బాల పాఠము – శ్రీవైష్ణవము గురించి పరిచయము

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

ఆణ్డాళమ్మగారు తిరుప్పావై అనుసంధిస్తుండగా,  పరాశర,వ్యాసులు పరుగెడుతూ ఆవిడ దగ్గరికి వచ్చిరి.

paramapadhanathan-2

 

పరాశర: పాట్టీ! మాకు ఒక సందేహము కలిగింది. శ్రీవైష్ణవమును గురించి తరచూ వింటున్నాము కదా,దయచేసి దాని గురించి మాకు వివరించవా?

ఆణ్డాళమ్మగారు: ఓహ్! చాలా మంచి ప్రశ్న పరాశరా. శ్రీవైష్ణవము శ్రీమన్నారాయణుడే పరమదైవముగా భావించి సకలజనుల చేతను ఆరాధింపబడె శాశ్వత ముక్తి మార్గము.

వ్యాస: కాని పాట్టీ,ఎందుకు ఒక్క  శ్రీమన్నారాయణుడే? ఎందుకు మరొకరు కాదు.

ఆణ్డాళమ్మ గారు~: వ్యాసా! చాలా మంచి ప్రశ్న. చెబుతాను వినండి. శ్రీవైష్ణవము వేదము,వేదాంతము మరియు ఆళ్వారుల దివ్య ప్రభందములు ఆధారముగా కలది. వీటన్నిటినీ ప్రమాణములు అని అందురు – ప్రమాణము అనగా శ్రేష్ఠమైన జ్ఞానమునకు ఆధారభూతమైనది. ఈ ప్రమాణములు సమస్తములందు శ్రీమన్నారాయణుడే అన్ని కారణములకు కారణమని చెప్పబడెను.అందువలన మనమందరమూ ఆ కారణకారకుడినే ఆరాధిస్తాము.ఆ ముఖ్య కారకుడు శ్రీమన్నారాయణుడని వివరించబడెను. అందువలన శ్రీవైష్ణవము పూర్తిగా శ్రీమన్నారాయణుడిపై దృష్టి సారించబడెను.

వ్యాస~: పాట్టీ! చాలా మంచివిషయమును తెలుసుకొన్నాము.నాకు అర్థమైనదానిని బట్టి మనమూ శ్రీవైష్ణవమును అనుసరించుచున్నాము కదా. అందువలన మనము ఏమి చేయవలెను పాట్టీ?

ఆణ్డాళమ్మగారు ~: మనము నిత్యమూ పెరుమాళ్, తాయారు, ఆళ్వారులు, ఆచార్యులను ఆరాధించవలెను.

పరాశర ~:పాట్టీ! మీరు ఒక్క శ్రీమన్నారాయణుడినే అని చెప్పారు.కాని ఎందుకు తాయార్, ఆళ్వారులు, ఆచార్యులని ఆరాధించవలెనని చెబుతున్నారు?

ఆణ్డాళమ్మ గారు~: ఇది చాలా మంచి ప్రశ్న పరాశరా! తాయార్ పెరుమాళ్ళ దేవేరి(అనగా ధర్మపత్ని). కనుక, పెరుమాళ్ మనకు తండ్రి మరియు తాయార్ మన తల్లి. మనము వారిద్దరినీ కలిపి ఆరాధించవలెను.ఏ విధముగా మీరు మీ తల్లితండ్రులకు తరచూ ప్రణామములు చేయుదురో-ఆ విధముగా పెరుమాళ్ మరియు తాయారులను కలిపి ఆరాధించవలెను. ఆళ్వారులు మరియు ఆచార్యులు శ్రీమన్నారాయణుడి ప్రియమైన భక్తులు. వారు శ్రీమన్నారాయణుడి యెడల దృఢమైన భక్తిని కలిగిఉందురు. వారే పెరుమాళ్ మరియు తాయారుల కీర్తిని చాటినవారు – అందువలన వారిని కూడా మనము సేవిస్తాము.

వ్యాస~~: ఇంకా ఏమేమి చేయవలెను పాట్టీ?

ఆణ్డాళమ్మగారు ~: శ్రీవైష్ణవులందరూ తమను పెరుమాళ్ మరియు తాయారుల పిల్లలుగా భావించుకొనవలెను. అందరియొక్క చక్కని జీవనమునకై ప్రార్థించవలెను మరియు వారిలో భక్తి పెంపొందెందుకు సహాయమును చేయవలెను.

పరాశర~~: అది ఏ విధముగా చేయవలెను పాట్టీ?

ఆణ్డాళమ్మ గారు ~~: ఓహ్! అది చాలా సులభము.ఎప్పుడైనా మనము ఎవరిని కలిసినా వారితో ఒక్క పెరుమాళ్, తాయార్, ఆళ్వారులు మరియు ఆచార్యుల గురించి మాత్రమే సంభాషింపవలెను.ఆ విధముగానే పెరుమాళ్, తాయార్, ఆళ్వారులు మరియు ఆచార్యుల గొప్పతనమును చెప్పడము వలన – వారిలో కూడా భక్తి భావము పెరుగును.ఇది అందరికీ భగవల్లాభమును చేకూర్చును.

వ్యాస~~: ఇది చాలా బాగుంది పాట్టీ.మన సమయమును సద్వినియోగమును చేసుకొనుటకు ఏంత మంచి మార్గము కలదు? దన్యవాదములు పాట్టీ. ఈ రోజు శ్రీవైష్ణవమును గురించి కొన్ని ప్రాధమికమైన విషయములని తెలుసుకొన్నాము..

ఆణ్డాళమ్మ గారు ~~: మీరిద్దరూ చాలా మంచిప్రశ్నలను అడిగారు. పెరుమాళ్ మరియు తాయార్ మీ ఇద్దరి యెడల చాలా సంతోషముగా ఉంటారు. ఇంక మనము కొంచెము ప్రసాదమును స్వీకరిద్దాము.

అడియేన్ : రఘు వంశీ రామానుజ దాసన్

మూలము : http://pillai.koyil.org/index.php/2014/07/beginners-guide-introduction-to-srivaishnavam/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

2 thoughts on “బాల పాఠము – శ్రీవైష్ణవము గురించి పరిచయము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *