శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
ఆండాళ్ నాన్నమ్మ, వ్యాస మరియు పరాశరుల ను శ్రీ రంగం లోని ముదలాళ్వారుల సన్నిధికి తీసుకుని వెళ్లి వారి కీర్తి ప్రఖ్యా తులను వివరిద్దామని ప్రణాళిక వేయుచున్నారు.
పొయిగై ఆళ్వార్
భూదత్తాళ్వారు
పెయాళ్వార్
ఆండాళ్ నాన్నమ్మ: వ్యాస మరియు పరాశర! ఇవాళ మనం గుడిలోని ముదలాళ్వారుల సన్నిధికి వెళ్దాం.
వ్యాస మరియు పరాశర: ఘనంగా ఉంది నాన్నమ్మ. వెళ్దాం పదండి.
ఆండాళ్ నాన్నమ్మ: సన్నిధికి నడుచుకుంటూ వెళ్లుతూ వారి గురించి కొంచం చెబుతాను. ముదల్ అంటే మొదలు. మనకు ఆళ్వార్ అంటే భక్తిలో మునిగిన వారని అర్థం తెలుసు కదా.ఆ 12 మంది ఆళ్వార్లు లో మొదటి వారు వీరు.
వ్యాస: ముదలాళ్వారులు అని బహువచనం ఎందుకు నాన్నమ్మ? ఒక్కరి కంటే ఎక్కువ “మొదలు” ఆళ్వార్ ఉన్నారా?
ఆండాళ్ నాన్నమ్మ: హ! హ! మంచి ప్రశ్న . అవును, ఆళ్వార్లులో మొదటి 3 ఆళ్వారులను జంట గా ఉదాహరిస్తారు.
పరాశర: ఎందుకు నాన్నమ్మ? వీరు కూడా పంచ పాండవులలాగా ఎప్పుడూ కలిసి ఉండేవారా?
ఆండాళ్ నాన్నమ్మ: చాలా మంచి ఉదాహరణ పరాశర. అవును – మొదలు 3 ఆళ్వారులు వేరు వేరు ప్రదేశాలలో పుట్టినప్పటికిని, ఒక దైవిక సంఘటన ద్వారా వారు తిరుక్కోవలూర్ దివ్యదేశము నందు కలుసుకొని శ్రీమన్నారాయణు ని ఆరాధించిరి. ఆ సంఘటన తరువాత వారి ముగ్గురిని కలిపి ఉదహరిస్తారు.
వ్యాస: ఆ దివ్యమైన సంఘటన ఏమిటి నాన్నమ్మ? నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.
ఆండాళ్ నాన్నమ్మ: తప్పకుండా, ఆ సంఘటన చెబుతాను. కాని దానికి ముందు, ఈ ముగ్గురు ఆళ్వారుల గురించి కొంచం తెలుసుకుందాము. మొదటి ఆళ్వార్ పొయిగై ఆళ్వార్ కు – సారో యోగి అని పేరు. రెండవ ఆళ్వారుకు భూదత్తాళ్వారు – భూత యోగి అని పేరు. మూడవ ఆళ్వారుకు పెయాళ్వార్ – మహాతాహ్వాయ అని పేరు.
పరాశర: వీరు ఎప్పుడు, ఎక్కడ పుట్టారు నాన్నమ్మా?
ఆండాళ్ నాన్నమ్మ: వారు ముగ్గురు మునుపటి యుగం – ద్వాపర యుగం ( కృష్ణావతారం జరిగిన యుగం) లో పుట్టారు. వీరు ముగ్గురూ పుష్పాలలో నుంచి ప్రకటించారు. పొయిగై ఆళ్వార్ ఆశ్వీయుజ మాసం శ్రవణ నక్షత్రం లో కాంచీపురం లోని తిరువెహ్ క్క దివ్య దేశం నందు ఒక మడుగులో పుట్టారు. భూదత్తాళ్వారు ఆశ్వీయుజ మాసం ధనిష్ఠ నక్షత్రంలో తిరుక్కడల్మల్లై నందు ఒక మడుగులో పుట్టారు. ఇప్పుడు ఈ దివ్య దేశము పేరు మహాబలిపురంగా మనకు తెలుసు. పెయాళ్వార్ ఆశ్వీయుజ మాసం శతభీషమ్ నక్షత్రం లో తిరుమయిలై లోని ఒక బావిలో పుట్టారు – ఇప్పుడు ఈ దివ్య దేశం పేరు మైలాపూర్ గా మనకు తెలుసు.
వ్యాస: ఒహో! వీరు పుష్పాలలో నుంచి పుట్టారు. అయితే, వీరికి అమ్మ మరియు నాన్నలేరూ?
ఆండాళ్ నాన్నమ్మ: అవును, వీరు భగవానుని ఆశీర్వాదముతో పుట్టారు, వారు పెరుమాళ్ మరియు తాయారులనే అమ్మా నాన్నలుగా భావిస్తారు
పరాశర: ఓ! ఇది తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. అయితే, వారు ఎలా కలుసుకున్నారు. ఆ అద్భుతమైన సంఘటన ఏమిటి?
ఆండాళ్ నాన్నమ్మ: వేరు వేరు దివ్య దేశములలో భగవానుని సేవించడమే వారి జీవితం . అనగా కేవలం గుడికి వెళ్ళటం, పెరుమాళ్ల ని సేవించడం, కొంత కాలం అక్కడ ఉండి మరొక దివ్య దేశమునకు తరలి వెళ్లడం.
వ్యాస: అదేదో చాలా అద్భుతంగా ఉంది – దేని గురించి చింత పడవలసిన అవసరం లేదు. అలా మనం కూడా ఉంటే బావుండు నాన్నమ్మ.
ఆండాళ్ నాన్నమ్మ: అవును. చూడండి మనం ముదలాళ్వారుల సన్నిధికి వచ్చేసాము. లోపలికి వెళ్లి దర్శనం చేసుకుందాం. తిరిగి వెళ్ళేటప్పుడు వారి మిగితా జీవిత చరిత్ర గురించి చెప్పుకుందాం.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-mudhalazhwargal-part-1/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org