Monthly Archives: August 2018

బాల పాఠము – ముదల్ ఆళ్వారులు – భాగము 2

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ముదల్ ఆళ్వారులు – భాగము 1

ఆండాళ్ నాన్నమ్మ, వ్యాస మరియు పరాశరులు ముదల్ ఆళ్వారుల సన్నిధి లోనుంచి బయటకు వచ్చారు.

పరాశర: ముదల్ ఆళ్వారుల దర్శనం చేసుకొని మంచిగా అనిపించింది. ఈ ముగ్గురు ఆళ్వారులు ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటారా నాన్నమ్మ?

mudhalAzhwargaL-thirukkovalur-with-perumAL

తిరుక్కోవలూర్ – తిరుక్కోవలూర్ ఎంపెరుమాన్ తో ముదల్ ఆళ్వారులు

ఆండాళ్ నాన్నమ్మ: మంచి ప్రశ్న. వారు ముగ్గురు ఒకే దగ్గర ఉండడానికి ఒక కారణం ఉంది. వివరిస్తాను. ఒక  రోజు, పెరుమాళ్ యొక్క దివ్య సంకల్పం చేత, వారు తిరుక్కోవలూర్ కు ఒకరి తరువాత ఒకరు వచ్చారు. భయంకరమైన తుఫాను. కుండపోత వర్షం పడుతోంది. తిరుక్కోవలూరులో మృకండు అనే ఒక ఋషి ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం ఎదురుగా చిన్న ఆకుల పందిరి. మొట్టమొదట పొయిగై ఆళ్వార్ అక్కడకు వచ్చి వర్షం నుండి రక్షణ కోసం ఆ పందిరి కింద ఆశ్రయం తీసుకున్నాడు. వారు కొంచం నడుం వాల్చి విశ్రాంతి తీసుకున్నారు.

పరాశర: ఒంటరిగానా? భయం వేయదా వారికి?

ఆండాళ్ నాన్నమ్మ:  లేదు పరాశరా! వారు ఎప్పుడూ పెరుమాళ్ల చింతనలో ఉంటారు, భయం ఉండదు. ఆ సమయం లో, భూదత్త ఆళ్వార్ అక్కడికి వచ్చి పందిరి లోనికి వస్తానని విన్నపిస్తారు. పొయిగై ఆళ్వారు ఇలా అంటారు ” ఇక్కడ స్థలం మితంగా ఉంది. ఒక్క మనిషి పడుకోవచ్చు కాని ఇద్దరు మనుషులు కూర్చోవచ్చు. దయచేసి లోపలికి రండి. భూదత్త ఆళ్వార్ లోనికి సంతోషముగా వచ్చి ఇద్దరు ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నారు. తరువాత, పేయాళ్వారులు వర్షంలో రక్షణ కోసం పరుగు పరుగున అక్కడకు వచ్చి లోనికి ప్రవేశించుటకు అనుమతి కోరెను. పొయిగై ఆళ్వారు అప్పుడు ఇలా అన్నారు “ఇక్కడ స్థలం మితంగా ఉంది. ఒక్క మనిషి పడుకోవచ్చు, ఇద్దరు మనుషులు కూర్చోవచ్చు  మరియు ముగ్గురు మనుషులు నిలబడవచ్చు. దయచేసి లోపలికి రండి, మనందరమూ నిలబడవచ్చు.పేయాళ్వారులులోనికి సంతోషముగా వచ్చారు, వారు అందరు చలికి వణుకుతూ నిలుచున్నారు.  వారు ఒకరితో ఒకరు మాట్లాడ సాగారు, వారు సమ ఆసక్తులు తెలుసుకోని ,వారు పెరుమాళ్ యొక్క నామాలు, రూప గుణాలు గురించి చర్చించ సాగారు.

వ్యాస: ఒహో! చాలా బాగుంది. నిజంగా దివ్యం. కాని అవ్వ, అక్కడ పెరుమాళ్ కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది, ఎలాగైతే పెరియ పెరుమాళ్ ఇక్కడ ఉన్నారు మనలని చూడటానికి.

ఆండాళ్ నాన్నమ్మ: ఉండండి. ఆ సంఘటన ఇంతటితో ముగిసిపోలేదు. నీవు తరువాత క్రమాన్ని బానే అంచనా వేసావు. ఈ క్రమంలో ఇంకా దైవత్వం రాబోతోంది. తన ప్రియమైన భాగవతుల సభ చూసి ఇప్పుడు పెరుమాళ్ కూడా సభలో పాలుపంచు కోవాలనుకున్నారు. వారు లోనికి ప్రవేశించి వారి మధ్యలో ఇరుక్కునారు. ఆ చీకటి లో హఠాత్తుగా ఇరుకు, ముగ్గురు ఆళ్వారులు ఇక్కడ ఏమి జరుగుతున్నది ఎవరు వచ్చారు మనకి తెలియకుండా అని ఆశ్చర్యపోయారు. అప్పుడు, మొదట పొయిగై ఆళ్వారు పాడటం మొదలుపెట్టారు “వైయం తగలియ” – ప్రపంచమునే ఒక దీపంగా ఊహించు కుంటున్నాను అని. ఆ దీపాలతో ఆ ప్రదేశామంతా వెలిగిపోయింది,పేయాళ్వారుకు మొట్టమొదట శ్రీ మహాలక్ష్మితో శ్రీమన్నారాయణుని దివ్యమంగళ స్వరూపం ఆ పందిరి కింద వారి మధ్యలో చూస్తారు. వారు పాడసాగరు “తిరుక్కండెన్…” ( నేను శ్రీమహాలక్ష్మి దేవి తో శ్రీమన్నారాయణని దివ్య/ సౌందర్య స్వర్ణమయ రూపం, వారి దివ్య శంఖు చక్రాలతో దర్శించుకున్నాను). వారు ముగ్గురు ఆళ్వారులు, పెరుమాళ్ మరియు తాయార్ దివ్యస్వరూపాన్ని దర్శించుకొని ఆనందించారు.

పరాశర: ఇది చాలా అద్భుతంగా ఉంది. వారు ఎంత ఆనందించి ఉంటారో.

ఆండాళ్ నాన్నమ్మ: అవును – వారు చాలా ఆనంద పడ్డారు. పెరుమాళ్ మరియు తాయారు కూడా చాలా సంతోష పడ్డారు. ఈ అద్భుతమైన సంఘటన తరువాత, వారు ఎన్నో మందిరాలలో అర్చావతార ఎంబెరుమాన్ లను కలిసి దర్శించుకొన్నారు. తరువాత జీవితాన్ని కలసి జీవించారు. తరువాత వారు  చివరకు పరమపదాన్ని అధిష్ఠించి ఎల్లప్పుడూ పెరుమాళ్ సేవలో  ఉండిపోయారు.

వ్యాస మరియు పరాశర: ఈ సంఘటన వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మిగిలిన ఆళ్వారుల జీవితం గురించి విందామా?

ఆండాళ్ నాన్నమ్మ: దానికోసం మీరు ఇంకొక సమయం కోసం ఎదురు చూడాలి.  ఇప్పుడు మీరు సరదాగా బయట ఆడుకునే సమయం. ఇప్పుడు నేను పెరుమాళ్లకు ఆహారం తయారు చేస్తాను, అది మనం రాత్రికి తినవచ్చు.

వ్యాస మరియు పరాశర: సరే నాన్నమ్మ. మేము మరలా రేపు వచ్చి మీతో ఇంకా వింటాం.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-mudhalazhwargal-part-2/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ముదల్ ఆళ్వారులు – భాగము 1

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<  ఆళ్వారుల పరిచయం

ఆండాళ్ నాన్నమ్మ, వ్యాస మరియు పరాశరుల ను శ్రీ రంగం లోని ముదలాళ్వారుల సన్నిధికి తీసుకుని వెళ్లి వారి కీర్తి ప్రఖ్యా తులను వివరిద్దామని ప్రణాళిక వేయుచున్నారు.

పొయిగై ఆళ్వార్

 

Created with Nokia Smart Cam

భూదత్తాళ్వారు

 

peyazhwar-mylai

పెయాళ్వార్

ఆండాళ్ నాన్నమ్మ: వ్యాస మరియు పరాశర! ఇవాళ మనం గుడిలోని ముదలాళ్వారుల సన్నిధికి వెళ్దాం.

వ్యాస మరియు పరాశర: ఘనంగా ఉంది నాన్నమ్మ. వెళ్దాం పదండి.

ఆండాళ్ నాన్నమ్మ: సన్నిధికి నడుచుకుంటూ వెళ్లుతూ వారి గురించి కొంచం చెబుతాను. ముదల్ అంటే మొదలు. మనకు ఆళ్వార్ అంటే భక్తిలో మునిగిన వారని అర్థం తెలుసు కదా.ఆ 12 మంది ఆళ్వార్లు లో మొదటి వారు వీరు.

వ్యాస: ముదలాళ్వారులు అని బహువచనం ఎందుకు నాన్నమ్మ? ఒక్కరి కంటే ఎక్కువ “మొదలు” ఆళ్వార్ ఉన్నారా?

ఆండాళ్ నాన్నమ్మ: హ! హ! మంచి ప్రశ్న . అవును, ఆళ్వార్లులో మొదటి 3 ఆళ్వారులను జంట గా ఉదాహరిస్తారు.

పరాశర: ఎందుకు నాన్నమ్మ? వీరు కూడా పంచ పాండవులలాగా ఎప్పుడూ కలిసి ఉండేవారా?

ఆండాళ్ నాన్నమ్మ: చాలా మంచి ఉదాహరణ పరాశర. అవును – మొదలు 3 ఆళ్వారులు వేరు వేరు ప్రదేశాలలో పుట్టినప్పటికిని, ఒక దైవిక సంఘటన ద్వారా వారు తిరుక్కోవలూర్ దివ్యదేశము నందు కలుసుకొని శ్రీమన్నారాయణు ని ఆరాధించిరి. ఆ సంఘటన తరువాత వారి ముగ్గురిని కలిపి ఉదహరిస్తారు.

వ్యాస: ఆ దివ్యమైన సంఘటన ఏమిటి నాన్నమ్మ? నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

ఆండాళ్ నాన్నమ్మ: తప్పకుండా, ఆ సంఘటన చెబుతాను. కాని దానికి ముందు, ఈ ముగ్గురు ఆళ్వారుల గురించి కొంచం తెలుసుకుందాము. మొదటి ఆళ్వార్ పొయిగై ఆళ్వార్ కు – సారో యోగి అని పేరు. రెండవ ఆళ్వారుకు భూదత్తాళ్వారు – భూత యోగి అని పేరు. మూడవ ఆళ్వారుకు పెయాళ్వార్ – మహాతాహ్వాయ అని పేరు.

పరాశర: వీరు ఎప్పుడు, ఎక్కడ పుట్టారు నాన్నమ్మా?

ఆండాళ్ నాన్నమ్మ: వారు ముగ్గురు మునుపటి యుగం – ద్వాపర యుగం ( కృష్ణావతారం జరిగిన యుగం) లో పుట్టారు. వీరు ముగ్గురూ పుష్పాలలో నుంచి ప్రకటించారు. పొయిగై ఆళ్వార్ ఆశ్వీయుజ మాసం శ్రవణ నక్షత్రం లో కాంచీపురం లోని తిరువెహ్ క్క దివ్య దేశం నందు ఒక మడుగులో పుట్టారు. భూదత్తాళ్వారు ఆశ్వీయుజ మాసం ధనిష్ఠ నక్షత్రంలో తిరుక్కడల్మల్లై నందు ఒక మడుగులో పుట్టారు. ఇప్పుడు ఈ దివ్య దేశము పేరు మహాబలిపురంగా మనకు తెలుసు. పెయాళ్వార్ ఆశ్వీయుజ మాసం శతభీషమ్ నక్షత్రం లో తిరుమయిలై లోని ఒక బావిలో పుట్టారు – ఇప్పుడు ఈ దివ్య దేశం పేరు మైలాపూర్ గా మనకు తెలుసు.

వ్యాస: ఒహో! వీరు పుష్పాలలో నుంచి పుట్టారు. అయితే, వీరికి అమ్మ మరియు నాన్నలేరూ?

ఆండాళ్ నాన్నమ్మ: అవును, వీరు భగవానుని ఆశీర్వాదముతో పుట్టారు, వారు పెరుమాళ్ మరియు తాయారులనే అమ్మా నాన్నలుగా భావిస్తారు

పరాశర: ఓ! ఇది తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. అయితే, వారు ఎలా కలుసుకున్నారు. ఆ అద్భుతమైన సంఘటన ఏమిటి?

ఆండాళ్ నాన్నమ్మ: వేరు వేరు దివ్య దేశములలో భగవానుని సేవించడమే వారి జీవితం . అనగా కేవలం గుడికి వెళ్ళటం, పెరుమాళ్ల ని సేవించడం, కొంత కాలం అక్కడ ఉండి మరొక దివ్య దేశమునకు తరలి వెళ్లడం.

వ్యాస: అదేదో చాలా అద్భుతంగా ఉంది – దేని గురించి చింత పడవలసిన అవసరం లేదు. అలా మనం కూడా ఉంటే బావుండు నాన్నమ్మ.

ఆండాళ్ నాన్నమ్మ: అవును. చూడండి మనం ముదలాళ్వారుల సన్నిధికి వచ్చేసాము. లోపలికి వెళ్లి దర్శనం చేసుకుందాం. తిరిగి వెళ్ళేటప్పుడు వారి మిగితా జీవిత చరిత్ర గురించి చెప్పుకుందాం.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-mudhalazhwargal-part-1/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

బాల పాఠము – ఆళ్వారుల పరిచయం

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<  శ్రీమన్నారాయణుడి దివ్యమైన కృప

ఆండాళ్ నాన్నమ్మ: వ్యాస మరియు పరాశరా ! నేను కాట్టళగియ సింగ పెరుమాళ్ సన్నిధికి వెళ్లుతున్నాను. (నరసింహ పెరుమాళ్ క్షేత్రం). మీరు నాతో వస్తారా?

వ్యాస: సరే నాన్నమ్మ, వస్తాము. కిందటి సారి మీరు అళ్వారులు గురించి చెప్పారు. ఇప్పుడు అళ్వారులు గురించి మరి కొన్ని విషయాలు చెబుతారా?

ఆండాళ్ నాన్నమ్మ: అడిగి మంచి పని చేసావు. ఇప్పుడు మీ ఇద్దరికీ వారి గురించి చెబుతాను.

వారు ముగ్గురు కాట్టళగియసింగ పెరుమాళ్ సన్నిధి వైపు నడవ సాగరు.

ఆండాళ్ నాన్నమ్మ: మొత్తం 12 ఆళ్వారులు ఉన్నారు. వారు మొత్తం 4000 పాశురాలు (పాటలు) పాడారు. వారి పాశురాల సంగ్రహాన్ని ‘నాలాయిర దివ్య ప్రబంధం’ అంటారు. నిజానికి నిన్న నేను చదివిన అమలనాదిపిరాన్ కూడా దివ్య ప్రబంధం సంగ్రహణ లోని ఒక భాగమే.

పరాశర: ఓ! ఈ 12 అళ్వారులు ఎవరు?

12 అళ్వారులు

ఆండాళ్ నాన్నమ్మ: పొయిగై ఆళ్వార్ , భూదత్త ఆళ్వార్ , పెయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తొందరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణ్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. వీరు 12 ఆళ్వారులు.

వ్యాస: బావుంది నాన్నమ్మ. అయితే పెరుమాళ్ యొక్క గొప్ప అనుగ్రహం వీరిపైన ఉన్నదా?

ఆండాళ్ నాన్నమ్మ: అవును వ్యాస. భగవానుడు వారికి సంపూర్ణ ఆశీర్వాదము ప్రసాదించిరి. లోక కళ్యాణార్థం భగవాన్ కృపను పాశురముల రూపంలో వేల సంవత్సరాల క్రితం పంచి పెట్టారు. ఈ పాశురముల ద్వారా మనము భగవానుని అర్థం చేసుకొని వారి కళ్యాణ గుణములను ఆనందించుచున్నాము.

పరాశర: అవునా ! నాన్నమ్మ, మనం వేదం మాధ్యమంగా భగవానుని అర్థం చేసుకుంటాం అని అనుకున్నాను.

ఆండాళ్ నాన్నమ్మ: అవును. ఖచ్చితంగా. కాని, వేదం చాలా విశాలమైనది. ఎన్నో క్లిష్టమైన విషయాలు సంస్కృతంలో వివరించ బడ్డాయి వేదంలో. వేదాధ్యయనం లేకుండా అర్థం చేసుకోవడం కష్టం. కాని, ఆళ్వారులు వేదసారాన్ని ఈ 4000 పాశురాలలో సరళమైన తమిళ భాషలో రచించారు. నీకు తెలుసు, పెరుమాళ్ ని కీర్తించడమే వేద సారం. పైగా, ఆళ్వారులకు స్వయంగా భగవానుని కృపా కటాక్షం తో పొందిన జ్ఞానం ఇది. ఇది చాలా ముఖ్యమైన విషయం.

వ్యాస: అవును, మాకు ఇప్పుడు అర్థం అయ్యింది. అళ్వారులు పెరుమాళ్ వర్ణన చాలా సరళంగా సూటిగా వివరించారు. ఇప్పుడు మీరు ఈ విషయాలను మాకు సరళంగా వివరిస్తున్నట్టు.

అండాళ్ నాన్నమ్మ: చాలా బావుంది వ్యాస. ఇది మంచి ఉదాహరణం. ఇప్పుడు, నీకు గుర్తుందా, గతంలో చర్చించాము పెరుమాళ్ 5 విభిన్న స్వరూపాల్లో ఉంటారని – పరమపదం లో, వ్యూహం లో, అవతార రూపం లో, అంతర్యామి గా మరియు అర్చారూపం లో అని. విభిన్న ఆళ్వారులు పెరుమాళ్ విభిన్న రూపాల యందు అనురాగం ఉండేది.

పరాశర: ఓ – మనకు ఎట్లాగైతే శ్రీ రంగంనాథుడు అంటే ఇష్టమో, అట్లాగే అళ్వారులకు కూడా వారి వారికి ఇష్టమైన పెరుమాళ్ ఉండేవారా?

ఆండాళ్ నాన్నమ్మ: అవును. ముదల్ అళ్వారులకు ( మొదలు ౩ ఆళ్వారులు – పొయిగై ఆళ్వార్, భూదత్త ఆళ్వార్ , పెయాళ్వార్) భగవానుని పరత్వ గుణము యందు అనురాగం ఎక్కువగా ఉండేది – పరమపదంలో ఉన్నట్టుగా. తిరుమళిశై ఆళ్వారుకు అందరి హృదయాలలో నివసించి అంతర్యామిగా ఉన్నపెరుమాళ్ యందు మిక్కిలి అనురాగం ఉండెను,. నమ్మాళ్వార్, పెరియాళ్వార్ మరియు ఆండాళ్ కృష్ణుడి యందు అమితమైన భక్తి యుండెను. కులశేఖర ఆళ్వార్ రాముని యందు, తొండరడిప్పొడి ఆళ్వార్ మరియు తిరుప్పాణ్ ఆళ్వారులు శ్రీ రంగనాథుని యందు, తిరుమంగై ఆళ్వార్ అర్చావతార పెరుమాళ్ల యందు మిక్కిలి ప్రేమ, అనురాగాలు ఉండేవి.

వ్యాస మరియు పరాశర: నాన్నమ్మ, మీరు మధురకవి ఆళ్వార్ ను వదిలేసారు.

ఆండాళ్ నాన్నమ్మ: బాగా  పరిషీలించారు. మధురకవి ఆళ్వార్ కు నమ్మాళ్వార్ అందే మిక్కిలి అనురాగము ఉండేది.

పెరుమాళ్ కోసం పువ్వులు కొనటకు అంగడి దగ్గర ఆగేను ఆండాళ్ నాన్నమ్మ.

పరాశర: నాన్నమ్మ, ఒక్కో ఆళ్వారు గురించి వివరంగా చెబుతారా?

ఆండాళ్ నాన్నమ్మ: తప్పకుండా. కాని ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేసాము. లోని కి వెళ్లి పెరుమాళ్లుని దర్శించి సేవించు కుందాం. మరో సారి , ప్రతి ఆళ్వారు గురించి వివరిస్తాను.

వ్యాస మరియు పరాశర: సరే నాన్నమ్మ, లోపలికి వెళ్లదాం. నరసింహా పెరుమళ్ దర్శనం కోసం ఇంకా ఎదురు చూడలేక ఉన్నాము మనము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/10/beginners-guide-introduction-to-azhwars/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్యమైన కృప

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్యమైన అర్చారూపములు మరియు గుణములు

ఒక మనోహరమైన ఆదివారం ప్రొద్దున్నే ఆండాళ్ నాన్నమ్మ అమలనాదిపిరాన్ చదువుతుండగా వ్యాస మరియు పరాశర వింటారు.

పరాశర: నాన్నమ్మ, మీరు ఏమి చదువుతున్నారు? మీరు ప్రతిరోజు ప్రొద్దున్నే చదువుతుండగా మేము వింటున్నాము.

ఆండాళ్ నాన్నమ్మ: పరాశర, దీన్ని అమలనాదిపిరాన్ అంటారు. 12 ఆళ్వారులలో ఒకరైన తిరుప్పాణ్ ఆళ్వారు రచించారు.

 

periyaperumal-thiruppanazhwar

శ్రీరంగనాథుడు – తిరుప్పాణ్ ఆళ్వారు

 

వ్యాస: ఆళ్వారులు ఎవరు? అమలనాదిపిరాన్ అంటే ఏమిటి? వారి గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాన్నమ్మ, మీరు మాకు చెబుతారా?

ఆండాళ్ నాన్నమ్మ: నేను తప్పకుండ మీకు ఆళ్వారులు, వారి రచనల గురించి చెప్పగలను, కాని దానికి ముందు, మీరు శ్రీరంగనాథుని గురించి ఇంకొంచం ఎక్కువ తెలుసుకోవాలి.

వ్యాస: అది ఏమిటి, అవ్వా?

ఆండాళ్ నాన్నమ్మ: వారి కృపను గురించి తెలుసుకోవాలి.

పరాశర: దయచేసి చెప్పండి నాన్నమ్మ.

ఆండాళ్ నాన్నమ్మ:  నేను చెప్పాబోయేది మీరు గ్రహించటం కొంచం కష్టం. కాబట్టి, జాగ్రత్తగా వినండి, సరేనా?

పరాశర మరియు వ్యాస: సరే నాన్నమ్మ.

ఆండాళ్ నాన్నమ్మ: మనం ఇప్పటికే మునుపటి చర్చలలో చూసాము శ్రీమన్నారాయణుడు పరమపదము నుంచి శ్రీరాముడిగా, కృష్ణడిగా  మరియు ఎన్నో అర్చావతార ఎంపెరుమానులు శ్రీరంగనాథునిగా  దిగివచ్చారు. వారు అంతర్యామిగా ప్రతి ఒక్కరిలో ఉన్నారు.

పరాశర మరియు వ్యాస ఇప్పుడు ఆండాళ్ నాన్నమ్మ యొక్క ప్రతి పదముపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

ఆండాళ్ నాన్నమ్మ: మునిపటి చర్చలలో మీకు గుర్తుందా వారు ఎందుకు ఇన్ని రూపాలలో ప్రత్యక్షమైనారో?

పరాశర మరియు వ్యాస: ఓ అవును నాన్నమ్మ! మనందరం అంటే వారికి చాలా ఇష్టం. అందుకోసం మనతో ఉండటానికి  వారు క్రిందకి వస్తారు.

ఆండాళ్ నాన్నమ్మ: అద్భుతం! నువ్వు మూల సూత్రాలను చాలా బాగా అర్థంచేసుకున్నావు. వారు క్రిందకి మనతో ఉండటానికి మాత్రమే కాదు, వారు క్రమేణా మనందరినీ పరమపదానికి తీసుకోని వెళ్లాలని వారి కోరిక.

పరాశర: ఎందుకు నాన్నమ్మ? ఆ స్థలానికి అంత ప్రత్యేకత ఎందుకు? శ్రీరంగం కంటే బావుంటుందా?

paramapadhanathan

పరమపదంలో(శ్రీవైకుంఠం లో) పరమపదనాథుడు

ఆండాళ్ నాన్నమ్మ: హ! హా! నిస్సందేహంగా, శ్రీరంగం  చాలా బావుంది. కాని పరమపదం వారి నిత్య స్థానం, అక్కడ నిర్మలమైన ఆనందం మరియు వారకి ఎడతెగకుండా సేవ చేసుకోవటానికి అవకాశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనము గుడికి వెళ్తాము, ఉత్సవాలలో పాల్గొంటాము, కాని ఒక సమయానికి మనము ఇంటికి రావాలి మరియు ఇతర పనులు చేసుకోవాలి. కాని పరమపదంలో ఇలాంటి భంగాలు ఉండవు – అది నిరంతర ఆనందం.

వ్యాస: ఓ! అట్లాగే నాకు ఇష్టం – స్థిరమైన ఆనందం.

ఆండాళ్ నాన్నమ్మ: పైగా, ఇక్కడ, మన శరీర సామర్ద్యం మితమైనది – మనము అలసిపోతాము, కొన్నిసార్లు జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది… కాని పరమపదంలో, ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా దివ్యమైన శరీరం దొరుకుతుంది. మనము శాశ్వతముగా కైన్కర్యంలో నిమగ్నమై ఉండికూడా ఏ అలసట, అనారోగ్యం అనుభవించము.

పరాశర: ఓ! ఇది ఇంకా మంచిది. అయితే, వారు మనలని పరమపదానికి తీసుకుని వెళ్ళటానికి ఏం చేస్తారు?

ఆండాళ్ నాన్నమ్మ: అద్భుతమైన ప్రశ్న. వారు వారి అమితమైన కరుణతో ఎన్నో చేస్తారు. కరుణ అంటే ఎదుటి వారికీ దయతో సహాయం చేయటం. వారు స్వయంగా దిగి శ్రీరామ, కృష్ణ, రంగనాథ, శ్రీనివాస, మొదలగు లాగా వచ్చారు. కాని వారు ఇంకా మనలోని చాలా మందిని తీసుకుని వెళ్ళలేకపోయారు, ఎందు కంటే చాలామంది మనుష్యులు వారిని స్పష్టంగా అర్థంచేసుకొని సర్వశ్రేష్ఠునిగా అంగీకరించలేదు.

వ్యాస: వారు ముందే ఉండగా ఎందుకు మనుష్యులు వారిని అర్థం చేసుకోవట్లేదు?

ఆండాళ్ నాన్నమ్మ: ఎందుకంటే వారు చాలా పెద్దవారు, కాబట్టి ఈర్ష్యతో కొంతమంది జనాలు, వారి శ్రేష్ఠుత్వానికి భయపడి కొందరు వారి దరికి రావట్లేదు. 

పరాశర: ఓ అలాగా. ఇది ఆళ్వారుల జననానికి దారితీస్తుంది అని ఊహిస్తున్నాను.

ఆండాళ్ నాన్నమ్మ: తెలివైన వాడవు. అవును, పెరుమాళ్ కు ఒక ఆలోచన వచ్చింది. మీకు తెలుసా వేటగాళ్ళు జింకలను ఎలా పట్టుకుంటారో? చాలా కష్టంగా ఒక జింకను పట్టుకుంటారు. తరువాత ఆ జింకకు ఇతర జింకలను ఎలా ఆకర్షించాలో శిక్షణ ఇస్తారు. ఎప్పుడైతే ఈ జింకకు ఇతర జింకలు ఆకర్షితులవుతారో, వేటగాడు వెంటనే అన్నిటిననీ పట్టుకుంటాడు.

వ్యాస: అవును నాన్నమ్మ.  ఇదే కుయుక్తితో ఏనుగులను కూడా పట్టుకుంటారు అని విన్నాను.

ఆండాళ్ నాన్నమ్మ: అవును. అలాగే, పెరుమాళ్ వారి నిష్కారణమైన కరుణతో  ప్రతి ఒక్కరికి సహాయం చేయుటకు, కొంత మంది జనాలను ఎంపిక చేసుకొని వారికి తనఎడల నిండు భక్తిని నిండు జ్ఞానాన్ని మరియు మిగిలిన వన్నీ ప్రసాదిస్తారు. ఇలాంటి వ్యక్తులు పెరుమాళ్ భక్తిలో మునిగిఉండే వారిని ఆళ్వారులు అంటారు.

పరాశర: ఓ! అయితే, ఆళ్వారుల ద్వారా చాలా మంది భక్తులై వారిని చేరుకుంటారు. ఓ! ఇది పెరుమాళ్ యొక్క గొప్ప పద్ధతి.

Azhwars

ఆండాళ్ నాన్నమ్మ: అవును, ఇది వారి గొప్ప కరుణ. గుర్తుపెట్టుకోండి, ఎవరూ వారి సొంత ప్రయత్నంతో ఆళ్వారులుగా మారారు. భగవాన్ కటాక్షంతో మాత్రమే, వారు ఆళ్వారులుగా మారతారు. ఎందుకంటే సొంత ప్రయత్నముతో పెరుమాళ్ వైపు కొంతవరకు భక్తిలో అభివృద్ధి చెందవచ్చు – కాని పెరుమాళ్ పైనే సంపూర్ణ భక్తి ఉండటం అంటే, వారికి భగవాన్ యొక్క సంపూర్ణ కటాక్షం ఉండాలి. అలాగే సొంత ప్రయత్నముతో కొంతవరకు జ్ఞానంలో  అభివృద్ధి చెందవచ్చు – కాని అన్నిటి గురించి సంపూర్ణ జ్ఞానం  ఉండాలంటే అలాంటి జ్ఞానం ఉన్న ఒక్క భగవానుడే ఇతరులకు అలాంటి జ్ఞానం ఉండాలని కటాక్షించ గలరు.

పరాశర: అవును, నాన్నమ్మ. మాకు ఇప్పుడు అర్థమైయింది. మీరు ఎంత మంచిగా మాకు ఈ సూత్రాలను వివరిస్తున్నారు. చూడండి, ఇది కొంచం కఠినమైన విషయము అని మీరు చెప్పినందుకు, మేము కళ్లు రెప్ప కూడా వాల్చలేదు.

ఆండాళ్ నాన్నమ్మ: అవును. మిమ్మల్ని బయటకు ఆడుకోవటానికి వదిలే ముందు, నేను మీకు అమలనాదిపిరాన్ గురించి వివరిస్తాను, ఎందుకంటే మీరు ముందు అడిగారు కాబట్టి. ఇది రచించినది తిరుప్పాణ్ ఆళ్వార్, పెరియ పెరుమాళ్ దివ్య మంగళ సౌందర్యాన్ని పూర్తిగా అనుభవించినవారు. వారు 5 వ పాసురములో ” అనేక సంవత్సరాలుగా మీరు కఠిన తపస్సు చేస్తున్నారు, కేవలము నన్నుపాప విముక్తుడను చేసి నిన్ను అర్థము చేసుకొని నిన్ను చేసుకోవడానికి సహాయం చేయుచున్నారు” అని వారు శ్రీరంగనాథునికి చెబుతున్నారు, . అక్కడినుండి మన మొత్తం సంభాషణ శ్రీమన్నారాయణ కృప గురించి మొదలైయింది. ఇప్పుడు మీకు మొత్తం విషయము గురించి మంచి అవగాహన ఉంది. మరో సారి, నేను మీకు ఆళ్వారుల గురించి మరింత చెబుతాను. ఇప్పుడు మీరు ఇద్దరూ కొద్దిసేపు ఆడుకోవచ్చు.

పరాశర మరియు వ్యాస: ధన్యవాదం నాన్నమ్మ. మేము తప్పకుండా తొందరలోనే తిరిగి వచ్చి ఆళ్వారుల గురించి వింటాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/09/beginners-guide-sriman-narayanas-divine-mercy/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org