బాల పాఠము – ఆళవందార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఉయ్యక్కొణ్డార్ మరియు మణక్కాల్ నమ్బి

వ్యాస, పరాశర మరియు వారి స్నేహితురాలు అత్తుళాయ్ తో పాటు నాన్నమ్మ ఇంటికి వస్తారు. నాన్నమ్మ వారిని తన చేతులలో ప్రసాదముతో స్వాగతిస్తారు.

నాన్నమ్మ:  స్వాగతం అత్తుళాయ్! ఇక్కడ మీ చేతులు, కాళ్ళు కడుక్కొని ఈ ప్రసాదం తీసుకోండి. నేడు ఉత్తరాషాడం, ఆళవందార్ తిరునక్షత్రం.

పరాశర : నాన్నమ్మా, పోయినసారి మీరు యమునైత్తురైవర్ గురించి మాకు చెప్తానని అన్నారు గుర్తుందా?

నాన్నమ్మ:  అవును! నాకు గుర్తుంది, మీకు గుర్తుందని మరియు ఆచార్యుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేడు వారి తిరునక్షతరం. వారి కీర్తి ప్రతిష్టల గురించి చర్చించడానికి చాలా సరైన రోజు.

వ్యాస : నాన్నమ్మా, కానీ మీరు ఆళవందార్ తిరునక్షత్రం అని అన్నారు కదా?

ఆళవందార్ – కాట్టు మన్నార్ కోయిల్

నాన్నమ్మ:  అవును. కట్టూ మన్నర్ కైయిల్ లో జన్మించిన యమునాథ్యురైవర్ తరువాత ఆళవందార్ గా ప్రసిద్ది చెందారు. వారు ఈశ్వర ముని యొక్క కుమారుడిగా మరియు నాథముని యొక్క మనుమడిగా జన్మించారు. వారు మహాభాష్య భట్టర్ వద్ద విద్యను అభ్యసించారు. వారు ఆళవందార్ గా పిలువబడడానికి  చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఆ రోజులల్లో పండితులు ప్రధాన పండితులకు పన్నులు చెల్లించే వారు . అక్కియాల్వాన్ అనే రాజ పురోహితుడు తన ప్రతినిధులను పండితుల వద్దకు పన్నులు చెల్లించమని పంపేవాడు. మహాభాష్య భట్టర్ భయపడితే, యమునైత్తురైవర్ తను  చూసుకుంటాడని చెబుతాడు. అతను “చౌకబారు కీర్తి ప్రతిష్టల కోసం చూస్తున్న కవులను నాశనం చేస్తాను” అని ఒక శ్లోకాన్ని పంపుతాడు. ఇది చూసిన అక్కియాల్వాన్ కు కోపం వచ్చి, తన సైనికులకు యమునైత్తురైవర్ ని రాజ దర్బారుకి  తీసుకురమ్మని పంపుతాడు. యమునైత్తురైవర్ తనకు సరైన గౌరవం ఇచ్చినప్పుడు మాత్రమే వస్తానని చెప్తాడు. అందువల్ల, రాజు వారికోసం పల్లకి పంపితే  యమనుతితురైవర్ దర్బారుకి  హాజరౌతారు. చర్చ మొదలవుతుండగా, రాణి, యమనుతితురైవర్ విజయాన్ని సాధిస్తాడని రాజుకు చెబుతుంది. ఒక వేళ అతను ఓడిపోతే, ఆమె రాజుకు సేవకురాలై సేవలు చేస్తానని చెప్తుంది. రాజు అక్కియాల్వాన్ గెలుస్తాడని నమ్మకం ఉందన్నారు. ఒకవేళ యమునైత్తురైవర్ గెలుస్తే అతనికి సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తారు . చివరకు, గొప్ప శౌర్యం జ్ఞానంతో, యమునైత్తురైవర్ అక్కియాల్వాన్ పై విజయం సాధిస్తారు. అక్కియాల్వాన్ చాలా ప్రభావితులై  యమునైత్తురైవర్ శిష్యులు అవుతారు. రాణి తనని రక్షించడానికి వచ్చారని “ఆళవందార్” అనే పేరును ఇస్తుంది – ఒక వేళ అతను ఓడిపోతే, ఆమె ఒక సేవకురాలై మారి ఉండేది. కాని ఇప్పుడు  ఆమె కూడా ఆళవందార్ శిష్యులుగా మారుతుంది.  రాజు వాగ్దానం ప్రకారం అతను సగం రాజ్యం పొందుతాడు.

వ్యాస : నాన్నమ్మా, యమునైత్తురైవర్ సగం రాజ్యం పొంది ఉంటే, అతను రాజ్యం పరిపాలించి వుండాలి. అతను మన సాంప్రదాయం లోకి ఎలా వచ్చారు?

అత్తుళాయ్:   ఉయ్యక్కొండార్ శిష్యులైన మణక్కాళ్ నంబి ద్వారా అతను మన సాంప్రదాయం లోకి వచ్చారు. ఉయ్యక్కొండార్ నిర్దేశం ప్రకారం  మణక్కాళ్ నంబి  ఆళవందార్లను తీసుకువస్తారు.

నాన్నమ్మ: ఖఛ్చితంగా నిజం అత్తుళాయ్! దీని గురించి నీకు ఎలా తెలుసు?

అత్తుళాయ్: మా అమ్మ కూడా మన ఆచార్యులు మరియు పెరుమాళ్ గురించి కథలను చెపుతుంది.

నాన్నమ్మ:  ఆళవందార్ ఒక గొప్ప ఆచార్యులు, వారు దేవపెరుమాళ్ ఆశీర్వాదంతో శ్రీ రామానుజులను మన సాంప్రదాయంలోకి తీసుకువచ్చారు.

పరాశర : కానీ నాన్నమ్మా, దేవపెరుమాళ్ ఎలా ఆళవందార్ కి సహాయం చేస్తారు?

నాన్నమ్మ: ఆళవందార్ కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఇళైఆళ్వార్ని చూస్తారు (ఈయనే తరువాతికాలంలో రామానుజులైనారు). ఇళైఆళ్వార్ తన గురువు యాదవ ప్రకాశుని వద్ద విద్య నేర్చుకొనే రోజులవి. సాంప్రదాయం తర్వాతి నాయకుడిగా ఇళైఆళ్వార్ని తయారు చేయమని ఆళవందార్ పెరుమాళ్ ను ప్రార్థిస్తారు. అందువల్ల దేవపెరుమాళ్ ఒక తల్లిలాగా ఇళైఆళ్వార్ని పెంచుతారు, వారు తరువాత కాలంలో సాంప్రదాయానికి గొప్పలో గొప్ప అయిన కైంకర్యాన్ని అందిస్తారు. ఆళవందార్ అవసరమైన విధంగా ఇళైఆళ్వార్కి మార్గనిర్దేశం చేయమని తిరుక్కచ్చి నంబికి కూడా అప్పగిస్తారు. తిరుక్కచ్చి నంబి మీకు గుర్తున్నారా?

వ్యాస : అవును నాన్నమ్మా, అతను తిరువాలవట్ట (వింజామర) కైంకర్యం దేవపెరుమాళ్, తాయార్లకు చేస్తారు మరియు వారిరువురితో మాట్లాడతారు కూడా. మనం కూడా తిరుక్కచ్చి నంబి లాగా పెరుమాళ్లతో మాట్లాడినట్లయితే ఎంత బాగుంటుంది? అయితే ఆళవందార్ ఇళైఆళ్వార్ ని కలిసారా? ఆళవందార్ ఇళైఆళ్వార్ని తన శిష్యులుగా అంగీకరించారా?

నాన్నమ్మ: దురదృష్టవశాత్తు కలుసుకోలేదు! ఇళైఆళ్వార్ ఆళవందార్ యొక్క శిష్యుడు కావటానికి శ్రీరంగం రావడానికి ముందే వారు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పరమపదం చేరుకుంటారు. వారు ఒకరినొకరు కలుసుకోలేక పోయారుకానీ ఆళవందార్ యొక్క కోరికలను నెరవేరుస్తానని ఇళైఆళ్వార్ హామీ ఇస్తారు. ఈ సారి మనం కలుసుకున్నప్పుడు, నేను మీకు, ఆళవందార్ శిష్యులలో ఒకరైన పెరియ నంబి గురించి తెలియజేస్తాను, ఈయనే ఇళైఆళ్వార్ యొక్క గురువై నిరంతరం మార్గదర్శకులగా వారిని నడిపిస్తారు. ఆళవందారుకి అనేకమంది శిష్యులు ఉండేవారు. వారందరూ ఇళైఆళ్వార్ని  సాంప్రదాయంలోకి తీసుకురావడానికి కలిసి కృషి చేశారు. పెరియ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరుమలై ఆండాన్, మారనేరి నంబి, తిరుక్కచ్చి నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్ మరెందరో ఆళవందార్ల శిష్యులు .

వ్యాస , పరాశర మరియు అత్తుళాయ్: ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నాన్నమ్మా. వచ్చే సారి దయచేసి పెరియ నంబి మరియు ఇళైఆళ్వార్ల గురించి చెప్పండి.

నాన్నమ్మ:  చాలా ఆనందంగా చెప్తాను. కానీ ఇప్పుడు బయట చీకటి పడుతోంది. మీరు మీ ఇండ్లకు వెళ్లండి.

పిల్లలు ఆళవందార్ గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లకు సంతోషంగా బయలుదేరుతారు..

మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-alavandhar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *