శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తిరువరంగప్పెరుమాళ్ అరైయర్, పెరియ తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్
పరాశర మరియు వ్యాస, నాన్నమ్మ ఇంటికి వారి స్నేహితురాలు వేదవల్లి తో పాటు ప్రవేశిస్తారు.
నాన్నమ్మ: స్వాగతం వేదవల్లి. పిల్లలూ లోపలికి రండి.
వ్యాస: నాన్నమ్మా, పోయిన సారి మీరు రామానుజ మరియు వారి ఆచార్యుల గురించి మాకు మరింత చెప్తానని చెప్పారు.
పరాశర: నాన్నమ్మా, మీరు రామానుజులకు అనేకమంది ఆచార్యులు ఉన్నారు, కేవలం పెరియ నంబి మాత్రమే కాదు అని చెప్పారు కదా? మిగతా వారు ఎవరు నాన్నమ్మా ?
నాన్నమ్మ: పిల్లలు, పోయిన సారి నేను మీకు చెప్పాను, ఆళవందారుకి చాలామంది శిష్యులు ఉండేవారని, వారందరూ ఇళైయాళ్వారుని సాంప్రదాయంలోకి తీసుకురావడానికి కృషి చేసారని చెప్పాను. వారిలో ముఖ్యులు 1) తిరువరంగ ప్పెరుమాళ్ అరైయర్ 2) తిరుక్కొష్టియూర్ నంబి 3) పెరియ తిరుమలై నంబి 4) తిరుమాలై ఆండాన్ 5) తిరుక్కచ్చి నంబి మరియు పెరియ నంబి. మనము కలుసుకున్నప్పుడు పెరియ నంబి గురించి చివరిసారి మాట్లాడాం మీకు గుర్తున్దా? ఇప్పుడు, ఇతర ఆచార్యుల గురించి మరియు సాంప్రదాయానికి వారి విలువైన సహకారం గురించి చెప్తాను.
పరాశర: నాన్నమ్మా, రామానుజులకు ఎందుకు అనేకమంది ఆచార్యులు ఉన్నారు?
నాన్నమ్మ: వారందరూ వారి వారి సొంత శైలిలో శ్రీ రామానుజులను గొప్ప ఆచార్యునిగా తీర్చిదిద్దడంలో తోడ్పడ్డారు. తిరువరంగ ప్పెరుమాళ్ రామానుజులను కాంచీపురం నుండి శ్రీరంగానికి తీసుకొని వచ్చి గొప్ప కైంకర్యం చేశారు.
వ్యాస: అది ఎలా జరిగింది? మాకు ఆ కథ చెప్పండి నాన్నమ్మా.
నాన్నమ్మ: రామానుజులు సమాశ్రయనం స్వీకరించి కాంచీపురంలో నివసిస్తున్న రోజులవి. అరైయర్ ఆ సమయంలో కాంచీపురానికి వెళ్లి తిరుక్కచ్చి నంబిని దేవపెరుమాళ్ ముందు అరైయర్ సేవ చేయటానికి అనుమతించమని ప్రార్థిస్తారు. తన అర్చకుల ద్వారా దేవపెరుమాళ్ తన ఎదుట అరైయర్ సేవ చేయమని చెబుతారు. అరైయర్ ఎంతో ప్రేమభక్తితో పాసురాలను పాడి ఆడుతారు. ఎమ్బెరుమాన్ ఎంతో సంతోషించి వారికి బహుమతులను ప్రసాదిస్తారు. కాని అరైయర్ వారికి ఆ బహుమతులు కాకుండా ఇంకేదో కావాలని విన్నవిస్తారు. ఎమ్బెరుమాన్ అంగీకరించి ” ఏమి కావాలో అడుగు. ఏమైనా ఇస్తాను” అని అంటారు. అరైయర్ రామానుజుల వైపు చూపించి, వారిని శ్రీరంగానికి పంపించమని అడుగుతారు. “నీవు వారిని అడుగుతావని అనుకోలేదు; ఇంకేమైనా అడుగు” అని దేవపెరుమాళ్ అంటారు. అరైయర్ బదులుగా ” మీరు ఎవరో కాదు రెండవ మాటలేని సాక్షాత్తూ ఆ శ్రీ రాముడే – ఇక తిరస్కరించలేరు”. దేవపెరుమాళ్ అంగీకరించి రామానుజులకు వీడ్కోలిస్తారు.
వ్యాస: ఎంత చమత్కారం నాన్నమ్మా? అరైయర్ వారు ఎంత తెలివిగా పెరుమాళ్‌ను ఒప్పిస్తారు .
నాన్నమ్మ: అవును వ్యాస. తక్షణమే రామానుజుల చేతులు పట్టుకుని అరైయర్ శ్రీరంగానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అందువల్ల, శ్రీరంగానికి రామానుజులను తీసుకువచ్చి శ్రీ వైష్ణవులకు అరైయర్ చాలా ముఖ్యమైన కృషి చేసాడు, మన సాంప్రదాయాన్ని ఉన్నతస్థితికి తీసుకువెళ్ళటానికి తోడ్పడ్డారు.
వేదవల్లి : నాన్నమ్మా, మీరు ప్రతి ఆచార్యులు ఒక్కొక్క విధంగా రామానుజులను తీర్చిదిద్దడంలో తోడ్పడ్డారని అన్నారు. అరైయర్ ఏమి బోధించారు నాన్నమ్మా?
నాన్నమ్మ: సాంప్రదాయం యొక్క వివిధ కోణాలను రామానుజులకు బోధించమని ఆళవందారులు తన ప్రముఖ శిష్యులకు ఆదేశించారు. రామానుజులకు సాంప్రదాయంలోని నిజమైన సారాంశాన్ని బోధించమని అరైయర్ని కోరుతారు. రామానుజులు జ్ఞానం కోసం అరైయర్ వద్దకు వెళ్లేముందు వారు ముందుగానే ఆరు నెలల పాటు ఆచార్యులకు (అరైయర్) కైంకర్యం చేసారు. ఇది చాలా ముఖ్యమైన అంశంగా పరిగ్రహించాలి, రామానుజులు, కూరత్తాల్వారు, ముదలియాన్డాన్ మరియు అనేక ఆచార్యులు వారి జీవితాల్లో ఈవిధంగా చేసారు – వారు ఆచార్యుల వద్ద విద్య నేర్చుకునే ముందు వారికి కైంకర్యం చేసేవారు. ఇది వారు నేర్చుకోవలసిన విద్య పట్ల మరియు వారికి విద్య బోధించే వారి పట్ల కూడా వారు కలిగి ఉన్న భక్తిని చూపిస్తుంది. రామానుజులు ప్రతిరోజూ సరైన వెచ్చదనంతో పాలు తయారు చేసేవారు మరియు అరియార్ వారికి అవసరమైనపుడు ఉపయోగం కోసం హరిద్రను నూరి సిద్ధం చేసేవారు.
వ్యాస: నాన్నమ్మా, ఇతర ఆచార్యులు రామానుజులకు ఏమి బోధించారు?
నాన్నమ్మ: అవును, నేను ఒకరి తరువాత ఒకరు వారి వద్దకే వస్తున్నాను. తిరుమలై నంబి రామానుజులకు మేనమామ. వారు తిరుమల నుండి వచ్చిన శ్రీవైష్ణవ అగ్రగణ్యులు. వారు శ్రీనివాసులకు ప్రతి రోజు అకాశగంగ నుండి పవిత్ర జలాలను తీసుకు వచ్చే కైంకర్యం చేసేవారు. వారు గొప్ప శ్రద్ధతో మరియు అంకితభావంతో శ్రీనివాసులకు సేవ చేసేవారు. శ్రీ రామాయణం యొక్క సారాంశం మరియు వాటి అందమైన అర్థాలను రామానుజులకు నేర్పించమని వారి ఆచార్యులు ఆళవందారు వారిని ఆదేశిస్తారు . శ్రీ రామాయణాన్ని మన సాంప్రదాయం లో శరణాగతి శాస్త్రం అని పిలుస్తారు. తిరుమలై నంబి రామానుజుల యొక్క మేనమామ కాబట్టి , వారికి ఇలైయార్వారుడని నామకరణం కూడా వీరే చేస్తారు. అంతే కాకుండా తిరుమలై నంబి వారు రామానుజుల యొక్క పిన్ని కొడుకైన గోవింద పెరుమాళ్ ను కూడా సాంప్రదాయంలోకి తిరిగి తీసుకువస్తారు . అతనికి సాంప్రదాయ జ్ఞానం మరియు ఆళ్వారుల పాసురాలపై ప్రేమ అసమానమైనది.
పరాశర: నాన్నమ్మా, మీరు తిరుమాలై ఆండాన్ గురించి మరింత మాకు చెబుతారా? అతను రామానుజులకు ఎలా సహాయం చేసారు?
నాన్నమ్మ: తిరువాయ్మోలి అర్థాలను నేర్పించే బాధ్యతను తిరుమాలై ఆండాన్ కు ఇవ్వబడింది. రామానుజులు శ్రీరంగానికి వచ్చిన తరువాత, నమ్మాళ్వారి తిరువయ్మోలిని విని అర్థంచేసుకోమని తిరుక్కోష్టివూర్ నంబి వారిని తిరుమాలై ఆండాన్ వద్దకు మార్గదర్శనం చేస్తారు. ప్రారంభంలో, ఇద్దరు గొప్ప విద్వాంసుల మధ్య సాధారణంగా జరిగిన అభిప్రాయాలకు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇది స్నేహపూర్వకంగా పరిష్కారం పొంది మరియు వారి ఆచార్యులు తిరుమాలై ఆండాన్ యొక్క ఆశీర్వాదంతో ఆళ్వార్ల పాసురాలలో దాగి ఉన్న క్లిష్టమైన అర్థాలను నేర్చుకున్నారు. తిరుమాలై ఆండానుకి వారి ఆచార్యులు ఆళవందారు లంటే గొప్ప గౌరవం, భక్తి ఉండేది. అతడు తన ఆచార్యుల యొక్క మార్గము మరియు బోధనల నుండి ఎప్పుడూ తప్పే వారు కాదు, అదే వారు రామానుజులకు కూడా నేర్పించారు, తద్వారా వారి ద్వారా ఆ కైంకర్యాన్ని మన సాంప్రదాయంలో ముందుకు తీసుకువెళ్లి కొనసాగిస్తారని నేర్పిస్తారు.
వేదవల్లి: మరి తిరుక్కోష్టివూర్ నంబి మరియు తిరుక్కచ్చి నంబి గురించి ?
నాన్నమ్మ: మనం మరోసారి కలుసుకున్నపుడు వారి గురించి చెబుతాను. వారి గురించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.
పిల్లలందరూ ఒకేసారి: ఆ కథలు మాకు ఇప్పుడే చెప్పండి నాన్నమ్మా.
నాన్నమ్మ: ఇక ఆలస్యమవుతుంది. ఇవాల్టికి ఇది చాలు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లి రేపు మరలా రండి. మీతో పాటు మీ స్నేహితులను కూడా తీసుకురావడం మర్చిపోకండి.
పిల్లలు ఆచార్యుల గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లలోకి వెళ్లి, మరుసటి రోజు వారికి నాన్నమ్మ చెప్పే కథల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-alavandhars-sishyas-1/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org