బాల పాఠము – పెరియాళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< కులశేఖర ఆళ్వార్

periyazhvar

ఒక సుందరమైన ఆదివారం ప్రొద్దున ఆండాళ్ నాన్నమ్మ ఇంటి బయట వరండాలో కూర్చొని పెరుమాళ్ కు పూలదండ చేస్తున్నారు. వ్యాస మరియు పరాశర వచ్చి వరండాలో నాన్నమ్మ ప్రక్కన కూర్చున్నారు. ఆండాళ్  నాన్నమ్మని వాళ్లు ఇద్దరు ఆసక్తిగా చూస్తునారు.

వ్యాస: మీరు ఏం చేస్తున్నారు నాన్నమ్మ?

ఆండాళ్ నాన్నమ్మ: పెరుమాళ్ కు మాల చేస్తున్నాను, ఇది నాకు కొంతమంది ఆళ్వారులను గుర్తుచేస్తుంది. వాళ్లలో ఒకరి గురించి చెబుతాను వింటారా?

పరాశర: ఓ! తప్పకుండా నాన్నమ్మ. మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.

ఆండాళ్ నాన్నమ్మ: అది మా మంచి అబ్బాయి. అప్పుడు నేను పెరియాళ్వారు గురించి చెబుతాను. వారు జేష్ఠ మాసం స్వాతి నక్షత్రంలో శ్రీ విల్లిపుత్తూర్ లో పుట్టారు.వారిని పట్టర్ పిరాన్ అని కూడా పిలిచేవారు. వారు వటపత్రసాయి ఎమ్పెరుమాన్కు దండలు తయారు చేసేవారు. ఒక రోజు, పాండ్య రాజ్యము పరిపాలించు రాజు, విధ్వానులను పిలిచారు.పరతత్త్వమైన దేవుడు ఎవరో నిరూపించిన వారికి సంచి నిండా బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించారు.

వ్యాస: అది చాలా కష్ఠమై ఉండాలి, కదా నాన్నమ్మ?

ఆండాళ్ నాన్నమ్మ: అది పెరయాళ్వార్లుకు కాదు. వారి భక్తి మరియు పెరుమాళ్ అనుగ్రహము వలన, వారు రాజ సభకు వెళ్లి వేద ప్రమాణికంగా పెరుమాళ్ పరతత్త్వమని నిరూపిస్తారు. ఆ రాజు చాలా సంతోషపడి పెరయాళ్వార్లకు తాను ప్రకటించిన బహుమతి సొమ్ముని ఇచ్చి , వారిని రాజ ఏనుగుపైన ఊరేగింపుతో మధురై విధులలో ఊరేగిస్తారు.

పరాశర: ఆ దృశ్యము చూడ ముచ్చటగా ఉండి ఉండవచ్చు,  నాన్నమ్మ.

ఆండాళ్ నాన్నమ్మ: అవును పరాశర. అందుకోసమే పెరుమాళ్  స్వయంగా  గరుడ స్వారులై పరమపదం నుండి క్రిందకు వచ్చారు. పెరయాళ్వారు ఏనుగు స్వారులైనను, వారు ఎంత వినయవంతులు అంటే వారు పెరుమాళ్ క్షేమం కోసం చింతించి, వ పెరుమాళ్ రక్షగా కోసం తిరుప్పల్లాండు పాడారు. అలాగా వారు పెరయాళ్వారుగా ప్రసిద్ధమైనారు. వారు పెరయాళ్వార్ తిరుమొళి కూడా పాడారు.

వ్యాస: అవును నాన్నమ్మ – పల్లాండు పల్లాండు తెలిసినట్టు అనిపిస్తుంది. ప్రతి రోజు అదే కదా మొదట్లో చదువుతాము. మనము గుడిలో విన్నాము.

ఆండాళ్ నాన్నమ్మ: అవును, నిజమే వ్యాస. పెరయాళ్వారు తిరుప్పల్లాండు మొదట్లో చదువుతారు మరియు ఆఖరున కూడా.

పరాశర: అది బావుంది నాన్నమ్మ. మనం కూడా నేర్చుకొని పెరుమాళ్ ముందు చదవటం మొదలుపెడదాం.

ఆండాళ్ నాన్నమ్మ: ఖచ్చితంగా, మీరు తొందరలోనే అది మొదలు పెట్టేస్తారు.  వారు ఆండాళ్ తండ్రిగారు, ప్రసిద్ధమైన తిరుప్పావై పాడారు. ఆండాళ్ గురించి తరువాత చెబుతాను, రండి వెళ్లి పెరుమాళ్ల కు దండ సమర్పిస్తాము.

ఆండాళ్ నాన్నమ్మ దండ అల్లడం పూర్తి చేసి సమర్పించుటకు,  వ్యాస మరియు పరాశరతో పాటు శ్రీరంగనాథుని గుడివైపుకి వెళ్లసాగింది.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-periyazhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *