శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఆండాళ్ నాన్నమ్మ వైకుంఠ ఏకాదశి రోజున జాగారణ ఉందామని అనుకున్నారు, పరాశర మరియు వ్యాస కూడా ఆరోజు మెలుకువ ఉంటామని చెబుతారు.
ఆండాళ్ నాన్నమ్మ: ఈ శుభ రోజున, మెలుకువ మాత్రమే ఉంటే సరిపోదు. మనం పెరుమాళ్ గురించి మాట్లాడటం మరియు వారి సేవలో నిమగ్నమై ఉండాలి.
పరాశర: నాన్నమ్మ, మనము ఎలాగో జాగారణ ఉండాలనుకుంటున్నాము కదా, మీరు తరువాత ఆళ్వారు గురించి చెబుతారా?
ఆండాళ్ నాన్నమ్మ: పరాశర, నా మనసులో ఏమిఉందో నువ్వు అదే అడిగావు. సరే, నేను ఇప్పుడు తిరుప్పాణ్ ఆళ్వార్ గురించి చెబుతాను.
పరాశర మరియు వ్యాస: తప్పకుండా నాన్నమ్మ.
ఆండాళ్ నాన్నమ్మ: తిరుప్పాణ్ ఆళ్వారు శ్రీరంగం దగ్గర ఉరైయుర్లో కార్తీక మాసం, రోహిణి నక్షత్రంలో జన్మించారు.వారు శ్రీరంగనాథుని సౌందర్యాన్ని పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణిస్తూ 10 పాశురాలు ఉన్న అమలనాదిపిరాన్ రచించారు.
వ్యాస: ఓ! అవును నాన్నమ్మ, మన పెరుమాళ్ ఎంతో అందముగా ఉంటారు, ఎవరు చూసినా వారికి పరిపూర్ణ ఆనంద అనుభవం లభిస్తుంది.
ఆండాళ్ నాన్నమ్మ: అవును! వారు పెరియ పెరుమాళ్ యొక్క ప్రియ భక్తుడు .ఒక ఆసక్తికరమైన సంఘటన హటాత్తుగా వారి పరమపద నివాసం చేరుకోవటానికి దోహదపడింది.
పరాశర: దయచేసి ఆ సంఘటన చెప్పండి నాన్నమ్మ.
ఆండాళ్ నాన్నమ్మ: ఒక రోజు, వారు కావేరికి అటు వైపు ఒడ్డున నుంచి పెరిమాళ్ ని ప్రశంసిస్తూ పాటలు పాడుతున్నారు. అప్పటి వరకు వారు భౌతికంగా శ్రీరంగంలో ఎప్పుడు అడుగుపెట్టలేదు. పెరియ పెరుమాళ్ కైన్కర్యర్పరుల్లో ఒకరు లోకసారంగముని నది నుంచి జలం తీసుకు రావటానికి వస్తారు. ఆ సమయంలో వారి దారిలో ఆళ్వారును ఉండటం గమనించారు. వారు ఆళ్వారుని అడ్డు తప్పుకుంటే జలం తీసుకోని వెళ్లతానని అడుగుతారు. కాని ఆళ్వారు పెరియ పెరుమాళ్ పై అఘాడమైన ధ్యానములో ఉన్నారు. అందుకని వారు స్పందించలేదు.
వ్యాస: తరువాత ఏమి అయ్యింది నాన్నమ్మ?
ఆండాళ్ నాన్నమ్మ: లోక సారంగముని ఒక గులకరాయిని తీసుకోని ఆళ్వారు పైన విసిరారు. ఆళ్వారుకు దెబ్బ తగిలి రక్తం కారటం మొదలైయింది. ఆళ్వారు ధ్యానము నుండి మేలుకొని వారు దారిలో ఉన్నారని తెలుసుకొంటారు.
పరాశర: వారికి లోకసారంగాముని పైన కోపం వచ్చిందా?
ఆండాళ్ నాన్నమ్మ: లేదు! శ్రీవైష్ణవులకు ఇలాంటి చిన్న విషయాలకు ఎపుడూ కోపం రాదు. వెంటనే ఆళ్వారు వారి దారిలో అడ్డం ఉన్నందుకు క్షమించమని అడిగి పక్కకు తప్పుకుంటారు. లోకసారంగముని గుడికి వెళ్లతారు కాని పెరియ పెరుమాళ్ ఆళ్వారుపైన అనవసరమైన దుర్వ్యవహారానికి కోపగిస్తారు. వారు తలుపులు తీయడానికి నిరాకరించి వెంటనే ఆళ్వారు దగ్గరకు వెళ్లి క్షమాపన యాచించి వారిని గుడికి తీసుకొని రమ్మంటారు. లోకసారంగముని వారు చేసిన ఈ పెద్ద తప్పుని గుర్తించి పరిగెత్తుకొని ఆళ్వారు దగ్గరకు వెళ్లతారు. వారు క్షమించమని ఆళ్వారుని యాచిస్తారు. ఆళ్వారుకు వారిపైన ఏ చెడ్డ భావన లేదు అందువల్ల వారి మాటలను వినయముగా స్వీకరిస్తారు.
వ్యాస: వారు అంతటి ఉదాహరణ మనకు నాన్నమ్మ. మనము కూడా వారి లాగా సజ్జనులై , ఉదారస్వాభావులై ఉండటానికి ప్రయత్నిద్దాం.
ఆండాళ్ నాన్నమ్మ: తరువాత లోకసారంగముని మరీ మరీ అడిగితే, ఆళ్వారు లోకసారంగముని భుజాల పైనకేక్కి దారిలో అమలనాదిపిరాన్ పాడుతూ పెరియ పెరుమాళ్ సన్నిధికి చేరుకుంటారు. వారు ఆఖరి పాశురం పాడుతూ ఇలా అంటారు ” పెరియ పెరుమాళ్ ని చూచిన ఈ కళ్ళతో ఇంక ఏమి చూడను “అని పెరియ పెరుమాళ్ సన్నిధికి చేరుకుంటారు. ఒక్కసారి వారు పెరియ పెరుమాళ్ పాద కమలాల వద్ద మాయమైపోయి శాశ్వత కైంకర్యం కొరకు పరమపదాన్ని అధీష్ఠిస్తారు.
పరాశర: ఓ! ఇది ఎంత అద్భుతంగా ఉంది నాన్నమ్మ. ఇప్పటి వరకు విన్న ఆళ్వారుల చరిత్ర అందరిలోకి ఇది ఉత్తమంగా ఉంది.
ఆండాళ్ నాన్నమ్మ: అవును, తిరుప్పాణ్ ఆళ్వార్ పెరియ పెరుమాళ్ యొక్క విశేష భక్తులు.మనం కూడా ఈవేళ ఉరైయూర్కి వెళ్లి వారిని సేవిద్దాం.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము : http://pillai.koyil.org/index.php/2015/01/beginners-guide-thiruppanazhwar/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org