బాల పాఠము – ఉయ్యక్కొణ్డార్ మరియు మణక్కాల్ నమ్బి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< నాథమునులు

వ్యాస మరియు పరాశర వారి స్నేహితురాలు వేదవల్లితో పాటు ఆండాళ్ నాన్నమ్మ  ఇంటికి వస్తారు.  నాన్నమ్మ వారిని తన చేతులలోని ప్రసాదముతో స్వాగతిస్తారు.

ఆండాళ్ నాన్నమ్మ:  ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని  మీ కొత్త స్నేహితురాలు ఎవరో చెప్పండి.

వ్యాస: నాన్నమ్మా, ఈమె పేరు వేదవల్లి సెలవుల కోసం కాంచీపురం నుండి వచ్చింది. తను కూడా ఆచార్యుల యొక్క ప్రఖ్యాతమైన కథలను వింటుందని మాతో పాటు తీసుకని వచ్చాము.

పరాశర: నాన్నమ్మా మనము ఈవాళ ఏదైనా పండుగ జరుపుకుంటున్నామా?

ఆండాళ్ నాన్నమ్మ: నేడు పద్మాక్షర్ మరియు పుండరీకాక్షర్ అని కూడా పిలవబడే ఉయ్యక్కొండార్  యొక్క తిరునక్షత్రము.

uyyakkondar

వ్యాస: నాన్నమ్మా, మీరు ఈ ఆచార్య గురించి మాకు చెప్పగలరా?

ఆండాళ్ నాన్నమ్మ: వారు చైత్ర మాసం, కృత్తికా నక్షత్రం, తిరువెళ్ళరాయ్ దివ్య దేశంలో జన్మించారు. వారికి తిరువెళ్ళరాయ్ యొక్క ఎమ్పెరుమాన్  పేరు పెట్టారు. వారు కురుగై కావలప్పన్ తో పాటుగా నాథముని వారి ప్రధాన శిష్యుడు. నాథమునులకు అష్టాంగ యోగం నమ్మాళ్వార్ వారి దీవెనలతో లభించినది.

పరాశర: ఈ యోగం ఏమిటి నాన్నమ్మా?

ఆండాళ్ నాన్నమ్మ: ఇది ఒక విధమైన యోగ పద్ధతి, దీని ద్వారా శరీర కార్యకలాపాల గురించి ఆలోచించకుండా భగవానుని నిరంతరాయముగా అనుభవించవచ్చు. నాథముని అష్టాంగ యోగను కురుగై కావలప్పన్ కు బోధించారు, ఉయ్యక్కొండార్ ని నేర్చుకుంటారేమో నని అడిగారు, “పిణం కిడక్క మనాం పుణరళామొ?” అని ఉయ్యక్కొండార్ అంటారు.

పరాశర: నాన్నమ్మా, అతను ఎవరైనా మరణించినప్పుడు ఆనందించలేము అని చెబుతున్నారా? ఎవరు మరణించారు?

ఆండాళ్ నాన్నమ్మ: అద్భుతం పరాశర! ఈ ప్రపంచంలో చాలామంది ప్రజలు బాధపడుతున్నారని, భగవానుని తానొక్కరే ఆనందించగలను అని ఎలా ఆలోచించవచ్చని ఆయన అన్నారు. ఇది విన్న, నాథముని మిక్కిలి సంతోషపడి  ఉయ్యక్కొండార్ యొక్క ఔదార్యాన్ని ప్రశంసిస్తారు. ఈశ్వర ముని  కుమారుడికి (నాథముని యొక్క సొంత మనవడు)  అష్టాంగ యోగం, దివ్య ప్రబంధం మరియు అర్థాన్ని ఉపదేశమివ్వమని ఉయ్యక్కొండార్  మరియు కురుగై కావలప్పన్ కు వారు ఆదేశిస్తారు.

వ్యాస: నాన్నమ్మా ఉయ్యక్కొండార్ కి ఎవరైనా శిష్యులు ఉన్నారా?

ఆండాళ్ నాన్నమ్మ: వారికి మణక్కాళ్ నంబి ప్రధాన శిష్యుడు. పరమపదానికి వెళ్ళే సమయములో, మణక్కాళ్ నంబి ఉత్తరాధికారి గురించి ప్రశ్నించగా,  సాంప్రదాయం జాగ్రత్తలను వారినే వహించమని  మణక్కాళ్ నంబిని నిర్దేశిస్తారు. అదీకాక యామునైత్తురైవర్ (ఈశ్వర ముని యొక్క కుమారుడు) ని వారి ఉత్తరాధికారిగా సిద్ధం చేయమని మణక్కాళ్ నంబికి నిర్దేశిస్తారు.

పరాశర: నాన్నమ్మా మణక్కాళ్ నంబి గురించి మాకు చెప్పగలరా?

ఆండాళ్ నాన్నమ్మ: వారి అసలు పేరు రామమిశ్రార్. మాఘ మాసం, మఖా నక్షత్రం, మణక్కాళ్ లో జన్మించారు. మధురకవి ఆళ్వార్ ఎలా నమ్మాళ్వారుకి అంకితమై ఉండేవారో, మణక్కాళ్ నంబి ఉయ్యక్కొండార్ కి అంకితమై ఉండేవారు. ఉయ్యక్కొండార్ భార్య మరణించిన తరువాత, అతను వంట కైంకర్యాన్ని వహిస్తూ  తన ఆచార్యుని ప్రతి వ్యక్తిగత అవసరానికి హాజరయ్యారు. ఉయ్యక్కొండార్ యొక్క కుమార్తెలు నదిలో స్నానం చేసిన తర్వాత వారు ఒకసారి బురదను దాట వలసి వచ్చింది. వారు బురద లో నడవడానికి వెనుకాడగా, రామమిశ్రార్ ఆ బురదలో పడుకొని వారి కుమార్తెలను తన వీపుపై నుండి నడిచి బురదను దాటమంటారు. ఇది విన్న ఉయ్యక్కొండార్, నంబి అంకిత భావానికి చాలా గర్వ పడతారు.

పిల్లలు: నాన్నమ్మా, మనము మరలా కలుసుకున్నప్పుడు  మీరు యమునైత్తురైవర్ కథ చెప్పగలరా?

నాన్నమ్మ సంతోషంగా ” తరువాత మనం కలుసుకున్నప్పుడు ఆ పని సంతోషంగా చేస్తాను ”  పిల్లలు వారి వారి ఇంటికి తిరిగి వెళతారు..

మూలము : http://pillai.koyil.org/index.php/2015/10/beginners-guide-uyakkondar-and-manakkal-nambi/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *