Author Archives: Sridevi

బాల పాఠము – ఆళవందార్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఉయ్యక్కొణ్డార్ మరియు మణక్కాల్ నమ్బి

వ్యాస, పరాశర మరియు వారి స్నేహితురాలు అత్తుళాయ్ తో పాటు నాన్నమ్మ ఇంటికి వస్తారు. నాన్నమ్మ వారిని తన చేతులలో ప్రసాదముతో స్వాగతిస్తారు.

నాన్నమ్మ:  స్వాగతం అత్తుళాయ్! ఇక్కడ మీ చేతులు, కాళ్ళు కడుక్కొని ఈ ప్రసాదం తీసుకోండి. నేడు ఉత్తరాషాడం, ఆళవందార్ తిరునక్షత్రం.

పరాశర : నాన్నమ్మా, పోయినసారి మీరు యమునైత్తురైవర్ గురించి మాకు చెప్తానని అన్నారు గుర్తుందా?

నాన్నమ్మ:  అవును! నాకు గుర్తుంది, మీకు గుర్తుందని మరియు ఆచార్యుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేడు వారి తిరునక్షతరం. వారి కీర్తి ప్రతిష్టల గురించి చర్చించడానికి చాలా సరైన రోజు.

వ్యాస : నాన్నమ్మా, కానీ మీరు ఆళవందార్ తిరునక్షత్రం అని అన్నారు కదా?

ఆళవందార్ – కాట్టు మన్నార్ కోయిల్

నాన్నమ్మ:  అవును. కట్టూ మన్నర్ కైయిల్ లో జన్మించిన యమునాథ్యురైవర్ తరువాత ఆళవందార్ గా ప్రసిద్ది చెందారు. వారు ఈశ్వర ముని యొక్క కుమారుడిగా మరియు నాథముని యొక్క మనుమడిగా జన్మించారు. వారు మహాభాష్య భట్టర్ వద్ద విద్యను అభ్యసించారు. వారు ఆళవందార్ గా పిలువబడడానికి  చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఆ రోజులల్లో పండితులు ప్రధాన పండితులకు పన్నులు చెల్లించే వారు . అక్కియాల్వాన్ అనే రాజ పురోహితుడు తన ప్రతినిధులను పండితుల వద్దకు పన్నులు చెల్లించమని పంపేవాడు. మహాభాష్య భట్టర్ భయపడితే, యమునైత్తురైవర్ తను  చూసుకుంటాడని చెబుతాడు. అతను “చౌకబారు కీర్తి ప్రతిష్టల కోసం చూస్తున్న కవులను నాశనం చేస్తాను” అని ఒక శ్లోకాన్ని పంపుతాడు. ఇది చూసిన అక్కియాల్వాన్ కు కోపం వచ్చి, తన సైనికులకు యమునైత్తురైవర్ ని రాజ దర్బారుకి  తీసుకురమ్మని పంపుతాడు. యమునైత్తురైవర్ తనకు సరైన గౌరవం ఇచ్చినప్పుడు మాత్రమే వస్తానని చెప్తాడు. అందువల్ల, రాజు వారికోసం పల్లకి పంపితే  యమనుతితురైవర్ దర్బారుకి  హాజరౌతారు. చర్చ మొదలవుతుండగా, రాణి, యమనుతితురైవర్ విజయాన్ని సాధిస్తాడని రాజుకు చెబుతుంది. ఒక వేళ అతను ఓడిపోతే, ఆమె రాజుకు సేవకురాలై సేవలు చేస్తానని చెప్తుంది. రాజు అక్కియాల్వాన్ గెలుస్తాడని నమ్మకం ఉందన్నారు. ఒకవేళ యమునైత్తురైవర్ గెలుస్తే అతనికి సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తారు . చివరకు, గొప్ప శౌర్యం జ్ఞానంతో, యమునైత్తురైవర్ అక్కియాల్వాన్ పై విజయం సాధిస్తారు. అక్కియాల్వాన్ చాలా ప్రభావితులై  యమునైత్తురైవర్ శిష్యులు అవుతారు. రాణి తనని రక్షించడానికి వచ్చారని “ఆళవందార్” అనే పేరును ఇస్తుంది – ఒక వేళ అతను ఓడిపోతే, ఆమె ఒక సేవకురాలై మారి ఉండేది. కాని ఇప్పుడు  ఆమె కూడా ఆళవందార్ శిష్యులుగా మారుతుంది.  రాజు వాగ్దానం ప్రకారం అతను సగం రాజ్యం పొందుతాడు.

వ్యాస : నాన్నమ్మా, యమునైత్తురైవర్ సగం రాజ్యం పొంది ఉంటే, అతను రాజ్యం పరిపాలించి వుండాలి. అతను మన సాంప్రదాయం లోకి ఎలా వచ్చారు?

అత్తుళాయ్:   ఉయ్యక్కొండార్ శిష్యులైన మణక్కాళ్ నంబి ద్వారా అతను మన సాంప్రదాయం లోకి వచ్చారు. ఉయ్యక్కొండార్ నిర్దేశం ప్రకారం  మణక్కాళ్ నంబి  ఆళవందార్లను తీసుకువస్తారు.

నాన్నమ్మ: ఖఛ్చితంగా నిజం అత్తుళాయ్! దీని గురించి నీకు ఎలా తెలుసు?

అత్తుళాయ్: మా అమ్మ కూడా మన ఆచార్యులు మరియు పెరుమాళ్ గురించి కథలను చెపుతుంది.

నాన్నమ్మ:  ఆళవందార్ ఒక గొప్ప ఆచార్యులు, వారు దేవపెరుమాళ్ ఆశీర్వాదంతో శ్రీ రామానుజులను మన సాంప్రదాయంలోకి తీసుకువచ్చారు.

పరాశర : కానీ నాన్నమ్మా, దేవపెరుమాళ్ ఎలా ఆళవందార్ కి సహాయం చేస్తారు?

నాన్నమ్మ: ఆళవందార్ కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఇళైఆళ్వార్ని చూస్తారు (ఈయనే తరువాతికాలంలో రామానుజులైనారు). ఇళైఆళ్వార్ తన గురువు యాదవ ప్రకాశుని వద్ద విద్య నేర్చుకొనే రోజులవి. సాంప్రదాయం తర్వాతి నాయకుడిగా ఇళైఆళ్వార్ని తయారు చేయమని ఆళవందార్ పెరుమాళ్ ను ప్రార్థిస్తారు. అందువల్ల దేవపెరుమాళ్ ఒక తల్లిలాగా ఇళైఆళ్వార్ని పెంచుతారు, వారు తరువాత కాలంలో సాంప్రదాయానికి గొప్పలో గొప్ప అయిన కైంకర్యాన్ని అందిస్తారు. ఆళవందార్ అవసరమైన విధంగా ఇళైఆళ్వార్కి మార్గనిర్దేశం చేయమని తిరుక్కచ్చి నంబికి కూడా అప్పగిస్తారు. తిరుక్కచ్చి నంబి మీకు గుర్తున్నారా?

వ్యాస : అవును నాన్నమ్మా, అతను తిరువాలవట్ట (వింజామర) కైంకర్యం దేవపెరుమాళ్, తాయార్లకు చేస్తారు మరియు వారిరువురితో మాట్లాడతారు కూడా. మనం కూడా తిరుక్కచ్చి నంబి లాగా పెరుమాళ్లతో మాట్లాడినట్లయితే ఎంత బాగుంటుంది? అయితే ఆళవందార్ ఇళైఆళ్వార్ ని కలిసారా? ఆళవందార్ ఇళైఆళ్వార్ని తన శిష్యులుగా అంగీకరించారా?

నాన్నమ్మ: దురదృష్టవశాత్తు కలుసుకోలేదు! ఇళైఆళ్వార్ ఆళవందార్ యొక్క శిష్యుడు కావటానికి శ్రీరంగం రావడానికి ముందే వారు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పరమపదం చేరుకుంటారు. వారు ఒకరినొకరు కలుసుకోలేక పోయారుకానీ ఆళవందార్ యొక్క కోరికలను నెరవేరుస్తానని ఇళైఆళ్వార్ హామీ ఇస్తారు. ఈ సారి మనం కలుసుకున్నప్పుడు, నేను మీకు, ఆళవందార్ శిష్యులలో ఒకరైన పెరియ నంబి గురించి తెలియజేస్తాను, ఈయనే ఇళైఆళ్వార్ యొక్క గురువై నిరంతరం మార్గదర్శకులగా వారిని నడిపిస్తారు. ఆళవందారుకి అనేకమంది శిష్యులు ఉండేవారు. వారందరూ ఇళైఆళ్వార్ని  సాంప్రదాయంలోకి తీసుకురావడానికి కలిసి కృషి చేశారు. పెరియ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరుమలై ఆండాన్, మారనేరి నంబి, తిరుక్కచ్చి నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్ మరెందరో ఆళవందార్ల శిష్యులు .

వ్యాస , పరాశర మరియు అత్తుళాయ్: ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నాన్నమ్మా. వచ్చే సారి దయచేసి పెరియ నంబి మరియు ఇళైఆళ్వార్ల గురించి చెప్పండి.

నాన్నమ్మ:  చాలా ఆనందంగా చెప్తాను. కానీ ఇప్పుడు బయట చీకటి పడుతోంది. మీరు మీ ఇండ్లకు వెళ్లండి.

పిల్లలు ఆళవందార్ గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లకు సంతోషంగా బయలుదేరుతారు..

మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-alavandhar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఉయ్యక్కొణ్డార్ మరియు మణక్కాల్ నమ్బి

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< నాథమునులు

వ్యాస మరియు పరాశర వారి స్నేహితురాలు వేదవల్లితో పాటు ఆండాళ్ నాన్నమ్మ  ఇంటికి వస్తారు.  నాన్నమ్మ వారిని తన చేతులలోని ప్రసాదముతో స్వాగతిస్తారు.

ఆండాళ్ నాన్నమ్మ:  ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని  మీ కొత్త స్నేహితురాలు ఎవరో చెప్పండి.

వ్యాస: నాన్నమ్మా, ఈమె పేరు వేదవల్లి సెలవుల కోసం కాంచీపురం నుండి వచ్చింది. తను కూడా ఆచార్యుల యొక్క ప్రఖ్యాతమైన కథలను వింటుందని మాతో పాటు తీసుకని వచ్చాము.

పరాశర: నాన్నమ్మా మనము ఈవాళ ఏదైనా పండుగ జరుపుకుంటున్నామా?

ఆండాళ్ నాన్నమ్మ: నేడు పద్మాక్షర్ మరియు పుండరీకాక్షర్ అని కూడా పిలవబడే ఉయ్యక్కొండార్  యొక్క తిరునక్షత్రము.

uyyakkondar

వ్యాస: నాన్నమ్మా, మీరు ఈ ఆచార్య గురించి మాకు చెప్పగలరా?

ఆండాళ్ నాన్నమ్మ: వారు చైత్ర మాసం, కృత్తికా నక్షత్రం, తిరువెళ్ళరాయ్ దివ్య దేశంలో జన్మించారు. వారికి తిరువెళ్ళరాయ్ యొక్క ఎమ్పెరుమాన్  పేరు పెట్టారు. వారు కురుగై కావలప్పన్ తో పాటుగా నాథముని వారి ప్రధాన శిష్యుడు. నాథమునులకు అష్టాంగ యోగం నమ్మాళ్వార్ వారి దీవెనలతో లభించినది.

పరాశర: ఈ యోగం ఏమిటి నాన్నమ్మా?

ఆండాళ్ నాన్నమ్మ: ఇది ఒక విధమైన యోగ పద్ధతి, దీని ద్వారా శరీర కార్యకలాపాల గురించి ఆలోచించకుండా భగవానుని నిరంతరాయముగా అనుభవించవచ్చు. నాథముని అష్టాంగ యోగను కురుగై కావలప్పన్ కు బోధించారు, ఉయ్యక్కొండార్ ని నేర్చుకుంటారేమో నని అడిగారు, “పిణం కిడక్క మనాం పుణరళామొ?” అని ఉయ్యక్కొండార్ అంటారు.

పరాశర: నాన్నమ్మా, అతను ఎవరైనా మరణించినప్పుడు ఆనందించలేము అని చెబుతున్నారా? ఎవరు మరణించారు?

ఆండాళ్ నాన్నమ్మ: అద్భుతం పరాశర! ఈ ప్రపంచంలో చాలామంది ప్రజలు బాధపడుతున్నారని, భగవానుని తానొక్కరే ఆనందించగలను అని ఎలా ఆలోచించవచ్చని ఆయన అన్నారు. ఇది విన్న, నాథముని మిక్కిలి సంతోషపడి  ఉయ్యక్కొండార్ యొక్క ఔదార్యాన్ని ప్రశంసిస్తారు. ఈశ్వర ముని  కుమారుడికి (నాథముని యొక్క సొంత మనవడు)  అష్టాంగ యోగం, దివ్య ప్రబంధం మరియు అర్థాన్ని ఉపదేశమివ్వమని ఉయ్యక్కొండార్  మరియు కురుగై కావలప్పన్ కు వారు ఆదేశిస్తారు.

వ్యాస: నాన్నమ్మా ఉయ్యక్కొండార్ కి ఎవరైనా శిష్యులు ఉన్నారా?

ఆండాళ్ నాన్నమ్మ: వారికి మణక్కాళ్ నంబి ప్రధాన శిష్యుడు. పరమపదానికి వెళ్ళే సమయములో, మణక్కాళ్ నంబి ఉత్తరాధికారి గురించి ప్రశ్నించగా,  సాంప్రదాయం జాగ్రత్తలను వారినే వహించమని  మణక్కాళ్ నంబిని నిర్దేశిస్తారు. అదీకాక యామునైత్తురైవర్ (ఈశ్వర ముని యొక్క కుమారుడు) ని వారి ఉత్తరాధికారిగా సిద్ధం చేయమని మణక్కాళ్ నంబికి నిర్దేశిస్తారు.

పరాశర: నాన్నమ్మా మణక్కాళ్ నంబి గురించి మాకు చెప్పగలరా?

ఆండాళ్ నాన్నమ్మ: వారి అసలు పేరు రామమిశ్రార్. మాఘ మాసం, మఖా నక్షత్రం, మణక్కాళ్ లో జన్మించారు. మధురకవి ఆళ్వార్ ఎలా నమ్మాళ్వారుకి అంకితమై ఉండేవారో, మణక్కాళ్ నంబి ఉయ్యక్కొండార్ కి అంకితమై ఉండేవారు. ఉయ్యక్కొండార్ భార్య మరణించిన తరువాత, అతను వంట కైంకర్యాన్ని వహిస్తూ  తన ఆచార్యుని ప్రతి వ్యక్తిగత అవసరానికి హాజరయ్యారు. ఉయ్యక్కొండార్ యొక్క కుమార్తెలు నదిలో స్నానం చేసిన తర్వాత వారు ఒకసారి బురదను దాట వలసి వచ్చింది. వారు బురద లో నడవడానికి వెనుకాడగా, రామమిశ్రార్ ఆ బురదలో పడుకొని వారి కుమార్తెలను తన వీపుపై నుండి నడిచి బురదను దాటమంటారు. ఇది విన్న ఉయ్యక్కొండార్, నంబి అంకిత భావానికి చాలా గర్వ పడతారు.

పిల్లలు: నాన్నమ్మా, మనము మరలా కలుసుకున్నప్పుడు  మీరు యమునైత్తురైవర్ కథ చెప్పగలరా?

నాన్నమ్మ సంతోషంగా ” తరువాత మనం కలుసుకున్నప్పుడు ఆ పని సంతోషంగా చేస్తాను ”  పిల్లలు వారి వారి ఇంటికి తిరిగి వెళతారు..

మూలము : http://pillai.koyil.org/index.php/2015/10/beginners-guide-uyakkondar-and-manakkal-nambi/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – నాథమునులు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆచార్యుల పరిచయము

nathamunigalవ్యాస మరియు పరాశర పాఠశాల తర్వాత ఇంటికి వస్తారు. వారితో పాటు వారి స్నేహితురాలు అత్తుళాయ్ ని తీసుకువస్తారు.

నాన్నమ్మ: మీరు ఎవరిని వెంట తీసుకువచ్చారు?

వ్యాస: నాన్నమ్మా, ఈమె అత్తుళాయ్ , మా స్నేహితురాలు. మీరు మాతో చెప్పిన కొన్ని వైభవాలను ఆమెకు చెప్పాము,  మీ నుండి వినాలని ఆమెకు ఆసక్తిగా ఉంది. అందుకని, ఆమెని వెంట తీసుకువచ్చాము.

నాన్నమ్మ:  స్వాగతం అత్తుళాయ్. మీరు ఇద్దరూ నేను చెప్పేది వినడమే కాకుండా,  మీ స్నేహితులకి కూడా వినిపిస్తున్నారంటే, చాలా సంతోషంగా ఉంది.

పరాశర: నాన్నమ్మా, మేము మన ఆచార్యుల గురించి వినడానికి వచ్చాము.

నాన్నమ్మ: మంచిది .నేను ఈ రోజు మీకు నమ్మాళ్వార్ దైవిక జోక్యంతో మన సాంప్రదాయం  మహిమను తిరిగి వెలికి తెచ్చిన ఆచార్యుడి గురించి చెప్తాను.

అత్తుళాయ్: వారు ఎవరు నాన్నమ్మా?

నాన్నమ్మ అత్తుళాయ్, వ్యాస మరియు పారాశరుల కోసం కొన్ని పండ్లు మరియు తినే వస్తువులను తెస్తుంది.

నాన్నమ్మ: అతను మన నాథముని. శ్రీమాన్ నాథముని ఈశ్వర భాట్టాల్వార్ కు వీరనారాయణపురంలో (కాట్టు మన్నార్ కోయిల్ ) జన్మించారు. అతనిని శ్రీరంగనాథముని అని మరియు నాథ బ్రహ్మర్ అని కూడా పిలుస్తారు. అతను అష్టాంగ యోగంలో మరియు దివ్య సంగీతంలో  నిపుణులు. అంతేకాదు వీరే అరైయర్ సేవను స్థాపించిన వ్యక్తి, ఇప్పటికీ శ్రీరంగం, ఆళ్వార్  తిరునాగరి, శ్రీవిల్లిపుత్తూర్  మొదలైన దివ్య దేశాలలో  అమలులో ఉంది.

పరాశర: నాన్నమ్మా మేము చాలా సార్లు మా పెరుమాళ్ ముందు అరైయర్ సేవ చూసాము . అరైయర్ స్వామి తన చేతుల్లో తాళం పట్టుకొని పాసురాలు పాడుతున్న విధానం చాలా అందంగా ఉంటుంది.

నాన్నమ్మ: అవును. ఒక రోజు, మేళనాడు (తిరునారాయణపురం ప్రాంతం) నుండి శ్రీవైష్ణవుల  బృందం కాట్టు మన్నార్ కోయిల్ ను సందర్శించారు. మన్నార్  (కాట్టు మన్నార్ కోయిల్ లో ఎమ్పెరుమాన్) ముందు తిరువాయ్మోలి లోని ” ఆరావముదే …” పాడతారు. నాథముని, ఆ పాసురాల లోని అర్థంతో మోహితుడై, వాటి గురించి ఆ శ్రీవైష్ణవులను అడిగారు, కానీ వారికి ఆ 11 పాసురాలు తప్ప ఇంక ఏమి తెలియదు. వారు నాథమునిని తిరుక్కురుగూర్ కి వెళితే, అక్కడ మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అని వివరిస్తారు. నాథముని మన్నార్ దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆళ్వార్ తిరునగరి చేరుకుంటారు.

అత్తుళాయ్, వ్యాస మరియు పరాశరులు త్వరగా వారి తినుబండారాలు పూర్తి చేసి, ఆత్రుతగా నాథముని గురించి వినడం కొనసాగిస్తున్నారు .

నాన్నమ్మ: అయన మాధురకవి ఆళ్వార్ యొక్క శిష్యుడైన పరాంకుశ దాసుని కలుసుకుంటారు , వారు కన్నినూన్ చిరుత్తాంబు ను నాథమునికి బోధించి తిరుప్పులియాల్వార్  (చింతపండు చెట్టు, నమ్మాళ్వార్ నివసించిన చోట) ఎదుట 12000 సార్లు ఒకే సారిగా నిరంతరంగా పటించమని వివరిస్తారు. నాథముని అప్పటికే అష్టాంగ యోగం నేర్చుకున్నారు కాబట్టి, అతను నమ్మాళ్వార్ ని ధ్యానించి, విజయవంతంగా కన్నినూన్ చిరుత్తాంబు 12000 సార్లు పఠనం పూర్తిచేస్తారు. నమ్మాళ్వార్ సంతోషంతో అతని ముందు ప్రత్యక్షమై  అష్టాంగ యోగం, 4000 దివ్య ప్రబంధం మరియు అరులిచెయ్యల్ (దివ్య ప్రబంధం) యొక్క అన్ని అర్ధాలుతో పూర్తి జ్ఞానాన్ని అతనికి ప్రసాదించి ఆశీర్వదిస్తారు.

వ్యాస: అయితే, ‘ఆరావముదే’ పదిగం 4000 దివ్య ప్రబంధంలోని భాగమేనా?

నాన్నమ్మ: అవును. ఆరావముదే పదిగం తిరుక్కుడంతై  ఆరావముదన్ ఎమ్పెరుమాన్  గురించి ఉంది. ఆ తరువాత, నాథముని కాట్టు మన్నార్ కోయిల్ తిరిగి వచ్చి మన్నారుకు  4000 దివ్య ప్రబందం అర్పిస్తారు . మన్నార్ చాలా సంతోషించి నాథమునిని  దివ్య ప్రబందాన్ని  వర్గీకరణ చేసి నలుమూలలా ప్రచారం చేయమని వివరిస్తారు. నాథముని అరులిచ్చెయల్ కి సంగీతాన్ని జతచేర్చి వారి మేనల్లుడైన కీలై అగత్త్ ఆల్వారుకు భోదించి వారి ద్వారా ప్రచారం చేస్తారు. అంతేకాక, తన అష్టాంగ యోగ సిద్ది ద్వారా, వారు మన సాంప్రదాయంలో మరొక పెద్ద ఆచార్యలు రానున్నారని కనపెడతారు. మరో సారి, నేను అతని గురించి మరింత మీకు చెప్తాను.

పిల్లలు: ఖచ్చితంగా నాన్నమ్మ. వారి గురించి తెలుసుకోవడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము.

అత్తుళాయ్  నాన్నమ్మ నుండి ఆశీర్వాదం తీసుకోని ఆమె ఇంటికి బయలుదేరింది, అయితే వ్యాస మరియు పరాశర వారి పాఠశాల పాఠాలను అధ్యయనం చేయడానికి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2015/06/nathamunigal/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఆచార్యుల పరిచయము

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< దివ్య ప్రబంధము – ఆళ్వారులు అనుగ్రహించిన విలువైన కానుక

Acharyas

ఆచార్య రత్నహారం

పరాశర మరియు వ్యాస కొంతకాలం తర్వాత ఆండాళ్ నాన్నమ్మ వద్దకు వచ్చి ఉంటారు. సెలవులలో  అమ్మమ్మ తాతలతో కలిసి ఉండటానికి వారు తిరువల్లిక్కేణి  వెళ్లారు.

నాన్నమ్మ: పరాశర! వ్యాస! స్వాగతం. తిరువల్లిక్కేణిలో చాలా బావుండింది అని ఆశిస్తున్నాను.

పరాశర :  అవును నాన్నమ్మ!  అద్భుతంగా ఉండింది. మేము ప్రతిరోజు పార్థసారథి పెరుమాళ్ దేవాలయానికి వెళ్ళాము. అంతేకాదు, మేము దగ్గరలోని కాంచీపురం మొదలగు చాలా దివ్యదేశాలు దర్శించాము. మేము శ్రీపెరుంబుదూర్ కూడా వెళ్లి ఎమ్బెరుమానార్ని దర్శనం చేసుకున్నాము.

నాన్నమ్మ:  చాలా బాగుంది. శ్రీపెరుంబుదూర్ రామానుజుల వారి జన్మ స్థలం. వారు అత్యంత ముఖ్యమైన ఆచార్యులలో ఒకరు. నేను త్వరలో వారి గురించి మరిన్ని వివరాలు చెప్తాను. మొన్నసారి నేను ఆచార్యుల గురించి చెప్తాను అని చెప్పాను. నేను ఇప్పుడు క్లుప్తంగా పరిచయం చేస్తాను. “ఆచార్య” అనే పదానికి అర్థమేమిటో మీకు తెలుసా?

వ్యాస:  నాన్నమ్మ! ఆచార్య, గురువు అంటే ఒకటేనా?

నాన్నమ్మ:  అవును. ఆచార్య మరియు గురువు సమానమైన పదాలు. ఆచార్య అంటే నిజమైన జ్ఞానం నేర్చుకున్నవాడు, దానిని స్వయంగా పాటించి మరియు ఇతరులు అనుసరించడానికి స్ఫూర్తినిస్తాడు. గురువు అనగా మన అజ్ఞానాన్ని తొలగించేవాడు.

పరాశర:  “నిజమైన జ్ఞానం” ఏమిటి నాన్నమ్మా?

నాన్నమ్మ: చాలా తెలివైన ప్రశ్న వేసావు పరాశర. నిజమైన జ్ఞానం అంటే మనము ఎవరో తెలుసుకోవటం మరియు మన బాధ్యతలు ఏమిటో తెలుసుకోవడం. ఉదాహరణకు, నేను మీ నాన్నమ్మను. మీకు మంచి విలువలను నేర్పించడం నా బాధ్యత. ఈ విషయంలో నాకు మంచి అవగాహన ఉంటే – ఇది నిజమైన జ్ఞానం. అదేవిధంగా, మనందరం భగవానుని సేవకులం మరియు అతను మనందరికీ యజమాని. ఒక యజమానిగా, అతను మన సేవకు అర్హుడు మరియు ఒక సేవకుడిగా ఆయనను సేవించడం మన బాధ్యత. ఇది ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవలసిన సాధారణమైన “నిజమైన జ్ఞానం”. ఇది తెలిసినవారు మరియు ఆచరణాత్మక మార్గాల ద్వారా ఇతరులకు నేర్పించేవారిని ‘ఆచార్యులు’ అని పిలుస్తారు. ఈ “నిజమైన జ్ఞానం” వేదం, వేదాంతం , దివ్య ప్రబంధం మొదలైన వాటిలో అందుబాటులో ఉంది.

వ్యాస:  ఓ! అయితే, మొదటి ఆచార్య ఎవరు? ఈ “నిజమైన జ్ఞానం” ఇతరులకు నేర్పడానికి మొట్ట మొదట ఎవరికో ఒకరికి తెలిసిఉండాలి.

నాన్నమ్మ: తెలివైన ప్రశ్న వ్యాస. మన పెరియ పెరుమాళ్ మొదటి ఆచార్యుడు. ఇప్పటి వరకు ఆళ్వారుల గురించి మనము చూశాము. పెరుమాళ్ వారికి నిజమైన జ్ఞానాన్ని ఇచ్చారు. వారి జీవితాల్లో మనము చూసినట్లుగా ఆళ్వార్లు పెరుమాళ్ వైపు  గొప్ప అనుబంధాన్ని చూపించారు. వారు ఆ నిజమైన జ్ఞానాన్ని దివ్య ప్రబంధం ద్వారా వెల్లడించారు.

పరాశర: నాన్నమ్మా!  ఆళ్వారుల సమయం తర్వాత, ఏమి జరిగింది?

నాన్నమ్మ: ఆళ్వార్లు కొంతకాలం ఈ ప్రపంచంలో నివసించి వారు శాశ్వతంగా ఉండటానికి పరమపదానికి వెళ్ళిపోయారు. జ్ఞానం నెమ్మదిగా క్షీణించి, దివ్య ప్రబంధాలు దాదాపు నష్టమైనప్పుడు చీకటి కాలాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ నమ్మాళ్వార్ వారి కృపతో, మనకు దివ్యప్రబందాలు తిరిగి లభించాయి మరియు తరువాత కాలంలో అనేకమంది ఆచార్యులు వాటిని ప్రచారం చేసారు. మనము ఆ ఆచార్యుల గురించి చూద్దాము.

పరాశర మరియు వ్యాస :  నాన్నమ్మ మేము ఎదురు చూస్తాము.

నాన్నమ్మ: మీ తల్లిదండ్రులు ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. మనము తరువాత కలిసినప్పుడు ఆచార్యుల గురించి మరిన్ని విషయాలు చెబుతాను.

అడియేన్ రఘువంశీ రామానుజ దాసన్

మూలము :  http://pillai.koyil.org/index.php/2015/06/introduction-to-acharyas/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – దివ్య ప్రబంధము – ఆళ్వారులు అనుగ్రహించిన విలువైన కానుక

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< తిరుమంగై ఆళ్వారు

dhivyaprabandham-small

 

నాన్నమ్మ కన్నినూన్ చిరుత్తాంబు ప్రబంధాన్ని చదువుతోంది. పరాశర, వ్యాసులు అక్కడికి వచ్చారు.

వ్యాస: నాన్నమ్మ! మీరు ఇప్పుడు ఏమి చదువుతున్నారు?

నాన్నమ్మ: వ్యాస! నేను దివ్య ప్రబంధంలోని ఒక భాగమైన కన్నినూన్ చిరుత్తాంబు చదువుతున్నాను.

పరాశర: నాన్నమ్మ! ఇది మధురకవి ఆళ్వారుచే రచింపబడినది కదా?

నాన్నమ్మ:  అవును. చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు.

వ్యాస: నాన్నమ్మ! ఆళ్వారుల చరిత్రను వివరిస్తున్నప్పుడు, ప్రతి ఆళ్వార్ కొన్ని దివ్య ప్రబంధాలను రచించినట్లు మీరు చెప్పారు. దయచేసి దివ్య ప్రబంధం వివరాల గురించి వివరంగా చెప్పండి.

నాన్నమ్మ: తప్పకుండా వ్యాస. ఈ వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండటం మంచిది. మన శ్రీరంగనాధుడు మరియు శ్రీరంగనాచియార్ను దివ్య దంపతులుగా పిలుస్తారు. భగవాన్ ఆశీర్వాదం కారణంగా ఆళ్వారులు దివ్య సూరులు (దివ్య మరియు పవిత్ర వ్యక్తిత్వాలు) అని పిలవబడ్డారు. ఆళ్వారులు స్వరపరిచిన పాసురములను (తమిళంలో శ్లోకాలు) దివ్య ప్రబంధం (దివ్య సాహిత్యం) అని పిలుస్తారు. ఆళ్వారులచే దివ్య ప్రబంధంలో మహిమపరచబడిన క్షేత్రాలు దివ్య దేశాలుగా (దివ్య పట్టణం)  పిలువబడ్డాయి.

పరాశర: ఓ! చాలా ఆసక్తికరంగా ఉంది నాన్నమ్మా. మీరు మాట్లాడే ఈ దివ్య ప్రబంధాలు ఏమిటి నాన్నమ్మా?

నాన్నమ్మ: దివ్య ప్రబంధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఎమ్బెరుమాన్ పవిత్రమైన లక్షణాలను పూర్తిగా చర్చించడం. అంతేకాకుండా, ప్రత్యేకించి, అర్చావతార ఎమ్బెరుమాన్, మన పెరియ పెరుమాళ్, తిరువేంకటేశ్వరుడు మొదలైనవి.

వ్యాస : కానీ మనము వేదం చాలా ముఖ్యం అని విన్నాము కదా నాన్నమ్మా . దివ్య ప్రబంధంతో వేదం ఎలా సంబంధం చేర్చ బడింది నాన్నమ్మా?

నాన్నమ్మ:  అది మంచి ప్రశ్న. పెరుమాళ్ గురించి తెలుసుకోవడం వేదం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వేదం యొక్క అత్యుత్తమ భాగమైన వేదాంతం, పెరుమాళ్, అతని దివ్య లక్షణాలు, తత్వశాస్త్రం మొదలైనవాటి గురించి వివరంగా చర్చిస్తుంది. కానీ ఇవి అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆళ్వారులు వేదం మరియు వేదాంతం యొక్క సారాంశాన్ని అందమైన తమిళంలో వారి దివ్య ప్రబంధాలలో తెచ్చారు.

పరాశర : ఓ! అయితే వేదం మరియు దివ్యప్రబంధం మధ్య తేడా ఏమిటి నాన్నమ్మ?

నాన్నమ్మ: శ్రీవైకుంఠము నుండి భగవాన్ అయోధ్యకు  శ్రీరాముడుగా దిగివచ్చినపుడు, వేదం కూడా శ్రీరామాయణంగా ప్రత్యక్షమైనది. అదే విధంగా పెరుమాళ్ అర్చావతారంగా దిగివచ్చినపుడు, వేదం  ఆళ్వారుల మాటల ద్వారా దివ్యప్రబంధంగా కనిపించింది. పరమపదనాధుడిని ఇక్కడ నుండి మనము గ్రహించటం చాలా కష్టం. కాబట్టి మనము ఉన్న స్థలంలోనే అర్చావతార పెరుమాళ్ ను దర్శిస్తాము . అదేవిధంగా, వేదం / వేదాంతాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కానీ అవే సూత్రాలు ఆళ్వారులు  దివ్య  ప్రబంధంలో చాలా సరళమైన మరియు సుస్పష్టమైన పద్ధతిలో వివరించారు.

వ్యాస:  నాన్నమ్మా! అంటే మనకు వేదం ముఖ్యం కాదా?

నాన్నమ్మ: కాదు కాదు! వేదం మరియు దివ్య ప్రబంధం రెండూ మనకు సమానంగా ముఖ్యమే. వేదం  ఎందుకు ముఖ్యం  అంటే పెరుమాళ్ ను అర్థం చేసుకోవడానికున్న అన్ని వనరులకు మూలం వేదం. కానీ పెరుమాళ్ యొక్క పవిత్ర లక్షణాలను నేర్చుకోవటానికి ఆనందించడానికి దివ్య ప్రబంధం చాలా సముచితమైనది. అంతేకాదు, మనకు ఎంతో సంక్లిష్టమైన సూత్రాలు వేదంలో వివరించబడ్డాయి,  దివ్య ప్రబంధం యొక్క అర్థాలను అధ్యయనం చేయడంతో ఆ సూత్రాలు సులభంగా అర్ధం చేసుకోవచ్చు. అందువల్ల  పరిస్థితుల ప్రకారం, వేదం, వేదాంతం  మరియు దివ్య ప్రబంధం వంటి వాటిని అధ్యయనం చేయాలి.

పరాశర :  దివ్య ప్రబంధం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి నాన్నమ్మా?

నాన్నమ్మ: ఈ భౌతిక ప్రపంచంలో తాత్కాలిక ఆనందంతోను, కష్టాలతోను  మనకున్న బంధాన్ని తొలగించడమే కాకుండా శాశ్వతంగా పరమపదంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి మరియు శ్రీమన్నారయణునికి శాశ్వతముగా సేవలను అందించడమే దివ్య ప్రబంధం యొక్క ప్రధాన లక్ష్యం. మన స్వభావం శ్రీమన్నారయణునికి నిత్యంగా సేవలు అందించటమే. కానీ ఈ లోకంలో మనము ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటం వలన, ఆ విలువైన ఆనందాన్ని కోల్పోతున్నాము. దివ్య ప్రబంధం పరమపదంలో పెరుమాళ్ ను నిరంతరం సేవించే  ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

వ్యాస : అవును నాన్నమ్మా! మీరు ఇంతకు మునుపు ఈ సూత్రాన్ని వివరించారు.

పరాశర: మన పూర్వాచార్యులు ఎవరు నాన్నమ్మా?

నాన్నమ్మ: పరాశర! చాలా మంచి ప్రశ్న. నేను ఇప్పటి నుండి మన సాంప్రదాయం యొక్క అనేక ఆచార్యుల గురించి వివరిస్తాను. మన ఆచార్యుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది, తద్వారా వారు ఆళ్వారుల మాటలను ఎలా అనుసరించి జీవించారో మరియు వారి అడుగుజాడలను అనుసరించాల్సిన అవసరమును, ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాము.

పరాశర మరియు వ్యాస: ధన్యవాదాలు నాన్నమ్మా! మేము మన ఆచార్యులను గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2015/02/beginners-guide-dhivya-prabandham-the-most-valuable-gift-from-azhwars/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – తిరుమంగై ఆళ్వార్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< తిరుప్పాణాళ్వార్

thirumangai-adalma

తిరుమంగై ఆళ్వార్ , వారి ఆడల్మా గుఱ్ఱం పై

ఆండాళ్ నాన్నమ్మ, పరాశర మరియు వ్యాస ఉరైయూర్ నుండి వారి ఇంటికి వస్తున్నారు.

ఆండాళ్ నాన్నమ్మ: పరాశర మరియు వ్యాస, మీరు ఉరైయూర్ లో సమయం అద్భుతంగా గడిపినట్టున్నారు.

పరాశర మరియు వ్యాస: అవును, నాన్నమ్మ. అక్కడ తిరుప్పాణ్ ఆళ్వారును చూడటం చాలా బావుండింది. దివ్య దేశాలకు వెళ్ళటం మరియు అక్కడ అర్చావతార ఎమ్పెరుమాన్ ని సేవించటం చాలా బావుంది.

ఆండాళ్ నాన్నమ్మ: ఇప్పుడు మీకు తిరుమంగై ఆళ్వారు గురించి చెబుతాను. వారు దివ్య దేశ ఎమ్పెరుమాన్ యొక్క కీర్తి ప్రతిష్ఠలు చాటడంలోఎంతో దోహద పడ్డారు. వారు కార్తీక మాసం, కృతిక నక్షత్రంలో తిరునాంగూర్ దివ్య దేశం వద్ద తిరుక్కురైయలూర్ లో జన్మించారు. వారు 6 దివ్య ప్రబంధములు రచించారు, అవి పెరియ తిరుమొళి, శిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడుందాండగం. వారి అసలు పేరు నీలన్ (వారు నీలవర్ణం కల వారు కాబట్టి)

పరాశర: నాన్నమ్మ, వారు ఆ రోజుల్లో దివ్య దేశాలకు ఎలా వెళ్లారు ?

ఆండాళ్ నాన్నమ్మ:  వారి దగ్గర ఒక గుఱ్ఱం ఉండేది. చాల శక్తిగల గుఱ్ఱం కాబట్టి వారు అంతటా ప్రయాణం దాని పైనే చేసేవారు.

వ్యాస: వారి విశేషం ఏమిటి నాన్నమ్మా?

ఆండాళ్ నాన్నమ్మ:  తిరుమంగై  ఆళ్వారుకు చాలా  అసమానమైన గుణాలు ఉన్నాయి. మొదట్లో వారు ఒక గొప్ప యోధులు ఇంక ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించే వారు. ఆ సమయంలో కుముదవల్లి నాచ్చియారును కలిసి పెళ్లి చేసుకోవాలను కొంటారు. ఆవిడ పెరుమాళ్ భక్తుడినే పెళ్ళాడతానని, మరియు భాగవతులను సేవించే  వారే  వరుడిగా కావాలని కోరుకుంటుంది. ఆళ్వారు అందుకు అంగీకరించి పెరుమాళ్ భక్తునిగా మారి వారిరువురు పరిణయమాడతారు. ఆళ్వారు ఎంతో మంది శ్రీవైష్ణవులకు అన్నప్రసాదాల తో సేవ  చేసేవారు. కాల క్రమేణ, వారి దగ్గర ఉన్న సంపద కరిగి కైంకర్యం చేయుటకు ఇబ్బందులు ఎదురవుతాయి. వారు అడవి గుండా వెళ్లుతున్న సంపద కలవారైనా యాత్రికులను దోపిడీ చేయసాగారు, అ సొమ్ముతో భాగవతులను సేవించసాగుతారు.

పరాశర: ఓ! మనం దొంగిలించవచ్చా నాన్నమ్మా?

ఆండాళ్ నాన్నమ్మ: లేదు! మనం అలా ఎప్పుడూ చేయకూడదు.  కాని ఆళ్వారు భాగవతులను సేవించాలని ఆతృతతో  ఐశ్వర్యవంతులను దొంగిలించటం మొదలు పెడతారు. ఏ విధంగానైనను, పెరుమాళ్ వారికి పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించి సంస్కరించాలని సంకల్పిస్తారు. అలా, తాయారుతో వారు స్వయంగా, కొత్తగా పెళ్లైయిన సంపద గల దంపతులుగా వేషధారణ చేసుకొని వారి పరివార/బంధువుల సమేతంగా ఆ అడవి గుండా ప్రయాణిస్తారు. ఆళ్వారు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి వారిని దోచుకోవటానికి ప్రయత్నిస్తారు. కాని పెరుమాళ్ అనుగ్రహంతో, పెరుమాళే వచ్చారని తెలుసుకుంటారు తుదకు. పెరుమాళ్ వారిని  పరిపూర్ణంగా ఆశీర్వదించి పరిశుద్దులుగా పరివర్తింప చేస్తారు. వారు పెరుమాళ్లను అనుగ్రహం ప్రసాదించమని బలవంత పెట్టినందుకు, పెరుమాళ్ వారికి “కలియన్” అని పేరు పెడతారు. “కలియన్” అంటే గంభీరమైన/గౌరవమైన అని అర్ధం. పరకాలన్(అంటే భగవానుడే భయపడే వాడు) అని వారికి మరో పేరు.

వ్యాస : ఓహో! అద్భుతంగా ఉంది నాన్నమ్మా. దాని తరువాత వారు ఏం చేసారు?

ఆండాళ్ నాన్నమ్మ: గొప్ప భావోద్రేకంలో మునిగిపోయి, వారు పెరుమాళ్లుకు శరణాగతి చేశారు. ఆ తరువాత, వారు భారతదేశం నలు మూలలా ప్రయాణించి దివ్యదేశాలు (80కి పైగా) సందర్శించుకుంటూ అక్కడి పెరుమాళ్లను పాడారు. అదీగాక, వీరు ఇతర ఆళ్వారులు స్తుతించని 40కి పైగా పెరుమాళ్ల ను స్తుతించారు,  తద్వారా మనకు దివ్య దేశాలను పరిచయం చేశారు.

పరాశర: ఓ! ఇది మనకు గొప్ప సంపద – వారి కారణంగా, మనము ఇప్పుడు ఈ దివ్యదేశాలను సేవించగలుగుతున్నాము. మనము ఎల్లపుడు వీరికి కృతజ్ఞులం.

ఆండాళ్ నాన్నమ్మ:  మన శ్రీరంగం లో అనేక కైంకర్యాలు చేశారు, ఆలయం చుట్టూ కోటలు నిర్మించటం వగైరా.  పెరుమాళ్  ఆళ్వార్ జీవితకాలంలోనే , వారి బావగారికి ఆళ్వార్ యొక్క విగ్రహం తయారు చేసి పూజలు చేయమని ఆదేశించారు.     కొంతకాలం తర్వాత, తిరుముంగై ఆళ్వార్ తిరుకురుంగుడి దివ్యదేశం వెళ్లి, కొంత సమయం  నంబి ఎమ్పెరుమాన్ను పూజించారు . చివరగా, ఎమ్పెరుమాన్ని  ధ్యానిస్తూ, తను శాశ్వతంగా ఎమ్పెరుమాన్ యొక్క కైంకర్యం లో నిమగ్నమవ్వాలని పరమపదం అధిరోహిస్తారు.

వ్యాస : నాన్నమ్మా అర్చావతార పెరుమాళ్  మరియు వారి భక్తుల కైంకర్యం యొక్క ప్రాముఖ్యాన్ని ఆళ్వారు జీవితంతో  తెలుసుకున్నాము.

ఆండాళ్ నాన్నమ్మ : అవును, అదే మన సంప్రదాయం యొక్క సారాంశం. దీనితో, మీరు అందరి ఆళ్వారుల గురించి విన్నారు. మీఇద్దరికి మన ఆచార్యుల గురించి మరోసారి చెబుతాను.

పరాశర మరియు వ్యాస : సరే నాన్నమ్మా! మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము.

మూలము : http://pillai.koyil.org/index.php/2015/02/beginners-guide-thirumangai-azhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – తిరుప్పాణాళ్వార్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< తొండరడిప్పొడి ఆళ్వార్

periyaperumal-thiruppanazhwar

ఆండాళ్ నాన్నమ్మ వైకుంఠ ఏకాదశి రోజున జాగారణ ఉందామని అనుకున్నారు, పరాశర మరియు వ్యాస కూడా ఆరోజు మెలుకువ ఉంటామని చెబుతారు.

ఆండాళ్ నాన్నమ్మ: ఈ శుభ రోజున, మెలుకువ మాత్రమే ఉంటే సరిపోదు. మనం పెరుమాళ్ గురించి మాట్లాడటం మరియు  వారి సేవలో నిమగ్నమై ఉండాలి.

పరాశర: నాన్నమ్మ, మనము ఎలాగో  జాగారణ ఉండాలనుకుంటున్నాము కదా, మీరు తరువాత ఆళ్వారు గురించి చెబుతారా?

ఆండాళ్ నాన్నమ్మ: పరాశర, నా మనసులో ఏమిఉందో నువ్వు అదే అడిగావు. సరే, నేను ఇప్పుడు తిరుప్పాణ్ ఆళ్వార్ గురించి చెబుతాను.

పరాశర మరియు వ్యాస: తప్పకుండా నాన్నమ్మ.

ఆండాళ్ నాన్నమ్మ: తిరుప్పాణ్ ఆళ్వారు శ్రీరంగం దగ్గర ఉరైయుర్లో కార్తీక మాసం, రోహిణి నక్షత్రంలో జన్మించారు.వారు శ్రీరంగనాథుని సౌందర్యాన్ని పాదాల నుంచి శిరస్సు   వరకు వర్ణిస్తూ 10 పాశురాలు ఉన్న అమలనాదిపిరాన్ రచించారు.

వ్యాస: ఓ! అవును నాన్నమ్మ, మన పెరుమాళ్  ఎంతో అందముగా ఉంటారు, ఎవరు చూసినా వారికి  పరిపూర్ణ ఆనంద అనుభవం లభిస్తుంది.

ఆండాళ్ నాన్నమ్మ: అవును! వారు పెరియ పెరుమాళ్ యొక్క ప్రియ భక్తుడు .ఒక ఆసక్తికరమైన సంఘటన హటాత్తుగా వారి  పరమపద నివాసం చేరుకోవటానికి దోహదపడింది.

పరాశర: దయచేసి ఆ సంఘటన చెప్పండి నాన్నమ్మ.

ఆండాళ్ నాన్నమ్మ: ఒక రోజు, వారు కావేరికి అటు వైపు ఒడ్డున  నుంచి పెరిమాళ్ ని ప్రశంసిస్తూ పాటలు పాడుతున్నారు. అప్పటి వరకు వారు భౌతికంగా శ్రీరంగంలో ఎప్పుడు అడుగుపెట్టలేదు. పెరియ పెరుమాళ్  కైన్కర్యర్పరుల్లో ఒకరు లోకసారంగముని నది నుంచి జలం తీసుకు రావటానికి వస్తారు. ఆ సమయంలో వారి దారిలో ఆళ్వారును  ఉండటం గమనించారు. వారు ఆళ్వారుని అడ్డు తప్పుకుంటే జలం తీసుకోని వెళ్లతానని అడుగుతారు. కాని ఆళ్వారు పెరియ పెరుమాళ్ పై అఘాడమైన ధ్యానములో ఉన్నారు. అందుకని వారు స్పందించలేదు.

వ్యాస: తరువాత ఏమి అయ్యింది నాన్నమ్మ?

ఆండాళ్ నాన్నమ్మ: లోక సారంగముని ఒక గులకరాయిని తీసుకోని ఆళ్వారు పైన విసిరారు. ఆళ్వారుకు దెబ్బ తగిలి రక్తం కారటం మొదలైయింది. ఆళ్వారు ధ్యానము నుండి మేలుకొని వారు దారిలో ఉన్నారని తెలుసుకొంటారు.

పరాశర: వారికి లోకసారంగాముని పైన కోపం వచ్చిందా?

ఆండాళ్ నాన్నమ్మ: లేదు! శ్రీవైష్ణవులకు ఇలాంటి చిన్న విషయాలకు ఎపుడూ కోపం రాదు. వెంటనే ఆళ్వారు వారి దారిలో అడ్డం ఉన్నందుకు క్షమించమని అడిగి పక్కకు తప్పుకుంటారు. లోకసారంగముని గుడికి వెళ్లతారు కాని పెరియ పెరుమాళ్ ఆళ్వారుపైన అనవసరమైన దుర్వ్యవహారానికి కోపగిస్తారు. వారు తలుపులు తీయడానికి నిరాకరించి వెంటనే ఆళ్వారు దగ్గరకు వెళ్లి క్షమాపన యాచించి వారిని గుడికి తీసుకొని రమ్మంటారు. లోకసారంగముని వారు చేసిన ఈ పెద్ద తప్పుని గుర్తించి పరిగెత్తుకొని ఆళ్వారు దగ్గరకు వెళ్లతారు. వారు క్షమించమని ఆళ్వారుని  యాచిస్తారు. ఆళ్వారుకు వారిపైన ఏ చెడ్డ భావన లేదు అందువల్ల వారి మాటలను వినయముగా స్వీకరిస్తారు.

వ్యాస: వారు అంతటి ఉదాహరణ మనకు నాన్నమ్మ. మనము కూడా వారి లాగా సజ్జనులై , ఉదారస్వాభావులై ఉండటానికి ప్రయత్నిద్దాం.

ఆండాళ్ నాన్నమ్మ: తరువాత లోకసారంగముని మరీ మరీ అడిగితే, ఆళ్వారు లోకసారంగముని భుజాల పైనకేక్కి దారిలో అమలనాదిపిరాన్ పాడుతూ పెరియ పెరుమాళ్ సన్నిధికి చేరుకుంటారు. వారు  ఆఖరి పాశురం పాడుతూ ఇలా అంటారు ” పెరియ పెరుమాళ్ ని చూచిన ఈ కళ్ళతో ఇంక ఏమి చూడను “అని పెరియ పెరుమాళ్ సన్నిధికి చేరుకుంటారు. ఒక్కసారి వారు పెరియ పెరుమాళ్ పాద కమలాల వద్ద మాయమైపోయి శాశ్వత కైంకర్యం కొరకు పరమపదాన్ని అధీష్ఠిస్తారు.

పరాశర: ఓ! ఇది ఎంత అద్భుతంగా ఉంది నాన్నమ్మ. ఇప్పటి వరకు విన్న ఆళ్వారుల చరిత్ర అందరిలోకి ఇది ఉత్తమంగా ఉంది.

ఆండాళ్ నాన్నమ్మ: అవును, తిరుప్పాణ్ ఆళ్వార్ పెరియ పెరుమాళ్ యొక్క విశేష భక్తులు.మనం కూడా ఈవేళ ఉరైయూర్కి వెళ్లి వారిని సేవిద్దాం.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2015/01/beginners-guide-thiruppanazhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – తొండరడిప్పొడి ఆళ్వార్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆండాళ్

periyaperumal-thondaradippodiazhwar

ఆండాళ్ నాన్నమ్మ తన ఇంటి బయట ఒక అంగడిలో పువ్వులు కొన్నారు. వ్యాస మరియు పరాశర ప్రొద్దున్నే నిద్రలేచి నాన్నమ్మ దగ్గరకు వెళ్లతారు.

వ్యాస: నాన్నమ్మ, ఇద్దరు ఆళ్వారులు పెరుమాళ్ కే పుష్ప కైన్కర్యం చేసారని ఇప్పుడే గుర్తుకు వచ్చింది, ఇప్పుడు వారిలో పెరయాళ్వారు ఒకరని తెలుసు, రెండో ఆళ్వారు ఎవరో ఇప్పుడు చెబుతారా?

ఆండాళ్ నాన్నమ్మ: నీకు నిజంగానే మంచి జ్ఞాపకశక్తి ఉంది వ్యాస. నువ్వు అడిగి నందుకు, పుష్ప కైన్కర్యం చేసిన రెండవ ఆళ్వార్ గురించి చెబుతాను.

వ్యాస మరియు పరాశర ఇద్దరూ నాన్నమ్మ చుట్టూ కూర్చొని వింటున్నారు తరువాతి ఆళ్వారు గురించి.

ఆండాళ్ నాన్నమ్మ: వారు తొందరడిప్పొడి ఆళ్వారుగా ప్రసిద్దులు. వారి తల్లి తండ్రులు పెట్టిన పేరు విప్ర నారాయణ. వారు కుంబకోణం, తిరుమండనగుడిలో మార్గళి మాసం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు. వారికి శ్రీరంగనాథుడు అంటే చాలా ఇష్టం. ఎంత అంటే వారు వ్రాసిన రెండు దివ్య ప్రబంధాలలో వేరే ఏ పెరుమాళ్ని గురించి పాడలేదు, తిరుమాలై ఒకటి మరియు తిరుప్పళ్ళియెళుచ్చి మరొకటి. ఎవరికైతే తిరుమాలై తెలియదో వారికి పెరుమాళ్ తెలియరు అని చెప్పబడింది.

పరాశర: ఓ! అవునా నాన్నమ్మ? అయితే మేమిద్దరం తిరుమాలై కూడా నేర్చుకుంటాం.

ఆండాళ్ నాన్నమ్మ: ఖచ్చితంగా మీరు ఇది కూడా నేర్చేసుకుంటారు. తిరుమాలై మొత్తం పెరియ పెరుమాళ్ మహిమలను వివరిస్తుంది. ఈ ఆళ్వారు యొక్క ప్రత్యేక అంశం ఏమిటో మీకు తెలుసా?

వ్యాస: అది ఏమిటి నాన్నమ్మ?

ఆండాళ్ నాన్నమ్మ: శ్రీవేంకటేశ సుప్రభాతంలోని మొదటి శ్లోకం ఎప్పుడైనా విన్నారా?

పరాశర: అవును నాన్నమ్మ. “కౌసల్యా సుప్రజా రామ…..”.

ఆండాళ్ నాన్నమ్మ: అవును. మీకు తెలుసా అది శ్రీరామాయణం లోనిది. విశ్వామిత్ర ముని శ్రీరాముడిని నిద్ర లేపుతూ పాడారు. అదేవిధంగా, పెరయాళ్వారు శ్రీకృష్ణుని నిద్ర లేపేవారు వారి పాశురాలలో. తొండరడిప్పొడి ఆళ్వారు శ్రీరంగనాథుని సుప్రభాతం పాడారు వారి తిరుప్పళ్ళియెళుచ్చి ప్రబంధంలో.

వ్యాస: ఓ! ఇదేకదా మనం వింటాము మార్గళి మాసంలో ప్రతి రోజు ప్రొద్దున్నే అరైయర్ స్వామి పెరియ పెరుమాళ్ ఎదుట పాడతారు తిరుప్పావైతో పాటు.

ఆండాళ్ నాన్నమ్మ: అవును. చాలా సరిగ్గా చెప్పావు. ఈ పూలతో మనం ఒక దండ చేసి పెరియ పెరుమాళ్ సన్నిధికి వెళదాం.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/12/beginners-guide-thondaradippodi-azhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఆండాళ్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< పెరియాళ్వార్

andal-birth-mirror

ఆండాళ్ నాన్నమ్మ ప్రొద్దు ప్రొద్దున్నే పాలవాడి దగ్గర నుంచి ఆవు పాలని తీసుకుని ఇంటిలోపలి వచ్చారు. వేడి చేసిన తరువాత, ఆవిడ వ్యాస మరియు పరాశరులకు ఇచ్చారు. వ్యాస మరియు పరాశరులు ఇద్దరూ పాలు త్రాగారు.

పరాశర: నాన్నమ్మ, ఒకసారి మీరు ఆండాళ్ గురించి తరువాత చెబుతాను అని అన్నారు. మీరు ఇప్పుడు చెబుతారా?

ఆండాళ్ నాన్నమ్మ: ఓ! తప్పకుండా. మీఇద్దరికి చెప్పినట్టు నాకు గుర్తుంది. ఇప్పుడు ఆండాళ్ గురించి చెప్పే సమయం వచ్చింది.

ఆండాళ్ నాన్నమ్మ, వ్యాస మరియు పరాశర, వారు ముగ్గురు వరండాలో కూర్చున్నారు.

ఆండాళ్ నాన్నమ్మ: ఆండాళ్ పెరియాళ్వారి పుత్రిక. ఆవిడ శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు, ఆండాళ్ పెరియాళ్వారుకు గుడి ప్రక్కనే ఉన్నఒక తోటలో తులసి చెట్టు దగ్గర దొరికారు. ఆవిడ ఆషాడ మాసంలో పుబ్బ నక్షత్రంలో జన్మించారు. ఈ రోజు కూడా తిరువాడిప్పూరంగా చాలా గొప్పగా జరుపుకుంటారు.  వెన్నె ముద్ద తో  పెరుమాళ్ భక్తిని కూడా ఆండాళ్కు  తినిపించేవారు పెరియాళ్వారు.

వ్యాస: ఓ! చాలా బాగుంది నాన్నమ్మ. ఇప్పుడు మీరు మాకు భోదిస్తున్నట్టుగానా?

ఆండాళ్ నాన్నమ్మ: అవును. నిజానికి దీనికంటే ఎక్కువే. ఎందుకంటే పెరియాళ్వారు పూర్తిగా కైన్కర్యంలో  నిమగ్నులై ఉండేవారు, వారు ఎప్పుడూ ఆమెకు పెరుమాళ్ కైంకర్యము చేయు అద్భుతమైన విషయములను తెలియచేసేవారు. అందు వల్ల ఆవిడ 5 సంవత్సరాల లేత వయస్సులోనే పెరుమాళ్ తనను పెళ్లి చేసుకుంటారని, ఆవిడ వారిని సేవించకోవచ్చని కలలు కంటూ ఉండేది.

పరాశర: ఓ! వారి ముఖ్యమైన కైన్కర్యం ఏమిటి నాన్నమ్మ?

ఆండాళ్ పాటి: వారి ముఖ్యమైన కైన్కర్యం గుడి తోటను పరిరక్షించడం మరియు పెరుమాళ్లకు ప్రతి రోజు మంచి మంచి దండలు తయారు చేయడం. వారు మంచి దండలు చేసి , ఇంట్లో పెట్టి ఉంచేవారు, వారి దినచర్యలు చేసుకొన్న తరువాత గుడికి వెళ్ళేటప్పుడు వారు ఆ దండలని తీసుకోని వెళ్లి పెరుమాళ్లకు సమర్పించేవారు. వారు దండలు ఇంట్లో పెట్టినప్పుడు, ఆండాళ్ వాటిని ధరించి బాగున్నాయో లేదో అని చూసేవారు మరియు దండలతో ఆవిడని  పెరుమాళ్ ప్రేమగా చూస్తారని ఊహించుకునేది.

వ్యాస: అయితే, పెరియాళ్వారుకు  అసలు ఈ విషయము తెలియనే తెలియదా?

ఆండాళ్ నాన్నమ్మ: అవును. చాలా రోజుల వరకు, వారికి ఈ విషయం తెలియదు. పెరుమాళ్ కూడా ఆ దండలు చాలా సంతోషముగా స్వీకరించేవారు ఎందుకంటే అవి తనకు ప్రియమైన ఆండాళ్ ధరించినవి కాబట్టి. కాని ఒక రోజు, పెరియాళ్వారు దండ తయారు చేసి, ఇంట్లో పెట్టి బయటకు వెళ్లారు. ఆండాళ్ ఎప్పటి లాగానే తాను ధరించారు. తరువాత, పెరియాళ్వారు వాటిని గుడికి తీసుకోని వెళ్లారు,  కాని దండలో ఒక వెంట్రుక కనుగొని వారు ఆ దండలు తిరిగి ఇంటికి తీసుకోని వస్తారు. వారు వారి కూతురు ధరించి ఉండవచ్చు అని గ్రహించి, కొత్త దండ సిద్ధం చేసి గుడికి తీసుకోని వెళ్లతారు. పెరుమాళ్ కొత్తగా చేసిన దండను తిరస్కరిస్తారు మరియు ఆండాళ్ ధరించిన దండనే కావలెనని అడుగుతారు. పెరియాళ్వారు వారి కూతురి లోతైన భక్తిని అర్థం చేసుకుంటారు మరియు ఆండాళ్ పై పెరుమాళ్ ప్రేమను కూడా, వారు ఆండాళ్ ధరించిన దండను తీసుకొని తిరిగి వస్తారు. వాటిని పెరుమాళ్ సంతోషంగా స్వీకరిస్తారు.

వ్యాస మరియు పరాశర అబ్బుర పోయి నిలుచొని ఆండాళ్ గురించి  మరియు పెరిమాళ్ పై వారి ప్రేమ గురించి వింటున్నారు.

వ్యాస: ఆ తరువాత ఏమి అయ్యింది?

ఆండాళ్ పాటి: పెరుమాళ్ పై  ఆండాళ్ భక్తి రోజు రోజుకి పెరిగింది. లేత వయసు లోనే, ఆవిడ తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళి పాడారు. మార్గళి మాసంలో, ప్రతి కోవెలలో మరియు గృహములలో తిరుప్పావై చదువుతారు. చివరిగా, పెరియ పెరుమాళ్, ఆండాళ్ ను శ్రీరంగానికి కళ్యాణము చేసుకోవడానికి తీసుకోని రమ్మని పెరియాళ్వారుకి ఆదేశిస్తారు. పెరియాళ్వారు సంతోషంగా ఆండాళ్ తో పాటు ఘనమైన ఊరేగింపుతో శ్రీరంగానికి వేంచేస్తారు. ఆండాళ్ నేరుగా పెరియ పెరుమాళ్ సన్నిధికి వెళ్ళిన తరువాత పెరుమాళ్ తనను స్వీకరిస్తారు మరియు ఆవిడ పరమపదానికి తిరిగి వెళ్లిపోతారు.

పరాశర: ఆవిడ తిరిగి వెళ్లిపోవుట అంటే? వారు మొదటి నుంచి పరమపద వాసి ఆ?

ఆండాళ్ నాన్నమ్మ: అవును. ఆవిడ స్వయంగా భూదేవి . ఇతర ఆళ్వారుల ఈ భూలోకం  లో అవతరించి పెరుమాళ్ కృపతో ఆళ్వారులు అయినట్టుగా కాకుండా, ఆండాళ్ మనలందరిని భక్తి మార్గ దర్శనం చేయడానికి  పరమపదం నుండి దిగివచ్చారు. వారి పని అయిపోయిన తరువాత, ఆవిడ పరమపదానికి తిరిగి వెళ్లిపోయారు.

పరాశర: ఓ! తెలుసుకోవడం చాలా బాగుంది. వారు ఎంత దయామయి.

ఆండాళ్ నాన్నమ్మ: చాలా బాగుంది. ఇప్పుడు, మీరిద్దరూ తిరుప్పావై ని నేర్చుకొని అభ్యాసం చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే  వచ్చే మార్గళి మాసంలో మీరు కూడా చదవాలి.

వ్యాస మరియు పరాశర: తప్పకుండా నాన్నమ్మ, ఇప్పుడే మొదలు పెడదాం.

ఆండాళ్ నాన్నమ్మ వారికి నేర్పించడం మొదలుపెట్టారు మరియు ఆ అబ్బాయిలు ఆత్రంగా నేర్చుకున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/12/beginners-guide-andal/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – పెరియాళ్వార్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< కులశేఖర ఆళ్వార్

periyazhvar

ఒక సుందరమైన ఆదివారం ప్రొద్దున ఆండాళ్ నాన్నమ్మ ఇంటి బయట వరండాలో కూర్చొని పెరుమాళ్ కు పూలదండ చేస్తున్నారు. వ్యాస మరియు పరాశర వచ్చి వరండాలో నాన్నమ్మ ప్రక్కన కూర్చున్నారు. ఆండాళ్  నాన్నమ్మని వాళ్లు ఇద్దరు ఆసక్తిగా చూస్తునారు.

వ్యాస: మీరు ఏం చేస్తున్నారు నాన్నమ్మ?

ఆండాళ్ నాన్నమ్మ: పెరుమాళ్ కు మాల చేస్తున్నాను, ఇది నాకు కొంతమంది ఆళ్వారులను గుర్తుచేస్తుంది. వాళ్లలో ఒకరి గురించి చెబుతాను వింటారా?

పరాశర: ఓ! తప్పకుండా నాన్నమ్మ. మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.

ఆండాళ్ నాన్నమ్మ: అది మా మంచి అబ్బాయి. అప్పుడు నేను పెరియాళ్వారు గురించి చెబుతాను. వారు జేష్ఠ మాసం స్వాతి నక్షత్రంలో శ్రీ విల్లిపుత్తూర్ లో పుట్టారు.వారిని పట్టర్ పిరాన్ అని కూడా పిలిచేవారు. వారు వటపత్రసాయి ఎమ్పెరుమాన్కు దండలు తయారు చేసేవారు. ఒక రోజు, పాండ్య రాజ్యము పరిపాలించు రాజు, విధ్వానులను పిలిచారు.పరతత్త్వమైన దేవుడు ఎవరో నిరూపించిన వారికి సంచి నిండా బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించారు.

వ్యాస: అది చాలా కష్ఠమై ఉండాలి, కదా నాన్నమ్మ?

ఆండాళ్ నాన్నమ్మ: అది పెరయాళ్వార్లుకు కాదు. వారి భక్తి మరియు పెరుమాళ్ అనుగ్రహము వలన, వారు రాజ సభకు వెళ్లి వేద ప్రమాణికంగా పెరుమాళ్ పరతత్త్వమని నిరూపిస్తారు. ఆ రాజు చాలా సంతోషపడి పెరయాళ్వార్లకు తాను ప్రకటించిన బహుమతి సొమ్ముని ఇచ్చి , వారిని రాజ ఏనుగుపైన ఊరేగింపుతో మధురై విధులలో ఊరేగిస్తారు.

పరాశర: ఆ దృశ్యము చూడ ముచ్చటగా ఉండి ఉండవచ్చు,  నాన్నమ్మ.

ఆండాళ్ నాన్నమ్మ: అవును పరాశర. అందుకోసమే పెరుమాళ్  స్వయంగా  గరుడ స్వారులై పరమపదం నుండి క్రిందకు వచ్చారు. పెరయాళ్వారు ఏనుగు స్వారులైనను, వారు ఎంత వినయవంతులు అంటే వారు పెరుమాళ్ క్షేమం కోసం చింతించి, వ పెరుమాళ్ రక్షగా కోసం తిరుప్పల్లాండు పాడారు. అలాగా వారు పెరయాళ్వారుగా ప్రసిద్ధమైనారు. వారు పెరయాళ్వార్ తిరుమొళి కూడా పాడారు.

వ్యాస: అవును నాన్నమ్మ – పల్లాండు పల్లాండు తెలిసినట్టు అనిపిస్తుంది. ప్రతి రోజు అదే కదా మొదట్లో చదువుతాము. మనము గుడిలో విన్నాము.

ఆండాళ్ నాన్నమ్మ: అవును, నిజమే వ్యాస. పెరయాళ్వారు తిరుప్పల్లాండు మొదట్లో చదువుతారు మరియు ఆఖరున కూడా.

పరాశర: అది బావుంది నాన్నమ్మ. మనం కూడా నేర్చుకొని పెరుమాళ్ ముందు చదవటం మొదలుపెడదాం.

ఆండాళ్ నాన్నమ్మ: ఖచ్చితంగా, మీరు తొందరలోనే అది మొదలు పెట్టేస్తారు.  వారు ఆండాళ్ తండ్రిగారు, ప్రసిద్ధమైన తిరుప్పావై పాడారు. ఆండాళ్ గురించి తరువాత చెబుతాను, రండి వెళ్లి పెరుమాళ్ల కు దండ సమర్పిస్తాము.

ఆండాళ్ నాన్నమ్మ దండ అల్లడం పూర్తి చేసి సమర్పించుటకు,  వ్యాస మరియు పరాశరతో పాటు శ్రీరంగనాథుని గుడివైపుకి వెళ్లసాగింది.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-periyazhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org