Category Archives: telugu

బాల పాఠము – నంపిళ్ళై

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంజీయర్

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి ఆండాళ్ నాన్నమ్మ ఇంటికి వస్తారు.

నాన్నమ్మ : పిల్లలూ స్వాగతం. ఈ రోజు మనం నంజీయర్ యొక్క శిష్యులైన ఆచార్య నంపిళ్ళై గురించి మాట్లాడుకుందాం. నేను మునుపు మీకు చెప్పినట్లుగా, వరదరాజుగా నంబూర్లో జన్మించిన నంపిళ్ళై తమిళ, సంస్కృత భాషలయందు మరియు సాహిత్యంలో పండితులు. నంజీయర్ తన 9000 పడి వ్యాఖ్యానాన్ని కాపీలు చేయడానికి, ఈ రెండు భాషల్లో నైపుణ్యత కారణంగా వరదరాజు పేరు  ఎలా సిఫార్సు చేయబడిందో మనందరికీ తెలుసు. నంజీయర్వారే  వరదరాజుని వారి నిజమైన సామర్థ్యాన్ని చూసి అర్థం చేసుకున్న తరువాత నంపిళ్ళై అన్న పేరు పెట్టారు. నంపిళ్ళైని తిరుక్కలికన్రి దాసు , కలివైరి దాసు, లోకాచార్య, సూక్తి మహార్ణవ, జగదాచార్యార్ మరియు ఉలగాసిరియ అని కూడా పిలుస్తారు.

నంపిళ్ళై – తిరువల్లిక్కేని

వ్యాస: నాన్నమ్మా, నంపిళ్ళై ఎలా  కావేరి వరదలో వారి ఆచర్యులిచ్చిన గ్రంథం కొట్టుకుపోయిన తరువాత వారి జ్ఞాపకశక్తితో మొత్తం 9000 వ్యాఖ్యానాన్ని తిరిగి వ్రాసారో మాకు గుర్తుంది.

నాన్నమ్మ : అవును, అంతటి గొప్పతనం మరియు జ్ఞానం ఉన్నప్పటికీ, నంపిళ్ళై చాలా వినయంగా ఉండేవారు. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, గౌరవంతో ఉండేవారు.

వేదవల్లి: నాన్నమ్మా, నంపిళ్ళై గొప్పతనాన్ని చాటిచెప్పే సంఘటనలు కొన్ని మాకు చెప్తారా?

నాన్నమ్మ : నంజీయర్ వద్ద పాసురాలు, వాటి అర్ధాలు నేర్చుకున్న తరువాత నంపిళ్ళై  శ్రీరంగంలో పెరుమాళ్ సన్నిధికి తూర్పు వైపున క్రమం తప్పకుండా ప్రసంగించేవారు. తమిళం మరియు సంస్కృత భాషల్లో, వాటి సాహిత్యంలో వారికి ప్రావీణ్యం ఉన్న కారణంగా నంపిళ్ళై పెద్ద సమూహాన్ని ఆకర్షించే వారు. వినేవారికి సందేహాలు / ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడల్లా వాల్మీకి రామాయణాన్ని ఉపయోగించి సంతృప్తికరమైన జవాబులు ఇవ్వడంలో కూడా వారు నిపుణులైనారు. ఒకసారి, నంపిళ్ళై ప్రసంగిస్తున్నపుడు, పెరియ పెరుమాళ్ (శ్రీరంగం లోని మూలవరులు) తన శయనావస్థ నుండి నిలబడి, నంపిళ్ళై ఇస్తున్న ప్రసంగాన్ని చూడటానికి ప్రయత్నిస్తారు. తిరువిళక్కు పిచ్చన్  (సన్నిధిలో దీపాలను మరియు వాటిని వెలిగించే సేవ చేసే ఒక శ్రీవైష్ణవుడు) పెరియ పెరుమాళ్ నిలబడివుండుటను చూసి, అర్చావతారంలో వారికి కదిలేందుకు వీలులేదని వారిని తిరిగి శయనించమని కోరతారు. ఎమ్బెరుమాన్ వారిచ్చిన ప్రమాణాన్ని (అర్చావతారంగా కదలనని, మాట్లాడానని) కూడా లెక్కచేయకుండా నంపిళ్ళై ప్రసంగానికి ఆకర్షితులైనారు. అంత ఆకర్షణీయకంగా ఉండేది నంపిళ్ళై యొక్క ప్రసంగం. తమిళం మరియు సంస్కృత సాహిత్యంలో వారికున్న లోతైన జ్ఞానం కారణంగా ప్రసంగం వినేవారిని మంత్రముగ్ధులను చేయగలిగేవారు. వారు జనాలను ఎలా  ఆకర్షించేవారంటే, ఊరెరిగింపులో నంపెరుమాళ్ వయ్యారి నడకకు, వారి అందమైన తిరుమేని దర్శనానికి ఎలా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఆకర్షితులౌతారో అలా.  ఎవరైనా శ్రీరంగంలో నంపెరుమాళ్ ఊరెరిగింపు చూసారా?

పెరుమాళ్ సన్నిధిలో నంపిళ్ళై ఉపన్యాసం – శ్రీరంగం

అత్తుళాయ్ : నాన్నమ్మా, నేను చూసాను. శ్రీ రంగంలో భ్రహ్మోత్సవాల సమయంలో ఒక సారి వెళ్ళాము,  పెరుమాళ్‌ని తిరుమాడవీధుల్లో ఉరేగిస్తుంటే వారి నడకను చూసాను.  చాలా బావుంటుంది.

పరాశర: అవును నాన్నమ్మా, మేము కూడా చాలా సార్లు  నంపెరుమాళ్ ఊరెరిగింపు చూశాము.

నాన్నమ్మ : ఎవరు చూసుండరు? కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది కదూ? ఎలాగైతే నంపెరుమాళ్ ఊరెరిగింపుతో తన భక్తులను ఆకర్షించేవారో , నంపిళ్ళై కూడా తన ఉపన్యాసాలతో అందరిని ఆకర్షించేవారు. అయినప్పటికీ, వారి వినయం అసమానమైనది. ఒకసారి నంపెరుమాళ్ ముందు, కందాడై తొళప్పర్ (ముదలియాన్డాన్ వంశస్తులు) నంపిళ్ళైని కొన్ని కఠినమైన కేకలు వేస్తారు. నంపిళ్ళైని పొగడలేక, కేకలు వేస్తారు. నంపిళ్ళై ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, అవమానాన్ని మింగేసి, వారి తిరుమాళిగకి (ఇంటికి) వెళ్లిపోతారు.

తొళప్పర్ తన తిరుమాళిగకి (ఇంటికి) వెళ్ళినప్పుడు, వారి భార్యకి అప్పటికే ఇతరుల నుండి వచ్చిన వార్తను విని, అతన ప్రవర్తన తప్పని బలంగా సలహా ఇచ్చి, నంపిళ్ళై యొక్క ప్రతిష్టతను వివరిస్తుంది. వారిని వెళ్ళి నంపిళ్ళై చరణకమలాల యందు పడి  క్షమాపణ వేడుకోమని ఆమె నొక్కి చెబుతుంది. చివరకు వారు చేసిన పొరపాటును తెలుసుకొని నంపిళ్ళై  తిరుమాళిగకి నడిరాత్రైనా సరే వెళ్లాలని  నిర్ణయించుకుంటారు. వారు వెళదాం అని తలుపు తెరిచినప్పుడు, బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్టు   గమనిస్తారు, వారు ఎవరో కాదు స్వయంగా నంపిళ్ళై వారే. తొళప్పర్ని చూసి నంపిళ్ళై వెంటనే కిందపడి వారికి దండంపెట్టి, వారితో ఏదైనా తప్పు జరిగి వారిని బాధపెట్టినట్లయితే క్షమించమని అడుగుతారు. నంపిళ్ళై గొప్పతనాన్ని చూసి తొళప్పర్ ఆశ్చర్యపోతారు  – పొరపాటు  తొళప్పర్ది అయినప్పటికీ, నంపిళ్ళై తప్పును తనపైకి తీసుకొని క్షమించమని అడుగుతారు. తొళప్పర్ వెంటనే వారికి సాష్టాంగప్రణామాన్ని సమర్పించి ఇకపై నంపిళ్ళై వారి గొప్ప వినయం వలన “లోకాచార్య” (ప్రపంచానికే గురువు) అని పిలవబడతారు అని అంటారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం, అయినప్పటికీ ఇంత వినమ్రతతో ఉన్న వారు కొందరు మాత్రమే ఉంటారు,  ఆ స్థానానికి సరిగ్గా సరిపోతారు. తొళప్పర్ ద్వేషాన్ని విడిచి అతని భార్యతో పాటు  నంపిళ్ళై సేవ చేయడం ప్రారంభిస్తారు మరియు వారి నుండి శాస్త్ర  అర్థాలను కూడా నేర్చుకుంటారు.

పరాశర: ఎంత అద్భుతంగా ఉంది!  కఠినంగా మాట్లాడిన వ్యక్తికి పరాశర భట్టార్ వారు ఖరీదైన శాలువను  బహుమతిగా ఇచ్చిన సంఘటన లాగా ఉంది.

నాన్నమ్మ : బాగా పరిశీలించావు పరాశర! మన పూర్వాచార్యులందరూ ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉండేవారు – నిజమైన శ్రీవైష్ణవునిలా. సమయా సమయాన మన ఆచార్యాలు ఒక శ్రీవైష్ణవుడు స్వచ్ఛమైన జీవితాన్ని ఎలా గడపాలో, ప్రతి ఒక్కరితో ఎలా వ్యవహరించాలో నేర్పుతూనే వచ్చారు, నొక్కిచెబుతూనే ఉన్నారు. మంచి ఉదాహరణగా వారు మనకు మార్గం చూపించారు. వారి గ్రంథాలలో సిద్ధాంతంగానే కాకుండా, ఆచరణాత్మకమైనది అని అనుసరించవచ్చని కూడా వారు మనకు చూపించారు. కావలసింది ఆచార్యుల ఆశీర్వాదం మరియు కొంచం మన కృషితో, మనం కూడా పూర్వాచార్యుల జీవితాన్ని గడపడానికి ప్రయత్నించవచ్చు. చిన్న చిన్న అడుగులు వేసి చివరికి మన గమ్యానికి చేరుకోవచ్చు.

నిజమైన శ్రీవైష్ణవుడు ఎలా ఉండాలో భట్టార్ మనకు చూపించిన తరువాత, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టార్, పరాశర భట్టార్ వంశంలో వచ్చారు, వారు నంపిళ్ళై అంటే అసూయ పడేవారు. ఒకసారి నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టార్ వారు పింభళగియ పెరుమాళ్ జీయర్ తో కలసి రాజ భవనానికి వెళ్ళారు . రాజు వారిద్దరిని ఆహ్వానించి, వారికి తగిన సంభావనలు ఇచ్చి ఆసనమిచ్చి ఆసీనులు కామన్నారు. శ్రీ రామాయణం నుండి రాజు ఒక ప్రశ్న అడిగారు, “శ్రీ రాముడు ఎప్పుడూ తనను తాను సామాన్య మానవునిగా  ప్రకటించుకున్నారు, పరమాత్మునిగా ఎప్పుడూ చూపించుకోలేదు, అలాంటప్పుడు వారు జటాయువుకి మోక్షాన్ని ఇస్తానని ఎలా చెప్పారు”? నంపిళ్ళై అయితే ఈ ప్రశ్నకి సమాధానం ఎలా వివరించే వారు అని భట్టార్ జీయర్‌ని అడుగుతారు. జీయర్ వెంటనే ఈ విధంగా వ్యాఖ్యానించి ఉండేవారని వెంటనే అంటారు, ” రాముని వంటి ధర్మాత్ముడు తన ధార్మిక శక్తితో అన్ని లోకాలను జయించగలరు” అని అంటారు. రాజు ప్రశ్నకు సమాధానమివ్వటానికి అదే వివరణను భట్టార్ ఉపయోగిస్తారు. రాజు ఆ వివరణతో ఎంతో సంతోషంచి, భట్టార్ జ్ఞానాన్ని ప్రశంశిస్తూ వారికి భారీ సంపదను బహుమానంగా సమర్పిస్తారు. భట్టార్  వెంటనే నంపిళ్ళై యొక్క వివరణ, దాని శక్తిని గ్రహించి, నంపిళ్ళై ఇంటికి వెళ్లి బహుమానంగా తీసుకున్న సంపదను వారికి సమర్పిస్తారు. అంతే కాకుండా వారు నంపిళ్ళై శిష్యులై నిరంతరం వారికి సేవ చేశారు. అలా నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టార్ విమోచనముచేయబడి, నంపిళ్ళై అనేకమంది శిష్యులలో ఒకరవుతారు.

వేదవల్లి: నాన్నమ్మా, భట్టార్ మరియు నంజీయర్  మధ్య గొప్ప సంభాషణలు జరిగేవని క్రిందటిసారి మీరు  చెప్పారు. నంజీయర్ మరియు నంపిళ్ళై మధ్య కూడా అలాగే ఆసక్తికరమైన సంభాషణలు జరిగేవా?

నాన్నమ్మ : అవును వేదవల్లి. నంజీయర్ మరియు నంపిళ్ళై మధ్య అద్భుతమైన సంభాషణలు జరిగేవి. ఒకసారి, నంపిళ్ళై నంజీయర్ని ఇలా అడుగుతారు, ” ఎమ్బెరుమాన్ అవతారాలు తీసుకోవడంలో ప్రయోజనం ఏమిటి?”. నంజీయర్ ప్రత్యుత్తరంగా ” ఎమ్బెరుమాన్ , భాగవతాపచారం చేసిన వారిని తగినట్టుగా శిక్షించాలనేదే వారి  అవతార ప్రధాన ఉద్దేశ్యం”. ఉదాహరణకి, కృష్ణావతారం తీసుకోవడంలో వారి ఉద్దేశ్యమేమిటంటే, వారి భక్తులపైన ఎన్నో అపచారాలు చేసిన దుర్యోధనుడిని చివరకు శిక్షించాలనేదే. భక్త ప్రహ్లాదుని బాధపెట్టిన హిరణ్యకశిపుడిని చంపడానికి నారసింహునిగా వచ్చారు. అందువల్ల, భాగవత సంరక్షణమే అన్ని అవతారాల ప్రధాన ఉద్దేశ్యం.

వ్యాస: నాన్నమ్మా, భాగవత అపచారం అంటే ఏమిటి?

నాన్నమ్మ: నంజీయర్ చెబుతారు, మనం ఇతర శ్రీవైష్ణవులకు సమానమనే భావనే భాగవత అపచారం.  వారి జన్మ, జ్ఞానం మొదలైన వాటికి సంబంధం లేకుండా ఎప్పుడూ అందరు శ్రీవైష్ణవులని మన కంటే ఎక్కువగా భావించి వ్యవహరించాలని నంజీయర్ వివరిస్తున్నారు. ఆళ్వారులు, ఇతర పూర్వాచార్యుల  లాగా ఇతర భాగవతులను నిరంతరం కీర్తించే ప్రయత్నం మనం చేయాలి అని కూడా అంటారు. 

ఇతర దేవ-దేవతల భజన, ఇతర దేవతాంతర ప్రార్థన నిరర్థకమైనదని  నంపిళ్ళై  స్పష్టంగా చెబుతారు.

అత్తుళాయ్ : నాన్నమ్మా, నంపిళ్ళై దానిని ఎలా వివరించారు?

నాన్నమ్మ : ఒకసారి ఒకరు వచ్చి నంపిళ్ళైని అడుగుతారు , “మీ నిత్య కర్మలలో దేవతాంతరులను (ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుడు తదితరాలను) పూజిస్తున్నారు, కాని ఎందుకు మీరు దేవాలయాలలో పూజించరు?” అని అడిగారు. నంపిళ్ళై  తక్షణమే తెలివైన సమాధానం ఇస్తారు. నంపిళ్ళై వారిని ప్రశ్న ఒకటి అడుగుతారు, “మీరు యజ్ఞ యాగాలలో అగ్నిని పూజిస్తారు స్మశానంలో అదే అగ్నికి దూరంగా ఉంటారా? అదే విధంగా, నిత్యా కర్మలను భగవదారాధనంగా  (భగవన్ యొక్క ఆరాధన) నిర్వర్తించాలని, ఆ భగవానుడు అన్ని దేవతలలో అంతర్యామిగా ఉన్నాడన్న భావనతో మనం చేస్తాము. శాస్త్రము కూడా ఇదే చెప్తుంది ఎమ్బెరుమాన్నే పూజించాలని, ఆ కారణంగా  మేము ఇతర దేవాలయాలకు వెళ్లము.

వేదవల్లి: నాన్నమ్మా, ఇది చాలా సున్నితమైన విషయమని అందరూ ఈ ఆలోచనను అంగీకరించరని మా అమ్మ చెప్పింది.

నాన్నమ్మ : నిజము చెప్పినపుడు, దానిని గ్రహించి, దానిని అంగీకరించని వారికి ఆ నిజము చేదు మందులాగా ఉంటుంది. అయితే, చేదు మందులు శరీరానికి మంచి చేస్తాయి, అలాగే ఈ నిజం కూడా ఆత్మ మరియు శరీరానికి మంచే చేస్తుంది. ప్రజలు అంగీకరించట్లేదని వైదిక నిజాల యొక్క ప్రామాణికతను ఖండించి వాటిని నిరర్ధకమని నిరూపించకూడదు. ఆచార్యుల ఆశీర్వాదాలతో, భగవంతుని అపారమైన కరుణతో దయతో  ప్రతిఒక్కరూ చివరికి ఈ నిజం తెలుసుకుంటారు. ఆళ్వార్ వారి ఒక పాసురంలో చెబుతూ అన్నారు, “ప్రతి ఒక్కరూ శ్రీమన్నారాయణుని యొక్క ఆధిక్యత యొక్క శాశ్వతమైన నిజాన్ని గుర్తించి, మోక్షానికి చేరుకున్నట్లయితే, భగవానునికి వారి దివ్య కాలక్షేపం కోసం  ఆడుకోవటానికి ప్రపంచం ఉండదు, అందుకే ఈ ఆలస్యం”. “ఈ చిట్కాని గ్రహించి, వెంటనే తిరుక్కురుగూర్ కి పరిగెత్తుకొని వెళ్లి, ఆధిప్పిరాన్ పెరుమాళ్ యొక్క చరణ కమలాల యందు శరణాగతి చేయండి” అని కూడా ఆళ్వార్ అన్నారు.

వ్యాస: నాన్నమ్మా, నంపిళ్ళైకి వివాహం అయ్యిందా?

నాన్నమ్మ : అవును, నంపిళ్ళైకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకసారి వారిలో ఒక భార్యను తన గురించి ఆమె ఎలా భావిస్తుందని వారు అడుగుతారు. ఆమె నంపిళ్ళైని ఎమ్బెరుమాన్ అవతారంగా తన ఆచార్యులుగా భావిస్తుందని చెప్తుంది. నంపిళ్ళై చాలా ఆనందపడి ఆమెను నంపిళ్ళైని సందర్శించే శ్రీవైష్ణవుల తదీయారాదన కైంకర్యాన్ని చేపట్టమని అంటారు. ఈ సంఘటనలో నంపిళ్ళై యొక్క ఆచార్య అభిమాన (గౌరవం) ప్రాముఖ్యతను చూపించారు.

పరాశర : నాన్నమ్మా, నంపిళ్ళై జీవితం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. వారు గొప్ప శిష్యులను  కలిగి ఉండాలి!

నాన్నమ్మ : అవును పరాశర! నంపిళ్ళైకి చాలా మంది శిష్యులు ఉన్నారు, వారిలో ఆచార్య పురుష కుటుంబాలకు చెందిన శిష్యులు కూడా ఉన్నారు, వీరి కాలాన్ని శ్రీరంగంలో నల్లడిక్కాలం (మహత్తరమైన కాలం) గా అందరూ కీర్తించేవారు. నంపిళ్ళై మన సాంప్రదాయంలో రెండు అద్భుతమైన స్తంభాలకు పునాది వేసారు – పిళ్ళైలోకాచార్య మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, వీరిద్దరూ వడక్కు తిరువీధిపిళ్ళై కుమారులు. నంపిళ్ళై ప్రముఖ శిష్యులు వడక్కు తిరువీధిపిళ్ళై, పెరియవాచ్చాన్  పిళ్ళై, పింభళగరాం పెరుమాళ్ జీయర్, కందాడై తోళప్పర్, ఈయున్ని మాధవ పెరుమాళ్, నడువిల్ తిరువీధిపిళ్ళై భట్టర్ మొదలైనవారు.

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

పింభళగరాం పెరుమాళ్ జీయర్‌తో నంపిళ్ళై – శ్రీరంగం

మనము మళ్ళీ కలుసుకున్నపుడు, నంపిళ్ళై  యొక్క శిష్యుల గురించి చెప్తాను, తన అనంతమైన కరుణతో, గొప్ప గ్రంథాలను అందించి మరియు మన సాంప్రదాయానికి అద్భుతమైన కైంకర్యాలను చేసారు.

పిల్లలు నంపిళ్ళై యొక్క అద్భుతమైన జీవితం మరియు అతని బోధనల గురించి ఆలోచిస్తూ వారి ఇంటికి వెళ్ళిపోతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-nampillai/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – నంజీయర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – పరాశర భట్టర్

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి ఆండాళ్ నాన్నమ్మ ఇంటికి వస్తారు.

నాన్నమ్మ : పిల్లలూ స్వాగతం. ఈ రోజు మనం పరాశర భట్టార్ శిష్యులైన ఆచార్య నంజీయర్ గురించి మాట్లాడుకుందాము. చివరిసారి మనం కలుసుకున్నప్పుడు మీకు చెప్పినట్టుగా, మాధవగా జన్మించిన నంజీయార్ సాంప్రదాయంలోకి రామానుజుల ఆదేశంతో పారాశర భట్టార్ ద్వారా తీసుకురాబడ్డారు. భట్టార్ ఎలా తిరునేడున్తాన్దకం మరియు శాస్త్రార్థాల సహాయంతో మాధవాచార్యులను చర్చలో గెలిచారో మనం చూశాము. మాధవాచార్యులు ఒకప్పుడు అద్వైత పండితులు, తరువాత పరాశర భట్టార్ వీరికి నంజీయర్ అనే పేరు పెట్టారు.  వీరిని నిగమాంతయోగి మరియు వేదాంతి అని కూడా పిలుస్తారు.

వ్యాస:  నాన్నమ్మా, రామానుజ మరియు పరాశర భట్టార్లు, యాదవ ప్రకాశులు (గోవింద జీయర్), గోవింద పెరుమాల్ (ఎంబార్), యగ్య మూర్తి (అరులాల పెరుమాల్ ఎమ్బెరుమానార్ అయ్యారు) మరియు మాధవాచార్యుల ( నంజీయర్ అయ్యారు) వంటి ఇతర తత్వాలను అనుసరించే వారికి మార్గదర్శనం చేసినట్లగా,  వారు శైవ రాజుల నుండి అన్ని ఇబ్బందులు ఎదురుకొంటున్నప్పటికి ఎందుకు వారిని సంస్కరించాలని ప్రయత్నించలేదు ? వారు శైవ రాజుల నుండి దూరంగా ఎందుకు వెళ్ళారు?

నాన్నమ్మ : వ్యాస , మన పూర్వాచార్యులకు ఎవరు సంస్కరించబడతారో ఎవరు కాదో తెలుసు. మనం చెప్పుకున్న ఆచర్యులందరి విషయములో వారు ప్రత్యర్థి సత్తాను తెలుసుకొని, గౌరవంగా ఓటమిని అంగీకరించారు, వారు పెరియ తిరుమలై నంబి, రామానుజులు మరియు భట్టార్‌ల యొక్క చరణ కమలాల యందు శరణాగతి చేసి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి ప్రవేశించారు. అయినప్పటికీ,  శైవ రాజు న్యాయమైన వాదనకు సిద్ధంగా లేరు కదా శ్రీమన్నారాయణుని ఆధిపత్యాన్నిగ్రహించి ఓటమిని కూడా అంగీకరించలేదు. పాత సామెతలాగా , “నిద్రపోతున్న ఎవరినైనా మేల్కొలపడం సాధ్యం కాని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వ్యక్తిని మేల్కొలపడం అసాధ్యం”. మన పూర్వాచార్యులకి ఎవరు నిజంగా నిద్రిస్తున్నారో ఎవరు నటిస్తున్నారో తెలుసు. అందువల్ల వారి నిర్ణయాలు ప్రత్యర్ధులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అంతే కాకుండా, అటువంటి వ్యక్తులలో లోపాలు ఉన్నప్పటికీ, మన పూర్వాచార్యులు వారిని సంస్కరించాలని ప్రయత్నించే వారు, కానీ అవతల వైపు నుండి చాలా ప్రతిఘటన తర్వాత మాత్రమే వారి మానాన వారిని వదిలివేయబడ్డారు.

పరాశర: నాన్నమ్మా, మాధవాచార్యులకు నంజీయర్ అనే పేరు ఎలా వచ్చింది?

నాన్నమ్మ : చర్చలో మాధవునిపై పరాశర భట్టార్ విజయం సాధించిన తరువాత, అతనికి అరుళిచ్చెయల్ నేర్చుకోమని వారు నిర్దేశిస్తారు, మన సాంప్రదాయ సూత్రాలను వారికి బోధించి వారు శ్రీరంగానికి బయలుదేరుతారు. భట్టార్ వెళ్ళిన తరువాత, వారికి శిష్యునిగా మారాలన్న మాధవాచార్యుల నిర్ణయాన్ని అతని ఇద్దరు భార్యలు సమ్మతించలేదు. భార్యలతో కలహం, వారి ఆచార్యుల నుండి విరహం సహించలేక వారు సన్యాసిగా మారాలని నిర్ణయించుకొని  ఆచార్యులతో  ఉండటానికి శ్రీరంగానికి ప్రయాణం చేస్తారు. వారి ఆస్తులను 3 భాగాలుగా విభజించి, తన ఇద్దరు భార్యలకు 2 భాగాలను ఇచ్చి, మూడో భాగాన్ని భట్టారుకి సమర్పించడానికి తనతో తీసుకువెళతారు, సన్యాస దీక్షను స్వీకరించి శ్రీరంగానికి చేరుకుంటారు. శ్రీరంగంలో మాధవాచార్యులను చూసి భట్టార్ వారి అంకితభావానికి, ఆచార్యాభిమానానికి ముగ్ధులై వారిని “నంజీయర్” (మా ప్రియమైన జీయార్) అని పిలుస్తారు. అప్పటి నుండి వారు నంజీయర్ అని పిలువబడ్డారు. నంజీయర్ వారి ఆచార్యులకు అంకితమై ఉండేవారు. వారి ఆచార్య భక్తి అనంతమైనది. వారు అనేవారు, “ఒక శ్రీవైష్ణవుడు మరో శ్రీవైష్ణవుడి బాధను చూసి తల్లడిల్లితే, అటువంటి వ్యక్తి శ్రీవైష్ణవుడు”. వారి కాలంలోని శ్రీవైష్ణవులన్నా, అచార్యులన్నా వారికి ఎంతో గౌరవం ఉండేది.

నంజీయర్ – తిరునారాయణపురం

అత్తుళాయ్ : నాన్నమ్మా, నంజీయార్ యొక్క ఆచార్య భక్తి కథలు కొన్ని మాకు చెప్పండి.

నాన్నమ్మ : ఒకసారి, భట్టార్ వారిని పల్లకిలో ఊరెరిగించు సమయంలో, త్రిదండంతో నంజీయర్ భట్టార్ వారిని  ఒక భుజాన పల్లకీని మరో భుజాన ఎత్తుకోవాలని ప్రయత్నిస్తారు. భట్టార్ అంటారు  “జీయా ! ఇది మీ సన్యాసాశ్రమానికి సరితూగదు. మీరు నన్ను ఎత్తుకోకూడదు”. నంజీయర్ అంటారు “నా త్రిదండం మీ సేవకు అడ్డంకిగా మారితే దానిని విరిచేసి సన్యాసాన్ని వదిలిపెడతాను”.

మరో సమయాన, కొంత మంది నంజీయర్ శిష్యులు వారివద్దకు వచ్చి భట్టార్ వారి ఆగమనంతో తోట అంతా చెదిరిపోయిందని ఫిర్యాదు చేస్తారు, నంజీయర్ అంటారు, ఈ తోట ప్రయోజనమే భట్టార్, వారి కుటుంబానికి సేవ చేయటం అని వెంటనే స్పష్తీకరించి బాగా గుర్తుపెట్టుకోమని హెచ్చరించారు.

ఆచార్యులు వారి తలను తమ శిష్యుల ఒడిళో పెట్టి పడుకునే ఆనవాయితీ ఉంది.  ఒకసారి, భట్టార్ విశ్రాంతి తీసుకోవాలని, నంజీయర్ ఒడిళో తల పెట్టి చాలాసేపు విశ్రాంతి తీసుకుంటారు. నంజీయర్ అసలు కదలకుండా అలాగే ఉంటారు.  వారి  ఆచార్యభక్తి,  ప్రేమకు ఇది ఒక నిదర్శనం. భట్టార్ మరియు నంజీయర్ ఎల్లప్పుడూ చాలా ఆసక్తికరమైన సంభాషణలలో మునిగి ఉండేవారు.

వేదవల్లి : మన సంభాషణలు లాగానా?

నాన్నమ్మ (చిరునవ్వుతో): అవును, మన సంభాషణల లాగానే కానీ అవి ఇంకా చాలా ఆసక్తికరమైనవి!

ఒకసారి, నంజీయర్ భట్టార్ని అడుగుతారు, ఎందుకు అందరు ఆళ్వారులు రాముని కంటే కృష్ణునిపై ఎక్కువ ఆకర్షితులై ఉండేవారు అని.  రాముని పట్ల ఎక్కువ ఆదరణ ఉన్న భట్టార్ అంటారు, సాధారణంగా  ప్రజలు ఇటీవలి కార్యకలాపాలను గుర్తుంచుకుంటారు. కృష్ణావతారం రామావతారం కన్నా  ఇటీవలి అవతారం, అందువల్ల ఆళ్వారులు కృష్ణునిపై ఎక్కువ మక్కువతో ఉండేవారు.

ఇంకొకసారి, నంజీయర్ భట్టారు వారిని అడుగుతారు, ఎందుకు మహాబలి పాతాళానికి వెళతారు మరియు శుక్రాచార్యుడు ఎందుకు కంటిని కోల్పోతారు? అని.  భట్టార్ వారు జవాబిస్తూ అంటారు శుక్రాచార్యులు మహాబలిని తన వాగ్దానాన్ని నిలుపుకునే ధర్మాన్ని నిర్వర్తించనీయలేదు  తన కంటిని కోల్పోయారు మరియు మహాబలి తన ఆచార్యుని యొక్క మాట వినలేదు అందుకని పాతాళ నివాసిగా శిక్షించబడ్డాడు. అందుచేత, ఇక్కడ, భట్టార్ ఆచార్య గౌరవం ఎంత ముఖ్యమైనదో నొక్కి చెబుతున్నారు. వారి మధ్య అనేక ఆసక్తికరమైన సంభాషణలు ఉన్నాయి. ఈ సంభాషణలు నంజీయార్కి వారి వ్రాతపూర్వక రచనలలో కూడా సహాయపడ్డాయి.

ఒక రోజు నంజీయర్ తన వ్రాతపూర్వక రచనలను మంచి కాపీలు చేయాలని, తన శిష్యులలో ఈ కార్యాన్ని చేయగల సామర్థ్యం ఉన్నవారు ఎవరో విచారణ చేస్తారు. నంబూర్ వరదరాజు పేరు ప్రతిపాదించబడింది. నంజీయర్ మొదట పూర్తి 9000 పడి కాలక్షేపాన్ని వరదరాజుకి వినిపించి ఇంకా  వారికి ఉన్న ఒక్క అసలు కాపీని ఇస్తారు. వరదరాజు కావేరీ అవతల ఉన్న వారి స్వస్థలానికి వెళ్లి నిరాటంకంగా త్వరగా ఆ కార్యాన్ని సంపన్నం చేయాలని నిర్ణయించుకుంటారు. కావేరీ నదిని దాటుతుండగా హటార్తుగా వరద కారణంగా వారు ఈదటం మొదలుపెడతారు. వారి దగ్గర ఉన్న గ్రంథం వారి చేతుల్లో నుండి జారిపోతుంది, వారు పూర్తిగా కృశించి పోతారు. వారి సొంత ఊరికి వెళ్ళాక వారి ఆచార్యులపై మరియు వారిచ్చిన కాలక్షేపముపై ధ్యానించి 9000 పడి వ్యాక్యానాన్ని తిరిగి వ్రాయడం ప్రారంభిస్తారు. వారు  తమిళ భాష మరియు  సాహిత్యంలో నిపుణుడైనందున, వారు మంచి అర్ధాలు జతచేర్చి చివరికి నంజీయర్కి తిరిగి ఇస్తారు. నంజీయర్ వ్యాక్యానాన్ని చూసి కొన్ని మార్పులను గమనిస్తారు, ఏమి జరిగిందో అడగగా. వరదరాజు మొత్తం సంఘటన గురించి వివరిస్తారు, నంజీయర్ మొత్తం విని చాలా గర్వపడతారు. వరదరాజు యొక్క ఖ్యాతిని అర్థం చేసుకోవడమే కాక, తన పనిని గుర్తించి, నంజీయర్ ఆప్యాయంగా వారిని నంపిళ్ళై అని పిలుస్తారు మరియు వారిని తరువాతి దర్శన ప్రవర్ధకరుడుగా చేస్తారు. నంజీయర్ అతని కంటే మంచి వివరణ ఇస్తున్నందుకు నంపిళ్ళైని నిరంతరం మెచ్చుకునేవారు. ఇది నంజీయర్ యొక్క గొప్పతనాన్ని చూపుతుంది.

వ్యాస : నాన్నమ్మా, నంపిళ్ళై గురించి మాకు మరింత చెప్పండి.

నాన్నమ్మ: నంపిళ్ళై వారి కీర్తులను గురించి రేపు చెప్పుకుందాము. ఇప్పుడు ఆలస్యమైయ్యింది . మీరు ఇప్పుడు ఇంటికి వెళ్లాలి.

పిల్లలు భట్టార్, నంజైయార్ మరియు నంపిళ్ళై గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లకు వెళ్తారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-nanjiyar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – నంపిళ్ళై శిష్యులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంపిళ్ళై

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి వస్తారు, ఆండాళ్ నాన్నమ్మ వంటింట్లో వంట చేస్తున్నారు. పిల్లలు మాట్లాడుతూ రావడం చూసి వారిని స్వాగతించడానికి నాన్నమ్మ బయటకు వస్తారు.

నాన్నమ్మ : పిల్లలూ రండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని గుడి నుంచి తెచ్చిన ఈ ప్రసాదం తీసుకోండి. క్రిందటిసారి మనం మన ఆచార్య నంపిళ్ళై గురించి చెప్పుకున్నాము. అప్పుడు నేను చెప్పినట్టుగా, ఈవేళ నంపిళ్ళై వారి ప్రముఖ శిష్యులైన వడక్కు తిరువీధి పిళ్ళై, పెరియ వాచ్చాన్ పిళ్ళై, పింభళగియ పెరుమాళ్ జీయర్, ఈయున్ని మాధవ పెరుమాళ్, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ గురించి మాట్లాడుకుందాము.

వ్యాస: నాన్నమ్మా, నంపిళ్ళైకి చాలా మంది శిష్యులు ఉన్నట్టున్నారు. మీరు వారి గురించి మాకు చెప్తారా?

నాన్నమ్మ: సరే, ఒకరి తరువాత ఒకరిని గురించి మనం చెప్పుకుందాము. మనం నంపిళ్ళై శిష్యుడు, వ్యాఖ్యాన చక్రవర్తి అయిన పెరియవాచ్చాన్ పిళ్ళైతో ప్రారంభిద్ధాం. ఈయన సేంగనూర్లో (తిరుచ్చంగనల్లూర్) యామునర్ కుమారుడిగా, కృష్ణ నామధేయంతో జన్మించారు, తరువాత పెరియవాచ్చాన్ పిళ్ళైగా పిలవబడ్డారు. వారు నంపిళ్ళై ప్రధాన శిష్యులలో ఒకరు, వారు నంపిళ్ళై నుండి అన్ని శాస్త్రార్ధాలను నేర్చుకున్నారు. వారు నాయనారాచ్చాన్ పిళ్ళైని తన దత్తపుత్రునిగా స్వీకరిస్తారు. తిరుక్కన్నమంగై ఎమ్పెరుమాన్ స్వయంగా తిరుమంగై ఆళ్వార్ వద్ద నుండి వారి పాసురాల అర్థాలను నేర్చుకోవాలని అనుకుంటారు – అందుకని తిరుమంగై ఆళ్వార్ నంపిళ్ళైగా ప్రకటమై, ఎమ్పెరుమాన్, పెరియవాచ్చాన్ పిళ్ళై గా ప్రకటమై అరుళిచ్చెయల్ అర్థాలను తెలుసుకుంటారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై – సేంగనూర్

వ్యాస: నాన్నమ్మా, ఎందుకు పెరియవాచ్చాన్ పిళ్ళైని వ్యాఖ్యాన చక్రవర్తిగా పిలుస్తారు?

నాన్నమ్మ : పెరియవాచ్చాన్ పిళ్ళై మాత్రమే సంపూర్ణ అరుళిచ్చెయల్ కి వ్యాఖ్యానం వ్రాశారు.  రామాయణం మరియు అరుళిచ్చెయల్ పై వారికి ఉన్న నైపుణ్యం అసమానమైనది. అతను పాసురపడి రామాయణం అని పిలవబడే గ్రంథం వ్రాశారు, అక్కడ వారు ఆళ్వారుల పాసురాల నుండి మాత్రమే పదాలను తీసుకొని శ్రీరామాయణాన్ని ప్రస్ఫుటమైన రీతిలో వివరించి వ్రాశారు. వారు అనువదించి వ్రాయకపోయినట్లైతే, ఎవరూ కూడా అరుళిచ్చెయల్ నిగూఢమైన అర్థాన్ని తెలుసుకొని వాటి గురించి మాట్లాడగలిగేవారు కారు. వారు విస్తృతంగా మన పూర్వాచార్యులు రచించిన అన్ని గ్రంథాలకు వ్యాఖ్యానాలు పూర్తిచేశారు.

నంపిళ్ళై యొక్క ప్రముఖ శిష్యులలో వడక్కు తిరువీధి పిళ్ళై కూడా ఒకరు. శ్రీరంగంలో శ్రీకృష్ణ పాదర్ గా  జన్మించిన వీరు పూర్తిగా ఆచార్య నిష్ఠలోనే మునిగిఉండేవారు. వడక్కు తిరువీధి పిళ్ళైకి వారి ఆచార్యులైన నంపిళ్ళై యొక్క దయతో ఒక కుమారుడు జన్మిస్తాడు. వారి ఆచార్యులైన నంపిళ్ళై (లోకాచార్య అని కూడా పిలుస్తారు) యొక్క దీవెనలతో జన్మించినందున తన కుమారుడికి పిళ్ళై లోకాచార్య అని నామకరణం చేస్తారు. నంపిళ్ళై, లోకాచార్యగా పిలువబడే వెనకటి కథ మీకు గుర్తుందనుకుంటాను.

వ్యాస: అవును, నాన్నమ్మా. కందాడై తోళప్పర్ నంపిళ్ళైని లోకాచార్య గా పేర్కొన్నారు. మాకు ఆ కథ గుర్తుంది.

వడక్కు తిరువీధి పిళ్ళై – కాంచీపురం

నాన్నమ్మ : వడక్కు తిరువీధి పిళ్ళై తన పుత్రునికి పిళ్ళైలోకాచార్య అని పేరు పెట్టినప్పుడు, నంపిళ్ళై ఆ బిడ్డకు అళగియ మణవాలన్ అని నామకరణం చేయాలని వారి ఇచ్చను ప్రకటిస్తారు. నంపెరుమాళ్ అనుగ్రహంతో కొద్దికాలానికే వారికి రెండవ పుత్రుడు జన్మిస్తాడు. ఆ నవ శిశువుకి అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అని నామకరణం చేస్తారు, ఎందుకంటే అతను అళగియ మణవాలన్ (నంపెరుమాళ్) యొక్క కృపతో జన్మించాడు కాబట్టి. ఈవిధంగా వడక్కు తిరువీధి పిళ్ళై తన ఆచార్యులైన నంపిళ్ళై యొక్క కోరిక నెరవేరుస్తారు. ఆ ఇద్దరు బాలురు రామ లక్ష్మణుల లాగా కలిసిమెలిసి పెరిగి గొప్ప విద్వాంసులుగా మారి మన సాంప్రదాయానికి గొప్ప కైంకర్యాలు చేయసాగారు. వారిద్దరికీ నంపిళ్ళై , పెరియవాచ్చాన్ పిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, తదితరులవంటి గొప్ప ఆచార్యుల కృపా కటాక్షాలు మరియు మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉండేది.

ఒకసారి వడక్కు తిరువీధి పిళ్ళై, తదీయారాధన కొరకై నంపిళ్ళైని తన తిరుమాలిగైకి (శ్రీవైష్ణవులు ఉండే గృహాలను తిరుమాలిగై అని పిలుస్తారు) ఆహ్వానిస్తారు. నంపిళ్ళై ఆ ఆహ్వానాన్ని స్వీకరించి వారి  తిరుమాలిగైకి వస్తారు. నంపిళ్ళై స్వయంగా తిరువారాధనం మొదలుపెడతారు, వారు కోయిల్ ఆళ్వార్ (పెరుమాళ్ సన్నిధి) లో తాటి ఆకులపై చక్కగా స్పష్టంగా వ్రాయబడిన, నమ్మాళ్వార్ రచించిన పాసురాలపై తాను చేసిన బోధనలు, ఉపన్యాసాలు మరియు వాటి వివరణలు చూస్తారు. ఆసక్తికరంగా, వాటిలో కొన్ని చదివి వడక్కు తిరువీధి పిళ్ళైని అవి ఏంటో అడుగుతారు. నంపిళ్ళై యొక్క ఉపన్యాసాలు విన్న తరువాత ప్రతిరోజు రాత్రి వాటిని వ్రాసి నమోదు చేసుకుంటారని వడక్కు తిరువీధి పిళ్ళై వివరిస్తారు. తన అనుమతి లేకుండా అలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తారు. అతను పెరియవాచ్చాన్ పిళ్ళై యొక్క వ్యాఖ్యానాలకు (ఆళ్వారుల పాసురాల యొక్క అర్ధ వివరణలు) పోటీగా ఏమైనా చేస్తున్నారేమోనని అడుగుతారు. వడక్కు తిరువీధి పిళ్ళై అపరాధము మన్నించమని వెంటనే నంపిళ్ళై యొక్క చరణ కమలాలపై పడి భవిష్యత్తులో వాటిని సూచించడానికి మాత్రమే వ్రాశారని వివరిస్తారు. నంపిళ్ళై ఒప్పుకొని, వడక్కు తిరువీధి పిళ్ళైని వారి వ్యాఖ్యానాలను కీర్తిస్తారు. అటువంటి అపారమైన జ్ఞానం మరియు ఆచార్య అభిమానం వడక్కు తిరువీధి పిళ్ళై కలిగి ఉండేవారు.

పరాశర: ఆ వ్యాఖ్యానానికి ఏం జరిగింది? వడక్కు తిరువీధి పిళ్ళై వ్యాఖ్యనాన్ని పూర్తి చేశారా?

నాన్నమ్మ : అవును, వడక్కు తిరువీధి పిళ్ళై వ్యాఖ్యానం పూర్తి చేస్తారు, ఆ తిరువాయ్మోలి వ్యాఖ్యానాన్నే ప్రముఖంగా ఈడు 36000 పడి అని పిలుస్తారు. నంపిళ్ళై ఆ వ్యాఖ్యానాన్ని రాబోవు తరాలవారు కూడా నేర్చుకోవడానికి ఈయున్ని మాధవ పెరుమాళ్ కి ఇవ్వమని వడక్కు తిరువీధి పిళ్ళై ని ఆదేశిస్తారు.

nampillai-goshti1

నంపిళ్ళై కాళక్షేప గోష్టి – కుడినుండి రెండవ స్థానంలో కూర్చొని ఉన్న ఈయున్ని మాధవ పెరుమాళ్

వేదవల్లి: నాన్నమ్మా, నంపిళ్ళై ఇచ్చిన వ్యాఖ్యానంతో  ఈయున్ని మాధవ పెరుమాళ్ ఏమి చేశారు?

పట్టి: ఈయున్ని మాధవ పెరుమాళ్ ఆ వ్యాఖ్యానాన్ని తన కుమారుడైన ఈయున్ని పద్మనాభ పెరుమాళ్ కు బోధిస్తారు. ఈయున్ని పద్మనాభ పెరుమాళ్ తన ప్రియ శిష్యుడైన నాళుర్ పిళ్ళైకి బోధిస్తారు. ఈ విధంగా సరైన పద్ధతిలో ఒకరి తరువాత ఒకరి శిష్యులకు వెళుతూ వచ్చింది. నాళూరాచ్చాన్  పిళ్ళై నాళుర్ పిళ్ళై యొక్క కుమారులు మరియు ప్రియమైన శిష్యులు కూడా. నాళూరాచ్చాన్ పిళ్ళై వారి తండ్రి చరణకమలాల వద్ద ఈడు 36000 పడి నేర్చుకుంటారు. నాళూరాచ్చాన్  పిళ్ళైకి అనేక శిష్యులు ఉండేవారు, వారిలో తిరువాయ్మొలి పిళ్ళై ఒకరు. నాళూరాచ్చాన్  పిళ్ళై మరియు నాళుర్ పిళ్ళై, దేవపెరుమాళ్ కు మంగళాశాసనం చేయటానికి కాంచిపురానికి వెళ్ళినప్పుడు, ఈడు వ్యాఖ్యానాన్ని తిరువాయ్మొలి పిళ్ళైకి బోధించమని ఎమ్బెరుమాన్ స్వయంగా నాళూరాచ్చాన్  పిళ్ళైని ఆదేశిస్తారు.  తిరువాయ్మొలి పిళ్ళై ఇతరులతో పాటు ఈడు వ్యాఖ్యానాన్ని నాళూరాచ్చాన్ పిళ్ళై నుండి నేర్చుకుంటారు, తిరువాయ్మొలి పిళ్ళై ఈట్టు పెరుక్కర్గా (ఈడు వ్యాఖ్యానాన్ని పోషించి కాపాడేవాడా అని అర్థం) పిలవబడిన మణవాల మామునికి బోధిస్తారు. ఆ విధంగా క్రమేణా మణవాల మామునికి చేరుకుంటుందని తెలుసు అందుకే నంపిళ్ళై ఈ వ్యాఖ్యానాన్ని ఈయున్ని మాధవ పెరుమాళ్ కి అందజేస్తారు.

అత్తుళాయ్ : నాన్నమ్మా, ఈయున్ని మాధవ పెరుమాళ్ మరియు ఈయున్ని పద్మనాభ పెరుమాళ్ పేరులో “ఈయున్ని” అంటే ఏమిటి?

నాన్నమ్మ : “ఈథల్” అంటే తమిళంలో దానము. “ఉన్నుతల్” అంటే భుజించడం. ఈయున్ని అనగా అతను ఇతర శ్రీ వైష్ణవులకు వడ్డించిన తరువాత మాత్రమే తానూ భుజించే ధర్మసంబంధమైనవాడు అని అర్థం.

నంపిళ్ళై యొక్క మరో ప్రముఖ శిష్యుడు పింభళగియ పెరుమాళ్ జీయర్. నంజీయర్ (ఒక సన్యాసి) భట్టార్నిసేవించినట్టుగా, వారు సన్యాసి అయిఉండి కూడా (గృహస్థుడైన) నంపిళ్ళై ని సేవించేవారు. వారిని నంపిళ్ళై యొక్క ప్రియమైన శిష్యుడు మరియు పింభళగియ పెరుమాళ్ జీయర్ అని కూడా పిలుస్తారు. వారు తన జీవితాన్ని ఒక నిజమైన శ్రీ వైష్ణవుడిగా వారి ఆచార్యుల పట్ల అమితమైన భక్తి గౌరవాలతో జీవించారు. వారి ఆచార్యాభిమానం ప్రఖ్యాతిగాంచినది.

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

నంపిళ్ళై చరణకమలాల వద్ద పింభళగియ పెరుమాళ్ జీయర్ – శ్రీరంగం

పరాశర: నాన్నమ్మా,  మీరు ఈరోజు నంపిళ్ళై మరియు వారి శిష్యుల మధ్య జరిగిన సంభాషణలు మాకు చెప్పలేదు. వారి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణలను మాకు చెప్పండి.

నాన్నమ్మ : మన పూర్వాచార్యులు అందరూ కేవలం భగవత్ విషయం మరియు భాగవత కైంకర్యం గురించి మాత్రమే సంభాషించేవారు. ఒకసారి పింభళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యంతో బాధపడుతున్నపుడు, తను తొందరగా కోలుకోవటానికి ఎమ్బెరుమాన్ని ప్రార్థించమని ఇతర శ్రీ వైష్ణవులని అడుగుతారు. సాధారణంగా మన సాంప్రదాయంలో, శ్రీ వైష్ణవులు ఎమ్బెరుమాన్ని ఏ ఇతర కోరికల కోసం ప్రార్థన చేయరాదు – అనారోగ్యం నుండి కోలుకోవడానికి కూడా. దీన్ని చూసి, నంపిళ్ళై శిష్యులు ఈ విషయం గురించి నంపిళ్ళై ని అడుగుతారు. నంపిళ్ళై మొదట ఇలా అంటారు, “వెళ్ళి అన్ని శాస్త్రాలలో నిపుణుడైన ఎంగళాళ్వాన్ ని అడగండి”. “శ్రీరంగం అంటే అనురాగం ఉండి ఉండవచ్చు అందుకని మరికొంత కాలం ఇక్కడ ఉండాలని కోరికేమో వారికి ” అని ఎంగళాళ్వాన్ అంటారు. నంపిళ్ళై వారి శిష్యులను అమ్మంగి అమ్మాళ్ ని అడగమని చెబుతారు, “నంపిళ్ళై కాలక్షేప గోష్ఠిని విడిచి వెళ్లాలని ఎవరు అనుకుంటారు? వారు ప్రార్ధన చేస్తున్నారేమో, నంపిళ్ళై కాలక్షేపాన్ని వినాలని.” చివరకు నంపిళ్ళై స్వయంగా జీయర్ ని అడుగుతారు. జీయర్ నంపిళ్ళై తో ఇలా అంటారు, “నిజమైన కారణం మీకు తెలిసినప్పటికీ, అది నా ద్వారా వినాలని అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఉండాలని ఎందుకు అనుకుంటున్నానో చెప్తాను. ప్రతిరోజూ, మీరు స్నానం చేసిన తరువాత, మీ రూపం యొక్క దైవ దర్శనమును పొందగలుగుతున్నాను మరియు వింజామర సేవ చేయగలుగుతున్నాను. నేను ఈ సేవను విడిచిపెట్టి అప్పుడే పరమపదానికి ఎలా వెళ్ళను?”. అని అంటారు. అలా పింభళగియ పెరుమాళ్ జీయర్ ఒక శిష్యుని యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడి చేశారు – వారి స్వంత ఆచార్యల యొక్క దివ్య స్వరూపంపై పూర్తి భక్తి అనురాగాలు ఉండటమే అని. నంపిళ్ళై పై జీయర్ భక్తి గురించి విన్న వారంతా ఆశ్చర్యపోయారు. నంపిళ్ళై పై పింభళగియ పెరుమాళ్ జీయర్ కు ఎంత అనురాగం అంటే వారు పరమపద ఆలోచనను కూడా విస్మరించారు. వారి ఆచార్య నిష్ఠ అంత గాఢమైనది.

చివరిగా నంపిళ్ళై మరొక శిష్యుని గురించి మనం చూద్దాము – నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్. ప్రారంభంలో, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ నంపిళ్ళైపై అనుకూలమైన వైఖరి ఉండేది కాదు. వారి గొప్ప కుటుంబ వారసత్వం (కూరత్తాళ్వార్ మరియు పారాశర భట్టర్ యొక్క కుటుంబస్తుడు) కారణంగా అహంకారంతో నంపిళ్ళైని గౌరవించేవారు కాదు. వారు నంపిళ్ళై యొక్క చరణ కమలాల వద్ద శరణాగతి చేయడం వెనక చాలా ఆసక్తికరమైన కథ ఉంది.

నంపిళ్ళై కాళక్షేప గోష్టి – కుడినుండి మూడవ స్థానంలో కూర్చొని ఉన్న నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్

వ్యాస: కూరత్తాళ్వార్ వంశీయుడు అహంకార లక్షణాలు కలిగి ఉండటం ఎంత విచిత్రం. మాకు ఆ కథ చెప్పండి నాన్నమ్మ!

నాన్నమ్మ : సరే, కానీ వారి అనవసరమైన గర్వం ఎక్కువ కాలం ఉండలేదు! ఎంతైనా, వారు కూరత్తాళ్వారి మనుమడు కదా! ఒకసారి, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ రాజదర్బారుకి వెళ్తున్నారు. వారికి దారిలో పింభళగియ పెరుమాళ్ జీయర్ కలుస్తారు,తనతోపాటు వారిని కూడా రాజదర్బారుకి రమ్మని ఆహ్వానిస్తారు. రాజు వారిని స్వాగతిస్తారు, వారిని సత్కరించి ఆసనమిస్తారు. భట్టర్ యొక్క మేధస్సును పరీక్షించడానికి రాజు శ్రీ రామాయణం నుండి ఒక ప్రశ్న అడుగుతారు. వారంటారు, “శ్రీ రాముడు తనను తాను సాధారణ మానవుడినని మరియు దశరథుని ప్రియ పుత్రుడినని అంటారు. కానీ జటాయువు చివరి క్షణాలలో వున్నప్పుడు, శ్రీరాముడు జటాయువుకి వైకుంటం చేరుకుంటావని ఆశీర్వదిస్తారు. అతను ఒక సాధారణ మానవుడైతే, వైకుంటం చేరుకుంటావని ఒకరిని ఎలా ఆశీర్వదిస్తారు?”. భట్టర్ నోట మాటలేక స్పందించ లేకపోయారు. అంతలో రాజుగారు మరేదో పనిమీద పరధ్యానంలో వుంటారు. ఆ సమయంలో, భట్టార్ జీయర్ వైపు మళ్ళి “నంపిళ్ళై ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం ఎలా వివరించి ఉండేవారు?” అని వారిని అడుగుతారు. జీయర్ సమాధానమిస్తూ “ఒక నిజాయితీ గల వ్యక్తి అన్ని ప్రపంచాలను నియంత్రించగలరని నంపిళ్ళై వివరించి ఉండేవారు”. భట్టార్, రాజువారికి ఆ సమాధానాన్ని వివరిస్తారు. రాజు ఆ సమాధానాన్ని అంగీకరించి వారిని సిరిసంపదలతో సత్కరిస్తారు. నంపిళ్ళై పై గొప్ప కృతజ్ఞతతో భట్టార్ నంపిళ్ళై ఇంటికి వెళ్లి వారి చరణ కమలాల యందు ఈ సంపదను ఉంచి వారికి శరణాగతి చేస్తారు. భట్టార్ నంపిళ్ళైకి చెప్తూ, “మీ బోధనల నుండి కేవలం ఒక్క చిన్న వివరణతో ఈ సంపద నాకు దక్కింది. మీ విలువైన సంబంధం / మార్గదర్శకత్వం నేను ఎప్పుడూ విస్మరిస్తూనే వచ్చాను. ఇప్పటి నుండి, నేను మీ సేవ చేస్తూ మన సాంప్రదాయ సూత్రాలను నేర్చుకుంటానని వారు నిశ్చయించుకుంటారు. నంపిళ్ళై భట్టార్ని స్వీకరించి వారికి మన సాంప్రదాయ తత్వార్థాలను బోధిస్తారు. కాబట్టి పిల్లలు, మీరు ఈ కథ నుండి ఏమి నేర్చుకున్నారు?

వేదవల్లి: వారి పూర్వీకుల ఆశీర్వాదంతో, భట్టర్ వారి గమ్యాన్ని చేరుకున్నారని తెలుస్తుంది.

అత్తుళాయ్ : నంపిళ్ళై యొక్క గొప్పతనం మరియు జ్ఞానం గురించి నేను తెలుసుకున్నాను.

నాన్నమ్మ : మీరు ఇద్దరూ చక్కగా చెప్పారు. కానీ ఈ కథ నుండి మనం మరో పాఠం కూడా నేర్చుకున్నాము.మనము మన ఆచార్యాల ద్వారా ఎమ్బెరుమాన్ని సమీపిస్తున్నప్పుడు వారు ఎలా స్వీకరిస్తారో, అటువంటి ఆచార్యులను చేరుకోవడం కేవలం శ్రీవైష్ణవుల దివ్య అనుబంధం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీనినే శ్రీవైష్ణవ సంబంధం లేదా అడియార్గల్ సంబంధం అని పిలుస్తారు. ఇక్కడ దైవ సంబంధమైన శ్రీవైష్ణవుడు ఎవరు భట్టార్ని నంపిళ్ళైతో కలిపింది?

పరాశర: పింభళగియ పెరుమాళ్ జీయర్!

నాన్నమ్మ : అవును! ఇక్కడ భాగవత సంబంధం యొక్క ప్రాముఖ్యత గోచరమౌతుంది. జీయర్, నంపిళ్ళై యొక్క ప్రియ శిష్యుడై నందు వలన, ఆచార్య జ్ఞానం (పరిజ్ఞానము) మరియు సంబంధం తో భట్టర్ ని అనుగ్రహించారు. నంపిళ్ళై మరియు వారి శిష్యుల చరణ కమలాలను మనం ధ్యానిద్దాం. మనం మరో సారి కలుసుకున్నపుడు, వడక్కు తిరువీధిపిళ్ళై వారి ఇద్దరు కుమారులు మరియు వారి అసమానమైన కైంకర్యాల గురించి మీకు చెప్తాను.

పిల్లలు వివిధ ఆచార్యలు మరియు వారి దివ్య సేవల గొప్పతనాన్ని గురించి ఆలోచిస్తూ వారి ఇంటికి వెళ్లిపోతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/09/beginners-guide-nampillais-sishyas/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – పరాశర భట్టర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఎంబార్

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి ఆండాళ్ నాన్నమ్మ ఇంటికి వస్తారు.

నాన్నమ్మ: పిల్లలు స్వాగతం. ఈ రోజు మనం తరువాత ఆచార్యులు, పరాశర భట్టార్ గురించి చెప్పుకుందాము. ఎంబార్ శిష్యులైన వీరు ఎమ్బెరుమానార్ పట్ల గొప్ప భక్తి కలిగి ఉండేవారు. పిల్లలు, నేను ముందు చెప్పినట్టుగా పరాశర మరియు వ్యాస ఋషులకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచటానికి  ఎమ్బె,రుమానార్, కూరత్తాళ్వార్ కు జన్మించిన ఇద్దరు కుమారులకు పరాశర భట్టార్ మరియు వేద వ్యాస భట్టార్ అని పేర్లు పెట్టారు. ఇది ఆళవందార్ కు చేసిన మూడు వాగ్దానాల్లో ఒకటి. పరాశర భట్టార్ మరియు వేద వ్యాస భట్టార్ కూరత్తాళ్వార్ మరియు అతని భార్య ఆండాళ్ లకు శ్రీరంగం పెరియ పెరుమాళ్ అనుగ్రహ ప్రసాదంగా పుట్టారు.

azhwan_bhattars

కూరత్తాళ్వారు వారి కుమారులు పరాశర భట్టార్ మరియు వేద వ్యాస భట్టార్

పరాశర: నాన్నమ్మా, వ్యాసకూ నాకూ ఈ ఆచార్యుల పేర్లే పెట్టారా?

నాన్నమ్మ: అవును పరాశర. పిల్లలకు సాధారణంగా పెరుమాళ్ లేదా ఆచార్యుల పేర్లు పెడతారు.  పిల్లలను పిలిచే కారణంగానైనా మనం పెరుమాళ్ ఇంకా ఆచార్యుల యొక్క దివ్య పేర్లను ధ్యానించే అవకాశం లభిస్తుంది. పెరుమాళ్ లేదా ఆచార్యుల పేర్లు పెట్టడానికి కారణం ఖచ్చితంగా ఇదే, వారి పవిత్రమైన పేర్లను పిలుస్తూ ఆచార్యుల మరియు పెరుమాళ్ల కళ్యాణ గుణాలను ధ్యానించే అవకాశం పొందుతాం. లేకపోతే, ఈ బిజీ ప్రపంచంలో, ప్రత్యేకంగా ఆచార్యులు ఇంకా పెరుమాళ్ యొక్క దివ్య నామాలను ధ్యానించేందుకు సమయం కేటాయించడం కష్టం. ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి. ప్రజలు అర్ధం లేని నామమాత్రపు పేర్ల వెనుకబడి, పెరుమాళ్, తాయార్ మరియు ఆచార్యులను గుర్తుంచుకోవటంలేదు.

శ్రీరంగానికి వచ్చిన తరువాత,ఆళ్వాన్  రోజువారీ ఆహారం కోసం ఉంజవృత్తి (ధర్మం) కి వెళ్ళేవారు. భారీ వర్షాల కారణంగా ఒక రోజు ఉంజవృత్తికి వెళ్ళలేకపోయారు. ఆళ్వాన్  మరియు వారి భార్య ఆండాళ్ ఖాళీ కడుపుతో నిద్రపోయారు. రాత్రి సమయంలో, ఆండాళుకి ఆలయంనుండి నైవేద్య ఘంటానాదం వినిపిస్తుంది. ఆండాళ్ ఎమ్బెరుమానుతో అంటారు, “ఇక్కడ, మీ భక్తులు ప్రసాదం లేకుండా ఉంటే, అక్కడ మీరు మంచి భోగాన్ని ఆనందిస్తున్నారా?” అని. పరిస్తితిని గ్రహించి, పెరియ పెరుమాళ్ తన ప్రసాదమును తన అన్ని సామగ్రులు, అడంబరాలతో (ఆలయ మర్యాదలతో) సహా ఉత్తమ నంబి ద్వారా ఆళ్వాన్ మరియు ఆండాళ్ లకు పంపుతారు. ప్రసాదం వస్తుండగా చూసి  ఆళ్వాన్ విస్మయం చెందుతారు. వెంటనే, వారు ఆండాళ్ ని “నువ్వేమైన ఎమ్బెరుమానుకి ఫిర్యాదు చేసావా?” అని అడుగుతారు. ఆండాళ్ అవునని అంగీకరిస్తుంది.అందుకు ఆళ్వాన్ కరవరపడి, కేవలం రెండు గుప్పిల్ల ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తారు, అందులో కొంచెం వారు తిని మిగిలిన శేషాన్ని ఆండాళ్ కు ఇస్తారు. ఆ రెండు గుప్పిల్ల ప్రసాదమే వారికి అందమైన ఇద్దరు శిశువులను ప్రసాదిస్తుంది.

వ్యాస: నాన్నమ్మా, ఎంబార్ ఎలా భట్టారుకి ఆచార్యులైనారు?

నాన్నమ్మ: పిల్లలు ఇద్దరూ జన్మించిన తరువాత, ఎంబార్ ఆ ఇద్దరు పిల్లలను చూసి వెంటనే వారిద్దరూ మన సాంప్రదాయము కోసమే జన్మించారని తెలుసుకుంటారు. వారి ముఖంలో తేజస్సు చూసి వెంటనే వారికి దుష్టశక్తులనుండి రక్షణగా ద్వయ మహామంత్రాన్ని పఠిస్తారు. ఎమ్బెరుమానార్ ఆ ఇద్దరు పిల్లలను చూసి వారు ద్వయ మహామంత్రం ద్వారా సాంప్రదాయములోకి ప్రవేశం చేయబడ్డారని గమనిస్తారు. ఎంబార్ను విచారించగా వారు ద్వయ మహామంత్రాన్ని పఠించినట్టు వివరిస్తారు. ఎంబార్ ద్వారా ఆ పిల్లలు ద్వయ మహామంత్రం పొందినందువల్ల వారే ఆ పిల్లలకు ఆచార్యులైనారు. ఆ ఇద్దరు పిల్లలు ఎంబార్ మరియు వారి తండ్రి ఆళ్వాన్ దగ్గర నుండి విద్య నేర్చుకుంటూ పెరిగి పెద్దవాళ్ళవుతారు. పెరియ పెరుమాళ్ ఆశీర్వాదం అనుగ్రహంతో జన్మించినందువల్ల, ఇద్దరు పిల్లలకు పెరియ పెరుమాళ్ మరియు పెరియ పిరాట్టి  (శ్రీరంగ నాచియార్) అంటే అమితమైన భక్తి ఉండేది. ఎమ్బెరుమానార్ కూడా పరాశర భట్టార్ను పెరియ పెరుమాళ్‌కు దత్తతు ఇవ్వమని ఆళ్వాన్ కు చెబుతారు,  ఆళ్వాన్ అలాగే చేస్తారు. వాస్తవానికి శ్రీరంగ నాచియారే స్వయంగా తన సన్నిధిలో భట్టార్ను పెంచారని చెప్తారు. పెరియ పెరుమాళ్, పిరాట్టి మరియు భట్టార్ ల మధ్య బంధం అటువంటిది. ఒకసారి, భట్టార్ పెరుమాళ్ సన్నిధిలో కొన్ని పాసురాలు పాడి బయటకు వస్తారు. రామానుజులు భట్టార్ న్ని చూసి అనంతాళ్వార్ ఇంకా ఇతర శిష్యులను పిలిచి భట్టార్ న్ని తనతో సమానంగా వ్యవహరించమని నిర్దేశిస్తారు, రామానుజులు భట్టార్‌లో తనను తాను చూసుకునేవారు.  భట్టార్ ను తరువాతి ధర్శప్రవర్తకులుగా (సాంప్రదాయ నాయకుడుగా) వారు భావించేవారు. భట్టార్ చిన్నతనం నుండి చాలా బుద్దిశాలి. వారి  తెలివితేటలు నిరూపించటానికి  అనేక కథలు ఉన్నాయి.

అత్తుళాయ్: వారి తెలివితేటల గురించి మాకు చెప్పండి.

నాన్నమ్మ: ఒకసారి, భట్టార్ వీధిలో ఆడుకుంటున్నప్పుడు, సర్వఘ్య భట్టన్ అనే పేరు గల ఒక విద్వాంసుడు పల్లకిలో వస్తుంటారు. రామానుజుల వంటి గొప్ప విద్వాంసులు ఉంటున్న శ్రీరంగంలో, వీరిని పల్లకిలో తీసుకురావడం చూసి భట్టార్ ఆశ్చర్యపోతారు.భట్టార్ నేరుగా ఆయన వద్దకు వెళ్ళి తనతో చర్చకు రమ్మని వారితో సవాలు చేస్తారు. సర్వఘ్య భట్టన్, భట్టార్ను చిన్నపిల్లవాడిగా పరిగణించి, భట్టార్ ఏ ప్రశ్న అడగినా తాను జవాబు ఇస్తానని అంటారు. భట్టార్ కొంచెం ఇసుక తీసుకొని, తన చేతిలో ఎంత ఇసుక ఉందని అడుగుతారు. సర్వఘ్య భట్టాన్ నోట్లో మాటలేక తనకు తెలియదంటారు. “అరచేతి నిండా” అని జవాబిచ్చుండవచ్చు అని భట్టార్ అంటారు. భట్టార్ యొక్క మేధాశక్తికి ఆశ్చర్యపోయి, సర్వఘ్య భట్టాన్ పల్లకిలో నుండి క్రిందకు దిగివచ్చి భట్టార్ ను ఎత్తుకొని వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లి కీర్తిస్తారు.

వేదవల్లి: అది చాలా తెలివైన జవాబు.

నాన్నమ్మ: భట్టార్ చాలా చురుకైన పిల్లవాడు, పాఠాలు తొందరగా పట్టేసేవారు.వారి చిన్న వయస్సులో గురుకులంలోవున్న ఒకానొక సందర్భంలో, భట్టార్ వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఆళ్వాన్ వచ్చి, తరగతికి హాజరు కాకుండా వీధిలో ఎందుకు ఆడుకుంటున్నావు అని అడుగుతారు. భట్టార్ “ప్రతిరోజూ వారు మళ్ళీ మళ్ళీ అదే పాఠాన్ని బోధిస్తున్నారు” అని అంటారు – సాధారణంగా ఒకే సందై 15 రోజులు చెప్తారు. అయితే, మొదటి రోజునే భట్టార్ పాఠం నేర్చేసుకునే వారు. ఆళ్వాన్ ఒక పాసురం పఠించమని అతనిని పరీక్షిస్తారు, భట్టార్ సునాయాసంగా పఠిస్తారు.

వ్యాస: తండ్రి లాగానే కొడుకు కూడా!

నాన్నమ్మ (చిరునవ్వు తో ): సరిగ్గా! భట్టార్ వారి తండ్రి ఆళ్వాన్ కూడా గొప్ప జ్ఞానం, జ్ఞాపకశక్తి కలిగి ఉండే వారు. ఆళ్వాన్ యొక్క కొన్ని ఇతర లక్షణాలలో వినయం మరియు గొప్పతనం వంటి గుణాలు భట్టార్కి వారసత్వంగా వచ్చాయి. ఒక సారి ఒక కుక్క శ్రీరంగం దేవాలయంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో, దేవాలయ అర్చకులు గుడిని సంప్రోక్షించి శుభ్రం చేస్తారు. అర్చకులు ఒక లఘు (చిన్న) సంప్రోక్షణ చేయాలని నిర్ణయించుకుంటారు. ఇది విని, భట్టార్ పెరియ పెరుమాళ్ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లి, ప్రతి రోజు నేను ఆలయంలోకి నడుచుకుంటూ వస్తాను, కానీ ఇంతవరకూ ఏ సంప్రోక్షణ చేయలేదు, ఇప్పుడు ఒక కుక్క దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఎందుకు సంప్రోక్షణ చేస్తున్నారు? అని అడుగుతారు. అంతటి వినమ్ర స్వభావం ఉండేది వారికి. అంతటి గొప్ప విద్వాంసులు అయినప్పటికీ, తనను తాను వారు కుక్క కన్నా తక్కువగా పరిగణించేవారు. వారు దేవలోకంలో దేవునిగా జన్మించే కంటే శ్రీరంగంలో ఒక కుక్కగా జన్మించటానికి ఇష్టపడతాను అని చెప్పేవారు.

వేదవల్లి: నాన్నమ్మా, ఒకవేళ రంగ నాచియార్ భట్టార్ని బిడ్డలాగా పెంచితే వారు కూడా పెరుమాళ్ మరియు పిరట్టితో మాట్లాడేవారా, తిరుక్కచ్చి నంబి దేవపెరుమళ్ తో మాట్లాడినట్టుగా?

నాన్నమ్మ: అవును వేదవల్లి. భట్టార్ కూడా శ్రీరంగ పెరుమాళ్ మరియు పిరాట్టితో మాట్లాడేవారు. మీకు తెలుసా, సంవత్సరానికి ఒకసారి, వైకుంట ఏకాదశికి ముందు రోజు మరియు పగల్ పత్తు ఉత్సవం 10 వ రోజున, నంపెరుమాళ్ నాచియార్ తిరుక్కోలం అలంకరణ చేసుకునేవారు. ఆరోజు వారు రంగ నాచియార్ యొక్క అన్ని ఆభరణాలను ధరించి నాచియార్ లాగా అందంగా ఆసీనులౌతారు. అలాంటి రోజున నంపెరుమాళ్ భట్టార్ను పిలిచి తాను తాయార్ లా కనిపిస్తున్నానా లేదా అని అతన్ని అడుగుతారు. భట్టార్ ఎప్పుడూ తాయార్ పక్షపాతి, భక్తితో మరియు అభిమానంతో నంపెరుమాళ్ని చూసీ, అలంకారంలో కొరత లేదు కానీ ఎమ్బెరుమాన్ కళ్ళల్లో కరుణ కానరావట్లేదు అని అంటారు. వారి తల్లి అయిన నాచియార్ పట్ల వారికున్న ప్రేమ అలాంటిది.

భట్టారుకి వందలాది మంది అనుచరులు. వారి కాలక్షేపాలను క్రమం తప్పకుండా విని వారి బోధనలచే ప్రభావితమైన వారు చాలామంది ఉన్నప్పటికీ,  కొందరు భట్టార్ని ఇష్టపడేవారు కాదు. గొప్ప వ్యక్తులకు ఇది సాధారణమే. ఇది రామానుజులకు కూడా జరిగింది. ఒకసారి, భట్టార్ని ఇష్టపడని కొంతమంది, వారిని అసూయ ద్వేషాలతో నిందించడం ప్రారంభించారు. ఎవరైనా మీ పైన అరిస్తే నువ్వు ఏంచేస్తావు, వ్యాసా?

వ్యాస: అతనిపై తిరిగి అరుస్తాను. నేను ఎందుకు భరించాలి?

నాన్నమ్మ: అదే పెద్దలు కూడా చేసేది. కానీ మీకు తెలుసా భట్టార్ ఏమి చేసారో? తన ఆభరణాలు మరియు ఖరీదైన శాలువను తనపై కేకలు వేసిన వ్యక్తికి బహుమానంగా ఇస్తారు. “ప్రతి శ్రీ వైష్ణవుడు రెండు పనులు చేయాల్సిన అవసరం ఉంది – ఎమ్బెరుమాన్ని కీర్తించడం మరియు తన స్వంత లోపాల గురించి విచారించడం. నేను ఎమ్బెరుమాన్ని కీర్తించి పాడటంలో లోతుగా నిమఙ్ఞమైనా తన తప్పుల గురించి విచారించడం మరచిపోయాను. నా బాధ్యతను గుర్తుచేసి నాకు ఎంతో మేలు చేశావు, అందువల్ల నేను నీకు బహుమానం ఇస్తున్నాను”. వారి మనోభావం అలాంటిది.

పరాశర: నాన్నమ్మా, నంజీయర్ ని సాంప్రదాయంలోకి తీసుకురమ్మని రామానుజులు భట్టార్ని ఆదేశించారని మీరు చెప్పినట్టు నాకు గుర్తుంది. భట్టార్ అది ఎలా చేశారు?

పరాశర భట్టార్ (తిరువడిలో నంజీయర్) – శ్రీరంగం

నాన్నమ్మ: నీకు ఇంకా గుర్తుందని చాలా సంతోషంగా ఉంది పరాశర. అవును, రామానుజుల దివ్య సూచన ప్రకారం, భట్టార్ నంజీయర్ను మన సాంప్రదాయంలోకి తీసుకురావడానికి తిరునారాయణపురానికి వెళతారు. ఇంతకు ముందు ఈ స్థలం గురించి మనం విన్నాం? ఎప్పుడో ఎవరికైనా గుర్తుందా?

వేదవల్లి: నాకు గుర్తుంది. తిరునారాయణపురం గుడి రామానుజులచే సంస్కరించబడిన అనేక దేవాలయాలలో ఒకటి. రామానుజులు మెల్కోటేలో ఆలయ విధులను పునరుద్ధరించారు.

నాన్నమ్మ: చాలా మంచిది వేదవల్లి. ముస్లిం ఆక్రమణదారుల నుండి తిరునారాయణపురం  ఆలయంలోని ఉత్సవ మూర్తి సెల్వప్పిళ్ళైని తిరిగి తెచ్చి, ఆలయ పరిపాలనను రామానుజులు పునరుద్ధరిస్తారు. భట్టారు మాధవాచార్యుల (నంజీయర్ యొక్క అసలు పేరు) యొక్క తదీయారాధన కూటం (భాగవతుల భోజనాలయం) కు వెళ్ళి, తాను తినకుండా అక్కడే మాధవాచార్యుల వారికోసం ఎదురుచూస్తుంటారు. అది గమనించిన మాధవాచార్యులు భట్టారు వద్దకు వచ్చి, ఎందుకు తినలేదో వారికి ఏం కావాలో అడుగుతారు. వారితో చర్చించాలని భట్టార్ కోరుకుంటారు.

భట్టార్ గొప్పతనం గురించి విన్న మాధవాచార్యులు ఈ విషయాన్ని గ్రహించి (వారిని సవాలు చేసే ధైర్యం ఎవరికీ లేదు తెలుసుకొని) చర్చకు అంగీకరిస్తారు. భట్టార్ మొదట తిరునెడుందాండకం ఉపయోగించి మరియు తద్వారా శాస్త్రార్థాల గొప్పతనాన్ని, ఎమ్బెరుమాన్ ఆధిపత్యాన్ని నిరూపిస్తారు. మాధవాచార్యులు ఓటమిని అంగీకరించి, భట్టార్ చరనాలపైన పడి, వారిని ఆచార్యులుగా స్వీకరిస్తారు. భట్టార్ సాంప్రదాయ అర్థాలతో పాటు వారికి అరుళిచ్చెయల్ నేర్చుకోవడానికి ప్రత్యేక సూచనలు ఇస్తారు. భట్టార్ శ్రీరంగానికి చేరుకాగానే వారికి గొప్ప స్వాగతం లభిస్తుంది. భట్టార్ రాకకై ఆత్రంగా ఎదురుచూస్తున్నపెరియ పెరుమాళ్ ఆసక్తితో మొత్తం సంఘటనను భట్టార్ నోటివెంట వింటారు. భట్టార్ విజయంతో ఆనందపడి పెరియ పెరుమాళ్ మళ్ళీ తిరునెడుందాండకంను చదివి వినిపించమని భట్టార్ని కోరతారు.

భట్టార్ నంపెరుమాళ్ మరియు రంగ నాచియార్ తిరుమేని (దివ్య రూపం) పై చాలా ప్రేమ, అనురాగం కలిగి ఉండేవారు. ఒక సారి పెరియ పెరుమాళ్ ముందు కొన్ని పాసురాలు వాటి అర్ధాలను పఠిస్తుండగా పెరుమాళ్ సంతోషించి “ఇప్పుడే నీకు మోక్షాన్నిఇస్తున్నాను” అని అంటారు. భట్టార్ చాలా సంతోషించి నంపెరుమాళ్ తో, తనకు పరమపదంలో నంపెరుమాళ్ రూపంలో దర్శనం ఇవ్వకపోతే అక్కడ నుండి ఒక రంధ్రం చేసి దూకి శ్రీరంగానికి తిరిగి వచ్చేస్తానని అంటారు. ఒక సారి అనంతాళ్వార్ భట్టార్ని, పరమపదనాథునికి 2 చేతులు ఉంటాయా లేక 4  చేతులు ఉంటాయా అని ప్రశ్నిస్తారు. భట్టార్, ఒకవేళ వారికి 2 చేతులుంటే వారు పెరియ పెరుమాళ్ లాగా కనిపిస్తారు లేక ఒకవేళ వారికి 4 చేతులు ఉంటే నంపెరుమాళ్ లాగా కనిపిస్తారు అని సమాధానమిస్తారు. భట్టార్ నంపెరుమాళ్కి మించి ఇంకెవరినే చూసేవారు కాదు. వారు పెరుమాళ్ యొక్క ప్రతి దివ్య తిరుమేనిని నంపెరుమాళ్ సంబంధం తోనే చూసేవారు. నంపెరుమాళ్ వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. వారి తల్లి అండాళ్ ఆశీర్వాదంతో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, ఆచార్యుల నిత్య కైంకర్యం చేయుటకు పరమపదానికి చేరుకుంటారు. వారు మన శ్రీ వైష్ణవ సాంప్రదాయం బాధ్యతను తదుపరి ఆచార్యులైన నంజీయర్ కి ఇస్తారు.

అత్తుళాయ్: నాన్నమ్మా, భట్టార్ జీవితం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నమ్పెరుమాళ్ తో వారి బంధం భక్తి గురించి వింటే హృదయాన్ని కరిగించి వేస్తుంది. అటువంటి భర్త మరియు కుమారులు కలిగినందుకు ఆండాళ్ ధన్యురాలు.

నాన్నమ్మ:  అవును అత్తుళాయ్. నిజంగా ఆండాళ్ ధన్యురాలు. రేపు, నేను తదుపరి ఆచార్యులు నంజీయర్ గురించి చెబుతాను. ఇప్పుడు ఈ పండ్లు తీసుకొని ఇంటికి వెళ్లండి.

పిల్లలు భట్టార్ మరియు అతని దివ్య జీవితం గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లకు వెళ్తారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-bhattar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఎంబార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< రామానుజులు – భాగము 2

 

పరాశర, వ్యాస వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి ఆండాళ్ నాన్నమ్మ ఇంటికి వస్తారు.

నాన్నమ్మ: పిల్లలూ! స్వాగతం. మీ చేతులు కాళ్ళు కడుక్కోండి.  ప్రసాదం తీసుకువస్తాను. రేపు ఏరోజో మీకు తెలుసా? రేపు ఆళవందార్ తిరునక్షత్రం, ఆషాడ మాసం, ఉత్తరాషాడ నక్షత్రం. ఇక్కడ ఎవరు అళవందార్ ను గుర్తుచేసుకుంటున్నారు?

అత్తుళాయ్: నేను గుర్తుంచుకున్నాను! వారు రామానుజులను మన సాంప్రదాయంలోకి తీసుకురమ్మని దేవపెరుమాళ్ ని ప్రార్థిస్తారు.

వ్యాస : అవును. అంతేకాక, వారు పరమపదం చేరుకున్న తరువాత, వారి తిరుమేనిలో మూడు వేళ్లు ముడుచుకొని ఉంటాయి, ఆ మూడు వేళ్ళు వారి చివరి మూడు నెరవేరని కోరికలకు సూచన. వాటిని పూర్తి చేసేందుకు రామానుజులు వాగ్దానం చేస్తారు. రామానుజులు వాగ్దానం చేసిన వెంటనే, ఆ మూడు వేళ్ళు విప్పుకుంటాయి.

పరాశర: నాన్నమ్మా,  రామానుజుల ఆవందార్ల మధ్య ఆత్మసంబంధం అని, శారీరక ఇంద్రియాలకు అతీతమైనది అని మీరు చెప్పినట్టు మాకు గుర్తుంది.

నాన్నమ్మ: అవును ! వారి తిరునక్షత్రం రేపు. ఇదిగోండి ఈ ప్రసాదం తీసుకోండి. రేపు ఆలయానికి వెళ్లి సాంప్రదాయంలోకి రామానుజులను తెచ్చిన ఈ గొప్ప ఆచార్యులను మొక్కడం మర్చిపోకండి. ఇక మనం మన తదుపరి ఆచార్య ఎంబార్ గురించి తెలుసుకుందాం. ఎంబార్ కమల నయన భట్టార్ మరియు శ్రీదేవి అమ్మగారికి కుమారుడుగా మధురమంగళంలో జన్మించారు. అతని జన్మ పేరు గోవింద పెరుమాళ్. వారిని గోవింద భట్టార్, గోవింద దాస మరియు రామానుజ పాద ఛాయైయార్ అని కూడా పిలుస్తారు. అతను రామానుజుల బంధువు మరియు ఒకసారి రామానుజులు చంపబడకుండా వారిని రక్షిస్తారు.

వేదవల్లి: హత్య? నాన్నమ్మా, నేను ఒకసారి మాత్రమే రామానుజుల జీవితం ప్రమాదంలో ఉందని భావించాను, కూరత్తాళ్వారు పెరియ నంబి కలిసి వారి ప్రాణాలను రక్షిస్తారు. వారి జీవితం ఎన్నిసార్లు ప్రమాదంలో ఉన్నది నాన్నమ్మా?

నాన్నమ్మ: ఎన్నోసార్లు! సమయం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. మొదటిసారి, వారి గురువు యాదవప్రకాశులు వారిని చంపాలని అనుకుంటారు. రామానుజులకు యాదవప్రకాశులకు మధ్య వేదాలలో సూచించిన అర్ధాల గూర్చి అభిప్రాయ భేదాలు ఎల్లప్పుడూ ఉండేవి. యాదవప్రకాశులు వేదాలలో వాక్యాలకు తారుమారు చేసి తప్పుడు అర్ధాలు చెప్పేవారు. అది విన్నప్పుడు రామానుజులకు బాధ కలిగించేది, విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం వారు యదార్థ అర్థాన్ని వివరించేవారు. యాదవప్రకాశులు ఒక అద్వైతి, రామానుజులు ఇచ్చిన వివరణలను అంగీకరించే వారు కాదు. రామానుజులు చెప్పిన వివరణలు అర్ధవంతమైనవి అని వారికి తెలిసినప్పటికిని వారికి పోటీగా భవించే వారు. రామానుజులు వారిని ఆచార్య స్థానం నుండి త్రోసిరాస్తారేమోనని భావించేవారు, కాని రామానుజులకు అలాంటి ఉద్దేశ్యాలు అణు మాత్రం కూడా ఉండేవి కాదు. అలా యాదవప్రకాశుల మనస్సులో రామానుజుల పట్ల అసూయా ద్వేషాలకు దారితీసాయి. యాదవప్రకాశులు వారి శిష్యులతో వారణాసి యాత్రా సమయాన రామానుజులను చంపడానికి పన్నాగం వేస్తారు. ఈ పన్నాగం గురించి తెలిసిన గోవింద పెరుమాళ్ రామానుజులకు తెలియచేస్తారు, ఆ శిష్య బృందంతో యాత్ర కొనసాగించ వద్దని హెచ్చరిస్తారు. వారిని దక్షిణం వైపున వున్న కాంచీపురానికి బయలుదేరితే వారి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెబుతారు. రామానుజులు అదే విధంగా బయలుదేరి వారి గురువు యొక్క హత్యా పన్నాగాన్నితప్పించుకుంటారు. ఇలా, గోవింద పెరుమాళ్ రామానుజుల ప్రాణాలను రక్షిస్తారు.

వ్యాస : నాన్నమ్మా, గోవింద పెరుమాళ్ కూడా యాదవప్రకాశుల శిష్యులేనా?

ఎంబార్ – మధురమంగళం

నాన్నమ్మ: అవును వ్యాస. రామానుజ మరియు గోవింద పెరుమాళ్లు ఇద్దరూ యాదవప్రకాశుల వద్ద విద్య నేర్చుకునేవారు. రామానుజులు తనను తాను రక్షించుకోవడానికి దక్షిణానికి వెళ్ళినప్పటికీ, గోవింద పెరుమాళ్ తనయాత్రను కొనసాగించి, శివభక్తుడై కాళహస్తి అనే స్థలంలో ఉంటూ ఉల్లాంగై కొండ నాయనార్ గా పిలువబడ్డారు. ఇది తెలుసుకున్న రామానుజులు వారి మామగారైన పెరియ తిరుమలై నంబిని, గోవింద పెరుమాళ్ ను సంస్కరించి మన సాంప్రదాయంలోకి తీసుకురమ్మని పంపుతారు. పెరియ తిరుమలై నంబి కాళహస్తికి వెళ్లి గోవింద పెరుమాళ్ ను నమ్మాళ్వార్ పాసురాలు, ఇంకా ఆళవందార్ స్తోత్రరత్నంలోని శ్లోకాలను ఉపయోగించి సంస్కరించేందుకు ప్రయత్నిస్తారు. గోవింద పెరుమాళ్ తన తప్పు తెలుసుకొని మన సాంప్రదాయంలోకి తిరిగివస్తారు. కాబట్టి పిల్లలు, ఆళవందార్ పరమపదం చేరిన తరువాత కూడా, రామానుజులు మాత్రమే కాదు వారి సోదరుడైన గోవింద పెరుమాళ్ ని కూడా మన సాంప్రదాయంలోకి తీసుకురావడానికి సాధనమైనారు.పెరియ తిరుమలై నంబి ఆచార్యులుగా గోవింద పెరుమాళ్‌కు  పంచ సంస్కారం చేస్తారు. పెరియ తిరుమలై నంబి గోవింద పెరుమాళ్ తో తిరుపతికి తిరిగి వస్తారు, గోవింద పెరుమాళ్ వారి ఆచార్య కైంకర్యాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ, మీరు గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. రామానుజులు మరియు పెరియ తిరుమలై నంబి గోవింద పెరుమాళ్ వద్దకు వెళ్లి సంస్కరించారే కానీ గోవింద పెరుమాళ్ వీరి వద్దకు రాలేదు, మీరిది గమనించాలి. ఇలా తమ శిష్యుల శ్రేయస్సు కోసం వారి వద్దకే వెళ్లి, ఆ శిష్యుల బాగుకోసం వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండే ఆచార్యులను కృపా మాత్ర ప్రసన్నాచార్యులు అని పిలుస్తారు. వారు తమ శిష్యులను స్వచ్ఛమైన నిస్వార్థ భావంతో సమీపిస్తారు. గోవింద పెరుమాళ్‌కు రామానుజుల మరియు పెరియ తిరుమలై నంబిలు ఇద్దరూ కృపా మాత్ర ప్రసన్నాచార్యులు.

పరాశర: నాన్నమ్మా, గోవింద పెరుమాళ్ గురించి మాకు మరింత చెప్పండి. వారు ఏ కైంకర్యాలు చేశారు?

నాన్నమ్మ:  గోవింద పెరుమాళ్ వారి ఆచార్యులు పెరియ తిరుమలై నంబి పట్ల చూపించిన ఆచార్య అభిమాన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒకానొక సమయంలో, పెరియ తిరుమలై నంబి పడుకోవటానికి గోవింద పెరుమాళ్ పడక తయారుచేస్తున్నారు, వారి ఆచార్యులకన్నా ముందు ఆ పడకపై వారే పడుకుంటారు. ఈ విషయం గురించి గోవింద పెరుమాళ్‌ని విచారిస్తే, గోవింద పెరుమాళ్ ప్రత్యుత్తరంగా, అలా చేస్తే నరకానికి వెళ్ళినా ఫరవాలేదు కాని ఆచార్యుల పడక సురక్షితంగా సౌకర్యవంతంగా ఉండాలి అని చెబుతారు. ఇది ఆచార్య అభిమానాన్ని చూపిస్తుంది, ఇక్కడ తనను తానూ పట్టించుకోకుండా ఆచార్యుల తిరుమేనిపై శ్రద్ధ ఎక్కువ వహించారు. పెరియ తిరుమలై నంబి నుండి శ్రీ రామాయణ సారాన్ని నేర్చుకోవడానికి రామానుజులు తిరుపతికి వచ్చే సమయం ఆసన్నమైంది. ఒక సంవత్సరం పాటు నంబి నుండి నేర్చుకున్న తరువాత, తిరిగి బయలుదేరే సమయాన, నంబి రామానుజులకు ఏదైనా ఇస్తాను అడగమంటారు. రామానుజులు కైంకర్యం కోసం గోవింద పెరుమాళ్‌ని ఇవ్వమంటే వారు  సంతోషంగా అంగీకరిస్తారు. ఇది తెలుసుకున్న గోవింద పెరుమాళ్ తిరుమలై నంబిని విడిచిపెట్టడానికి  విచారం వ్యక్తం చేస్తారు.

వ్యాస : నాన్నమ్మా, ఎందుకు నంబి గోవింద పెరుమాళ్‌ను ఇస్తారు? వారి ఆచార్యులకు కైంకర్యం చేస్తూ  సంతోషంగా ఉన్నట్లయితే గోవింద పెరుమాళ్ ఎందుకు వదిలి వెళ్ళాలి?

నాన్నమ్మ: వ్యాస, గోవింద పెరుమాళ్ రామానుజుల వద్ద వివిధ కైంకర్యాలు చేస్తూ తద్వారా మన సాంప్రదాయంలో గొప్ప పాత్ర వహించాల్సి ఉంది. తన చిన్ననాటి నుండి, వారు రామానుజుల పట్ల గొప్ప ప్రేమ, అభిమానం కలిగి ఉండేవారు. రామానుజులు పరమపదానికి  చేరుకున్న తరువాత, పరాశర భట్టార్ మరియు రామానుజుల యొక్క ఇతర శిష్యులకు వారు మార్గదర్శిగా ఉంటారు. ఇన్ని బాధ్యతలు, విధులు అతని కోసం ఎదురుచూస్తున్నాయి, అతను తన ఆచార్యులైన పెరియ తిరుమలై నంబిని త్యాగం చేసి, తనకు మార్గదర్శిగా, ఉపదేశకునిగా రామానుజులను స్వీకరించాల్సిందే. తరువాత వారు రామానుజులను తన సర్వస్వంగా స్వీకరించి, రామానుజుల తిరుమేని (దైవ రూపం) యొక్క అందాన్ని వర్ణిస్తూ ఒక పాసురాన్ని వ్రాసారు. దానినే “ఎమ్బెరుమానార్ వడివళగు పాసురం” అని పిలుస్తారు. ముందు మీకు చెప్పినట్టుగా, సాంప్రదాయం విషయానికి వస్తే, మీరు ఉన్నతమైన ఉద్ధరణ కోసం ఏ త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి. గోవింద పెరుమాళ్ కూడా అదే చేశారు.

అత్తులాయ్ :  గోవింద పెరుమాళ్ పెళ్లి చేసుకున్నారా? వారికి పిల్లలు ఉన్నారా?

నాన్నమ్మ: గోవింద పెరుమాళ్ ఎల్లప్పుడూ భగవత్ విషయంలో మునిగి ఉండేవారు. వారు ప్రతి వస్తువులో, ప్రతి ఒక్కరిలో ఎమ్బెరుమాన్ ని చూసేవారు. వారికి వివాహం అయినప్పటికీ, భగవత్ విషయంలో గోవింద్ పెరుమాళ్ యొక్క ఉన్నతమైన స్తితిని చూసి, ఎమ్బెరుమానార్ స్వయంగా గోవింద పెరుమాళ్‌కు సన్యాసాశ్రమ స్వీకారం చేయించి వారికి ఎంబార్ అని పేరునిస్తారు. ఎంబార్ తన ఆఖరి రోజులలో, మన అందమైన శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు నడుపమని పరాశర భట్టార్ని నిర్దేశిస్తారు. ఎమ్బెరుమానార్ యొక్క చరణకమలాల యందు ఎల్లప్పుడూ “ఎమ్బెరుమానార్ తిరువడిగాలే తంజం” అని ధ్యానించమని నిర్దేశిస్తారు. వారి ఆచార్యులైన రామానుజుల యొక్క చరణకమలాలను ధ్యానిస్తూ, ఆచార్యులకు తను చేసిన వాగ్దానాలు నెరవేర్చి, ఎంబార్ తన ఆచార్యుల కైంకర్యం కొనసాగించడానికి పరమపదానికి చేరుకుంటారు. భట్టార్ వారి ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడిచి మచ్చలేని మన సాంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తారు.

వేదవల్లి : నాన్నమ్మా,  భట్టార్ గురించి మరింత చెప్పండి.

నాన్నమ్మ: మీరు మళ్ళీ వచ్చినప్పుడు భట్టార్ గురించి మరింత మీకు చెప్తాను. బయట చీకటి పడుతోంది ఇంటికి వెళ్లండి. గుడికి వెళ్ళడం మర్చిపోకండి ఆళవందార్ తిరునక్షత్రం రేపు.

ఆళవందార్, పెరియ తిరుమలై నంబి, రామానుజులు మరియు ఎంబార్ గురించి ఆలోచిస్తూ పిల్లలు వారి ఇళ్ళకు బయలుదేరారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-embar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – రామానుజులు – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< రామానుజులు – భాగము 1

పరాశర, వ్యాస వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి ఆండాళ్ నాన్నమ్మ ఇంటికి వస్తారు.

పరాశర: నాన్నమ్మ, నిన్న మీరు రామానుజులు మరియు వారి శిష్యుల జీవితం గురించి మాకు చెప్తానని అన్నారు.

నాన్నమ్మ: అవును. వారి శిష్యుల గురించి చెప్పడానికి ముందు, రామానుజుల గురించి ఒక ప్రత్యేక అంశాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. అది రామానుజుల అవతారం గురించి, వారు భౌతికంగా జన్మించుటకు ముందే సుమారు 5000 సంవత్సరాల క్రితం నమ్మాళ్వార్ మధురకవి ఆళ్వార్ కి భవిష్యవాణి చెప్పారు, తరువాత కాలంలో నాథమునులు కూడా  తెలుసుకున్నారు. చరమోపాయ నిర్ణయం అని పిలవబడే గొప్ప గ్రంథం,  పూర్తిగా మన ఎమ్బెరుమానార్ యొక్క కీర్తిని వెల్లడిస్తుంది – ఈ పుస్తకం ఎమ్బెరుమానార్ అవతారాన్నిగురించి నమ్మాళ్వార్ – నాథమునుల సంభాషణను బహిర్గతం చేస్తుంది. ఎమ్బెరుమానార్ యొక్క దైవ స్వరూపం నమ్మాళ్వార్ చేత మధురకవి ఆళ్వారికి  సమర్పించబడిన విగ్రహం, ఆళ్వార్ తిరునగరిలో భవిష్యదాచార్య సన్నిధిలో ఇప్పటికీ పూజింపబడుతుంది.

రామానుజ – ఆళ్వార్ తిరునగరి

వ్యాస: ఓ! అయితే, ఆళ్వారులకు, కొంతమంది ఆచార్యులకు వారి జన్మ వివరాల గురించి ముందే తెలుసు. చాలా గొప్పగా ఉంది నాన్నమ్మా. వారి చరిత్రను మీరు చెప్పడం కొనసాగించండి.

నాన్నమ్మ: సరే, రామానుజులు మన దేశం యొక్క అన్ని దిశలా ప్రయాణించి వైష్ణవ తత్వశాస్త్రాన్ని ప్రచారం చేశారు. కొన్నిసార్లు సునాయాసంగా ప్రచారం చేసినా అనేక సార్లు ఎదుటివారి నుండి చాలా ప్రతిఘటన వచ్చింది, కానీ రామానుజులు తన జ్ఞానంతో మరియు ఆప్యాయతతో  ప్రజల మెప్పు పొందేవారు. వారు కాంచీపురంలో ఉన్నప్పుడు, వారి వివాహం తంజమ్మాళ్ తో జరిగింది, కానీ తరువాత  దేవపెరుమాళ్ ద్వారా సన్యాసాశ్రమం స్వీకరించారు. రామానుజులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినపుడు, ఒక్క తన మేనల్లుడైన ముదలియాణ్డాన్ ను తప్ప, వారు జీవితంలో అన్నిటిని త్యాగం చేస్తానని ప్రమాణం చేస్తారు.

వ్యాస: నాన్నమ్మా, ఎందుకు వారు వివాహం చేసుకున్న తరువాత సన్యాసాశ్రమం స్వీకరించారు? ఎందుకు వారు వివాహితులుగానే ఉండి ఆ కైంకర్యాలు చేయలేదు?

నాన్నమ్మ: వ్యాస, దీనికి అనేక కారణాలున్నాయి. ఒకటి, వారికి, వారి భార్యకు మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉండటం వలన, రెండు, కొన్ని గొప్ప కార్యాల కోసం కొన్ని త్యాగాలు చేయాలి, తప్పదు. వైష్ణవ సిద్ధాంతాన్ని మన దేశం నలుమూలలా ప్రచారం చేసే బాధ్యత వారి భుజంఫై ఉందని మనకందరికీ తెలిసు. ఉదాహరణకు, మన సైనికులు దేశ సరిహద్దులకు భద్రత కల్పించడం కోసం, వారి కుటుంబాలు,  వారి ప్రియమైన వారిని విడిచి ఉంటారు, ఎందుకంటే అది వారి బాధ్యత కాబట్టి. అదేవిధంగా, రామానుజుల మనస్సులో గొప్ప సంకల్పం ఉంది. వారి ఉద్దేశ్యం వేదంలోని నిజమైన సారాంశాన్ని ఉద్దరించడం అని వారికి తెలుసు . అందువల్ల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. వారు జీయర్ కాగానే, ముదలియాణ్డాన్ మరియు కూరత్తాళ్వార్ వంటి గొప్ప విద్వాంసులు రామానుజుల శిష్యులయ్యారు.

అత్తుళాయ్ : ఇంత పెద్ద బాధ్యతను చేపట్టడం ఒక భారం కాదా? ఎలా రామానుజులు అన్ని ఒంటరిగా చేశారు?

నాన్నమ్మ: కాదు అత్తుళాయ్! ఇది ఒక భారం కానే కాదు. మీరు మీ పని పట్ల మక్కువగా ఉన్నప్పుడు, అది భారంగా ఉండదు. అంతేకాక, రామానుజులు ఒంటరిగా ఎప్పుడూ లేరు. వారు ఎల్లప్పుడూ ముదలియాణ్డాన్, కూరత్తాళ్వార్, ఎంబార్, అనంతాళ్వార్, కిడాంబి అచ్చాన్, వడుగ నంబి, పిళ్ళై ఉరంగవిల్లి దాసు మొదలగు గొప్ప శిష్యులు రాత్రింబవళ్ళు వారిని చూసుకున్నారు. వీరు ఈ దిగ్విజయయాత్రలో పూర్హిగా రామానుజులతో పాటుగా వున్నారు. రామానుజులను దెబ్బతీయడానికి హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. అలాంటి సందర్భాలలో, ఎంబార్ మరియు కూరత్తాళ్వార్ వంటి శిష్యులు తమ ఆచార్యుని రక్షించటానికి వారి ప్రాణాలన్నే పణంగా పెట్టారు. కూరత్తాళ్వార్, పెరియ నంబి శైవ చక్రవర్తి దర్బారుకి వెళ్లి వారి కంటిచూపును ఎలా కోల్పోయారో మీఅందరికి తెలుసు? చుట్టూ అటువంటి గొప్ప శిష్యులతో కూడి, అనేక దేవాలయాలలో సరైన ఆలయ వ్యవస్తని పునః స్థాపించడంలో రామానుజులు గొప్ప శ్రద్ధ తీసుకున్నారు.

రామానుజ – శ్రీరంగం

వేదవల్లి: అవును నాన్నమ్మా,  శ్రీరంగం, తిరుపతి వంటి అనేక దేవాలయాల్లో ఆలయ నియమాలు, ఆచారాలు అన్నింటినీ రామానుజులు స్థాపించారని నేను విన్నాను. దీని గురించి మాకు మరింత వివరంగా చెప్పగలరా?

నాన్నమ్మ: నిజమే వేదవల్లి. వారు కేవలం వేదాలలో పేర్కొన్న ఆచారాలను తిరిగి అమలు చేసారు. వారు ఆచారాలన్ని అమలు చేసి, వాటిని స్థాపించడంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. శ్రీరంగంలో, ఆ ఆలయాన్ని పెరియ కోయిల్ నంబి అనే పేరుతో ఒకరు సంరక్షించేవారు. ముందు నేను చెప్పినట్లుగా, ఆలయం పరిపాలనలో అవసరమైన మార్పులు చేయుటకు రామానుజులు పెరియ కోయిల్ నంబి యొక్క తక్షణ ఆమోదం పొందలేదు. శ్రీ వైష్ణవ సాంప్రదాయం గురించి పెరియ కోయిల్ నంబికి అవగాహన కల్పించడం కోసం మరియు ఆలయ పరిపాలనలో మార్పుల కోసం రామానుజులు కూరత్తాళ్వారుని పంపాల్సి వచ్చింది. పెరియ కోయిల్ నంబి కూరత్తాళ్వారి మార్గనిర్దేశం తర్వాత, రామానుజులుకు వారు శరణాగతులై  తరువాత తిరువరంగత్తు అముదనార్ అనే పేరుతో పిలువబడ్డారు . తరువాత వారు రామానుజులను ప్రశంశిస్తు రామానుజ నూత్తందాది వ్రాశారు. తిరుమల వేంకటేశ్వరుడు విష్ణుమూర్తిగా గుర్తించబడింది రామానుజుల చేతనే, ఇతర వర్గాల వారు వేరుగా ప్రతిపాదనలు చేశారని మీకు తెలుసా?

రామానుజ – తిరుపతి

పరాశర: ఏమిటి? వేంకటేశ్వర స్వామి ఎవరో కాదు సాక్షాత్ విష్ణు భగవానుడేనని మనందరికీ తెలుసు. నీకు ఆ విషయం పైన ఎప్పటినుంచి సందేహం ఉంది?

నాన్నమ్మ: అవును! తిరుమల వేంకటేశ్వర స్వామి స్వయంగా విష్ణుమూర్తియే. కానీ కొందరు వారిని వేరుగా చెప్పుకున్నారు. కొందరు ఆయన రుద్రుడని అన్నారు, మరి కొంతమంది ఆయన స్కంధుడని పేర్కొన్నారు. అటువంటి ఆరోపణలను విన్న తరువాత రామానుజులు తిరుపతికి వెళ్లారు. ఈ సంఘటనల పట్ల వారు అసంతృప్తిని వ్యక్తపరిచి, వేంకటేశ్వర స్వామి గుర్తింపుపై సత్యాన్ని స్థాపించారు, వారు శంఖ చక్రాలతో స్వయంగా శ్రీమన్ నారాయణుడే అన్న సత్యాన్ని స్థాపించారు. అలా తిరుపతిలో, ఆలయం ఆచారాలను స్థాపించటంతో పాటు రామానుజులు ఇంకొంచం ఎక్కువగా వారు వెంకటేశ్వర స్వామి యొక్క గుర్తింపునే స్థాపించారు. అందువల్ల, రామానుజులు తిరువేంకటముడయాన్ యొక్క ఆచార్యులుగా ప్రశంసించ బడ్డారు. ఇక్కడ, రామానుజులు రామాయణం యొక్క సారాంశాన్ని వారి మేన  మామయ్య పెరియ తిరుమలై నంబి నుండి నేర్చుకున్నారు. వారు ఇతర దేవాలయాలలో ఆలయ విధులు స్థాపించిగా వాటిలో తిరునారాయణపురం ఆలయం ప్రముఖమైనది.

రామానుజ – తిరునారాయణ పురం

అత్తుళాయ్: నాన్నమ్మా,  ఆ రోజుల్లో మేల్కొటె  జైనులు, రామానుజులకు సమస్యలను సృష్టించారని విన్నాను.

వ్యాస: తిరునారాయణపురం ఆలయ పెరుమాళ్ ముస్లిం ఆక్రమణదారులచే దొంగిలించబడ్డారని కూడా విన్నాను.

నాన్నమ్మ: అవును, అది నిజం. రామానుజులు దేవాలయాల యొక్క బాగు కోసం మరియు మన సాంప్రదాయ సంస్కరణలను తీసుకువచ్చేటప్పుడు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే, మార్పు మంచిదైనా చాలామంది స్వాగతించరు. ప్రతి ఒక్కరూ పాత ఆచారాలే సురక్షితంగా భావిస్తారు, సరియైనా కాకపోయినా మార్పును వారు అంగీకరించరు, చాలా అవసరమైన మార్పు తీసుకురావాలనే వ్యక్తిని స్వాగతించరు. ఇది సమాజంలో సాధారణ వైఖరి. ఈకాలంలో మార్పు చాలా కష్టం, 1000 సంవత్సరాల క్రితం ఊహించండి, ఆచారాలు మరియు నమ్మకాలు దృఢంగా ఉన్నప్పుడు, రామానుజులు సానుకూల ఫలితాన్ని తీసుకురావడానికి ముందు చాలా ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చింది. జైన పండితులు విశిష్టాద్వైత తత్వశాస్త్రం యొక్క శాశ్వత నిజాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. 1000 జైన మేధావులు ఏకకాలంలో తమ 1000 ప్రశ్నలకు రామానుజులు సమాధానమివ్వాలని సవాలు చేసారు. రామానుజులు వారి అసలు రూపంతో – ఆదిశేషునిలాగా 1000 పడగలతో ఏకకాలంలో వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి  తద్వారా చర్చలో గెలుపు పొందుతారు .

తిరునారాయణపురం ఆలయ ఉత్సవ మూర్తియైన సెల్వప్పిళ్ళై, ముస్లిం ఆక్రమణదారులచే దొంగిలించబడి ఆ ఆక్రమణదారుల కుమార్తె యొక్క గృహంలో ఉంటుంది , ఆమె సెల్వప్పిళ్ళై పట్ల ప్రేమతో ఆప్యాయతతో ఉండేది. సెల్వప్పిళ్ళైను రక్షించడానికి రామానుజులు వచ్చినప్పుడు, ఆమె  సెల్వప్పిళ్ళై విరహాన్ని భరించలేకపోయింది.

అత్తుళాయ్: ఎలాగైతే ఆండాళ్ కృష్ణుని విరహాన్ని భరించలేకపోయింది, అలాగ!

నాన్నమ్మ: అవును, సరిగ్గా ఆండాళ్ లాగానే. ముస్లిం ఆక్రమణదారుల కుమార్తె సెల్వప్పిళ్ళైను రామానుజులతో పంపే ఆలోచనను భరించలేకపోయింది. చివరికి, రామానుజులు ముస్లిం రాజు కుమార్తె మరియు సెల్వప్పిళ్ళైల  యొక్క వివాహం చేస్తారు. నిజమైన భక్తి మతానికి మించినది అని ఇక్కడ నిరూపించబడింది.

కూరత్తాల్వారు – రామానుజ – ముదలియాన్డాన్

వ్యాస: నాన్నమ్మా, ఎలా రామానుజులు ఆళవందార్ 3 కోరికలను నేరవేరుస్తారో మీరు చెప్పలేదు .

నాన్నమ్మ: ఇద్దరు పిల్లలతో కూరత్తాళ్వార్ దీవించబడ్డారు. రామానుజులు వారిద్దరికి వ్యాస మరియు పరాశరగా నామకరణం చేసి తద్వారా ఇద్దరు ఋషుల గొప్పతనాన్ని గుర్తించి ఆళవందార్ మొట్టమొదటి వాగ్దానాన్ని నెరవేర్చారు. ఎంబార్ గా పిలువబడే గోవింద భట్టార్ కి, సిరియ గోవింద పెరుమాళ్ అని పిలవబడే ఒక చిన్న సోదరుడు ఉండేవారు, అతని కుమారుడికి నమ్మాళ్వార్ మరో పేరైన పరాంకుశనంబిగా నామకరణం చేసి, తద్వారా రెండవ వాగ్దానం నెరవేర్చారు. చివరకు, వారు మూడవ వాగ్దానాన్ని నెరవేర్చడానికి శ్రీ భాష్యాన్ని రాశారు. శ్రీ భాష్యాన్ని రాయడానికి, రామానుజులు కూరత్తాళ్వార్  తో కష్మీరుకి వెళతారు.

వేదవల్లి: కష్మీరులో ఏమి జరిగింది?

నాన్నమ్మ: శ్రీ భాష్యాన్ని వ్రాయడానికి గతంలో వ్రాసిన గ్రంథం పొందడానికి రామానుజులు కష్మీర్కి వెళతారు. వారు ఆ గ్రంథాన్ని పొందిన తరువాత , అక్కడ ఉన్న కొంతమంది దుష్టులు, రామానుజులు తన సొంత ప్రయోజనం కోసం తమ సంగ్రహాలయం నుండి వారి గ్రంథాన్ని తీసుకువెళ్తున్నారను కొని, ఆ ఆలోచనను భరించలేక వారు రామానుజులను అనుసరిస్తూ, ఆ గ్రంథాన్ని రామానుజుల దగ్గర నుండి  లాగేసుకుంటారు.

వ్యాస: ఎంత దారుణం!

నాన్నమ్మ: అవును! అయినప్పటికీ, ఆ దుష్టుల చేతులు ఆ గ్రంథంపై పడే ముందే, కూరత్తాళ్వార్ సంపూర్ణ గ్రంథాన్ని, రచనకు అవసరమైన విషయాలను కంఠస్తం చేసేసుకుంటారు.

వ్యాస: మొత్తం గ్రంథం కంఠస్తం చేసుకున్నారా? అది ఎలా సాధ్యమవుతుంది నాన్నమ్మా? నేను కూడా నా పాఠ్య పుస్తకాలను అలా కంఠస్తం చేసుకుంటే ఎంత బాగుండో!

నాన్నమ్మ (నవ్వుతూ): కూరత్తాళ్వార్ రామానుజులకు కేవలం శిష్యులే కాదు, వారు రామానుజులకు ఒక గొప్ప వరం. రామానుజుల అనుబంధంతో ప్రతి ఒక్కరూ ఉద్ధరింప బడుతూ ఉంటే, వారు తన సహచరుడైన కూరత్తాళ్వార్ తో ఉద్ధరింపబడ్డారని రామానుజులు స్వయంగా చెప్పారు. అటువంటి ఒక గొప్ప విద్వాంసుడైనప్పటికీ, రామానుజుల నివాసమైన కూరత్తాళ్వార్ స్వచ్ఛమైన హృదయంలోకి  అహంకారం కొంచం కూడా రాలేదు. కూరత్తాళ్వార్ సహాయంతో, శ్రీ భాష్యం రచన పూర్తిచేసి తద్వారా ఆళవందార్కు చేసిన చివరి వాగ్దానాన్ని కుడా నెరవేర్చారు. శ్రీరంగాన్ని పాలిస్తున్న శైవ రాజు మరణించిన తరువాత, రామానుజులు శ్రీరంగానికి తిరిగివస్తారు.

చివరగా, ఈ ప్రపంచాన్ని వదిలి పరమపదానికి చేరుకోవడానికి ముందు, రామానుజులు తన తదుపరి మన సాంప్రదాయాన్ని నడుపుటకు కూరత్తాళ్వార్ కుమారుడైన పరాశర భట్టార్ని ఆచార్యునిగా నిర్ణయిస్తారు. భట్టార్ మరియు ఇతర శిష్యులకు ఎంబార్ ని ఆశ్రయించి వారి మార్గదర్శకత్వంలో నేర్చుకోమని నిర్దేశిస్తారు. వారు తన శిష్యులందరికీ తనతో వారందరూ ఎలా వ్యవహరించారో అదేవిధంగా భట్టార్తో కూడా వ్యవహరించాలని నిర్దేశిస్తారు. సాంప్రదాయంలోకి  రామానుజులను తీసుకురావటానికి ఆళవందారు పెరియ నంబిని నియమించిన మాదిరిగా, రామానుజులు నంజీయర్ను సాంప్రదాయంలోకి తీసుకురామని భట్టార్ కి  చెబుతారు. ఎమ్బెరుమానార్ వారి ఆచార్యులైన పెరియ నంబి మరియు ఆళవందార్ని ధ్యానిస్తూ ఈ ప్రపంచాన్ని వదిలి శ్రీమన్నరాయణుని నిత్య నివాసంలో తన కైంకర్యాన్ని కొనసాగించడానికి పరమపదానికి చేరుకుంటారు. రామానుజుల విరహం భరించలేక త్వరలో ఎంబార్ కూడా పరమపదాన్ని అధిరోహిస్తారు.

పరాశర: నాన్నమ్మా, రామానుజుల యొక్క శరీరం ఇప్పటికీ శ్రీరంగం లో సంరక్షించబడినది అని విన్నాను. అది నిజమా?

నాన్నమ్మ: అవును పరాశర, అది నిజం, మనం గొప్ప ఆచార్యుల గురించి మాట్లాడేటప్పుడు, తిరుమేని అని అంటాం, ఎలాగైతే  గౌరవంతో పెరుమాళ్‌ని సంబోధిస్తామో అలాగే. శ్రీరంగం ఆలయం లోపల రామానుజుల సన్నిధి క్రింద తిరుమేనిని భద్ర పరిచారన్నది నిజం. ఈ రోజు మనం చూస్తున్న  రామానుజుల సన్నిధి ఒక సమయంలో శ్రీరంగనాథుని వసంత మండపంగా ఉండేది. ఇప్పుడు, మనం రామానుజుల చరణారవిందములకు మరియు శ్రీరంగనాథునికి, మన ఆచార్యుల గురించి వారి కీర్తిప్రతిష్టల గురించి మరింత తెలుసుకోవడానికి మనకు ఆసక్తిని మరియు ప్రమేయంని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఇప్పటికే ఆలస్యమైయింది మీరు అందరూ ఇంటికి వెళ్ళండి. మళ్ళీ కలుసుకున్నప్పుడు రామానుజుల శిష్యుల గురించి వారి కీర్తిప్రతిష్టల గురించి మరియు రామానుజుల ఈ విజయయాత్రలో వారి సహకారం గురించి చెబుతాను .

పిల్లలు రామానుజుల గురించి, వారి వివిధ కైంకర్యాలు, వారు ఎదుర్కొన్న అనేక ఇబ్బందుల గురించి  మరియు వారు మన సాంప్రదాయపు గొప్ప ఆచార్యులుగా ఎలా ఉద్భవించారో ఆలోచిస్తూ వారి ఇంటికి వెళ్ళారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-ramanujar-2/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – రామానుజులు – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళవన్దారుల శిష్యులు – భాగము 2

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తులాయ్,  ఆండాల్ నాన్నమ్మ ఇంటికి వస్తారు .

నాన్నమ్మ: పిల్లలూ! స్వాగతం. మీ చేతులు కాళ్ళు కడుక్కోండి. ఇక్కడ ఆలయంలో తిరుఆదిపురం ఉత్సవం జరిగింది, ఈ ప్రసాదం తీసుకోండి. ఈవేళ, మనం ఆండాల్ పిరాట్టికి ప్రియమైన వారి గురించి చర్చను ప్రారంభించబోతున్నాము, ఆమె తన సొంత సోదరుడిగా పిలిచేవారు. ఎవరో ఊహించగలరా?

వ్యాస: లేదు నాన్నమ్మా,  ఆండాల్ పిరాట్టి సోదరుడు ఎవరు నాన్నమ్మా? ఆండాల్ కి సోదరుడు ఉన్నాడా?

నాన్నమ్మ:  అవును, పుట్టుకతో కాదు కాని, ప్రేమ మరియు అనురాగంచేత అతను ఆమెకు సోదరుడు. వారిని గోదాగ్రజా లేదా కోయిల్ అన్నన్ అని పిలిచేవారు, వారు ఎవరో కాదు మన రామానుజులే! అగ్రజ  అంటే సంస్కృతంలో అన్నయ్య అని అర్థం.రామానుజులు ఆండాల్ (గోదాదేవి) చేత తన సోదరుడిగా పరిగణించబడ్డారు కాబట్టి వారు గోదాగ్రజా అని పిలువబడ్డారు. ఇళైయాళ్వారు శ్రీపెరంబుదూర్‌లో కేశవ దీక్షితులు మరియు కాంతిమతి అమ్మగారికి జన్మించారు. వారు స్వయంగా ఆదిశేషుని యొక్క అవతారం. వారు తిరువల్లిక్కేని పార్థసారథి పెరుమాళ్ యొక్క దయతో జన్మించారు.

ఉభయ నాచియార్లతో  పార్థసారథి మరియు ఉడైయవరులు – తిరువల్లిక్కేని

పరాశర: నాన్నమ్మా! ఆండాల్, రామానుజులకన్నా చాలా ముందుకాలంలో జన్మించలేదా? అప్పుడు వారెలా అన్నయ్య అవుతారు?

నాన్నమ్మ:  మంచి ప్రశ్న పరాశర. ముందు నేను చెప్పినట్లు, వారు పుట్టుకతో కాదు కానీ వారి ఆచరణతో సోదరుడైయ్యాడు. గోదాదేవి, పెరుమాళ్ పై పవిత్రమైన ప్రేమతో 100 గంగాళాల పాయసాన్నిఇంకా 100 గంగాళాల వెన్నను తిరుమాలిరుంచోలై అళగర్ పెరుమాళ్ కు నైవేద్య నివేదన చేస్తానని సంకల్పిస్తారు. కానీ, ఆమె చిన్నపిల్లగా ఉండటం వలన, ఆచరణాత్మకంగా సాధ్యం కాలేదు. రామానుజులు నాచ్చియార్ తిరుమొళి పాశురం చదవి, గోదాదేవియొక్క కోరికను గ్రహించి, ఈ నైవేద్య సమర్పణను తానే జరపాలనుకుంటారు. రామానుజులు ఆండాలమ్మ తరపున 100 గంగాళాల పాయసాన్న, 100 గంగాళాల వెన్నను తిరుమాలిరుంచోలై అళగర్ పెరుమాళుకు నైవేద్య నివేదన చేస్తారు. వారు నివేదన పూర్తిచేసి,  శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నప్పుడు, ఆండాల్ అతన్ని స్వాగతించి, వారిని కోయిల్ (శ్రీరంగం) నుండి వచ్చిన అన్నయ్యా (అన్నన్) అని పిలుస్తుంది, ఆ కారణంగా కోయిల్ అన్నన్ అనే పేరు వచ్చింది. వారిని ఆమె అన్నగా పిలుస్తారు ఎందుకంటే ఒక అన్న ఎప్పుడూ తన సోదరి కోరికలను నెరవేరుస్తారు కాబట్టి.

అత్తులాయ్, తిరుప్పావై నుండి కొన్ని పాసురములను నువ్వు చదవగలవా? మీ పాఠశాల ఫాన్సీ డ్రెస్సు పోటీలో నువ్వు ఆండాల్ గా వేషం వేసుకొని పాసురాలు పాడావని నాకు గుర్తుంది.

నాన్నమ్మ:  నేను ఈ రోజు ఎందుకు చదవమంటున్నానో తెలుసా? ఎందుకంటే, రామానుజులను తిరుప్పావై జీయర్ అని కూడా పిలుస్తారు. వారు ప్రతిరోజు తిరుప్పావై పఠించేవారు.  తిరుప్పావై గొప్ప విద్వాంసులైన రామానుజుల హృదయానికి దగ్గరగా ఉండేది, వారు ప్రతిరోజు తిరుప్పావై పఠించేవారు. ఎందుకో మీకు తెలుసా?

వేదవల్లి: తిరుప్పావైని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. నాకు మొత్తం 30 పాసురాలు వచ్చు!

నాన్నమ్మ (చిరునవ్వు తో):  చాలా మంచిది వేదవల్లి. తిరుప్పావై నేర్చుకోవడం సులభమేమీ కాదు, ఇంకా ఆ 30 పాసురాలలో మన సాంప్రదాయం యొక్క సారాంశం మొత్తం నిమిడి ఉంది. ఇది వేదంలోని విస్తృత జ్ఞానానికి సమానంగా భావిస్తారు. అందుకే అది “వేదం అనైత్తుక్కుం విత్తాగుం” అని పిలువబడుతుంది – ఈ 30 పాసురాలలో మొత్తం 4 వేదాల నిగూఢమైన సారాంశం ఇమిడి ఉంది.

అత్తులాయ్: నాన్నమ్మా, రామానుజులకు చాలా పేర్లు ఉన్నట్లున్నాయి. మొదట, మీరు ఇళైయాళ్వార్ అని అన్నారు, ఇప్పుడు కోయిల్ అన్నన్ మరియు తిరుప్పావై జీయర్ అని అంటున్నారు!

నాన్నమ్మ: అవును. వారికి ఆ పేర్లన్నీ వారి ఆచార్యులు, ఆండాళ్ మరియు ఎమ్బెరుమాన్ ద్వారా ప్రేమతో ఇవ్వబడినవి. ఇప్పటివరకు మీరు రామానుజులయొక్క ఆచార్యులను మరియు రామానుజుల జీవితంలో ఆ ఆచార్యుల సహకారాలను చూశారు.ఇప్పుడు రామానుజుల యొక్క వివిధ పేర్లను మరియు వారికి ఆ పేర్లన్నీ ఎవరు ఇచ్చారో కూడా చూద్దాము.

 • ఇళైయాళ్వార్ అని తిరుమలై నంబి (రామానుజులకు మేన మామయ్య) ఇచ్చిన పుట్టిన పేరు.
 • శ్రీరామానుజ అని మధురాంతగంలో పంచ సంస్కార సమయంలో పెరియ నంబి వారిచే ఇవ్వబడింది.
 • యతిరాజ మరియు రామానుజముని అని రామానుజులకు వారి సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించు సమయాన దేవ పెరుమాళ్ చేత ఇవ్వబడింది.
 • ప్రపంచంలోని అన్ని సంపత్తులు ఇప్పుడు రామానుజుల వారి ఆధీనములో ఉన్నట్టు ఉడయవర్ అని స్వయంగా నంపెరుమాళ్ ఆ పేరును ఇచ్చారు.
 • లక్ష్మణముని అన్న పేరు తిరువరంగ పెరుమాళ్ అరయర్ వారు ఇచ్చారు.
 • తిరుక్కోష్టిఊర్ లో అక్కడ ఉన్న జనులచేత శరణాగతి చేయించి మన సాంప్రదాయానికి రామానుజులు గొప్ప అర్ధాన్ని తెచ్చినందుకు తిరుక్కోష్టిఊర్ నంబి చేత ఎమ్బెరుమానార్ అని పేరు ఇవ్వబడింది. తిరుక్కోష్టిఊర్ నంబి “రామానుజుల కరుణా భావానికి చాలా ఆకర్షితుడై,” మీరు ఎంబెరుమాన్ కన్నా కరుణామయులు, అందుకే ఎమ్బెరుమానార్ అనే పేరు వచ్చింది అన్నారు.
 • శఠకోపన్ పొన్నడి అని తిరుమలై ఆండాన్ వారి చేత ఇవ్వబడింది.
 • ఆండాళ్ చేత కోయిల్ అన్నన్ అని పిలువబడ్డారు.
 • శ్రీ భాష్యకారర్ అని కాష్మీర్లో సరస్వతి దేవి ఇచ్చిన పేరు.
 • భూతపురిసర్ అని శ్రీపెరుంబుదూర్ లో ఆదికేశవపెరుమాళ్ ఇచ్చారు.
 • దేశికేంద్ర అని మన తిరుమల శ్రీవేంకటేశ్వరుడు ప్రసాదించిన పేరు.

కాబట్టి, మొత్తంమీద, రామానుజులు చాలామంది ఆచార్యులను కలిగి ఉండేవారు. రామానుజులను వారందరూ జాగ్రత్తగా చూసుకుంటూ మరియు జ్ఞానబోధ చేస్తూ, ఆళవందార్ తరువాత మన సాంప్రదాయం ముందుకు సాగేవిధంగా జాగ్రత్తపడ్డారు. ఆళవందార్ ఆశీర్వాదాలతో వారు మొట్టమొదట తిరుక్కచ్చి నంబి ద్వారా శ్రీవైష్ణవంలోకి తీసుకురాబడ్డారు. పంచ సంస్కారము పెరియ నంబి చేత తీసుకొని, తిరుమలై ఆండాన్ ద్వారా పూర్తిగా తిరువాయిమోళి యొక్క సారాన్ని నేర్చుకున్నారు, తిరువరంగ పెరుమాళ్ అరైయర్ నుండి మన సాంప్రదాయం యొక్క సారాన్ని నేర్చుకొని, చరమశ్లోక సారాన్ని తిరుక్కోష్టిఊర్ నంబి నుండి నేర్చుకొని, చివరకు తన మేనమామ పెరియ తిరుమలై నంబి ద్వారా శ్రీరామాయణం యొక్క పూర్తి అర్ధం తెలుసుకున్నారు. అలా, ఆళవందార్ యొక్క ఆరుగురు గొప్ప శిష్యులు వారి ఆచార్యుని పట్ల వారి బాధ్యతను నెరవేర్చుకున్నారు.

రామానుజ – శ్రీ పెరుంబుదూరు

వేదవల్లి: నాన్నమ్మా, ఆవందార్ గురించి మాట్లాడేటప్పుడు, మీరు రామానుజులు వారి శిష్యులు కాలేదు కానీ వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశారని చెప్పారు. అవి ఏంటి నాన్నమ్మా? ఆవందార్ల మనసులోని సంకల్పం రామానుజులు ఎలా తెలుసుకున్నారు?

నాన్నమ్మ: చాలా మంచి ప్రశ్న. ఆవందార్ రామానుజులను శ్రీరంగానికి తీసుకురమ్మని పెరియ నంబిని  అడిగినప్పుడు, పెరియ నంబి కాంచిపురానికి బయలుదేరుతారు. పెరియ నంబి రామానుజులను శ్రీరంగానికి తీసుకువచ్చే సమయానికి , ఆవందార్లు ఈ ప్రపంచాన్ని విడిచి పరమపదం చేరుకుంటారు. శ్రీరంగం చేరుకున్న తరువాత, పెరియ నంబి మరియు రామానుజులు జరిగినది తెలుసుకుంటారు. ఆలవందారు యొక్క తిరుమేనిని (దైవ రూపం) రామానుజులు చూసినపుడు, వారి ఒక చేతి మూడు వేళ్లు ముడుచుకొని ఉండటం గమనిస్తారు. ఆవందార్ శిష్యులను అడిగినప్పుడు,  ఆవందార్లకు కొన్ని నెరవేరని కోరికలు ఉన్నాయని చెప్తారు. రామానుజులు వెంటనే ప్రమాణం చేస్తారు:

 • వ్యాస మరియు పరాశార ఋషుల పట్ల వారి కృతజ్ఞతలను నిరూపించుట.
 • వారి జీవిత కాలంలో నమ్మాళ్వారి పట్ల ప్రేమ కృతజ్ఞతలను చూపించుట.
 • వ్యాస బ్రహ్మ సూత్రాలపైన భాష్యం వ్రాయుట, తరువాత కాలంలో అది శ్రీభాష్యంగా పిలువబడింది, కూరత్తాళ్వారి సహాయంతో రామానుజుల చేత లిఖించబడింది. ఈ కార్య నిర్వహణకోసం కూరత్తాళ్వారులతో వారు స్వయంగా కాష్మీరుకి ప్రయాణం చేస్తారు.

రామానుజులచేత ఈ 3 ప్రమాణాలు తీసుకోగానే ఆవందార్ మూడు వేళ్ళు తెరుచుకుంటాయి. ఈ సంఘటనను చూచిన అందరు శిష్యులు ఆశ్చర్యపడతారు మరియు రామానుజులను పొగడ్తలతో నింపి మరియు మన సాంప్రదాయానికి  తదుపరి ఆచార్యులుగా కీర్తిస్తారు. కాని, ఎమ్బెరుమానార్ ఆవందార్ పరమద దుఃఖంతో  శ్రీరంగంలోని  శ్రీరంగనాథుని సేవించకుండానే కాంచిపురానికి వెళ్ళిపోతారు.

వ్యాస: కానీ నాన్నమ్మా, రామానుజుల ప్రతిజ్ఞతో ఆవందార్ యొక్క వేళ్లు ఎలా ఆవిధంగా ప్రతిస్పందించాయి?

నాన్నమ్మ: వ్యాస, రామానుజులు మరియు ఆవందార్ ల సంబంధం ఇంద్రియాలకు అతీతమైనది.  మనస్సు, ఆత్మ ద్వారా కట్టుబడి ఉన్న సంబంధం వారిది. ఆవందార్ లు వారి 3 కోరికలు ఏమిటో  చెప్పారా? అయినప్పటికీ, ఆవందార్ ల సంకల్పం ప్రకారం రామానుజులు ప్రమాణం చేశారు. ఇది ఎలా జరగినట్టు? వ్యాస, ఇటువంటి సంబంధాలు ఉనికిలో ఇంకా ఉన్నాయి. ఎలాగైతే రామానుజులు యొక్క మనస్సులో వేలాడుతున్న సందేహాలు వారు స్వయంగా అడగకుండానే దేవపెరుమాళ్            రామానుజులకు స్పష్టం చేశారో, అలాగే. ఇలాంటి సంబంధాలు ఆత్మసంబంధాలు, శరీరానికి సంబంధించినవి కావు. ఆవందార్ రామానుజుల మధ్య సంబంధం కూడా అటువంటిదే.

ఇంతకాలంగా మనం రామానుజులు వారి వివిధ ఆచార్యుల గురించి ప్రతి విషయం చూశాము. రేపు నేను  రామానుజులు ఎలా గొప్ప నాయకుడైయ్యారో మరియు ఎలా ఈ ప్రయాణంలో వారికి అనేక మంది శిష్యులయ్యారో చెబుతాను.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-ramanujar-1/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఆళవన్దారుల శిష్యులు – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళవన్దారుల శిష్యులు – భాగము 1

తిరుక్కోష్టిఊర్ నంబి, తిరుక్కచ్చి నంబి మరియు మారనేరి నంబి

 tirukkachinambi

పరాశర మరియు వ్యాస ఆండాళ్ నాన్నమ్మ ఇంటికి వస్తారు. వాళ్ళ స్నేహితులైన వేదవల్లి, అత్తుళాయ్ మరియు శ్రీవత్సాంకన్ తో కలిసి వస్తారు.

నాన్నమ్మ నవ్వుతూ : పిల్లలూ రండి. వ్యాస, నిన్ననేను చెప్పినందుకు నీ స్నేహితులందరినీ తీసుకువచ్చి నట్లున్నావు.

వ్యాస: అవును నాన్నమ్మా, నేను నాతో పాటుగా పరాశర, రామానుజులు ఇంకా వారి ఆచార్యుల కథలు శ్రీవత్సాంకన్ కి చెప్పాము. అతను మీ నుండి ఇంకా వినాలని ఈవాళ మాతోపాటు వచ్చాడు.

నాన్నమ్మ:  చాలా బాగుంది. రండి కూర్చోండి. ఈ రోజు సాంప్రదాయంలో చాలా ప్రత్యేక స్థానం కలిగిఉన్న తిరుక్కచ్చి నంబి మరియు తిరుక్కోష్టిఊర్ నంబి గురించి మీకు చెప్తాను.

శ్రీవత్సాంకన్: నాన్నమ్మా, తిరుక్కచ్చి నంబి, శ్రీపెరుంబుదూరు మార్గంలో చెన్నై సమీపంలో ఉన్న పూవిరుంతవల్లి అనే ప్రదేశంలో జన్మించారు. వేసవి సెలవుల్లో  గత సంవత్సరం మేము ఆ ఆలయానికి వెళ్ళాము.

నాన్నమ్మ: అద్భుతం. వారు దేవ పెరుమాళ్ కు తన వింజామర సేవ మరియు నిత్యం పెరుమాళ్ తో వారి సంభాషణలకు బాగా ప్రసిద్దులు. వారు దేవ పెరుమాళ్ కు చాలా ప్రియమైన వారు. రామానుజులు కాంచీపురానికి  వచ్చినప్పుడు, మొట్టమొదటి ఆచార్యులుగా తిరుక్కచ్చి నంబి తన అధీనంలోకి తీసుకొని, రామానుజులకు ఎమ్బెరుమాన్ యొక్క మొదటి కైంకర్యాన్ని ఆశీర్వదిస్తారు.

వ్యాస: రామానుజులు ఏ కైంకర్యాన్ని చేసేవారు, నాన్నమ్మా?

నాన్నమ్మ:  సరైన మార్గదర్శకత్వం కోసం రామానుజుల చేత ప్రార్థించబడినపుడు, తిరుక్కచ్చి నంబి పెరుమాళ్ తిరుమంజనం కోసం సాలైకినారు (దగ్గర లో ఒక బావి) నుండి తీర్థం తీసుకువచ్చే కైంకర్యాన్ని రామానుజులకు అప్పగిస్తారు. తిరుక్కచ్చి నంబి చేత రామానుజులకు ఇవ్వబడిన మొదటి కైంకర్యం ఇది. శాస్త్రంలో వారికున్న జ్ఞానం మరియు ఎమ్బెరుమాన్ పై వారికున్న ప్రేమ అపారమైనది. రామానుజులకు తిరుక్కచ్చి నంబి పట్ల అపారమైన ప్రేమ మరియు గౌరవం అభివృద్ధి అయి, తనను వారు శిష్యుడిగా స్వీకరించి పంచ సంస్కారము చేయమని రామానుజులు ప్రార్థిస్తారు.

పరాశర : కానీ, నాన్నమ్మా, మీరు మధురాంతగంలో పెరియ నంబి రామానుజులకు పంచ సంస్కారము చేసారని చెప్పారు కదా?

నాన్నమ్మ:  అవును పరాశర. ఆ సంఘటన నీవు ఇంకా గుర్తుంచుకున్నందుకు సంతోషంగా ఉంది. తిరుక్కచ్చి నంబి శాస్త్ర పండితులు, అతను శాస్త్రంలో పేర్కొన్న పరిమితుల ఆధారంగా రామానుజులకు పంచ సంస్కారము నిర్వహించడానికి అర్హులు కారని బాగా తెలుసు. వారు రామానుజులకు శాస్త్రం చెప్పగా, వారు కూడ అంగీకరిస్తారు. ఇది రామానుజులకు శాస్త్రధర్మాల పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేస్తుంది. మన ఆచార్యులు చెప్పినట్లుగా ఏ అనుమానం లేకుండా నిస్సందేహంగా, మన శాస్త్రం స్వయంగా దేవుడి పలుకులు మరియూ ఆయన సంకల్పాలే అని అంగీకరించాలి. తిరుక్కచ్చి నంబి రామానుజులకు మన సాంప్రదాయానికి సంబంధించిన ప్రశ్నలకు, సందేహాలకు మార్గదర్శనం చేసారు. తిరుక్కచ్చి నంబి రామానుజుల సందేహాలకు జవాబుల కోసం దేవపెరుమళ్ తో సంభాషించే సంఘటనల గూర్చి చాలా ఆసక్తికరమైన కథ ఉంది.

వేదవల్లి : నాన్నమ్మా ఆ సందేహాలు ఏమిటి? దేవపెరుమళ్ ఏమి చెప్పేవారు?

నాన్నమ్మ:  ఒకసారి రామానుజుల మనస్సులో కొన్ని సందేహాలు వస్తాయి. తిరుక్కచ్చి నంబి దేవ పెరుమాళ్ తో మాట్లాడతారని వారికి తెలుసు, వారు మళ్లీ నంబి యొక్క మార్గదర్శకత్వం కోరతారు. నంబి ఎమ్బెరుమాన్ వద్దకు వెళ్లి యధావిధిగా తన కైంకర్యం నిర్వహిస్తూ, రామానుజుల విన్నపాన్ని వ్యక్తం చేయుటకు సరైన సమయం కోసం నిరీక్షిస్తుంటారు. దేవపెరుమాళ్ గమనించి నంబి యొక్క సంశయం ఏమిటని ప్రశ్నిస్తారు. రామానుజులకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటికి జవాబులు కావాలని  నంబి చెప్తారు. నంబికి ఆ సందేహాలు ఏమిటో తెలియదు కాని, అందరికి అంతర్యామిగా ఉన్న దేవపెరుమాళ్, కరుణామయుడయిన ఆ ఎమ్బెరుమాన్ ఇలా అంటారు, “రామానుజులకు చెప్పండి 1) నేను నిస్సందేహంగా సర్వోత్తముడను 2) అన్ని జీవ నిర్జీవ రాసులలో అంతర్యామిగా ఉంటున్నాను కాని వారందరూ నాకు సమానులు కారు, వారు నాకు భిన్నంగా ఉంటారు నాకు అధీనులుగా ఉంటారు. 3) నన్ను ఆశ్రయించడమే, నన్ను చేరడానికి ఏకైక మార్గం. 4) శరణాగతి చేసిన పిదప, నిస్సందేహంగా వారి అంతిమ సమయమున వారిని స్మరించి వారి యోగక్షేమాలు నేను వహించెదను 5) నా భక్తులు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన తరువాత, నా నివాసమైన  శ్రీ వైకుంటంలో శాశ్వతముగా వారికి కైంకర్యాన్ని ఇస్తాను మరియు చివరిగా 6) పెరియ నంబిని రామానుజులు ఆచార్యులుగా స్వీకరించాలి.  రామానుజుల యొక్క సందేహాలు ఏమిటి అని దేవపెరుమాళ్ అడగలేదు, నంబికి కూడా ఆ సందేహాలు ఏమిటో తెలియదు. ఈ సమాధానాలతో నంబి తిరిగి రామానుజుల దగ్గరకు వెళ్లినప్పుడు, రామానుజుల యొక్క ఆనందానికి  పరిమితం లేదు. దేవపెరుమాళ్ యొక్క దయ అలా ఉండేది. రామానుజులకు సందేహాలు కాని ఏ రకమైన భయం కాని ఉన్నప్పుడు వారు నిత్యం తోడు ఉండేవారు. ఇప్పుడు పంచ సంస్కారము కోసం రామానుజులు పెరియ నంబిని ఆశ్రయించాలన్న మాట స్పష్టమైనది, అతను తిరుక్కచ్చి నంబి యొక్క ఆశీర్వాదాలను తీసుకొని, పెరియ నంబిని  కలుసుకోవడానికి శ్రీరంగానికి బయలుదేరుతారు. తరువాత మిగిలిన కథ మనందరికీ తెలుసు, కదూ పిల్లలూ?

వ్యాస: అవును నాన్నమ్మా, మాకు గుర్తుంది.

నాన్నమ్మ:  శ్రీవైష్ణవ లక్షణాల్లో ఒక ముఖ్యమైనది వినయం, దీనిని తరచూ నైచ్య భావంగా పిలుస్తారు, మన సాంప్రదాయంలో ఇతర శ్రీవైష్ణవుల సమక్షంలో అర్పణ భావానుభావం ఉండాలి. పెరియ నంబి వినయానికి సజీవ ఉదాహరణ మరియు వారికి ఆ భావం హృదయములో నుండి నిజాయితీగా వచ్చినది  కాని కేవలం నోటి నుండి వచ్చినది కాదు. పెరియ నంబి ఇతర శ్రీవైష్ణవులను ఎల్లప్పుడు చాలా గౌరవప్రదంగా ఆదరించేవారు. చాలా ఆసక్తికరమైన సంఘటన ఒకటి ఈ విషయాన్ని నిరూపిస్తుంది. ఒకసారి మారనేరి నంబి అనే ఒక  గొప్ప ఆచార్యులు ఉండేవారు, వారు పెరియ నంబి లాగానే ఆళవందార్ల  శిష్యులు. మారనేరి నంబి వారి చివరి కర్మలు ఒక శ్రీవైష్ణవుడి చేత చేయించుకోవాలని కోరి, ఆ కార్యాన్ని పెరియ నంబిని చూసుకోమని అప్పగిస్తారు. పెరియ నంబి సంతోషంగా అంగీకరిస్తారు, కాని పెరియ నంబి తక్కువ కులంలో ఉన్న వ్యక్తికి  చివరి కర్మలను నిర్వహించి తద్వారా శాస్త్ర విరుద్ధంగా వెళ్ళారని  గ్రామంలో స్థానిక ప్రజల కోపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అడిగినప్పుడు, పెరియ నంబి వారు కేవలం నమ్మాళ్వార్ భోదించినట్టు భాగవత కైంకర్యమే గొప్పదని, పవిత్రమైనదని, అదే వారు అనుసరిస్తున్నారని చెప్తారు. భాగవతులను వారి జన్మ లేదా కుల భేదం లేకుండా  గౌరవించాలని చెప్తారు. నైచ్య భావ సిద్ధాంతమును పెరియా నంబి ఆచరణలో పెట్టారు. అందరు శ్రీ వైష్ణవులు భగవంతునికి  ప్రియమైనవారు, వారిని ఆదరించి గౌరవించాలని వారు నమ్మేవారు. ఎమ్బెరుమాన్ యొక్క నిజమైన భక్తుడు తన చివరి క్షణాలను ఎప్పుడు, ఎలా గడిపినా, తిరుక్కచ్చి నంబికి దేవపెరుమళ్ హామీ ఇచ్చినట్టుగా, ఎమ్బెరుమాన్ వారికి శాశ్వత బ్రహ్మానందమైన శ్రీ వైకుంటంలో కైంకర్యాన్ని ప్రసాదిస్తారు. వారు జీవితమంతా వారి ఆచార్యులైన ఆళవందార్, మరియు నమ్మాళ్వార్ యొక్క బోధనలను ఆచరిస్తూ గడిపారు. పిల్లలూ ఈవాలిటికి ఇంక చాలా లేదా మీరు తిరుక్కోష్టివూర్ నంబి గురించి కూడా వింటారా?

 

azhwar-acharyas-ramanuja

 

వేదవల్లి: వారి గురించి కూడా మీకు కథలు తెలుసా నాన్నమ్మా?

నాన్నమ్మ: అవును, చాలా!

అత్తులాయ్:  అయితే మీరు తిరుక్కోష్టిఊర్ నంబి గురించి కూడా మాకు చెప్పండి.

నాన్నమ్మ:  తిరుక్కోష్టిఊర్ నంబి కూడా ఆళవందార్ ప్రముఖ శిష్యులలో ఒకరు, తిరుమంత్రం మరియు చరమ శ్లోకం యొక్క అర్థాలను నేర్పించే బాధ్యత వీరికి అప్పగించబడింది. మీకు తెలుసా అవి ఏమిటో?

వ్యాస: ‘ఓం నమో నారాయణాయ’ దీనిని తిరుమంత్రం అని పిలుస్తారు.

శ్రీవత్సాంకన్:  ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ; అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః’ దీనిని చరమ శ్లోకం అంటారు.

నాన్నమ్మ:  చాలా బాగుంది. ఈ మూడు శ్లోకాలు చాలా నిగూఢమైన మరియు లోతైన అర్ధాలు కలిగి ఉన్నాయి, ప్రతివారు తమ ఆచార్యుల నుండి పూర్ణముగా వీటిని నేర్చుకోవాలి.

వేదవల్లి: కానీ నాన్నమ్మా, మాకు చాలామట్టుకు ఈ శ్లోకాల అర్థం తెలుసు.

నాన్నమ్మ:  అవును, మనలో చాలామందికి ఈ శ్లోకాల యొక్క సాధారణ అర్థం కొంతవరకు తెలుసు కానీ మన సాంప్రదాయం ప్రకారం వీటిలో ప్రతి ఒక్కటి చాలా లోతైన సారం కలిగున్నాయి, అవి ఆచార్యుల యొక్క ఆశీర్వాదము మరియు మార్గదర్శకత్వం లేకుండా పూర్తిగా తెలిసుకునే సామర్థ్యాన్ని మించినవి. అందువల్ల ఈ శ్లోకాల అర్ధాలను రామానుజులకు నేర్పించే ముఖ్యమైన కార్యం తిరుక్కోష్టిఊర్ నంబికి ఇవ్వబడింది.

అత్తులాయ్: నాన్నమ్మా! ఈ విషయంలో రామానుజులు  తిరుక్కోష్టిఊర్ నంబి దగ్గరికి 18 సార్లు ప్రయాణం చేయవలసి వచ్చిందని నేను విన్నాను. ఇది నిజమా? ఎందుకు అతను అలా ఇబ్బందిపడాల్సి  వచ్చింది?

నాన్నమ్మ:  అవును, ఇది నిజం. ఇది మన సాంప్రదాయం గురించి నేర్చుకోవడంలో రామానుజుల యొక్క ప్రమేయం మరియు నిజాయితీని పరీక్షించడానికి తిరుక్కోష్టిఊర్ నాంబి ఉపయోగించిన ఒక మార్గంగా పరిగణించవచ్చు మరియు ఇది రామానుజుల యొక్క పట్టుదల మరియు సహనానికి ప్రమాణంగా కూడా పరిగణించవచ్చు. మనము ఇబ్బందులు వచ్చినపుడు ఎదుర్కోవాలి, సహనం కోల్పోకూడదు. ఎన్నిసార్లు రామానుజులు  ప్రయాణించవలసి వచ్చింది చూడండి. 18 సార్లు! వారు స్థిరత్వంతో చివరకు,  18 వ సారి తిరుక్కోష్టిఊర్ నంబి చరమ శ్లోకార్థాన్ని బోధిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, తిరుక్కోష్టిఊర్ నంబి చాలా కఠినమైన ఆచార్యులుగా ఉన్నట్టున్నారు. వారు  రామానుజులపై కొంత జాలి చూపించాల్సింది.

నాన్నమ్మ:  అందరూ ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత ఇలాగే దురభిప్రాయ పడతారు. కానీ ఇది నిజం కాదు. వారు ఎల్లప్పుడూ మనస్సులో రామానుజుల యొక్క యోగక్షేమాలు కోరేవారు మరియు వారు ఒక తండ్రి లాగా బహిరంగంగా కొడుకుతో కఠినంగా అనిపించినా కాని కుమారుని సంక్షేమం కోసం ఎలాంటి త్యాగమైనా చేయగలడు. గుర్తుందా, నిన్న తిరుమాలై ఆండాన్  గురించి మాట్లాడినప్పుడు, నేను ఆండాన్ మరియు రామానుజుల మధ్య కొన్ని అభిప్రాయాల భేదాలు ఉండేవని చెప్పాను? అప్పుడు  తిరుక్కోష్టిఊర్ నంబి రామానుజుల కోసం మధ్యవర్తి అయి స్నేహ పూర్వకంగా వారి  వివాదాన్ని పరిష్కరిస్తారు. వాస్తవానికి, ఇతర శ్రీ వైష్ణవలపట్ల రామానుజుల యొక్క నిస్వార్ధ ప్రేమ తిరుక్కోష్టిఊర్ నంబిని ఎంతో ఆకట్టు కుంటుంది, వారు ఎమ్బెరుమానార్ అనే బిరుదాన్ని (ఎమ్బెరుమాన్ కంటే ఉన్నతమైన వాడు అని అర్థం) రామానుజులకు ప్రసాదిస్తారు. ఈ విధంగా ఆ అందమైన పేరు “ఎమ్బెరుమానార్” అని రామానుజులకు వచ్చింది. శ్రీరంగంలో కొంతమంది దుష్టులు రామానుజులకు విషాన్ని ఇస్తారు, తిరుక్కోష్టిఊర్ నంబి సమయానికి వచ్చి, రామానుజులకు ఆహారాన్ని తయారుచేయుటకు  కిడాంబి ఆచాన్ని నియుక్తి చేస్తారు. తిరుక్కోష్టిఊర్ నాంబి ఎల్లప్పుడూ రామానుజుల యొక్క యోగక్షేమాలు ప్రేమపూర్వకంగా ఒక తండ్రి వలె చూసుకునే వారు. అతని గొప్పతనాన్ని, సమృద్ధ జ్ఞానాన్ని, వారి ఆచార్యులు ఆళవందార్ పట్ల అతని భక్తిని చూపుటకు ఎన్నో కథలు ఉన్నాయి. నేను మీకు ఆ కథలను చెప్పాలని ఎంతో ఇష్టంగా ఉంది, తప్పకుండా మీకూ వినాలని ఉంది అనుకుంటున్నాను. కాని, మీకాలస్యం అవుతుంది మీ తల్లిదండ్రులు భయపడతారు? ఇప్పుడు మీరు ఈ పండ్లను తీసుకొని ఇంటికి వెళ్లండి. మరో సారి, మన ఆచార్యుల గురించి ఇంకా కథలను మీకు చెప్తాను.

పిల్లలు పండ్లు పంచుకుంటూ తిరుక్కచ్చి నంబి, పెరియ నంబి మరియు తిరుక్కోష్టిఊర్ నంబి గురించి ఆలోచించుకుంటూ ఇంటికి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-alavandhars-sishyas-2/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఆళవన్దారుల శిష్యులు – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< పెరియ నమ్బి

తిరువరంగప్పెరుమాళ్ అరైయర్, పెరియ తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్

pancha-acharyas

ఆలవందార్ శిష్యులు

పరాశర మరియు వ్యాస, నాన్నమ్మ ఇంటికి వారి స్నేహితురాలు వేదవల్లి తో పాటు ప్రవేశిస్తారు.

నాన్నమ్మ: స్వాగతం వేదవల్లి. పిల్లలూ లోపలికి రండి.

వ్యాస: నాన్నమ్మా, పోయిన సారి మీరు రామానుజ మరియు వారి ఆచార్యుల గురించి మాకు మరింత చెప్తానని చెప్పారు.

పరాశర: నాన్నమ్మా, మీరు రామానుజులకు అనేకమంది ఆచార్యులు ఉన్నారు, కేవలం పెరియ నంబి మాత్రమే కాదు అని చెప్పారు కదా? మిగతా వారు ఎవరు నాన్నమ్మా ?

నాన్నమ్మ: పిల్లలు, పోయిన సారి నేను మీకు చెప్పాను, ఆళవందారుకి చాలామంది శిష్యులు ఉండేవారని, వారందరూ ఇళైయాళ్వారుని సాంప్రదాయంలోకి తీసుకురావడానికి కృషి చేసారని చెప్పాను. వారిలో ముఖ్యులు 1) తిరువరంగ ప్పెరుమాళ్ అరైయర్ 2) తిరుక్కొష్టియూర్ నంబి 3) పెరియ తిరుమలై నంబి 4) తిరుమాలై ఆండాన్ 5) తిరుక్కచ్చి నంబి మరియు పెరియ నంబి. మనము కలుసుకున్నప్పుడు పెరియ నంబి గురించి చివరిసారి మాట్లాడాం మీకు గుర్తున్దా? ఇప్పుడు, ఇతర ఆచార్యుల గురించి మరియు సాంప్రదాయానికి వారి విలువైన సహకారం గురించి చెప్తాను.

పరాశర: నాన్నమ్మా, రామానుజులకు ఎందుకు అనేకమంది ఆచార్యులు ఉన్నారు?

నాన్నమ్మ:  వారందరూ వారి వారి సొంత శైలిలో  శ్రీ రామానుజులను గొప్ప ఆచార్యునిగా తీర్చిదిద్దడంలో తోడ్పడ్డారు. తిరువరంగ ప్పెరుమాళ్ రామానుజులను  కాంచీపురం నుండి శ్రీరంగానికి  తీసుకొని వచ్చి  గొప్ప కైంకర్యం చేశారు.

వ్యాస: అది ఎలా జరిగింది? మాకు ఆ కథ చెప్పండి నాన్నమ్మా.

నాన్నమ్మ:  రామానుజులు సమాశ్రయనం స్వీకరించి కాంచీపురంలో నివసిస్తున్న రోజులవి.  అరైయర్ ఆ సమయంలో కాంచీపురానికి వెళ్లి తిరుక్కచ్చి నంబిని దేవపెరుమాళ్ ముందు అరైయర్ సేవ చేయటానికి అనుమతించమని ప్రార్థిస్తారు. తన అర్చకుల ద్వారా దేవపెరుమాళ్ తన ఎదుట అరైయర్ సేవ చేయమని చెబుతారు. అరైయర్ ఎంతో ప్రేమభక్తితో పాసురాలను పాడి ఆడుతారు. ఎమ్బెరుమాన్ ఎంతో సంతోషించి వారికి బహుమతులను ప్రసాదిస్తారు. కాని అరైయర్ వారికి ఆ బహుమతులు కాకుండా ఇంకేదో కావాలని విన్నవిస్తారు. ఎమ్బెరుమాన్ అంగీకరించి ” ఏమి కావాలో అడుగు. ఏమైనా ఇస్తాను” అని అంటారు.  అరైయర్ రామానుజుల వైపు చూపించి, వారిని శ్రీరంగానికి పంపించమని అడుగుతారు. “నీవు వారిని అడుగుతావని అనుకోలేదు; ఇంకేమైనా అడుగు” అని దేవపెరుమాళ్ అంటారు. అరైయర్ బదులుగా ” మీరు ఎవరో కాదు రెండవ మాటలేని సాక్షాత్తూ ఆ శ్రీ రాముడే – ఇక తిరస్కరించలేరు”. దేవపెరుమాళ్ అంగీకరించి రామానుజులకు వీడ్కోలిస్తారు.

వ్యాస: ఎంత చమత్కారం నాన్నమ్మా? అరైయర్ వారు ఎంత  తెలివిగా పెరుమాళ్‌ను ఒప్పిస్తారు .

నాన్నమ్మ: అవును వ్యాస. తక్షణమే రామానుజుల చేతులు పట్టుకుని అరైయర్ శ్రీరంగానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అందువల్ల, శ్రీరంగానికి రామానుజులను తీసుకువచ్చి శ్రీ వైష్ణవులకు అరైయర్ చాలా ముఖ్యమైన కృషి చేసాడు,  మన సాంప్రదాయాన్ని ఉన్నతస్థితికి తీసుకువెళ్ళటానికి తోడ్పడ్డారు.

వేదవల్లి : నాన్నమ్మా, మీరు ప్రతి ఆచార్యులు ఒక్కొక్క విధంగా రామానుజులను తీర్చిదిద్దడంలో  తోడ్పడ్డారని అన్నారు. అరైయర్ ఏమి బోధించారు నాన్నమ్మా?

నాన్నమ్మ: సాంప్రదాయం యొక్క వివిధ కోణాలను రామానుజులకు బోధించమని ఆళవందారులు తన ప్రముఖ శిష్యులకు ఆదేశించారు. రామానుజులకు సాంప్రదాయంలోని  నిజమైన సారాంశాన్ని బోధించమని అరైయర్ని కోరుతారు. రామానుజులు జ్ఞానం కోసం అరైయర్ వద్దకు వెళ్లేముందు వారు  ముందుగానే ఆరు నెలల పాటు ఆచార్యులకు (అరైయర్) కైంకర్యం చేసారు. ఇది చాలా ముఖ్యమైన అంశంగా పరిగ్రహించాలి, రామానుజులు, కూరత్తాల్వారు, ముదలియాన్డాన్ మరియు అనేక ఆచార్యులు వారి జీవితాల్లో ఈవిధంగా చేసారు – వారు ఆచార్యుల వద్ద విద్య నేర్చుకునే ముందు వారికి కైంకర్యం చేసేవారు. ఇది వారు నేర్చుకోవలసిన విద్య పట్ల మరియు వారికి విద్య బోధించే వారి పట్ల  కూడా వారు కలిగి ఉన్న భక్తిని చూపిస్తుంది. రామానుజులు ప్రతిరోజూ సరైన వెచ్చదనంతో పాలు తయారు చేసేవారు మరియు అరియార్ వారికి అవసరమైనపుడు ఉపయోగం కోసం హరిద్రను నూరి సిద్ధం చేసేవారు.

వ్యాస: నాన్నమ్మా, ఇతర ఆచార్యులు రామానుజులకు ఏమి బోధించారు?

నాన్నమ్మ: అవును, నేను ఒకరి తరువాత ఒకరు వారి వద్దకే వస్తున్నాను. తిరుమలై నంబి రామానుజులకు మేనమామ. వారు తిరుమల నుండి వచ్చిన శ్రీవైష్ణవ అగ్రగణ్యులు. వారు శ్రీనివాసులకు ప్రతి రోజు  అకాశగంగ నుండి పవిత్ర జలాలను తీసుకు వచ్చే కైంకర్యం చేసేవారు. వారు గొప్ప శ్రద్ధతో మరియు అంకితభావంతో శ్రీనివాసులకు సేవ చేసేవారు. శ్రీ రామాయణం యొక్క సారాంశం మరియు వాటి అందమైన అర్థాలను రామానుజులకు నేర్పించమని వారి ఆచార్యులు ఆళవందారు వారిని ఆదేశిస్తారు . శ్రీ రామాయణాన్ని మన సాంప్రదాయం లో శరణాగతి శాస్త్రం అని పిలుస్తారు. తిరుమలై నంబి రామానుజుల యొక్క మేనమామ కాబట్టి , వారికి ఇలైయార్వారుడని నామకరణం కూడా వీరే చేస్తారు. అంతే కాకుండా తిరుమలై నంబి వారు రామానుజుల యొక్క పిన్ని కొడుకైన గోవింద పెరుమాళ్ ను కూడా సాంప్రదాయంలోకి తిరిగి తీసుకువస్తారు . అతనికి సాంప్రదాయ జ్ఞానం మరియు ఆళ్వారుల పాసురాలపై ప్రేమ  అసమానమైనది.

పరాశర: నాన్నమ్మా, మీరు  తిరుమాలై ఆండాన్ గురించి మరింత మాకు చెబుతారా? అతను రామానుజులకు ఎలా సహాయం చేసారు?

నాన్నమ్మ: తిరువాయ్మోలి అర్థాలను నేర్పించే బాధ్యతను తిరుమాలై ఆండాన్ కు ఇవ్వబడింది. రామానుజులు శ్రీరంగానికి వచ్చిన తరువాత, నమ్మాళ్వారి తిరువయ్మోలిని విని అర్థంచేసుకోమని  తిరుక్కోష్టివూర్ నంబి వారిని తిరుమాలై ఆండాన్ వద్దకు మార్గదర్శనం చేస్తారు. ప్రారంభంలో, ఇద్దరు గొప్ప విద్వాంసుల మధ్య సాధారణంగా జరిగిన అభిప్రాయాలకు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇది స్నేహపూర్వకంగా పరిష్కారం పొంది మరియు వారి ఆచార్యులు తిరుమాలై ఆండాన్  యొక్క ఆశీర్వాదంతో ఆళ్వార్ల పాసురాలలో దాగి ఉన్న క్లిష్టమైన అర్థాలను నేర్చుకున్నారు. తిరుమాలై ఆండానుకి వారి ఆచార్యులు ఆళవందారు లంటే  గొప్ప గౌరవం, భక్తి ఉండేది. అతడు తన ఆచార్యుల యొక్క మార్గము మరియు బోధనల నుండి ఎప్పుడూ తప్పే వారు కాదు, అదే వారు రామానుజులకు కూడా నేర్పించారు, తద్వారా వారి ద్వారా ఆ కైంకర్యాన్ని మన సాంప్రదాయంలో ముందుకు తీసుకువెళ్లి కొనసాగిస్తారని నేర్పిస్తారు.

వేదవల్లి: మరి తిరుక్కోష్టివూర్ నంబి మరియు తిరుక్కచ్చి నంబి గురించి ?

నాన్నమ్మ: మనం మరోసారి కలుసుకున్నపుడు వారి గురించి చెబుతాను. వారి గురించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.

పిల్లలందరూ ఒకేసారి: ఆ కథలు మాకు ఇప్పుడే చెప్పండి నాన్నమ్మా.

నాన్నమ్మ: ఇక ఆలస్యమవుతుంది. ఇవాల్టికి ఇది చాలు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లి రేపు మరలా రండి.  మీతో పాటు మీ స్నేహితులను కూడా తీసుకురావడం మర్చిపోకండి.

పిల్లలు ఆచార్యుల గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లలోకి వెళ్లి, మరుసటి రోజు వారికి నాన్నమ్మ చెప్పే కథల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-alavandhars-sishyas-1/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – పెరియ నమ్బి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళవందార్

పరాశర మరియు వ్యాస నాన్నమ్మ ఇంటికి వస్తారు. అత్తుళాయ్ చేతిలో ఒక బహుమతితో ప్రవేశిస్తుంది.

నాన్నమ్మ: నువ్వు  ఏమి గెలిచావు అత్తుళాయ్ ?

వ్యాస: నాన్నమ్మా, అత్తుళాయ్ మా పాఠశాలలో  ఫాన్సీ డ్రస్సు పోటీలో ఆండాళ్ లాగా నటించింది, తిరుప్పావై లోని కొన్ని పాసురాలని పాడి మొదటి బహుమతిని గెలుచుకుంది.

నాన్నమ్మ:  చాలా అద్భుతం అత్తుళాయ్! నేను పెరియ నంబి గురించి ఈరోజు మీకు చెప్పిన తర్వాత పాసురాలను నేను వింటాను.

పిల్లలు : ఇలైఆళ్వార్ గురించి కూడా నాన్నమ్మా.

నాన్నమ్మ: అవును, అవును. నేను పోయిన సారి చెప్పినట్టుగా, పెరియ నంబి ఆళవందార్ యొక్క ప్రధాన శిష్యులలో ఒకరు. వారు శ్రీరంగంలో మార్గశిర మాసం, జ్యేష్ట నక్షత్రంలో జన్మించారు.  ఇలైఆళ్వార్ ని కాంచీపురం నుండి శ్రీరంగానికి తీసుకువచ్చింది కూడా వీరే. ఇలైఆళ్వార్ ను కలుసుకోవడానికి పెరియనంబి కంచికి వెళుతుండగా, ఇలైఆళ్వార్ పెరియ నంబిని కలుసుకునేందుకు తన ప్రయాణం శ్రీరంగానికి ప్రారంభిస్తారు.

పరాశర: నాన్నమ్మా,  ఇలైఆళ్వారులు  కాంచిపురంలో యాదవప్రకాశుల వద్ద విద్య నేర్చుకుంటుండగా శ్రీరంగానికి ఎందుకు బయలుదేరారు?

నాన్నమ్మ: చాలా మంచి ప్రశ్న! నేను కిందటి సారి చెప్పింది గుర్తుందా, ఆళవందారులు తిరుక్కచ్చి నంబి కి ఇలైఆళ్వారులను  అప్పగించి కావాల్సినప్పుడు  మార్గనిర్దేశం చేయమని చెబుతారు. ఇలైఆళ్వారులకు  యాదవప్రకాశులతో అభిప్రాయ భేదాలు మొదలై సతమతమవుతుండగా,  తిరుక్కచ్చి నంబి వద్దకు పరిష్కారం కోసం వస్తారు . తిరుక్కచ్చి నంబి మార్గదర్శం చేయమని  ఎవరిని అడుగుతారు?

అత్తుళాయ్: దేవప్పెరుమాళ్!

నాన్నమ్మ: అద్భుతం ! దేవప్పెరుమాళ్ ఎల్లప్పుడూ ఇలైఆళ్వారులను రక్షించుటకు వచ్చి, పెరియ నంబి వద్దకు వెళ్లి పంచ సంస్కారము కానిచ్చి వారి శిష్యులుగా కామని చెబుతారు. అతను ఒక ప్రకాశవంతమైన, పెరుగుతున్న సూర్యుడు రాత్రి చీకటిని తొలగించినట్టుగా ఇలైఆళ్వారుల మనస్సులో ఉన్న సందేహాలను తొలగిస్తారు. అట్లా, కంచి నుండి ఇలైఆళ్వార్ బయలుదేరినప్పుడు, పెరియ నంబి ఇలైఆళ్వారులను కలవడానికి కంచి కి బయలుదేరారు. వారు ఇద్దరూ మధురాంతగం అనే ప్రదేశంలో కలుసుకుంటారు, పెరియ నంబి ఇలైఆళ్వారులకు అక్కడే పంచ సంస్కారము చేసిన తరువాత సాంప్రదాయంలోకి ప్రవేశిస్తారు.

వ్యాస: ఓహ్ అవును, మధురాంతగం లో యేరి కాత్త రామాలయం ఉంది. పోయిన సెలవుల్లో మేము ఆ ఆలయానికి వెళ్ళాము. కానీ, అతను దీక్షను ఆచరించటానికి కంచి లేదా శ్రీరంగానికి ఎందుకు వెళ్ళలేదు? మధురాంతగంలో నే ఉన్నట్టుండగా ఎందుకు అలా చేసారు?

పెరియ నంబి – శ్రీరంగం

నాన్నమ్మ: పెరియ నంబి ఒక గొప్ప ఆచార్యులు, వారికి ఇలైఆళ్వార్ పట్ల అపారమైన అనుబంధం మరియు గౌరవం కలిగి ఉండేది. ఇలాంటి మంచి పనులు వాయిదా వేయకూడదని వారికి తెలుసు. పిల్లలు, దీని నుంచి మనకు ఏమి తెలుస్తుందంటే, మనము మన సాంప్రదాయానికి  సంబంధించిన మంచి విషయాలు, పనులను ఆలస్యం లేదా వాయిదా వేయకూడదు. ఎంత తొందరగా అయితే అంత మేలు! పెరియ నంబి మన సాంప్రదాయానికి సంబంధించిన నిజమైన సూత్రాలు వారికి తెలుసు. అతను తన శిష్యుడు రామానుజులును ఎంతో ఇష్టపడేవారు, ఎంత అంటే వారు వారి జీవితాన్నే ధార పోసారు మన సాంప్రదాయం కోసం – రామానుజ!

వ్యాస: వారు తన జీవితాన్ని అర్పించారు! ఎందుకు వారు అలా చేయవలసి వచ్చింది నాన్నమ్మా?

నాన్నమ్మ: ఆ సమయంలో ఆ ప్రాంతానికి రాజు,  శైవ రాజు తన ఆజ్ఞను అంగీకరించి రాజ దర్బారికి రావాలని రామానుజులను ఆజ్ఞాపిస్తారు. రామానుజులకు బదులుగా, వారి యొక్క గొప్ప శిష్యులలో ఒకరైన కూరత్తాల్వారు, వారి ఆచార్యులుగా మారువేషంలో, పెరియ నంబి తో రాజ దర్బారికి వెళతారు. పెరియ నంబి ఆ సమయంలో చాలా వృద్దులు, వారి కూతురు అత్తుళాయ్ కూడా వారితోపాటు  వెళుతుంది.

అత్తుళాయ్: అది నా పేరు!

నాన్నమ్మ: అవును! రాజు తన ఆజ్ఞలను అంగీకరించమని ఆజ్ఞాపించినప్పుడు, కూరత్తాల్వారు మరియు పెరియ నంబి ఇద్దరూ రాజు యొక్క ఆజ్ఞలను తిరస్కరిస్తారు. ఆగ్రహించి రాజు, వారిద్దరి కళ్ళను పీకేయమని సేవకులకు ఆదేశించారు. పెరియ నంబి వృద్ధాప్యము వలన ఆ నొప్పిని తట్టుకోలేక, తిరిగి  శ్రీరంగానికి వెళ్తుండగా కూరత్తాల్వార్ వడిలో వారు జీవితాన్ని త్యాగం చేసి పరమపదం చేరుకుంటారు. ఈ మహాత్ములు ఏ ఆలోచనా లేకుండా  ముత్యాల హారం మధ్యలోని మణి లాంటి వారైన రామానుజులని కాపాడటానికి త్యాగం చేశారు. ఆ హారంలోని ముత్యాలను విచ్ఛిన్నం చేస్తే ఏమి జరుగుతుంది?

పరాశర మరియు వ్యాస ఒకే సారిగా: హారం కూడా తెగిపోతుంది!

నాన్నమ్మ:  సరిగ్గా!  అదేవిధంగా, మన సాంప్రదాయంలో హారంలోని మణి లాంటి వారు రామానుజులు, అయినప్పటికిని మన ఆచార్యులు ముత్యాల వంటి వారై, వారందరూ కలిసి, కేంద్ర రత్నం సురక్షితంగా ఉండాలని సంరక్షిస్తూ ఉండేవారు. కాబట్టి మనమందరం మన ఆచార్యాలకు కృతజ్ఞత కలిగి ఉండాలి.

పరాశర: నాన్నమ్మా, కూరత్తాల్వారుకి ఏమి అయింది?

నాన్నమ్మ:  కూరత్తాల్వారు, అతని గ్రుడ్డి అయిన కళ్ళతో తిరిగి శ్రీరంగానికి వచ్చారు. వారు రామానుజుల యొక్క గొప్ప శిష్యులు, వారు  రామానుజులతో కలిసి అన్ని అంశాలలో అనుసరించారు. మనం మరో సారి కలుసుకున్నపుడు నేను కూరత్తాల్వారు మరియు రామానుజుల గురించి మరింత మీకు చెప్తాను. ఇప్పుడు మీరు త్వరగా ఇంటికి వెళ్లండి. మీ తల్లిదండ్రులు మీ కోసం వేచి ఉంటారు.  అత్తుళాయ్, ఈ సారి వచ్చినపుడు తిరుప్పావై పాసురాలని వినిపించాలి.

పిల్లలు పెరియ నంబి మరియు కూరత్తాల్వారు గురించి ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వెళ్ళారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-periya-nambi/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org