శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీవైష్ణవం (సనాతన ధర్మం అని కూడా అంటారు) ఒక ఆద్యంతరహితమైన సాంప్రదాయం, చరిత్రలో ఎంతో మంది మహా పురుషులు ఈ సాంప్రదాయాన్ని అంతటా విస్తరించారు. ద్వాపరయుగం చివరిలో, ఆళ్వారులు భారతవర్షంలోని దక్షిణభాగంలో వివిధ నదీ తీరాలలో ప్రత్యక్షమౌట ప్రారంభించారు. చివరి ఆళ్వార్ కలియుగ ప్రారంభభాగంలో ప్రత్యక్షమైనారు. వ్యాస మహర్షి, శ్రీ భాగవతంలో ఆ ఉన్నతమైన శ్రీమన్నారాయణ భక్తులు వివిధ నదీ తీరాలలో ప్రత్యక్షమౌతారని మరియు ఎమ్పెరుమాన్ యొక్క దివ్యజ్ఞానంతో ప్రతి ఒక్కరిని సుసంపన్నం చేస్తారని గుర్తించారు. ఆళ్వార్ లు మొత్తం 10 మంది – పొయిగై ఆళ్వార్ , భూదత్త ఆళ్వార్ , పెయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్, తొందరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణ్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. మధురకవి ఆళ్వార్ – ఆచార్య నిష్ఠాపరులు మరియు ఆండాళ్ – భూమి పిరాట్టి అవతారం. ఆళ్వార్ లు (ఆండాళ్ తప్ప) అందరూ ఎమ్పెరుమాన్ చేత ఎంపిక చేయబడిన ఈ సంసారములోని జీవాత్మలే. ఎమ్పెరుమాన్ తన సంకల్పంతో ఆళ్వారులకు అత్యంత పరిపూర్ణమైన తత్వత్రయ (చిత్ – ఆత్మ, అచిత్ – ప్రకృతి, ఈశ్వర – భగవానుడు) జ్ఞానాన్ని ప్రసాదించారు. తద్వార ఆకాలంలో అంతరించిన భక్తి/ప్రపత్తి మార్గాన్నితిరిగి స్థాపింపచేసారు. భగవానుడే వారికి భూత, వర్తమాన మరియు భవిష్యత్ సంఘటనలను పూర్తిగా స్పష్టంగా తెలియపరిచారు. ఆళ్వారులు పాడిన 4000 దివ్య ప్రబంధం (అరుళిచెయల్ గా ప్రసిద్దిగాంచినది), వారికి కలిగిన భగవదనుభవం యొక్క ప్రత్యక్ష ధారలు.
ఆళ్వారుల కాలం తరువాత ఆచార్యుల సమయం ప్రారంభమైనది. నాథమునులతో ప్రారంభించి, మధ్యలో రామానుజులు, చివరిన మనవాళ మామునులతో సహా అనేకమంది ఆచార్యుల ద్వారా మన సత్సాంప్రదాయం విస్తరించినది. ఈ ఆచార్య పరంపర 74 సింహాసనాధిపతులు మరియు జీయర్ మఠాల ద్వారా ఈనాటికి కొనసాగుతోంది. ఈ ఆచార్యులు అరుళిచెయర్ల పైన ప్రతి పాసురాన్ని వివరించి అనేక వ్యాఖ్యానాలు వ్రాసారు. ఈ వ్యాఖ్యానాలు మనందరి కోసం వారు వదిలి వెళ్ళిన గొప్ప నిధి – వాటిని చదవటం ద్వారా భగవదనుభవంలో మనందరం మునుగుటకు గొప్ప అవకాశం కల్పిస్తున్నాయి. ఆళ్వారుల యొక్క అనుగ్రహంతో, మన ఆచార్యులు పాసురములలో ఉన్న దివ్య భావాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వివిధ కోణాలలో మనకు వాటిని వివరించారు.
1. పాయిగై ఆళ్వార్
(కాసార యోగి)
తిరువెక్క (కాంచీపురం)
ఐప్పశి – శ్రావణం
ముదల్ తిరువంతాది
ఎమ్పెరుమాను యొక్క ఆధిపత్యంపై దృష్టి పెట్టారు. వారికి సారో మునీంద్ర అని కూడా పేరు.
కాన్చ్యాం సరసి హేమాబ్జే జాతం కాసార యోగినం
కలయే యః శ్రియఃపత్యే రవిం దీపం అకల్పయత్
సెయ్య తుళా ఓణత్తిల్ సెగత్తుధిత్తన్ వాళియే
తిరుక్కచ్చి మానగరం సెళిక్క వందోన్ వాళియే
వైయంథగళి నూఱుం వగుత్తురైత్తాన్ వాళియే
వనస మలర్క్ కరువదనిల్ వన్దమైన్దాన్ వాళియే
వెయ్య కధిరోన్ తన్నై విళాక్కిట్టాన్ వాళియే
వేంగడవర్ తిరుమలైయై విరుంబుమవన్ వాళియే
పాయిగై ముని వడివళగుం పొఱ్పపదముం వాళియే
పోన్ముదియుం తిరుముగముం పూతలత్తిల్ వాళియే
2. భూదత్త ఆళ్వార్
తిరుక్కడళ్ మల్లై (మహాబలిపురం)
ఐప్పశి – ధనిష్ట
ఇరందాం తిరువందాది
ఎమ్పెరుమాను యొక్క ఆధిపత్యం పై దృష్టి పెట్టారు.
మల్లాపుర వరాధీశం మాధవీ కుసుమోద్భవం
భూతం నమామి యో విష్ణో: జ్ఞానదీప మకల్పయత్
అన్బే తగళి నూఱుం అరుళినాన్ వాళియే
ఐప్పసియిల్ అవిటత్తిల్ అవతరిత్తాన్ వాళియే
నన్పుగళ్ సేర్ కురుక్కత్తి నాణ్మలరోన్ వాళియే
నల్ల తిరుక్కడల్ మల్లై నాధనార్ వాళియే
ఇన్బురుగు సింధై తిరి ఇట్ట పిరాన్ వాళియే
ఎళిళ్ జ్ఞానచ్చుడర్ విళక్కేట్టినాన్ వాళియే
పొన్ పురైయుం తిరువరంగర్ పుగళ్ ఉరైప్పోన్ వాళియే
భూదత్తార్ తాళినై యిప్పూతలత్తిల్ వాళియే
3. పేయాళ్వార్
(మహతాహ్వాయ)
తిరుమయిలై (మయిలాపూర్)
ఐప్పశి – శతభిషం
మూన్ఱాం తిరువందాది
ఎమ్పెరుమాను యొక్క ఆధిపత్యంపై దృష్టి పెట్టారు.
దృష్ట్వా హృష్టం తదా విష్ణుం రమయా మయిలాధిపం
కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయ మాశ్రయే
తిరుక్ కన్డేన్ ఎన నూఱుం సెప్పినాన్ వాళియే
సిరాంధ ఐప్పసియిల్ సాధయం సెనిత్త వళ్ళల్ వాళియే
మరుక్కమళుం మయిలై నగర్ వాళ వందోన్ వాళియే
మలర్ క్కరియ నెయ్దల్ తనిల్ వందుతిత్తాన్ వాళియే
నెరుక్కిడవే ఇడైకళియిల్ నిన్ఱ సెల్వన్ వాళియే
నేమిసన్గన్ వడివళగై నెంజిల్ వైప్పోన్ వాళియే
పెరుక్కముదన్ తిరుమళిసై ప్పిరాన్ తొళువోన్ వాళియే
పేయాళ్వార్ తాళినై ఇప్పెరు నిలత్తిల్ వాళియే
4. తిరుమళిశై ఆళ్వారు
(భక్తిసార)
తిరుమళిశై
తై – మఖ
నాన్ముగన్ తిరువందాది, తిరుచంత విరుత్తం
ఎమ్పెరుమాన్ యొక్క అంతర్యామిత్వంపై దృష్టి పెట్టారు. అలాగే, మనము కేవలం శ్రీమన్ నారాయణుని మాత్రమే శరణాగతి చేయవలెనని స్థాపించారు.
శక్తి పంచమయ విగ్రహాత్మనే శుక్తికా రజిత చిత్తహారిణే
ముక్తిదాయక మురారి పాదయోః భక్తిసార మునయే నమో నమః
అన్బుదన్ అందాది తొంనూఱ్ఱాఱు ఉరైత్తాన్ వాళియే
అళగారుం తిరుమళిసై అమర్న్ద సెల్వన్ వాళియే
ఇంబమిగు తైయిల్ మగత్తిన్గుదిత్తాన్ వాళియే
ఎళిళ్ సందవిరుత్తం నూత్తిరుపదీన్దాన్ వాళియే
మున్బుగత్తిల్ వందుదిత్త మునివనార్ వాళియే
ముళు ప్పెరుక్కిల్ పొన్ని ఎదిర్ మిదంద సొల్లోన్ వాళియే
నన్పువియిల్ నాలాయిరత్తేళునూత్తాన్ వాళియే
నాంగళ్ పత్తిసారాన్ ఇరు నఱ్పదంగల్ వాళియే
5. నమ్మాళ్వార్
(శఠకోప స్వామి)
ఆళ్వార్ తిరునగరి
వైకాశి – విశాఖ
తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువంతాది, తిరువాయ్మొలి
కృష్ణావతారం పైన దృష్టి పెట్టారు. ఆళ్వారులకు మరియు శ్రీ వైష్ణవులందరికి నాయకుడిగా పరిగణించబడతారు. 4 ప్రబంధాలలో 4 వేదాల సారాన్ని తీసుకువచ్చారు.
మాతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం య దేవ నియమేన మదన్వయానాం
ఆద్యస్య నః కులపతేర్ వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా
తిరుక్కురుగై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్ గళ్ వాళియే
తిరువాన తిరుముగత్తుచ్ చెవియెన్నుం వాళియే
ఇరుక్కుమొళి ఎన్నెంజిల్ తేక్కినాన్ వాళియే
ఎందై ఎదిరసర్కు ఇఱైవనార్ వాళియే
కరుక్కుళియిల్ పుగా వణ్ణం కాత్తరుళ్వోన్ వాళియే
కాసినియిల్ ఆరియనై క్కాట్టినాన్ వాళియే
వరుత్తమఱ వందెన్నై వాళ్విత్తాన్ వాళియే
మధురకవి తం పిరాన్ వాళి వాళి వాళియే
6. మధురకవి ఆళ్వారు
తిరుక్కోలూర్
చిత్రి – చిత్ర
కణ్ణినున్ చిఱుత్తాంబు
నమ్మాళ్వార్ పైన దృష్టి పెట్టారు. ఆచార్య భక్తి యొక్క ప్రాముఖ్యాన్ని స్థాపించారు.
అవిదిత విషయాంతరః శఠారేర్ ఉపనిషదాం ఉపగాన మాత్ర భోగః
అపి చ గుణ వశాత్ తధేక శేషి మధురకవిర్హృదయే మమావిరస్తు
చిత్తిరైయిల్ చిత్తిరై నాళ్ సిఱక్క వందోన్ వాళియే
తిరుక్కోళూర్ అవతరిత్త సెల్వనార్ వాళియే
ఉత్తర గంగా తీరత్తు ఉయర్ తవత్తోన్ వాళియే
ఒళి కదిరోన్ తెఱ్కు ఉదిక్క ఉగందు వందోన్ వాళియే
పత్తియెడు పతినొన్ఱుం పాడినాన్ వాళియే
పరాంగుశనే పరన్ ఎన్ఱు పత్తినాన్ వాళియే
మత్తిమమాం పదప్ పొరుళై వాళివిత్తాన్ వాళియే
మధురకవి తిరువడిగళ్ వాళి వాళి వాళియే
7. కులశేఖరాళ్వార్
తిరువంజిక్కాలం
మాసి – పునర్వసు
పెరుమాళ్ తిరుమొళి, ముకుంద మాలా
రామావతారం పైన దృష్టి పెట్టారు. భాగవతుల వైపు దివ్య దేశాల వైపు అనురాగాభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను చూపించారు.
ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే
తమహం శిరసా వందే రాజానం కులశేఖరం
అంజన మామలైప్పిఱవి ఆదరిత్తోన్ వాళియే
అణి అరంగర్ మణత్తూణై అడైన్దుయన్దోన్ వాళియే
వంజి నగరమ్ తన్నిల్ వాళ వందోన్ వాళియే
మాసి తనిల్ పునర్ పూసం వందుదిత్తాన్ వాళియే
అంజలెనక్ కుడప్ పాంబిల్ అంగై ఇట్టాన్ వాళియే
అనవరదం ఇరామ కదై ఆరుళుమువన్ వాళియే
సెంజొల్ మొళి నూత్తంజుం సెప్పినాన్ వాళియే
సేరలర్ కోన్ సెంగమలత్ తిరువడిగళ్ వాళియే
8. పెరియాళ్వార్
( విష్ణుచిత్త స్వామి)
శ్రీవిల్లిపుత్తూర్
ఆణి – స్వాతి
తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి
కృష్ణావతారం పైన దృష్టి పెట్టారు. మంగళాశాసనం (భగవానుని మంగళం కోసం చేయు ప్రార్థన) యొక్క ప్రాముఖ్యతను స్థాపించారు. అది భగవానునిపై అత్యంత ఉన్నతమైన ప్రేమభావము.
గురుముఖమనధీత్య ప్రాహవేదాన్ అశేషాన్
నరపతి పరిక్లుప్తం శుల్కమాధాతు కామః
శ్వశురం అమర వంద్యం రంగానాథస్య సాక్షాత్
ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి
నల్ల తిరుప్పల్లాండు నాన్మూన్ఱోన్ వాళియే
నానూత్తఱుపత్తొన్ఱుమ్ నమక్కురైత్తాన్ వాళియే
సొల్లరియ ఆని తనిల్ సోది వందాన్ వాళియే
తొడై సూడిక్ కొడుత్తాళ్ తాన్ తొళుం తమప్పన్ వాళియే
సెల్వ నంబి తన్నైప్పోల్ సిఱప్పుత్తాన్ వాళియే
సెన్ఱు కిళి అఱుత్తు మాల్ దెయ్వం ఎంరాన్ వాళియే
విల్లిపుత్తూర్ నగరత్తై విళంగ వైత్తాన్ వాళియే
వేదియర్ కోన్ పట్టర్ పిరాన్ మేదినియిల్ వాళియే
9. ఆండాళ్
(గోదా)
శ్రీవిల్లిపుత్తూర్
ఆడి – పూరమ్
తిరుప్పావై, నాచియార్ తిరుమొళి
కృష్ణావతారం పైన దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరి యొక్క ఉద్ధరణ కోసం ఈ ప్రపంచంలో భూదేవి (భగవానుని యొక్క దివ్య దేవేరి) అవతారంగా ప్రత్యక్షమైనారు.
నీళా తుంగ స్తనగిరి తటీ సుప్తముద్భోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శృతిశతశిర స్సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్చిష్టాయాం స్రజినిగళితం యాబలాత్ కృత్య భుంక్తే
గోదా తస్త్యె నమ యిదమిదం భూయ ఏవాస్తు భూయః ||
తిరువాడిప్పూరత్తిల్ శెగత్తుతిత్తాళ్ వాళియే
తిరుప్పావై ముప్పదుం శెప్పినాళ్ వాళియే
పెరియాళ్వార్ పెత్తెడుత్త పెణ్బిళ్ళై వాళియే
పేరుంబూదూర్మామునిక్కు పిన్నానాళ్ వాళియే
ఒరునూత్తు నాఱ్పత్తు మూన్ఱురైత్తాళ్ వాళియే
ఉయర రంగర్కే కణ్ణి యుగందళిత్తాళ్ వాళియే
మరువారుం తిరుమల్లి వళనాడు వాళియే
వణ్పుదువై నగర్ కోదై మలర్ పదంగళ్ వాళియే
10. తొండరడిప్పొడి ఆళ్వార్
(భాక్తాngri రేను)
తిరుమందన్ గుడి
మార్గళి – జ్యేష్ట
తిరుమాలై, తిరుప్పళ్ళియెళుచ్చి
శ్రీ రంగానాథుని పైన దృష్టి పెట్టారు. శరణాగతి, నామ సంకీర్తనం మరియు శ్రీవైష్ణవుల వైభవాన్ని సవివరంగా స్థాపించారు.
తమేవ మత్వా పరవాసుదేవం
రంగేశయం రాజవదర్హణీయం
ప్రాబోధికీం యోకృత సూక్తిమాలాం
భక్తాంఘ్రి రేణుం భగవంతమీడే
మండన్గుడి అదనై వాళ్ విత్తాన్ వాళియే
మార్గళియిల్ కీట్టై నాళ్ వందుదిత్తాన్ వాళియే
తెణ్డిరై సూళ్ అరంగరైయే దెయ్వం ఎన్ఱాన్ వాళియే
తిరుమాలై ఒన్బతంజుం సెప్పినాన్ వాళియే
పండు తిరుప్పళ్ళియేళుచ్చి ప్పత్తురైత్తాన్ వాళియే
పావైయర్గళ్ కలవి తనై పళిత్త సెల్వన్ వాళియే
తొండు సెయ్దు తుళబత్తాల్ తులంగినాన్ వాళియే
తొండరడిప్పొడియాళ్వార్ తుణై ప్పదంగళ్ వాళియే
11. తిరుప్పాన్ ఆళ్వార్
(ముని వాహన)
ఉఱైయూర్
కార్తీకం – రోహిణి
అమలనాదిపిరాన్
శ్రీ రంగానాథుని పైన దృష్టి పెట్టారు. పెరుమాళ్ (శ్రీ రంగానాథుని) దివ్య రూపానికి అందంగా మాంగళాశాసనం చేశారు.
ఆపాద చూడం అనుభూయ హరిం శయానం
మధ్యే కవేరతు హితుర్ ముదితాన్తరాత్మా
అద్రష్ట్రుతాం నయనయోర్ విషయాంతరాణాం
యో నిశ్చికాయ మనవై మునివాహనం తం
ఉంబర్ తొళుం మెయ్ జ్ఞానత్తు ఉరైయూరాన్ వాళియే
ఉరోగిణి నాళ్ కార్తిగైయిల్ ఉదిత్త వళ్ళల్ వాళియే
వంబవిళ్ తార్ ముని తోళిల్ వంద పిరాన్ వాళియే
మలర్క్ కణ్ణై వేఱొన్ఱిల్ వైయాదాన్ వాళియే
అంపువియిళ్ మదిళ్ అరంగర్ అగం పుగుందాన్ వాళియే
అమలనాదిపిరాన్ పత్తుం అరుళినాన్ వాళియే
సెంపొన్ అది ముడి అళావుం సేవిప్పోన్ వాళియే
తిరుప్పాణన్ పొర్పదంగళ్ సెగతలత్తిల్ వాళియే
12. తిరుమంగై ఆళ్వారు
(పరకాల)
తిరుక్కురైయలూర్
కార్తీకం – కృత్తిక
పెరియ తిరుమొళి, తిరుక్కురున్తాణ్డగం, తిరువేళుక్కూర్రిరుక్కై, సిరియ తిరుమదల్, పెరియ తిరుమదల్, తిరునేడున్తాణ్డగం
అనేక దివ్యదేశాల పైన దృష్టి పెట్టారు, ఆ దివ్యదేశాలకు వారి ఆడల్మా గుర్రం పైననే యాత్ర చేసారు. అనేక కైంకర్యాలు శ్రీరంగంలో వారి సమయంలో నిర్వహించారు.
కలయామి కలిధ్వంసం కవిం లోకదివాకరం
యస్య గోభిః ప్రకాశాభిః ఆవిద్యం నిహతం తమః
కలంద తిరుక్కార్తిగైయిల్ కార్తిగై వందోన్ వాళియే
కాసినియిల్ కుఱైయలూర్క్ కావలోన్ వాళియే
నలం తిగళ్ ఆయిరత్తెణ్పత్తు నాలురైత్తాన్ వాళియే
నాలైందుం అఱైందుం నమక్కురైత్తాన్ వాళియే
ఇలాంగెళుకూత్తిరుక్కై ఇరుమదల్ ఈందాన్ వాళియే
ఇమ్మూన్ఱిల్ ఇరునూత్తిరుపత్తేళీన్దాన్ వాళియే
వలం తిగళుం కుముదవల్లి మణవాళన్ వాళియే
వాట్కలియన్ పరకాలన్ మంగైయర్ కోన్ వాళియే
గుకారః అంతకార వాచ్య శబ్దః – ‘గు’ అక్షరం అజ్ఞానంతో కప్పబడిన మన బుద్ధి యొక్క స్వరూపాన్ని తెలియచేస్తుంది. రుకారః తన్ నివర్తకః – ‘రు’ అక్షరం అజ్ఞానాన్ని తొలగించే నిజమైన జ్ఞాన స్వరూపాన్ని తెలియచేస్తుంది. గురు అనగా అజ్ఞానాన్ని తొలగించి మరియు నిజమైన జ్ఞాన మార్గంలోకి మార్గదర్శనం చేసే శిక్షకుడు అని అర్థం. గురువు మరియు ఆచార్యుడు రెండూ నానార్ధములు. రెండిటి అర్థం ధార్మిక శిక్షకుడు అనే అర్థం.
ఓరాణ్ వాళి గురు పరంపర అనగా గురు శిష్యుల యొక్క వారసత్వం క్రమశిక్షణతో ధర్మ గ్రంథాల యొక్క గొప్ప సందేశమును ముందుకు తీసుకు వెళ్ళుట.
మన ఓరాణ్ వాళి గురు పరంపర శ్రీ రంగనాథునితో (శ్రీమన్ నారాయణునితో) మొదలై, మధ్యలో శ్రీ రామానుజులు (జగదాచార్య – మొత్తం జగత్తుకే ఆచార్యులు), చివరకు శ్రీ మనవాళ మాముని (శ్రీరంగనాథుడు శ్రీ రంగంలో స్వయంగా వారిని ఆచార్యులుగా ప్రకటించారు) వరకు కొనసాగింది. ఇప్పుడా ప్రతి ఆచార్యుని యొక్క వివరాలు ఒక్కొక్కటిగా చూద్దాము.
.
13. పెరియ పెరుమాళ్
(శ్రీమన్నారాయణ)
పంగుని – రేవతి
భగవద్గీత, శ్రీశైలేశ దయాపాత్రం తనియన్
ప్రముఖంగా శ్రీ రంగనాథా అని పిలుస్తారు. వారు అందరికి ప్రథమాచార్యులు (మొదటి ఆచార్యుడు). పరమపదం నుండి సత్యలోకానికి దిగివచ్చారు – బ్రహ్మతో పూజించబడి, తరువాత అయోధ్యకు వచ్చి – సూర్య వంశ మహారాజులతో, స్వయంగా శ్రీరాముడినితో పూజించబడి, చివరికి శ్రీ విభీషనుడి ద్వారా శ్రీరంగానికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు.
శ్రీ స్తనాభరణం తేజః శ్రీరంగేశయ మాశ్రయే
చింతామణి మివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః
తిరుమగళుం మణ్మగళుం సిఱక్కవంతోన్ వాళియే
సెయ్యవిదైత్తాయ్మగళార్ సేవిప్పోన్ వాళియే
ఇరువిసుంబిళ్ వీత్తిరుక్కుం ఇమైయవర్కోన్ వాళియే
ఇదర్కదియ ప్పాఱ్కడలై ఎయ్తినాన్ వాళియే
అఱియ దయరతన్ మగనాయ్ అవతరిత్తాన్ వాళియే
అంతరియామిత్తువముం ఆయినాన్ వాళియే
పెరుకివరుం పొన్నినడు ప్పింతుయిన్ఱాన్ వాళియే
పెరియపెరుమాళ్ ఎంగళ్ పిరాన్ అడిగళ్ వాళియే
14.పెరియ పిరాట్టి
(శ్రీ మహాలక్ష్మి)
పంగూని – ఉత్తర ఫల్గుని
ప్రముఖంగా శ్రీ రంగనాయకి అని పిలుస్తారు. భగవానుని దివ్య మహిషి (దివ్య దేవేరి). భగవానుని దయా (కరుణ) గుణం మూర్తి రూపంగా ఆవిర్భవించారు. ఎమ్పెరుమానుని చేరే సమయంలో మనకోసం ఆచార్యలు పురుషాకార భూత ( సిఫార్సు అధికారి) గా కీర్తించారు.
నమః శ్రీరంగ నాయక్యై యద్భ్రూ విభ్రమ భేదతః
ఈ శేశితవ్య వైషమ్య నిమ్నోన్నత మిదం జగత్
పంగయప్పూవిళ్ పిరాంత పావై వాళియే
పంగునియిల్ ఉత్తరనాళ్ పారుదిత్తాళ్ వాళియే
మంగైయర్కళ్ తిలగమెన వంత సెల్వి వాళియే
మాలరంగర్ మణిమార్బై మన్నుమవళ్ వాళియే
ఎంగలెళిళ్ సేనైమన్నర్క్కు ఇతమురైత్తాళ్ వాళియే
ఇరుపత్తజు ఉట్పొరుల్ మాల్ ఇయంపుమవళ్ వాళియే
సెంగమల చ్చెయ్యరంగం చెళిక్కవంతాళ్ వాళియే
శ్రీరంగ నాయకియార్ తిరువడిగళ్ వాళియే
15. సేనాధిపతి
(విష్వక్సేనుడు)
ఐప్పసి – పూర్వాషాడ
వీరు పరమపదంలో భగవానుని సేనాధిపతి. వీరు అన్ని కార్యాల నిర్వహణ చూసుకుంటారు. వీరిని శేషాసనుడు అని కూడా అంటారు – అంటే భగవానుని యొక్క శేషప్రసాదాన్ని మొట్టమొదట స్వీకరించువారు అని అర్థం.
శ్రీరంగచంద్ర మసమిందిరయా విహర్తుం
విన్యస్య విశ్వ చిద చిన్నయనాధికారం
యో నిర్వహత్యనిశ మంగుళిముద్రయైవ
సేనాన్య మన్య విముఖాః తమశి శ్రియామ
ఓంగుతులాప్ పూరాదత్తుదిత్త సెల్వన్ వాళియే
ఒండోడియాళ్ సూత్రవతి ఉఱై మార్బన్ వాళియే
ఇంగులగిల్ శఠగోపఱ్కు ఇతమురైత్తాన్ వాళియే
ఎళిల్ పిరంబిన్ సెంగోలై ఏంతుమవన్ వాళియే
పాంగుడన్ ముప్పత్తుమూవర్ పణియుమవన్ వాళియే
పంగయత్తాల్ తిరువడియై ప్పత్తినాన్ వాళియే
తేంగుపుగళ్ అరరంగరైయే సింతై సెయ్వోన్ వాళియే
సేనైయర్కోన్ సెంగమల త్తిరువడిగళ్ వాళియే
16. నమ్మాళ్వార్
(శఠకోప స్వామి)
ఆళ్వార్ తిరునగరి
వైయ్యాశి – విశాఖ
తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువంతాది, తిరువాయ్మొలి
వైష్ణవ కులపతిగా మరియు ప్రపన్న జన కూతస్తరుడిగా (శ్రీవైష్ణవుల అందరికి నేతగా) పిలువబడతారు. మాఱన్, పరాంకుశ, కురుగూర్ నంబి మొదలగు పేర్లతో కూడా పిలువబడతారు.
మాతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం య దేవ నియమేన మదన్వయానాం
ఆద్యస్య నః కులపతేర్ వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా
తిరుక్కురుగై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్ గళ్ వాళియే
తిరువాన తిరుముగత్తు చ్చెవియెన్నుం వాళియే
ఇరుక్కుమొళి ఎన్నెంజిల్ తేక్కినాన్ వాళియే
ఎందై ఎదిరసర్కు ఇఱైవనార్ వాళియే
కరుక్కుళియిల్ పుగా వణ్ణం కాత్తరుళ్ వోన్ వాళియే
కాసినియిల్ ఆరియనై క్కాట్టినాన్ వాళియే
వరుత్తమఱ వందెన్నై వాళ్విత్తాన్ వాళియే
మధురకవి తం పిరాన్ వాళి వాళి వాళియే
17. నాథముని
(శ్రీరంగనాథ ముని)
కాట్టుమన్నార్ గుడి (వీర నారాయణ పురం)
జ్యేష్టం – అనురాధ
న్యాయ తత్వం, యోగ రహస్యమ్, పురుష నిర్ణయం
నమ్మాళ్వార్ అవతార స్థలాన్ని వెతికి 4000 దివ్య ప్రబంధాలని సంపాదించారు వారు, నమ్మాళ్వారు పైన నిరంతరం ధ్యానించి దివ్య ప్రబంధ అర్థాన్ని కూడా సంపాదించారు.
నమః అచింత్య అద్భుద అక్లిష్ట జ్ఞాన వైరాగ్యరాశయే
నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే
ఆనితనిల్ అనుడత్తిళ్ అవతరిత్తాన్ వాళియే
ఆళవంతార్కు ఉపదేసం ఆరుళివైత్తాన్ వాళియే
బానుతెఱ్కిఱ్కండవన్ సొఱ్పలవురైత్తాన్ వాళియే
పరాంగుశనార్ సొఱ్పిరబంధం పరింతుకత్తాన్ వాళియే
గానముఱత్ తాళత్తిల్ కండిసైత్తాన్ వాళియే
కరుణైయినాళ్ ఉపదేస క్కతియళిత్తాన్ వాళియే
నానిలత్తిళ్ గురువరైయై నాట్టినాన్ వాళియే
నలంతిగళుం నాథముని నఱ్పతంగళ్ వాళియే
18. ఉయ్యక్కొండార్
(పుండరీకాక్ష)
తిరువెల్లరై
చిత్ర – కార్తీకం
4000 దివ్య ప్రబంధం మరియు వాటి అర్థాన్నినాథమునుల వద్ద నేర్చుకొని వాటిని విస్తరించారు.
నమః పంకజనేత్రాయ నాథః శ్రీపాదపంకజే
న్యస్త సర్వ భారాయాస్మత్ కులనాథాయ ధీమతే
వాలవెయ్యోన్తనై వెన్ఱ వడివళగన్ వాళియే
మాల్ మణక్కాల్ నమ్బి తొళుం మలర్ ప్పతత్తోన్ వాళియే
సీలమిగుణాథముని సీరురైప్పోన్ వాళియే
చిత్తిరైయిల్ కార్త్తిగైనాళ్ సిఱక్కవంతోన్ వాళియే
నాలిరండుం ఐయైన్ధుం నమక్కురైత్తాన్ వాళియే
నాలెట్టిన్ ఉట్పొరుళై నడత్తినాన్ వాళియే
మాలరంగ మణవాళర్ వళమురైప్పోన్ వాళియే
వైయముయ్యక్ కొండవర్ తాళ్ వైయగత్తిల్ వాళియే
19. మణక్కాల్ నంబి
(శ్రీరామ మిశ్ర)
మణక్కాల్ (శ్రీరంగం సమీపంలో)
మాఘం – మాసి
యమునాచార్యుల వారిని సరైన మార్గంలో పెట్టి వారిని గొప్ప ఆచార్యులుగా స్తాపింపచేశారు.
అయత్నతో యామున మాత్మదాసం అలర్క పత్రార్పణ నిష్క్రయేణ
యః క్రీతవానాస్థిత యౌవరాజ్యం నమామితం రామమేయ సత్వం
దేసముయ్యక్ కొండవర్ తాళ్ సెన్నివైప్పోన్ వాళియే
తెన్నరంగర్ సీరరుళై చ్చేర్ న్తిరుప్పోన్ వాళియే
దాసరథి తిరునామం తళైక్కవంతోన్ వాళియే
తమిళ్ నాథ మునియుగప్పై త్తాబిత్తాన్ వాళియే
నేసముదన్ ఆరియనై నియమిత్తాన్ వాళియే
నీణిలత్తిల్ పతిన్మర్ కలై నిఱుత్తినాన్ వాళియే
మాసిమగం తనిల్ విళాంగ వంతుతిత్తాన్ వాళియే
మాల్ మణక్కల్ నంబి పదం వైయగత్తిల్ వాళియే
20. ఆళవందార్
(యమునాచార్య)
కాట్టుమన్నార్ గుడి (వీర నారాయణ పురం)
ఆషాడం – ఉత్తరాషాడం
గీతార్థ సంగ్రహం, ఆగమ ప్రామాణ్యం, చతుశ్లోకి, స్తోత్ర రత్నం, మొదలగునవి.
గొప్ప పండితులు, వారు శ్రీరంగమును ప్రధాన కార్యాలయంగా స్థాపించాడు, అక్కడ అనేక శిష్యులతో నివసించారు.
యత్పదాంభోరుహ ధ్యాన విధ్వస్తాశేష కల్మషః
వస్తుతా ముపయాతోహం యామునేయం నమామి తమ్
మచ్చణియు మదిళరంగం వాళ్ విత్తాన్ వాళియే
మఱైణాన్గు మోరురువిల్ మగిళ్ న్దుకత్తాన్ వాళియే
పచ్చెయిట్ట రామర్ పదం పగరుమవన్ వాళియే
పాడియత్తో నీడేఱ ప్పార్వై శెయ్దోన్ వాళియే
కచ్చినగర్ మాయ నిరుక్కళల్ పణిన్దోన్ వాళియే
కడగ ఉత్తిరాడత్తుక్కా లుదిత్తాన్ వాళియే
అచ్చమఱ మనమగిళ్ చ్చియణైన్దిట్టాన్ వాళియే
ఆళవందార్ తాళినైగళ్ అనవరతం వాళియే
21. పెరియ నంబి
(మహాపూర్ణ స్వామి)
శ్రీరంగం
మార్గళి – జ్యేష్ట
తిరుప్పతిక్ గుడి
ఆళవందార్ మరియు రామానుజుల పైన గొప్ప అనురాగము వారికి ఉండేది. రామానుజులను శ్రీరంగానికి తీసుకువచ్చారు.
కమలాపతి కళ్యాణ గుణామృత నిషేవయా
పూర్ణ కామాయ సతతం పూర్ణాయ మహతే నమః
అంబువియిల్ పతింమర్కలై ఆయంతురైప్పోన్ వాళియే
ఆళవందార్ తాళినైయై అడైన్తుయన్తోన్ వాళియే
ఉంబర్ తొళుం అరంగేసర్కు ఉగాప్పుడైయోన్ వాళియే
ఓంగుతనుక్ కేట్టైతనిల్ ఉదిత్త పిరాన్ వాళియే
వంబవిళ్ తార్ వరదరురై వాళిసెయ్తాన్ వాళియే
మాఱనేర్ నమ్బిక్కు వాళ్వళిత్తాన్ వాళియే
ఎమ్పెరుమానార్ మునివర్కు ఇతమురైత్తాన్ వాళియే
ఎళిళ్ పెరియ నంబి శరణ ఇనితూళి వాళియే
22. ఎమ్పెరుమానార్
( శ్రీ రామానుజ)
శ్రీ పేరుంబుదూర్
చిత్రి – ఆర్ద్రా
శ్రీ భాష్యం, గీతా భాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత దీపం, వేదాంత సారం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీ వైకుంట గద్యం, నిత్య గ్రంథం.
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మన సాంప్రదాయాన్ని నలు వైపుల వ్యాపింప చేసిన ముఖ్యమైన గురువు.
యోనిత్య మచ్యుత పదాంభుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే
అస్మద్గురో ర్భగవతోస్య దయైక సింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే
అత్తిగిరి యరుళాళర్ అడిపణిన్దోన్ వాళియే
అరుట్కచ్చి నంబి యురైయాఱు పెత్తోన్ వాళియే
పత్తియుడన్ పాడియత్తైప్పగర్ న్దిట్టాన్ వాళియే
పదిన్మర్ కలై యుట్పొరుళైప్ పరిండు కత్తోన్ వాళియే
శుత్తమగిళ్ మాఱనడి తొళుదుయందోన్ వాళియే
తొల్ పెరియ నంబి శరన్ తోన్ఱినాన్ వాళియే
శిత్తిరైయి లాదిరైణాళ్ శిఱక్కవందోన్ వాళియే
శీర్ పేరుంబూదూర్ మునివన్ తిరువడిగళ్ వాళియే
23. ఎమ్బార్
(గోవింద పెరుమాళ్)
మధుర మంగళం
పుష్యమి – పునర్వసు
విజ్ఞాన స్తుతి, ఎమ్పెరుమానార్ వడివళగు పాశురం
శ్రీ రామానుజుని నీడగా పిలుస్తారు. లౌకిక వ్యవహారాలలో పూర్ణ అనాసక్తులుగా ఉండేవారు కాని భగవద్ విషయాలలో గొప్ప రుచి చూపించే వారు.
రామానుజ పదచ్ఛాయా గోవిన్దాహ్వనపాయినీ
తదాయత్త స్వరూపాసా జీయాన్మద్విశ్రమస్థలీ
పూవళారుం తిరుమగళార్ పొలివుత్తోన్ వాళియే
పాయిగై ముతల్ పతిన్మర్కలై ప్పొరుళురైప్పోన్ వాళియే
మావళారుం పూతూరాన్ మలర్ పతత్తోన్ వాళియే
మగరత్తిల్ పునర్పూసమ్ వంతుతిత్తోన్ వాళియే
తేవుమెప్పొరుళుం పడైక్కత్ తిరుంతినాన్ వాళియే
తిరుమలైనంబి క్కడిమై సెయ్యుమవన్ వాళియే
పావైయర్గళ్ కలవియిరుళ్ పకలెంఱాన్ వాళియే
బట్టర్ తొళుం ఎంబార్ పొఱ్పదమిరణ్డుమ్ వాళియే
24. పరాశర భట్టర్
( శ్రీరంగం)
వైశాఖం- అనురాధ
శ్రీరంగరాజ స్తవం, అష్ట స్లోకి, శ్రీ గుణరత్న కోశము, మొదలగునవి
కూరత్తాళ్వారు యొక్క సుప్రప్రసిద్ధమైన కుమారుడు. శ్రీరంగనాథుని మరియు శ్రీరంగనాయకి యొక్క దత్త పుత్రునిగా పిలువబడినవారు. శాస్త్రాలలో నైపుణ్యం, నియంత్రణ కారణంగా వారిని సర్వ తంత్ర స్వతంత్రునిగా పిలుస్తారు.
శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితః
శ్రీ వత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే
తెన్నరంగర్ మైన్తన్ ఎనచ్చిఱక్కవంతోన్ వాళియే
తిరునెడుంతాండగ ప్పొరుళై చ్చెప్పుమవన్ వాళియే
అన్నవయల్ పూతూరన్ ఆడిపణిన్దోన్ వాళియే
అనవరత మెమ్బారు క్కాట్చెయ్ వోన్ వాళియే
మన్ను తిరుక్కూరనార్ వళమురైప్పోన్ వాళియే
వైగాశి యనుడత్తిల్ వందుదిత్తోన్ వాళియే
పన్నుకలై నాల్వేదప్పయన్ తెరిన్తోన్ వాళియే
పరాశరనాం శీర్ భట్టర్ పారులగిల్ వాళియే
25. నంజీయర్
(వేదాంతి)
తిరునారాయణపురం
ఫాల్గుణము – ఉత్తర ఫాల్గుని
తిరువాయ్ మొళి 9000 పడి వ్యాఖ్యానం మరియు ఇతర వ్యాఖ్యానములు
భట్టర్ ద్వారా సంస్కరించబడిన వారు. మొదట్లో వారు అద్వైత సిద్ధాంతులు, కాని భట్టర్ ప్రమేయంతో వారు గొప్ప శ్రీవైష్ణవునిగా మారారు. వారిని వేదాంతాచార్యులు అని కూడా అంటారు.
నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే
యస్య వాగామృతాసార పూరితం భువన త్రయం
తెణ్డిరై శూళ్తిరువరంగం సెళిక్కవందోన్ వాళియే
శీమాదవనెన్నుం శేల్వనార్ వాళియే
పండై మఱై త్తమిళ్ ప్పొరుళైప్ పగరవందోన్ వాళియే
పన్గునియిల్ ఉత్తరనాళ్ పారుదిత్తాన్ వాళియే
ఒండొడియాళ్ కలవిదన్నై యొళిత్తిట్టాన్ వాళియే
ఒన్బదినాయిరప్పొరుళై ఓదుమవన్ వాళియే
ఎండిశైయుం శీర్ బట్టర్ ఇణైయడియోన్ వాళియే
ఎళిళ్ పెరుగుం నన్జీయర్ ఇని తూళి వాళియే
26. నంపిళ్ళై
(లోకాచార్య)
నంబూర్
కార్తీకం – కృత్తిక
తిరువాయ్మొలి 36000 పడి వ్యాఖ్యానం మరియు ఇతర వ్యాఖ్యానములు.
సంస్కృతం / ద్రావిడ శాస్త్రంలో గొప్ప పండితులు. శ్రీరంగంలో తిరువాయ్మొలి పైన ప్రసంగం మొట్ట మొదట వీరే ఇచ్చారు. తిరుమంగై ఆళ్వార్ అవతారంగా పిలువబడతారు.
వేదాంత వేద్యామృత వారిరాశే:
వేదార్థ సారామృత పూరమగ్ర్యం
ఆదాయ వర్షంతమహం ప్రపద్యే
కారుణ్య పూర్ణం కలివైరి దాసం
తేమరువుం సెంగమలత్ తిరుత్తాళ్ గళ్ వాళియే
తిరువరైయిల్ పట్టాడై శేర్మరుంగుం వాళియే
తామమణి వడమార్వుం పురిణూలుం వాళియే
తామరైక్కై ఇణైయళగుం తడంపుయముం వాళియే
పామరువుంతమిళ్ వేదం పయిల్ పవళం వాళియే
పాడియత్తిన్ పొరుళ్ తన్నై ప్పగర్ణావుమ్ వాళియే
నామనుతల్ మతిముగముం తిరుముడియుం వాళియే
నంపిళ్ళై వడివళగుం నాడోఱుం వాళియే
27. వడక్కు తిరువీధి ప్పిళ్ళై
(శ్రీ కృష్ణ పాద)
శ్రీరంగం
జ్యేష్టం – స్వాతి
తిరువాయ్మొలి 36000 పడి వ్యాఖ్యానం మరియు ఇతర వ్యాఖ్యానములు.
నంపిళ్ళై కు చాలా అంకితమైన శిష్యుడు. నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానాలని లిఖిత పూర్వకం చేసారు. మనకు రెండు గొప్ప రత్నాలను ఇచ్చారు – పిళ్ళై లోకాచార్య మరియు మనవాళ పెరుమాళ్ నాయనారు.
శ్రీ కృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా
యత్ప్రసాద ప్రభావేన సర్వ సిద్ధిరభూన్మమ
ఆనితనిల్ సోతిణాన్నాల్ అవతరిత్తాన్ వాళియే
ఆళవార్గళ్ కలైప్పొరులై ఆయన్తురైప్పోన్ వాళియే
తానుగంత నంపిళ్ళై తాళ్తొళువోన్ వాళియే
శఠకోపన్ తమిళ్ క్కీడు సాత్తినాన్ వాళియే
నానిలత్తిల్ పాడియత్తై నడత్తినాన్ వాళియే
నల్ల ఉలగారియనై నమక్కళిత్తాన్ వాళియే
ఈనమఱ ఎమైయాళుం ఇఱైవనార్ వాళియే
ఎంగళ్ వడవీతిప్పిళ్ళై ఇణైయడిగళ్ వాళియే
28. పిళ్ళైలోకాచార్య
శ్రీరంగం
ఐప్పస్ – శ్రవణం
ముమ్ముక్షుపడి, తత్వ త్రయం, శ్రీవచన భూషణం, మొదలగునవి (18 రహస్య గ్రంథాలు, ఇంక అనేకం)
ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం సరళమైన భాషలో మన సాంప్రదాయం యొక్క నిగూఢమైన సూత్రాలను లిఖిత పూర్వకం చేసిన చాలా దయగల ఆచార్యులు.
లోకాచార్య గురవే కృష్ణ పాదస్య సూనవే
సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః
అత్తిగిరి యరుళాళ రనుమతియోన్ వాళియే
ఐప్పసియిల్ తిరువోణత్తు అవతరిత్తాన్ వాళియే
ముత్తిణెరి మఱైత్తమిళాల్ మొళిన్తరుళ్వోన్ వాళియే
మూదరియ మణవాళన్ మున్పుతిత్తాన్ వాళియే
నిత్తియం నంపిళ్ళైపదం నెంజిల్ వైప్పోన్ వాళియే
నీళ్వసనపూడణత్తాళ్ నియమిత్తాన్ వాళియే
ఉత్తమమాం ముడుమ్బైణగరుదిత్త వళ్ళల్ వాళియే
ఉలగారియన్ పదంగళ్ ఉళితొఱుం వాళియే
29. తిరువాయ్మొలి పిళ్ళై
(శ్రీ శైలేశ)
కుంతీ నగరం
వైశాకం – విశాఖం
పెరియాళ్వార్ తిరుమొళి స్వాపదేశం
తన జీవితమంతా నమ్మాళ్వార్ మరియు తిరువాయ్మొలి కోసం అంకితం చేశారు. ఆళ్వారు తిరునగరిలో ప్రతి ఒక్కటి పునః స్థాపించి అక్కడ శ్రీ రామానుజులకు కొత్త ఆలయాన్ని నిర్మించారు.
నమ శ్రీశైల నాథాయ కుంతీ నగర జన్మనే
ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్య శాలినే
వైయగమెన్ శఠకోపన్ మఱైవళర్త్తోన్ వాళియే
వైకాసి విశాకత్తిల్ వంతుతిత్తాన్ వాళియే
ఐయన్ ఆరుణ్మారి కలై ఆయంతురైప్పోన్ వాళియే
అళగారుం ఎతిరాసర్ ఆడిపణివోన్ వాళియే
తుయ్యవులగారియన్ తన్ తుణైప్పదత్తోన్ వాళియే
తొల్ కురుకాపురి అతనై త్తులక్కినాన్ వాళియే
తెయ్వనగర్ కుంతి తన్నిల్ సిఱక్కవంతోన్ వాళియే
తిరువాయ్ మొళిప్పిళ్ళై తిరువడిగళ్ వాళియే
30. మనవాళ మహామునులు
( రమ్య జామాత్రు ముని)
ఆళ్వార్ తిరునగరి
ఐప్పస్ – తిరు మూలం
అనేక స్తోత్రాలు, తమిళ ప్రబంధాలు, వ్యాఖ్యానాలు
శ్రీ రామానుజుల యొక్క పునః అవతారం. తిరువాయ్మొలి ఈడు వ్యఖ్యానం ఒక సంవత్సరం పాటు శ్రీరంగనాధుడు మరియు వారి పరీవారం ఎదుట ప్రసంగించారు. ప్రసంగముల ఆఖరున, శ్రీరంగనాధుడు వారిని ఆచార్యులుగా స్వీకరించి మరియు వారికి సుప్రసిద్ధమైన శ్రీశైలేశ దయాపాత్రం తనియన్ ను వారికి అర్పించారు.
శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం
యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిమ్
ఇప్పువియిళ్ అరంగేసర్ క్కు ఈడళిత్తాన్ వాళియే
ఎళిళ్ తిరువాయ్మొలి పిళ్ళై ఇణైయడియోన్ వాళియే
ఐప్పసియిళ్ తిరుమూలత్తు అవతరిత్తాన్ వాళియే
అరవరస ప్పెరున్జోతి అనంతనెన్ఱుం వాళియే
ఎప్పువియుం శ్రీశైలం ఏత్తవంతోన్ వాళియే
ఏరారుం ఎతిరాసర్ ఎనవుదిత్తాన్ వాళియే
ముప్పురినూల్ మణివడముమ్ ముక్కోల్ తరిత్తాన్ వాళియే
మూతరియ మణవాళమామునివన్ వాళియే
అడియేన్ రఘువంశీ రామానుజ దాసన్
మూలము : http://pillai.koyil.org/index.php/presentations/ (AzhwArs – quick reference, OrAN vazhi AchAryas – quick reference)
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org