Author Archives: raguvamsi

బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్యమైన అర్చారూపములు మరియు గుణములు

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – శ్శ్రీమన్నారయణుడు ఎవరు?

వ్యాస మరియు పరాశర ఆడుకొని తిరిగి ఆణ్డాళ్ పాట్టి ఇంటికి వచ్చేసరికి, ఆణ్డాళ్ పాట్టి పూలు, ఫలములు ఒక పళ్ళెములో పెట్టడము గమనించారు.

వ్యాస~: పాట్టి, ఎవరి గురించి ఈ పూలు మళ్ళీ ఈ పండ్లు?

ఆణ్డాళ్ పాట్టి~: వ్యాస, ఇప్పుడు శ్రీరంగనాదుడు పుఱప్పాడు(తిరువీధి) నకు వచ్చు సమయము.ఎవరైనా అతిదులు వచ్చినప్పుడు, ముఖ్యముగా పెద్దవారు విచ్చేసినప్పుడు, వారికి సపర్యలు చేయడము మన ధర్మము. ముఖ్యముగా భూలోకమునకే రాజైన స్వామి విచ్చేస్తున్నపుడు వారిని గౌరవించడము తర్వాత ఆనందింపచేయడము మన కర్తవ్యము. వారికి ఎటువంటి లోటు రానివ్వకొండ జాగ్రత్తగ చూసుకోవలి.

పరాశర~: ఓహ్ తప్పకుండా పాట్టి. అయితే, నేను శ్రీరంగనాదుడికి పళ్ళని సమర్పిస్తాను.

ఆణ్డాళ్ పాట్టి~: తప్పకుండ పరాశర. రండి, వారి రాకకై ద్వారము దగ్గర నుంచోని ఎదురుచూద్దాము.

namperumal-2-nachiars

నమ్పెరుమాళ్ (శ్రీరంగనాదన్) ఆణ్డాళ్ పాట్టి ఇంటి ముందుకు విచ్చేసిరి. పరాశరుడు చాలా సంతోషముతో పూలు, పళ్ళను శ్రీరంగనాదుడికి సమర్పించాడు.

పరాశర ~: పాట్టి, స్వామి తన ఎడమ చేతియందు ఏమి పట్టుకొన్నాడు?

namperumal2

చక్రము కుడిచేతియందు, శంఖు ఎడమచేతియందు– తన భుజములపై,
అభయ హస్తము (ఆశ్రయమునకు గుర్తుగా) కుడిచేతి, గద ఎడమ చేతియందు– భుజమునకు క్రిందగా

ఆణ్డాళ్ పాట్టి~: స్వామి గదను తన ఎడమచేతి యందు పట్టుకొనెను, పరాశర. అర్చావతారమునందు శ్రీరంగనాదుడు నాలుగు హస్తములను కలిగిఉన్నారు, ఇంకొక ఎడమచేతియందు భజమునకు పైన శంఖమును, సుదర్శన చక్రమును కుడి భుజమునకు పైన ఉన్న చేతియందు ధరించినారు. మన యొక్క భాదలను నిర్మూలించడమునకై వారు తమ యొక్క ఆయుదములను ధరించి మనలను ఎల్లపుడూ కాపాడుతానని గుర్తుచేస్తున్నారు.

వ్యాస~: మరి కుడి చేతికి గల ప్రాముఖ్యత ఏమిటి పాట్టి?

namperumAL-abhayahasthamఅభయ హస్తము – ఆశ్రయించువారికి నేనున్నానని గుర్తుగా

ఆణ్డాళ్ పాట్టి~: చాలా మంచి ప్రశ్న. తన అభయ హస్తము “ఎల్లప్పుడూ నేనున్నాను మిమ్మలని కాపాడుటకై, భయపడనవసరము లేదు” మరియు మనతో ఉన్న అనుబంధమునకు, మనపై గల తన వాత్సల్యమునకు గుర్తు. ఉదాహరణకు, ఓ దూడకి తన తల్లి అవసరం వచ్చినప్పుడు, ఆ తల్లి, అంటే ఆవు, పరుగు పరుగున వచ్చి తన బిడ్డని ఆదుకుంటుందే కాని, ఆ దూడ యొక్క ఇదువరుకటి ప్రవర్తనను (లేదా తప్పులను) మనుసులో పెట్టుకొని ప్రవర్తించదు. తన తక్షన కర్తవ్యం తన బిడ్డ యొక్క బాధను తగ్గించి సంతోషపరచడం. ఆలాంటి గొప్ప అనుబంధం మనకీ ఆయనకి మధ్య. దూడలం మనం ఐతే, ఆయన ఆవు అవుతాడు.

namperumal2 - smiling-face and tall-crown

పెద్ద కీరీటము (ఆదిపత్యమునకు)మరియు చిరు దరహాసము(నిరాడంభరము)

వ్యాస~: పాట్టి, స్వామి తలపైన ఉన్నది ఏమిటది?

ఆణ్డాళ్ పాట్టి~: అది కీరీటము, వ్యాస. అది ప్రపంచములో అన్నింటికినీ తానే సార్వభౌముడను అను విషయమును తెలియచేస్తుంది.

పరాశర~: కీరీటము చాలా అందముగా ఉంది పాట్టి. అది తన ఆరాధనీయమైన ముఖమునకు సరిగ్గా సరిపోయినది.

ఆణ్డాళ్ పాట్టి~: అవును, తను చాలా పూజ్యమైన ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. స్వామికి మనతో ఉండడము చాలా సంతోషము, మరీముఖ్యముగా మీవంటి పిల్లలమధ్యన ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సంతోషముగా ఉంటారు.

పరాశర~: అవును పాట్టి. నేను చాలా దగ్గరినుండి చూసాను, వారి దరహాసమును మరియు వారి పాదములను.

ఆణ్డాళ్ పాట్టి~: అరె, మంచిది, పరాశర. సాధారణంగా, వారి యొక్క పాదములను మనము “పాదపద్మములు” అని అంటాము. ఎందుకంటే, అవి సహజముగానే సుకుమారమైనవి మరియు అందమైనవి. వారి ముఖముపై ఆ చెదరని నవ్వు ఆయన అనందముగా కేవలం మనకోసం ఆ వైకుంఠం నించి క్రిందకి దిగి వచ్చాడని సూచిస్తుంది. అలాగే, వారు వారి పాదపద్మములను ధృడముగా మళ్ళీ స్థిరముగా ఆ కమల పీఠము పై వుంచి మనకి ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఆయన మనకోసమే వచ్చాడని మళ్ళీ మనని ఎప్పడికీ వదిలి వేళ్ళే ప్రశక్తే లేదు అని. అయితే, నేడు, ఆ స్వామి యొక్క అనేక మంగళకరమైన గుణములలో, కొన్ని శ్రెష్ఠమైన గుణములను వారి అర్చావతార రూపములో చూడగలిగాము, అవి: వాత్సల్యము (తల్లికి సహజముగా ఉండే సహనము – మన రక్షణ కొరకై చూపే వారి శ్రీ హస్తము), స్వామిత్వము (శ్రెష్ఠత్వము/ఆధిపత్యము – పెద్ద కిరీటము), శౌశీల్యము (ఎలాంటి భేధ భావము లేకుండ మనతో కలసిపోగలడం – వారి ముఖముపై చెదరని చిరునవ్వు), మరియు సౌలభ్యము (వారిని మనము సులభముగా చేరుకోవడం – వారి పాదపద్మములను తేలికగా ఆశ్రయించే వీలు).

వ్యాస మరియు పరాసర విస్మయంతో నిలబడి, ఆ ఊరేగింపును కళ్ళార్పకుండా అనుసరించారు.

అడియేన్ : రఘు వంశీ రామానుజ దాసన్

మూలము : http://pillai.koyil.org/index.php/2014/08/beginners-guide-sriman-narayanas-divine-archa-form-and-qualities/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – శ్రీమన్నారయణుడు ఎవరు?

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – శ్రీవైష్ణవము గురించి పరిచయము

 

ఆణ్డాళ్ నాన్నమ్మ పరాశర మరియు వ్యాసులని  శ్రీరంగము కోవెలకి తీసుకొని వెళ్ళింది.

srirangam-temple

వ్యాస~: ఆహా, నాన్నమ్మ, ఇది చాలా పెద్ద గుడి. మేము ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి పెద్ద ఆలయం చూడలేదు. రాజులు మాత్రమే ఇటువంటి పెద్ద భవనములలో ఉంటారని విన్నాము. మనము ఇప్పుడు ఏ రాజుగారినైనా దర్శించుకోవడానికి వెళ్ళుతున్నామా?

ఆణ్డాళ్ నాన్నమ్మ~: అవును, ఇప్పుడు మనము అందరికీ రాజైన రంగరాజన్ ని చుడడానికి వెళ్ళుతున్నాము. రంగరాజన్ (శ్రీరంగమునకు రాజు), మనము వారిని ప్రేమతో పెరియ పెరుమాళ్ మరియు నంపెరుమాళ్ అని పిలుస్తాము. పెరియ పెరుమాళ్ తన యొక్క ఆధిపత్యాన్ని లేదా స్వామిత్వమును మనకు తెలియపరచడానికి, వారు ఆది శేషునిపై పవళించి ఉంటారు. వీరు తమ భక్తుల రాకకై వేచి ఉండి అనుగ్రహిస్తారు, కాని నమ్పెరుమాళ్ సౌలభ్యముతో అనుగ్రహిస్తారు, ఎవరైనా వీరిని సులభముగా దర్శించుకోవచ్చు, ఎట్లా అంటే వీరు తమ భక్తుల యొక్క ఇబ్బందులను గ్రహించి, ఎవరైతే వీరిని దర్శించుకొనుటకు రాలేరో, వీరు తమ పుఱప్పాడు (సవారి/తిరువీధి సేవ) ద్వారా వాళ్ళని అనుగ్రహిస్తాడు. శ్రీరంగములో సంవత్సరము పొడుగునా నమ్పెరుమాళ్ తమ భక్తుల వద్దకి స్వయముగా తానే వచ్చి వారి అనుగ్రహమును అందరికీ ప్రసాదిస్తాడు.

పరాశర~: నాన్నమ్మ, కాని పెరుమాళ్ వైకుంఠములో కదా ఉండేది, మరి ఇక్కడ కూడా ఎందుకు ఉన్నారు?

ఆణ్డాళ్ నాన్నమ్మ~: అవును పరాశర,నీవు విన్నది నిజము. పెరుమాళ్ ఉండేది వైకుంఠములోనే కాని వారు మనతో ఉండడానికై ఇక్కడకు కూడా వస్తారు.నీవు వినే ఉంటావు, నీరు ఏ విధముగా తన స్వభావమును వివిధ రూపములలో కలిగి ఉండునో: ధ్రవము, ఆవిరి మరియు మంచు. అదే విధంగా, పెరుమాళ్ ఐదు రూపములను కలిగి ఉన్నారు,అవి పర, వ్యూహ, విభవ, అంతర్యామి మరియు అర్చ. ఇక్కడ శ్రీరంగములో పెరుమాళ్ అర్చావతారము లో ఉన్నారు. అవతారం అనగా క్రిందికి రావడము. నేను ఇంతకు ముందు చెప్పిన విధముగా, మనము అందరి మంచికై వారిని ప్రార్థిస్తాము. శ్రీమన్నారాయణుడు మన ప్రార్థనలను విని ఇక్కడికి వచ్చారు. ఇదే కాక, వారికి మన యెడల గొప్ప వాత్సల్యము కలిగి ఉండటముచే, ఆయన మనతోనే ఉండటానికి ఇష్టపడతాడు. ఈ కారణంగా స్వామి శ్రీరంగం లో వేంచేసి వున్నాడు.

bhagavan-5-forms-parathvadhi-panchakam

పాట్టి, వ్యాస, మరియు పరాశర సన్నిధిలోనికి వెళ్ళి పెరియ పెరుమాళ్ళను సేవించుకొనిరి.

వ్యాస~: మేము కూడా మీరు చెప్పినవాటిని విన్నతరువాత వీరియందు ప్రీతి కలుగుతున్నది. అంతే కాక, స్వామి చూడడానికి మనలానే ఉన్నారు, నాన్నమ్మ.

ఆణ్డాళ్ నాన్నమ్మ~: స్వామి చూచుటకు మాత్రమే కాదు, ఒకప్పుడు మన లానే జీవించాడు కూడ. స్వామి విభవ అవతారములో, తన వైకుంఠమును వదిలి శ్రీ రామ, శ్రీ కృష్ణుడివలే ఇక్కడ జన్మించి, మనలో ఒకరిగా ఇక్కడ నివసించాడు. మనమందరికీ ప్రత్యేకముగా శ్రీ రామావతారము లేద కృష్ణావతారము మీద అనురాగము కలిగి ఉండడముచే, స్వామి కృష్ణుని లా పెరియ పెరుమాళ్ళ యందు, శ్రీ రాముని లా నమ్పెరుమాళ్ల లో మనతోనే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. పెరియ పెరుమాళ్ ఎల్లప్పుడు పడుకొని, తన యొక్క భక్తుల గురించి దీర్ఘముగా ఆలొచిస్తూ కనిపిస్తాడు, నంపెరుమాళ్ అయితే ఎప్పుడూ మన మధ్య ఉంటూ మన ప్రేమని స్వీకరిస్తూ ఆనందంగా ఉంటాడు.

ఆపై ముగ్గురూ ఇంటికి చేరుకొనిరి.

వ్యాస మరియు పరాశర~: సరే అయితే, నాన్నమ్మ. మేము ప్లేగ్రౌండు కి వెళుతున్నాము.

ఆణ్డాళ్ నాన్నమ్మ~: జాగ్రత్తగా ఆడుకోండి పిల్లలు, మళ్ళీ మర్చిపోవద్దు, వీలైనంత వరకు మీ స్నెహితులతో శ్రీమన్నారాయుణిడి వైభవం గురుంచి మాట్లాడుకోండి.

అడియేన్ : రఘు వంశీ రామానుజ దాసన్

మూలము : http://pillai.koyil.org/index.php/2014/07/beginners-guide-who-is-sriman-narayana/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

బాల పాఠము – శ్రీవైష్ణవము గురించి పరిచయము

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

ఆణ్డాళమ్మగారు తిరుప్పావై అనుసంధిస్తుండగా,  పరాశర,వ్యాసులు పరుగెడుతూ ఆవిడ దగ్గరికి వచ్చిరి.

paramapadhanathan-2

 

పరాశర: నాన్నమ్మ! మాకు ఒక సందేహము కలిగింది. శ్రీవైష్ణవమును గురించి తరచూ వింటున్నాము కదా,దయచేసి దాని గురించి మాకు వివరించవా?

ఆణ్డాళమ్మగారు: ఓహ్! చాలా మంచి ప్రశ్న పరాశరా. శ్రీవైష్ణవము శ్రీమన్నారాయణుడే పరమదైవముగా భావించి సకలజనుల చేతను ఆరాధింపబడె శాశ్వత ముక్తి మార్గము.

వ్యాస: కాని నాన్నమ్మ,ఎందుకు ఒక్క  శ్రీమన్నారాయణుడే? ఎందుకు మరొకరు కాదు.

ఆణ్డాళమ్మ గారు~: వ్యాసా! చాలా మంచి ప్రశ్న. చెబుతాను వినండి. శ్రీవైష్ణవము వేదము,వేదాంతము మరియు ఆళ్వారుల దివ్య ప్రభందములు ఆధారముగా కలది. వీటన్నిటినీ ప్రమాణములు అని అందురు – ప్రమాణము అనగా శ్రేష్ఠమైన జ్ఞానమునకు ఆధారభూతమైనది. ఈ ప్రమాణములు సమస్తములందు శ్రీమన్నారాయణుడే అన్ని కారణములకు కారణమని చెప్పబడెను.అందువలన మనమందరమూ ఆ కారణకారకుడినే ఆరాధిస్తాము.ఆ ముఖ్య కారకుడు శ్రీమన్నారాయణుడని వివరించబడెను. అందువలన శ్రీవైష్ణవము పూర్తిగా శ్రీమన్నారాయణుడిపై దృష్టి సారించబడెను.

వ్యాస~: నాన్నమ్మ! చాలా మంచివిషయమును తెలుసుకొన్నాము.నాకు అర్థమైనదానిని బట్టి మనమూ శ్రీవైష్ణవమును అనుసరించుచున్నాము కదా. అందువలన మనము ఏమి చేయవలెను నాన్నమ్మ?

ఆణ్డాళమ్మగారు ~: మనము నిత్యమూ పెరుమాళ్, తాయారు, ఆళ్వారులు, ఆచార్యులను ఆరాధించవలెను.

పరాశర ~:నాన్నమ్మ! మీరు ఒక్క శ్రీమన్నారాయణుడినే అని చెప్పారు.కాని ఎందుకు తాయార్, ఆళ్వారులు, ఆచార్యులని ఆరాధించవలెనని చెబుతున్నారు?

ఆణ్డాళమ్మ గారు~: ఇది చాలా మంచి ప్రశ్న పరాశరా! తాయార్ పెరుమాళ్ళ దేవేరి(అనగా ధర్మపత్ని). కనుక, పెరుమాళ్ మనకు తండ్రి మరియు తాయార్ మన తల్లి. మనము వారిద్దరినీ కలిపి ఆరాధించవలెను.ఏ విధముగా మీరు మీ తల్లితండ్రులకు తరచూ ప్రణామములు చేయుదురో-ఆ విధముగా పెరుమాళ్ మరియు తాయారులను కలిపి ఆరాధించవలెను. ఆళ్వారులు మరియు ఆచార్యులు శ్రీమన్నారాయణుడి ప్రియమైన భక్తులు. వారు శ్రీమన్నారాయణుడి యెడల దృఢమైన భక్తిని కలిగిఉందురు. వారే పెరుమాళ్ మరియు తాయారుల కీర్తిని చాటినవారు – అందువలన వారిని కూడా మనము సేవిస్తాము.

వ్యాస~~: ఇంకా ఏమేమి చేయవలెను నాన్నమ్మ?

ఆణ్డాళమ్మగారు ~: శ్రీవైష్ణవులందరూ తమను పెరుమాళ్ మరియు తాయారుల పిల్లలుగా భావించుకొనవలెను. అందరియొక్క చక్కని జీవనమునకై ప్రార్థించవలెను మరియు వారిలో భక్తి పెంపొందెందుకు సహాయమును చేయవలెను.

పరాశర~~: అది ఏ విధముగా చేయవలెను నాన్నమ్మ?

ఆణ్డాళమ్మ గారు ~~: ఓహ్! అది చాలా సులభము.ఎప్పుడైనా మనము ఎవరిని కలిసినా వారితో ఒక్క పెరుమాళ్, తాయార్, ఆళ్వారులు మరియు ఆచార్యుల గురించి మాత్రమే సంభాషింపవలెను.ఆ విధముగానే పెరుమాళ్, తాయార్, ఆళ్వారులు మరియు ఆచార్యుల గొప్పతనమును చెప్పడము వలన – వారిలో కూడా భక్తి భావము పెరుగును.ఇది అందరికీ భగవల్లాభమును చేకూర్చును.

వ్యాస~~: ఇది చాలా బాగుంది నాన్నమ్మ.మన సమయమును సద్వినియోగమును చేసుకొనుటకు ఏంత మంచి మార్గము కలదు? దన్యవాదములు నాన్నమ్మ. ఈ రోజు శ్రీవైష్ణవమును గురించి కొన్ని ప్రాధమికమైన విషయములని తెలుసుకొన్నాము..

ఆణ్డాళమ్మ గారు ~~: మీరిద్దరూ చాలా మంచిప్రశ్నలను అడిగారు. పెరుమాళ్ మరియు తాయార్ మీ ఇద్దరి యెడల చాలా సంతోషముగా ఉంటారు. ఇంక మనము కొంచెము ప్రసాదమును స్వీకరిద్దాము.

అడియేన్ : రఘు వంశీ రామానుజ దాసన్

మూలము : http://pillai.koyil.org/index.php/2014/07/beginners-guide-introduction-to-srivaishnavam/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org