బాల పాఠము – తిరుమళిశై ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ముదల్ ఆళ్వారులు – భాగము -2

 

thirumazhisaiazhwar

 

వ్యాస మరియు పరాశర ను తిరువేళ్లరై గుడికి తీసుకోని వెళ్ళింది ఆండాళ్ నాన్నమ్మ. శ్రీరంగం రాజగోపురం బయట వారు బస్సెక్కారు.

పరాశర: మనం బస్సులో ఉన్నపుడు, మీరు నాలుగవ ఆళ్వారు గురించి చెబుతారా?

ఆండాళ్ నాన్నమ్మ:  తప్పకుండా , పరాశర.  మీరు యాత్ర సమయంలో  ఆళ్వారుల గురించి చర్చిన్చాలనుకుంటున్నారని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది,

పరాశర మరియు వ్యాస అవ్వని చూచి చిరుమందహాసంతో నవ్వారు. శ్రీరంగం నుండి బస్సు మొదలైయింది.

ఆండాళ్ నాన్నమ్మ: నాలుగవ ఆళ్వారు తిరుమళిశై ఆళ్వారు, భక్తిసార అని అందరు ఇష్టంగా పిలిచేవారు. వారు చెన్నై దగ్గర తిరుమళిశై గ్రామంలో భార్గవ ముని, కనకాంగి దంపతులకు మాఘ మాసంలో మఘానక్షత్రం లో  జన్మించారు. ఈ ఆళ్వారు అందరి కన్నా దీర్ఘకాలం జీవించారు. వారు “4700 సంవత్సరాలు” జీవించారు.

పరాశర అండ్ వ్యాసులు అవ్వరపోయి “4700 సంవత్సరాలా?!!” అని అడిగారు.

ఆండాళ్ నాన్నమ్మ: అవును, వీరు పెయాళ్వారును కలుసుకునేటప్పటికి వివిధ తత్వ శాస్త్రాల  అధ్యయనం చేసారు.

వ్యాస: ఒహో! తరువాత ఏమి అయ్యింది?

ఆండాళ్ నాన్నమ్మ: తిరుమళిశై ఆళ్వారుకు పెరుమాళ్ గురించి హితభోద చేసి శ్రీవైష్ణవంలోకి తీసుకొని వచ్చారు పెయాళ్వారు.

బస్సు ఛత్రం బస్సుస్టాండ్ కు చేరుకుంది.

ఆండాళ్ నాన్నమ్మ: అంతర్యామి గురించి తెలుసుకోవాలని ప్రత్యేక శ్రద్ధ ఉండేది, మన లోపల ఉన్న భగవానుడు మరియు కుంభకోణం ఆరవముదన్ పెరుమాళ్లకు మిక్కిలి అంకిత భావంతో ఉండేవారు. అది ఎంత వరకు చేరిందనగా పెరుమాళ్, ఆళ్వారు వారి వారి పేర్లు మార్చుకున్నారు. పెరుమాళ్ ఆరవముద ఆళ్వారు గా మరియు ఆళ్వారు తిరుమాళిశైపిరాణ్ గా ప్రసిద్ధ మైనారు.

పరాశర: ఒహో, నాన్నమ్మ. వారు పెరుమాళ్లకు చాలా సన్నిహితులుగా ఉన్నట్టున్నారు.

ఆండాళ్ నాన్నమ్మ: అవును, వారు ఉండేవారు. ఒకసారి ఒక ఊర్లో వారు పయనిస్తున్నారు, ఆ ఊరి గుడికి వెళ్లారు. వారంటే పెరుమాళ్లకు ఎంత ప్రీతి , ఆళ్వారు ఎటువైపు వెళ్ళితే పెరుమాళ్ల అటువైపు తిరగసాగారు. అలాగే, ఆరావముదన్ ఎమ్పెరుమాన్ ఎంతో ప్రీతితో వినమ్రంగా ఆళ్వారు మాట విని శయనించినవారు లేచేవారు.

పరాశర మరియు వ్యాసులు ఇద్దరు ఆశ్చర్యపోయి అడిగారు ” తరువాత ఏమి అయ్యింది అవ్వ?”

ఆండాళ్ నాన్నమ్మ: ఆళ్వారు ఆశ్చర్యపోయి పెరుమాళ్లని మరళా శంయనించామని విన్నపించారు. పెరుమాళ్ కంగారు పడ్డారు. వారు ఇప్పడికి సగం శయనించిన స్థితిలో ఉన్నారు.

వ్యాస: ఓ! చాలా బావుంది అవ్వ. ఒక రోజు మనం ఈ పెరుమాళ్లను దర్శించాలి.

ఆండాళ్ నాన్నమ్మ: తప్పకుండా,  మనం వెళ్లదాం ఎప్పుడైనా అక్కడికి. ఆళ్వారు చాలా కాలం అక్కడ ఉన్నారు. వారు రచించిన 2 ప్రబంధములు – తిరుచ్ఛంద విరుత్తం మరియు నాన్ముగన్ తిరువందాది, తప్ప అన్నిరచనలు కావేరి నదిలో పారవేస్తారు. చిట్టచివర వారు పరమపదాన్ని అదిష్ఠించి ఎమ్బెరుమాన్ రుని సేవలో శాశ్వతంగా ఉండిపోయారు.

తిరువేళ్లరై చేరుకుంది బస్సు. వారు గుడిలోనికి వెళ్లి పెరుమాళ్ మరియు తాయార్ ని దర్శించుకున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-thirumazhisai-azhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *