శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
<< బాల పాఠము – శ్శ్రీమన్నారయణుడు ఎవరు?
వ్యాస మరియు పరాశర ఆడుకొని తిరిగి ఆణ్డాళ్ పాట్టి ఇంటికి వచ్చేసరికి, ఆణ్డాళ్ పాట్టి పూలు, ఫలములు ఒక పళ్ళెములో పెట్టడము గమనించారు.
వ్యాస~: పాట్టి, ఎవరి గురించి ఈ పూలు మళ్ళీ ఈ పండ్లు?
ఆణ్డాళ్ పాట్టి~: వ్యాస, ఇప్పుడు శ్రీరంగనాదుడు పుఱప్పాడు(తిరువీధి) నకు వచ్చు సమయము.ఎవరైనా అతిదులు వచ్చినప్పుడు, ముఖ్యముగా పెద్దవారు విచ్చేసినప్పుడు, వారికి సపర్యలు చేయడము మన ధర్మము. ముఖ్యముగా భూలోకమునకే రాజైన స్వామి విచ్చేస్తున్నపుడు వారిని గౌరవించడము తర్వాత ఆనందింపచేయడము మన కర్తవ్యము. వారికి ఎటువంటి లోటు రానివ్వకొండ జాగ్రత్తగ చూసుకోవలి.
పరాశర~: ఓహ్ తప్పకుండా పాట్టి. అయితే, నేను శ్రీరంగనాదుడికి పళ్ళని సమర్పిస్తాను.
ఆణ్డాళ్ పాట్టి~: తప్పకుండ పరాశర. రండి, వారి రాకకై ద్వారము దగ్గర నుంచోని ఎదురుచూద్దాము.
నమ్పెరుమాళ్ (శ్రీరంగనాదన్) ఆణ్డాళ్ పాట్టి ఇంటి ముందుకు విచ్చేసిరి. పరాశరుడు చాలా సంతోషముతో పూలు, పళ్ళను శ్రీరంగనాదుడికి సమర్పించాడు.
పరాశర ~: పాట్టి, స్వామి తన ఎడమ చేతియందు ఏమి పట్టుకొన్నాడు?
చక్రము కుడిచేతియందు, శంఖు ఎడమచేతియందు– తన భుజములపై,
అభయ హస్తము (ఆశ్రయమునకు గుర్తుగా) కుడిచేతి, గద ఎడమ చేతియందు– భుజమునకు క్రిందగా
ఆణ్డాళ్ పాట్టి~: స్వామి గదను తన ఎడమచేతి యందు పట్టుకొనెను, పరాశర. అర్చావతారమునందు శ్రీరంగనాదుడు నాలుగు హస్తములను కలిగిఉన్నారు, ఇంకొక ఎడమచేతియందు భజమునకు పైన శంఖమును, సుదర్శన చక్రమును కుడి భుజమునకు పైన ఉన్న చేతియందు ధరించినారు. మన యొక్క భాదలను నిర్మూలించడమునకై వారు తమ యొక్క ఆయుదములను ధరించి మనలను ఎల్లపుడూ కాపాడుతానని గుర్తుచేస్తున్నారు.
వ్యాస~: మరి కుడి చేతికి గల ప్రాముఖ్యత ఏమిటి పాట్టి?
అభయ హస్తము – ఆశ్రయించువారికి నేనున్నానని గుర్తుగా
ఆణ్డాళ్ పాట్టి~: చాలా మంచి ప్రశ్న. తన అభయ హస్తము “ఎల్లప్పుడూ నేనున్నాను మిమ్మలని కాపాడుటకై, భయపడనవసరము లేదు” మరియు మనతో ఉన్న అనుబంధమునకు, మనపై గల తన వాత్సల్యమునకు గుర్తు. ఉదాహరణకు, ఓ దూడకి తన తల్లి అవసరం వచ్చినప్పుడు, ఆ తల్లి, అంటే ఆవు, పరుగు పరుగున వచ్చి తన బిడ్డని ఆదుకుంటుందే కాని, ఆ దూడ యొక్క ఇదువరుకటి ప్రవర్తనను (లేదా తప్పులను) మనుసులో పెట్టుకొని ప్రవర్తించదు. తన తక్షన కర్తవ్యం తన బిడ్డ యొక్క బాధను తగ్గించి సంతోషపరచడం. ఆలాంటి గొప్ప అనుబంధం మనకీ ఆయనకి మధ్య. దూడలం మనం ఐతే, ఆయన ఆవు అవుతాడు.
పెద్ద కీరీటము (ఆదిపత్యమునకు)మరియు చిరు దరహాసము(నిరాడంభరము)
వ్యాస~: పాట్టి, స్వామి తలపైన ఉన్నది ఏమిటది?
ఆణ్డాళ్ పాట్టి~: అది కీరీటము, వ్యాస. అది ప్రపంచములో అన్నింటికినీ తానే సార్వభౌముడను అను విషయమును తెలియచేస్తుంది.
పరాశర~: కీరీటము చాలా అందముగా ఉంది పాట్టి. అది తన ఆరాధనీయమైన ముఖమునకు సరిగ్గా సరిపోయినది.
ఆణ్డాళ్ పాట్టి~: అవును, తను చాలా పూజ్యమైన ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. స్వామికి మనతో ఉండడము చాలా సంతోషము, మరీముఖ్యముగా మీవంటి పిల్లలమధ్యన ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సంతోషముగా ఉంటారు.
పరాశర~: అవును పాట్టి. నేను చాలా దగ్గరినుండి చూసాను, వారి దరహాసమును మరియు వారి పాదములను.
ఆణ్డాళ్ పాట్టి~: అరె, మంచిది, పరాశర. సాధారణంగా, వారి యొక్క పాదములను మనము “పాదపద్మములు” అని అంటాము. ఎందుకంటే, అవి సహజముగానే సుకుమారమైనవి మరియు అందమైనవి. వారి ముఖముపై ఆ చెదరని నవ్వు ఆయన అనందముగా కేవలం మనకోసం ఆ వైకుంఠం నించి క్రిందకి దిగి వచ్చాడని సూచిస్తుంది. అలాగే, వారు వారి పాదపద్మములను ధృడముగా మళ్ళీ స్థిరముగా ఆ కమల పీఠము పై వుంచి మనకి ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఆయన మనకోసమే వచ్చాడని మళ్ళీ మనని ఎప్పడికీ వదిలి వేళ్ళే ప్రశక్తే లేదు అని. అయితే, నేడు, ఆ స్వామి యొక్క అనేక మంగళకరమైన గుణములలో, కొన్ని శ్రెష్ఠమైన గుణములను వారి అర్చావతార రూపములో చూడగలిగాము, అవి: వాత్సల్యము (తల్లికి సహజముగా ఉండే సహనము – మన రక్షణ కొరకై చూపే వారి శ్రీ హస్తము), స్వామిత్వము (శ్రెష్ఠత్వము/ఆధిపత్యము – పెద్ద కిరీటము), శౌశీల్యము (ఎలాంటి భేధ భావము లేకుండ మనతో కలసిపోగలడం – వారి ముఖముపై చెదరని చిరునవ్వు), మరియు సౌలభ్యము (వారిని మనము సులభముగా చేరుకోవడం – వారి పాదపద్మములను తేలికగా ఆశ్రయించే వీలు).
వ్యాస మరియు పరాసర విస్మయంతో నిలబడి, ఆ ఊరేగింపును కళ్ళార్పకుండా అనుసరించారు.
అడియేన్ : రఘు వంశీ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org