Category Archives: telugu

బాల పాఠము – వేదాంతాచార్య

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< పిళ్ళై లోకాచార్య శిష్యులు

ఆండాళ్ నాన్నమ్మ ఇంట్లో పువ్వులు అల్లుతూ గుడి వైపు అటూ ఇటూ నడుస్తున్న వాళ్ళని చూస్తున్నారు. ఆమె తన ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న పిల్లలను చూసి చిరునవ్వు నవ్వుకుంది. అల్లిన పూలమాలను ఆమె పెరియ పెరుమాళ్ మరియు తయార్ చిత్ర పఠానికి అలంకరించి తరువాత వాళ్ళని స్వాగతించింది.

నాన్నమ్మ : పిల్లలలూ రండి. ఈ రోజు ఎవరి గురించి చర్చించబోతున్నామో మీకు తెలుసా?

పిల్లలందరు ఒకేసారి : వేదాంతాచార్య

నాన్నమ్మ : అవును. ఆ పేరు వారికి ఎవరు పెట్టారో మీకు తెలుసా?

వ్యాస : పెరియ పెరుమాళ్ వారికి వేదాంతాచార్య అని పేరు పెట్టారు. అవునా
నాన్నమ్మ?

నాన్నమ్మ : అవును, వ్యాస. వారికి పుట్టుకతో పుట్టిన పేరు వెంకటనాథన్. వారు కంచీపురంలో ఒక దివ్య దంపతులైన అనంతసూరి మరియు తోతారంబైలకు జన్మించారు.

పరాశర : నాన్నమ్మ, వారు మన సాంప్రదాయంలోకి ఎలా వచ్చారో మాకు మరింత చెప్పండి.

నాన్నమ్మ : ఖచ్చితంగా, పరాశర. నడాదూర్ అమ్మాళ్ యొక్క కాలక్షేప గోష్టిలో కిడాంబి అప్పుళ్ళార్ అనే పేరుతో ఒక ప్రముఖ శ్రీవిష్ణవుడు ఉండేవారు. చిన్నప్పుడు వేదాంతాచార్యులు వారి మేనమామ (కిడాంబి అప్పుళ్ళార్)తో పాటు శ్రీ నడాదూర్ అమ్మాళ్ యొక్క కాలక్షేప గోష్టికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీ నడాదూర్ అమ్మాళ్ వారిని అన్ని అడ్డంకులను ఛేదించి విశిష్టాద్వైత శ్రీవిష్ణవ సిద్దాంతాన్ని స్థిరపరుస్తారని ఆశీర్వదిస్తారు.

అత్తుళాయ్ : ఓహ్! వారి ఆశీర్వాదం నిజమైంది!

నాన్నమ్మ చిరునవ్వుతో: అవును, అత్తుళాయ్ . పెద్దల ఆశీర్వాదాలు నెరవేరకుండా ఉండవు.

వేదవల్లి: వారు తిరువెంకటేశ్వరస్వామి వారి పవిత్ర గంట అవతారం అని నేను విన్నాను. అవునా
నాన్నమ్మ ?

నాన్నమ్మ : అవును. వారు సంస్కృతం, తమిళ్ మరియు మణిప్రవళంలో వందకు పైగా గ్రంథాలు వ్రాశారు.

వ్యాస: ఓ! వందనా?

నాన్నమ్మ : అవును, వాటిలో ముఖ్యమైనవి తాత్పర్య చంద్రిక (శ్రీ భగవత్ గీతపై వ్యాఖ్యానం), తత్వతీకై, న్యాయ సిద్జాంజనం, శత ధూశని ఇంకా అహార నియమం (ఆహార అలవాట్లపై వ్యాఖ్యానం) ఉన్నాయి.

పరాశర : నాన్నమ్మ, ఆశ్చర్యంగా ఉంది. ఒకే వ్యక్తి ఎలా ఆహార అలవాట్లపై వ్యాఖ్యానం లాంటి ప్రాథమిక గ్రంథాలు రాసి మరియు అదే సమయంలో క్లిష్టమైన తాత్విక వ్యాఖ్యానాలు కూడా ఎలా రాసారూ అని.

నాన్నమ్మ : మన పూర్వాచార్యుల జ్ఞానం లోతు మహాసముద్రం లాంటిది, పరాశర! ఆశ్చర్యపోనవసరం లేదు, వారికి మన తాయార్ (శ్రీ రంగనాచియార్) ‘సర్వ-తంత్ర-స్వతంత్ర’ (అన్ని కళల నైపుణ్యం) అని బిరుదునిచ్చారు.

అత్తుళాయ్ : మాకు ఇంకా చెప్పండి, నాన్నమ్మ. వారి గురించి ఇంకా వినాలని ఉంది.

srivedanthachariar_kachi_img_0065.jpg

అవతార ఉత్సవంలో కాంచి తూప్పుళ్ వేదాంతాచార్య

నాన్నమ్మ: వేదాంతాచార్యులను ‘కవితార్కిక కేసరి’ (కవులలోకి సింహం) అని కూడా పిలుస్తారు. వారు ఒకసారి కృష్ణమిశ్ర అనే ఒక అధ్వైతితో 18 రోజుల పాటు సుదీర్ఘ చర్చ చేసి గెలిచారు. వారు ఒక వ్యర్థ కవి సవాలు చేస్తే ‘పాదుకా సహస్రం’ ను రచించారు. ఇది శ్రీ రంగనాథుని దివ్య పాదుకలను ప్రశంసిస్తూ వ్రాసిన 1008 పద్యాల కవిత.

వేదవల్లి: చాలా బాగుంది! ఇన్ని నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఇంత నమ్రత కలిగిన గొప్ప ఆచార్యులు మన సాంప్రదాయంలో ఉండటం నిజంగా మన అదృష్టం.

నాన్నమ్మ : బాగా చెప్పావు వేదవల్లి. వేదాంత దేశికులు మరియు అనేక ఇతర సమకాలీన ఆచార్యులు పరస్పర ప్రేమ మరియు గౌరవం కలిగి ఉండేవారు. తన అభితిస్తవంలో, వారు శ్రీ రంగనాథుని “ఓ భగవాన్! పరస్పర శ్రేయోభిలాషులైన గొప్ప భాగవతుల చరణాల వద్ద శ్రీరంగం లోనే నివసిస్తాను అని అడుగుతారు “. మణవాళ మామునులు, ఎఱుంబి అప్పా, వాధికేసరి అళగీయ మణవాళ జీయర్, చోళసింహపురం (షోలింగర్) దొడ్డాచార్య వారి రచనలలో వేదాంత దేశికుల గ్రంథాలను ఉదాహరించారు. వేదాంత దేశికులు, పిళ్ళై లోకాచార్యులను గొప్పగా ప్రశంసించే వారు. వీరు పిళ్ళై లోకాచార్యుల గురించి “లోకాచార్య పంచాసత్” అని పిలువబడే గ్రంథం రచించారు. ఈ గ్రంథం తిరునారాయణపురం (మేల్కోటె, కర్ణాటక) లో క్రమం తప్పకుండా రొజూ పఠిస్తారు.

పరాశర : వేదాంతాచార్యులు శ్రీ రామానుజాచార్యుల సంభంధం ఎలాంటిది?

నాన్నమ్మ : వేదాంతాచార్యులకు శ్రీ రామానుజాచార్యుల పట్ల భక్తి చాలా ప్రసిద్ధమైనది; వారి ‘న్యాస తిలకా’ అనే గ్రంధంలో ‘ఉక్త్య ధనంజయ…’ అను పద్యంతో, శ్రీ రామానుజ సంభంధం వల్ల మోక్షం ఖాయమని పరోక్షంగా చెప్పిన పెరిమాళ్ ని పసన్న పరుస్తారు.

వ్యాస : మన ఆచార్యుల గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది, నాన్నమ్మ !


నాన్నమ్మ : అవును, వేదాంతాచార్య విజయ ని ‘ఆచార్య – చంపు’ అని కూడా పిలుస్తారు. వేదాంత దేశికుల జీవితం మరియు రచనల క్లుప్తమైన సంగ్రహాన్ని సంస్కృతంలో గద్య మరియు పద్య రూపంలో గొప్ప పండితుడైన ‘కౌశిక కవితార్కికసింహ వేదాంతాచార్య’ (సుమారు 1717 లో నివసించిన గొప్ప పండితుడు) రచించారు.

అత్తుళాయ్ : ఓహ్, బాగుంది! నాన్నమ్మ, ఈరోజు మనం వేదాంతాచార్యుల సంస్కృతం మరియు తమిళంలోని సాహిత్య నైపుణ్యము మరియు వారి భక్తిలో వినయం నేర్చుకున్నాము. వారి గొప్పతనాన్ని అనుసరించడం నిజంగా మన అదృష్టం.

నాన్నమ్మ : అవును, పిల్లలు. ఇలాంటి గొప్ప పుణ్యాత్ములను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి! రేపు మళ్లీ కలుద్దాం. మీరు ఇంటికి వెళ్ళే సమయం అయ్యింది.

పిల్లలందరు ఒకేసారి: నాన్నమ్మ ధన్యవాదాలు.

మూలము : http://pillai.koyil.org/index.php/2019/02/beginners-guide-vedhanthacharyar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – అపచారాలు (అపరాధాలు)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< కైంకర్యం

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి వస్తారు.

నాన్నమ్మ:  స్వాగతం పిల్లలూ. మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి, మీకు దేవుడికి పెట్టిన పండ్లను ఇస్తాను. ఈ నెల ప్రత్యేకత ఏమిటో  మీకు తెలుసా?

పరాశర: నేను చెప్తాను నాన్నమ్మ. మాణవాళ మామునులు పుట్టిన నెల. వారి తిరునక్షత్రం వైశాఖ  మాసం తిరుమూలా నక్షత్రంలో వస్తుంది.

వేదవల్లి: అవును. ఈ నెల ముదల్ ఆళ్వార్, సేనాధిపతి విశ్వక్సేన, పిళ్ళై లోకాచార్యుల పుట్టిన నెల కూడా. అవునా నాన్నమ్మా?

నాన్నమ్మ: అవును. ఇప్పటి వరకు ఆళ్వారులు, ఆచార్యులు,  ఉత్తమ అనుష్ఠానాలు, కైంకర్యాల గురించి మనం చూసాము. ఇప్పుడు అపచారాల గురించి నేర్చుకుందాము.

వ్యాస: నాన్నమ్మా అపచారం అంటే ఏమిటి?

నాన్నమ్మ: అపచారము అంటే భగవంతుడి పట్ల లేదా వారి భక్తుల పట్ల అపరాధం చేయుట. మనం ఎప్పుడూ భగవానుని మరియు వారి భక్తులను ఆనందపరచాలి. మనం చేసే కార్యాలు ఎమ్బెరుమాన్  మరియు భాగవతులను అసంతృప్తి పరిచితే, దానిని అపచారము అంటారు. మనము ఇప్పుడు ఏ అపచారాలు చేయకుండా దూరంగా ఉండాలో చూద్దాము.

అత్తుళాయ్: నాన్నమ్మ, అవేంటో వివరంగా చెప్తారా?

నాన్నమ్మ: సరే. శ్రీవైష్ణవులకు శాస్త్రం ఒక ఆధారం/మూలం /మార్గదర్శనం. మన పూర్వాచార్యులు శాస్త్రం పట్ల చాలా గౌరవప్రదంగా ఉండి వారి అనుష్టానాలను క్రమం తప్పకుండా అనుసరించారు. వారు భగవానుడి పట్ల వారి భక్తుల పట్ల ఎలాంటి అపరాధాలు చేయాలన్నా చాలా భయపడేవారు. కాబట్టి, మనం కూడా ఏ అపచారాలు చేయకుండా అన్ని సమయాల్లో జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకదానిని (అపచారాల రకాలు) వివరంగా చూద్దాము. ముందుగా మనం భగవత్ అపచారాల గురించి చూద్దాము.

వ్యాస: ఎమ్బెరుమానుకు అపచారము చేస్తే భగవత్ అపచారము అంటారు, అవునా నాన్నమ్మా?

నాన్నమ్మ: అవును, భగవత్ అపచారాలు,  ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

 • భగవానుడిని ఇతర దేవతలతో (బ్రహ్మ, శివ, వాయు, వరుణ, ఇంద్ర మొదలగు వారు) సమానంగా పరిగణలోకి తీసుకోవడం ఒక నేరం.
 • ఒక శ్రీవైష్ణవుడయిన తరువాత, ఇతర దేవతలను పూజించడం కూడా భగవత్ అపచారమే. అందరిని ఎమ్బెరుమానే సృష్టించారు.
 • నిత్యకర్మానుష్టాలు నిర్వహించక పోవడం భగవత్ అపచారము క్రిందకు వస్తాయి.  నిత్యకర్మానుష్టాలు మనకు భగవానుని ఆజ్ఞలు, ఆదేశాలు. కాబట్టి మనము వారి మాటలకు కట్టుబడి ఉండాలి. మనం వారి ఆదేశాలను ఆచరించకపోతే, మనం నేరం చేస్తున్నట్టు లెక్క. ఇంతకుముందు ఈ విషయం గురించి మనం చెప్పుకున్నాము, అందరికి గుర్తుందనుకుంటాను.

పరాశర: అవును నన్నమ్మా. వ్యాస మరియు నేను ప్రతిరోజు సంధ్యావందనం క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తాము.

నాన్నమ్మ: మీరు నిత్యకర్మానుష్టాలు క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తారంటే, వినడానికి సంతోషంగా ఉంది.

 • మనం చేయకుండా దూరముండాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రామ, కృష్ణులను సాధారణ మనుషులుగా పరిగణలోకి తీసుకోకూడదు. భగవానుడు తన భక్తుల కోసం ప్రేమ, కృపతో మన సహాయం కోసం ఈ అవతారాలను తీసుకున్నాడు.
 • ఈ భౌతిక ప్రపంచంలో మనము స్వతంతృలమని అనుకోవడం భగవత్ అపచారము. అందరూ ఎమ్బెరుమానుకి ఆధీనులమని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని అర్థం చేసుకోవాలి.
 • ఎమ్బెరుమానుకి కు చెందిన వస్తువులను దొంగిలించుట. వారి వస్త్రాలు, తిరువాభరణాలు(ఆభరణాలు) మరియు స్థిర ఆస్తులు (భూములు) మొదలైనవి.

అత్తుళాయ్: నన్నమ్మా వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది, మీరు భాగవత అపచారము గురించి మాకు వివరించండి?

నాన్నమ్మ: తప్పకుండా అత్తుళాయ్. ఎమ్బెరుమాన్ యొక్క భక్తులకు  అపచారం భాగవత అపచారము క్రిందకు వస్తుంది. భాగవత అపచారము మరియు భగవత్ అపచారము మధ్య, భాగవత అపచారము అత్యంత క్రూరమైనది. ఎమ్బెరుమాన్ తన భక్తుల బాధలను తట్టుకోలేడు. కాబట్టి మనం భాగవత అపచారము చేయకుండా జాగ్రత్తపడాలి. ఈ క్రింది భాగవత అపచారాలు ఇవ్వబడ్డాయి.

 • ఇతర శ్రీవైష్ణవులను మనకు సమానంగా పరిగణించడం. ఇతర శ్రీవైష్ణవుల కంటే మనలను తక్కువగా పరిగణించుకోవాలి.
 • మనం శారీరికంగా గానీ, మానసికంగా గానీ ఎవరినీ బాధపెట్టకూడదు.
 • శ్రీవైష్ణవులను వారి జన్మ, జ్ఞానం, చర్యలు, సంపద, జీవించే ప్రదేశం, రంగు మొదలైనవి ఆధారంగా వారిని అవమానించకూడదు.

మన పూర్వాచార్యులు ఇతర శ్రీవైష్ణవులతో వ్యవహరించేటప్పుడు  ఖచ్చితమైన ప్రమాణాలను అనుసరించే వారు. ఇతర శ్రీవైష్ణవులను అసంతృప్తి / మనసును గాయపరచ కుండా వారు చాలా జాగ్రత్తగా ఉండేవారు. వారు ప్రతి ఒక్కరితో గౌరవంగా వ్యవహరించేవారు.

వేదవల్లి: నాన్నమ్మా, మేము తప్పకుండా ఇటువంటి అపచారాలు చేయకుండా ఎమ్బెరుమానుని సంతోషపెడతాం.

మిగితా ముగ్గురు పిల్లలు కూడా ఒకేసారి: అవును నాన్నమ్మా.

నాన్నమ్మ: చాలా మంచిది  పిల్లలు. ఇప్పటి వరకు నేను మీకు మన సాంప్రదాయం గురించి చాలా విషయాలు నేర్పించాను. మరోసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను.  చీకటి పడుతోంది. మీరు వెళ్ళే సమయమయ్యింది.

పిల్లలు: అవును మేము చాలా  నేర్చుకున్నాము నాన్నమ్మా. ఎమ్బెరుమాన్ మరియు ఆచార్యుల కృపతో మేము  నేర్చుకున్నవన్నీ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాము.

నాన్నమ్మ: చాలా మంచిది.

పిల్లలు నాన్నమ్మతో సంభాషణ గురించి ఆలోచించుకుంటూ సంతోషంగా వారి ఇండ్లకు వెళతారు.


మూలము: http://pillai.koyil.org/index.php/2018/11/beginners-guide-apacharams/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


బాల పాఠము – కైంకర్యం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – ఉత్తమ అనుష్ఠానాలు

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి వస్తారు

నాన్నమ్మ: స్వాగతం పిల్లలూ . మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి, మీకు దేవుడికి పెట్టిన పండ్లను ఇస్తాను. మీరు  ఆళవందార్ తిరునక్షత్రం జరుపుకున్నారా?

పరాశర: అవును నాన్నమ్మ, బాగా జరుపుకున్నాము. ఆళవందార్ సన్నిధి దర్శనం కూడా బాగా జరిగింది. అక్కడ, తిరునక్షత్రం ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. మా నాన్నగారు ఆళవందార్ వాళి తిరునామాలు మాకు నేర్పించారు. వారి తిరునామాలు మా ఇంట్లో పఠించాము.

నాన్నమ్మ: వినడానికి చాలా ఆనందంగా ఉంది.

వేదవల్లి: నాన్నమ్మా,  మీరు క్రిందటి సారి కైంకర్యం యొక్క ప్రాముఖ్యతను చెప్తానని అన్నారు మీకు గుర్తుందా?

నాన్నమ్మ: అవును, నాకు గుర్తుంది. నువ్వు గుర్తుంచుకొని అడిగినందుకు చాలా ఆనందంగా ఉంది.
కైంకర్యం అంటే ఎమ్బెరుమాన్ కి మరియు వారి భక్తులకు సేవ చేయడం. మన కైంకర్యం ఎమ్బెరుమాన్ని సంతోషపెట్టాలి మరియు వారి హృదయాన్ని సంతృప్తి పరచాలి.

వ్యాస: ఎమ్బెరుమాన్ సంతోషంపడితే మేము కైంకర్యం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. కైంకర్యం ఎలా చేయాలి నాన్నమా?

నాన్నమ్మ: మనం కైంకర్యం హృదయంతో (మానసిక కైంకర్యం), మన వాక్కుతో (వాచిక కైంకర్యం) మరియు మన శరీరంతో (శరీర కైంకర్యం) చేయవచ్చు. ఆండాళ్ నాచ్చియార్ కూడా తన తిరుప్పావై 5 వ పాసురంలో మనము వారి కీర్తిగానలు పాడవచ్చని, వారిని ధ్యానించవచ్చని, వారికి పుష్పాలు అర్పించ వచ్చని అన్నారు.  ఎమ్బెరుమాన్ దివ్య కళ్యాణ గుణాలను ధ్యానించడం మానసిక కైంకర్యంలోకి వస్తుంది. ఎమ్బెరుమాన్ మరియు వారి భక్తుల యొక్క దివ్య మహిమలను కీర్తించి/పాడి మాట్లాడుట, చాలా ముఖ్యముగా, ఆళ్వారుల పాసురాలు మరియు పుర్వాచార్యుల స్తోత్రాలు పాటించుట ఎమ్బెరుమాన్ కి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇవన్నీ వాచిక కైంకర్యంలోకి వస్తాయి.  ఆలయ ప్రాంగణం / సన్నిధిని శుభ్రపరచుట, ఆలయ ప్రాంగణం / సన్నిధిని ముగ్గులతో, పూల దండలతో అలంకరింఛడం, తిరువారాధనం కోసం గంధపు చెక్కను నూరడం వంటివి శారీరక కైంకర్యంలోకి వస్తాయి. మొదట, మన ఇళ్లలో ఎమ్బెరుమాన్ కు సాధ్యమైనంత కైంకర్యం చేయాలి. మీ వంటి పిల్లలు చేసిన  కైంకర్యాన్ని ఎమ్బెరుమాన్ ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు.

పరాశర: మీరు చాలా బాగా వివరించారు నాన్నమ్మా. ఇంట్లో మా నాన్నగారు చేసే తిరువారాధనంలో సంతోషంగా పాల్గొంటాము.

నాన్నమ్మ: మంచిది.

అత్తుళాయ్: వేదవల్లి మరియు నేను ముగ్గులు వేసి, పూలల్లి దండలు తయారు చేస్తాను.

నాన్నమ్మ:  విని చాలా ఆనందం వేస్తుంది అత్తుళాయ్. మరొక ముఖ్యమైన విషయం, భగవానుని కంటే భాగవతుల (భక్తుల) సేవ చేయడం చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు, లక్ష్మనుడు శ్రీ రాముడికి అన్ని కైంకర్యాలు చేసాడు, కానీ శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క ప్రియమైన సోదరుడు, భక్తుడైన భరతునికి కైంకర్యం చేశాడు. అంతేకాక, నమ్మాళ్వారు తనకు ప్రియమైన శ్రీకృష్ణుడినే తన ఆహారం, నీరుగా భావించారు, కానీ మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వారినే తన భగవంతునిగా భావించారు. ఇది ఎమ్బెరుమాన్ యొక్క భక్తుల (భాగవతుల) యొక్క గొప్పతనాన్ని ఉద్ఘాటిస్తుంది. కాబట్టి, మనము ఎల్లప్పుడు వారి భక్తులకు భక్తులుగా ఉండాలి.

అత్తుళాయ్: మీరు చెప్పినట్లుగా, ఖచ్చితంగా ఎమ్బెరుమాన్ యొక్క భక్తులకు (భాగవతులకు) సేవ చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ భాగవతులను ఎలా సేవించాలి నాన్నమ్మా?

నాన్నమ్మ: భక్తులు మన ఇళ్లకు వచ్చినపుడు, వారికి శాష్టాంగ నమస్కారం చేయాలి,  సుఖంగా వుంచాలి, వారికి అవసరమైన సహాయం చేయాలి. మనం ఎమ్బెరుమాన్, ఆళ్వారుల మరియు ఆచార్యాల గురించి, అద్భుతమైన వారి చరితాల గురించి ప్రశ్నించి వీలైనంత వారి నుండి నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. వారు చేసే కైంకర్యాల్లో ఏవైనా సహాయం అవసరమేమో వినమ్రంగా అడగాలి. భక్తుల సేవ చేయటానికి ఇలాంటి అనేక మార్గాలు ఉన్నాయి.

అత్తుళాయ్: ఖచ్చితంగా నాన్నమ్మా. ఇప్పుడు మాకు దీనిగురించి మంచి అవగాహన వచ్చింది. అలాంటి అవకాశం వస్తే వదులుకోము.

(మిగతా ముగ్గురు పిల్లలు కూడా ఒకే సారి “అవును” అని అంటారు)

నాన్నమ్మ:  పిల్లలూ చాలా సంతోషం, ఆనందంగా ఉంది.

వేదవల్లి: నాన్నమ్మ, మీరు చెప్పేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకా చెప్పండి.

నాన్నమ్మ: నేను చాలా ఆనందంగా చెప్పుండే దాన్ని కానీ ఇప్పుడు బయట చాలా చీకటి పడింది. ఈసారి, మనం ఇంకో విషయం గురించి చర్చించు కుందాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లండి.

పిల్లలు నాన్నమ్మతో  చర్చించుకున్న అద్భుతమైన సంభాషణ గురించి ఆలోచిస్తూ తమ గృహాలకు సంతోషంగా వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/10/beginners-guide-kainkaryam/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఉత్తమ అనుష్ఠానాలు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – అష్ట దిగ్గజాలు మరియు ఇతరులు

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి వస్తారు.

నాన్నమ్మ:  స్వాగతం పిల్లలూ. మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి, మీకు దేవుడికి పెట్టిన పండ్లను ఇస్తాను. ఈ నెల ప్రత్యేకత ఏమిటో  మీకు తెలుసా?

వేదవల్లి : నేను చెప్తాను నాన్నమ్మ. మీరు మాకు ముందు చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. ఇది “సూడి క్కొడుత్త సుడర్కొడి” ఆండాళ్ నాచ్చియార్ పుట్టిన నెల. ఆమె ఆషాడ మాసం పూర్వా ఫాల్గుని నక్షత్రంలో జన్మించారు.

పరాశర: అవును. ఈ నెలలో నాథమునుల యొక్క మనవడు ఆళవందార్ వారి జన్మదినం కూడా వస్తుంది. వారు ఆషాడ మాసం ఉత్తర ఆషాడ నక్షత్రంలో జన్మించారు. అవునా నాన్నమ్మా?

నాన్నమ్మ: బాగా చెప్పావు. ఇప్పటి వరకు ఆళ్వారులు మరియు ఆచార్యుల గురించి మనము చెప్పుకున్నాము. ఇప్పుడు మనం రోజూ ఆచరించవలసిన అనుష్ఠానాల (ఉత్తమ ఆచారాలు) గురించి తెలుసుకుందాము.

అత్తుళాయ్:  నాన్నమ్మా, అనుష్ఠానం అంటే ఏంటి?

నాన్నమ్మ: మన శ్రేయస్సు కోసం శాస్త్రాల ద్వారా నియమించబడిన కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ  అనుసరించే నియమాలను అనుష్ఠానం (ఉత్తమ ఆచరణలు) అని అంటారు. ఉదాహరణకు: ఉదయాన్నే లేచి స్నానం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనకొక నియమం. తిరుప్పావైలో
ఆండాళ్ నాచ్చియార్ కూడా అన్నారు “నాట్కాలే నీరాడి” అని.

వ్యాస: అవును నాన్నమ్మా, నాకు గుర్తుంది తిరుప్పావై రెండవ పాసురంలో ఉంది.

నాన్నమ్మ: అవును! ఉదయాన్నే మనము పెరుమాళ్ ని మనసులో స్మరించుకుంటే మన మనస్సులు శుద్ధి అవుతాయి. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత ఊర్ధ్వపుండ్రం పెట్టుకొని ఉపనయనం అయిన వారు సంధ్యావందనం మరియు ఇతర రోజువారీ కర్మానుష్ఠానాలు చేయాలి.

పరాశర మరియు వ్యాస: నాన్నమ్మా, మేము క్రమం తప్పకుండా నిత్య కర్మానుష్ఠానాలు చేస్తాము.

నాన్నమ్మ: వింటానికి సంతోషంగా ఉంది!

వేదవల్లి: మేము పూర్తి ఆనందంతో ఊర్ధ్వపుండ్రాలు (తిరుమన్ కాప్పు) ధరించాము. దయచేసి ఊర్ధ్వపుండ్రాలు ధరించడంలో ప్రాముఖ్యత, కారణం చెప్పండి. మాకు వినాలని చాలా ఉత్సాహంగా ఉంది నాన్నమ్మా.

నాన్నమ్మ: సరే, వినండి. తిరుమన్ కాప్పు – కాప్పు అంటే అర్థం (రక్షణ). ఎమ్బెరుమాన్ మరియు పిరాట్టి మనతో ఉంటున్న, మనల్ని ఎల్లప్పుడూ రక్షింస్తున్నట్టు అర్థం. తిరుమన్ కాప్పు ధరిస్తే, మనము వారి భక్తులమని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మనము సంతోషంగా ధరించాలి, గర్వ పడాలి.

వేదవల్లి: ఊర్ధ్వపుండ్రాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం. విని చాలా సంతోషంగా వున్నాం.

పిల్లలందరూ ఒకే సారి: అవును నాన్నమ్మా.

నాన్నమ్మ: చాలా మంచిది పిల్లలు. అదే విధంగా మన శ్రేయస్సు కోసం శాస్త్రాల ద్వారా అనేక ఇతర నియమాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిలో కొన్ని మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. తినడానికి ముందు మరియు తరువాత మన చేతులు మరియు కాళ్ళు కడగాలి. ఎందుకంటే మనం పరిశుభ్రం గా ఉంటేనే మన ఆరోగ్యము బాగుంటుంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం కేవలం పెరుమాళ్ కి అర్పించిన ఆహారం మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారం మన స్వభావాన్ని నిర్ణయిస్తుంది. పెరుమాళ్ ప్రసాదాన్ని ఆరగిస్తే సత్వ గుణాలు
(మంచి లక్షణాలు)  పెరుమాళ్ దయతో అభివృద్ధి చెందుతాయి.

పరాశర: మా ఇంటిలో, నా అమ్మ ప్రసాదం సిద్ధం చేస్తుంది, మా నాన్నగారు దేవుడికి అర్పిస్తారు.  పెరుమాళ్ల తీర్థం తీసుకున్న తరువాత మాత్రమే, మేము ప్రసాదాన్ని తింటాము.

నాన్నమ్మ: మంచి అలవాటు. 

నలుగురూ నవ్వు ముఖంతో సరే అంటారు. 😊

నాన్నమ్మ: ఇంకా ఆళ్వారుల కొన్ని పాసురాలను పాటించిన తరువాత మాత్రమే ప్రసాదం తీసుకోవాలి. పెరుమాల్కు అర్పించిన ఆహారం మన కడుపుకి ఆహారం. మన నాలుకకు ఆహారం అంటే ఏమిటి?

అత్తుళాయ్: నాలుక కోసం ఆహారమా! దయచేసి చెప్పండి! అంటే ఏమిటి నాన్నమ్మా?

నాన్నమ్మ: అవును. ఎమ్బెరుమాన్ దివ్య నామాలను జపించడమే మన జిహ్వకి (నాలుకకి) ఆహారం. మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వారిని వారి దేవుడిగా భావించేవారు. మధురకవి ఆళ్వార్ వారి కన్నినూన్ చిరుత్తాంబులో కురుగూర్ నంబి (నమ్మాళ్వారి నామాలలో ఒకటి) అన్నప్పుడు  నాలుకపై తేనె పోసినట్టుగా ఉందని అనేవారు.

( నమ్మాళ్వార్ – మధురకవి ఆళ్వార్ )

వేదవల్లి: నాన్నమ్మా, నమ్మాళ్వార్ పట్ల మధురకవి ఆళ్వార్ వారి భక్తి గుండెకు హత్తుకున్నట్టుగా ఉంది, మీరు బాగా వివరిస్తున్నారు నాన్నమ్మా. ఇప్పడి తరువాత నుండి, మేము కైన్నియున్ చిరుత్తాంబును చదివింతరువాతనే మేము ప్రసాదం తీసుకుంటాము.

నాన్నమ్మ: బావుంది వేదవల్లి.

వ్యాస: నాన్నమ్మా, మీరు చెప్తుండగా వినడం చాలా ఆసక్తికరంగా ఉంది. మాకు ఇంకా చెప్పండి.

నాన్నమ్మ: నేను చాలా ఆనందంగా చెప్పుండే దాన్ని కానీ ఇప్పుడు బయట చాలా చీకటి పడింది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లండి.

పిల్లలు నాన్నమ్మ తో సంభాషణ గురించి ఆలోచిస్తూ సంతోషంగా వారి ఇంటికి వెళ్ళిపోతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/08/beginners-guide-anushtanams/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – అష్ట దిగ్గజాలు మరియు ఇతరులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

 << బాల పాఠము – అళగియ మణవాళ మామునులు

నాన్నమ్మ: స్వాగతం పిల్లలు, గతంలో మనం చర్చించుకున్న విషయాలు మీకు గుర్తున్నాయని ఆశిస్తున్నాను.

పిల్లలందరూ కలిసి ఒకేసారిగా:  నమస్కారం నాన్నమ్మా, అవును గుర్తున్నాయి, అష్ట దిగ్గజాల గురించి మరింత వినడానికి వచ్చాము.

నాన్నమ్మ: మంచిది, ప్రారంభిద్దాం.

పరాశర: నాన్నమ్మా, అష్ట దిగ్గజాలు అంటే 8 శిష్యులు.  అవునా నాన్నమ్మా?

నాన్నమ్మ: అవును పరాశర. అష్ట దిగ్గజాలు మణవాళ మామునుల యొక్క 8 ప్రధాన శిష్యులు.
పొన్నడిగళ్ జీయర్, కోయిళ్ అన్నన్, పతంగి పరవస్తు పట్టర్పిరాన్ జీయర్, తిరువేంకట జీయర్, ఎరుమ్బియప్పా, ప్రతివాధి భయంకర అన్నన్, అపిళ్ళై, అప్పిళ్ళార్. వీరు మణవాళ మామునుల యొక్క గొప్ప శిష్యులు, మామునులు తర్వాత మన సాంప్రదాయ అభివృద్ధికి అత్యంత ప్రభావవంతమైన కృషి చేశారు. 

పొన్నడిగళ్ జీయర్ వారి ఆచార్యులు మణవాళ మామునులకు ప్రాణ సుక్రుత్ (ప్రాణం కంటే ప్రియమైన) లాంటి వారు. వారితో మొదలుపెడదాం.

ponnadikkal-jiyar

నాన్నమ్మ: అళగియ వరదర్ గా జన్మించి, అతను పొన్నడిగళ్ జీయర్ గా ప్రసిద్ధులు అయ్యారు.

పరాశర: నాన్నమ్మా, వారిని ఎందుకు పొన్నడిగళ్ జీయర్ అని పిలిచేవారు?

నాన్నమ్మ: పొన్నడిగళ్ అంటే మణవాళ మామునులు యొక్క శిష్య సంపత్తికి (అంటే శిష్య సంపద) పునాది అని అర్ధం. ఎనేకమంది ఆచార్యులు మామునులను సంప్రదించేందుకు పొన్నడిగళ్ జీయర్ని పురుషాకారంగా భావించేవారు.

మణవాళ మామునులు పొన్నడిగళ్ జీయర్ వారికి కూడా అష్ట దిగ్గజాలను నియుక్తి చేశారు. మణవాళ మామునులు పొన్నడిగళ్ జీయర్ని వానమామలైకి వెళ్ళమని నిర్దేశిస్తారు. ఎందుకంటే దైవనాయకన్ ఎమ్బెరుమాన్ (వానమామలై ) సేనాధిపతి విశ్వక్సేనుల వారిచే శ్రీముఖాన్ని (దివ్య ఆజ్ఞ) మామునులకు పంపి పొన్నడిగళ్ జీయర్ని వానమామలై దివ్య దేశానికి పంపి అక్కడి కైంకర్యాలను చూసుకోమని ఆదేశిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పొన్నడిగళ్ జీయర్ దైవనాయకన్ ఎమ్బెరుమాన్కి మామగారు. నిజమేనా?

నాన్నమ్మ: అవును వ్యాస. పొన్నడిగళ్ జీయర్ తిరుమలై నుండి నాచియార్ విగ్రహం (తాయార్ యొక్క దివ్య విగ్రహం) తీసుకుని వచ్చి దైవనాయకన్ ఎమ్బెరుమాన్ తో దివ్య కళ్యాణానికి ఏర్పాటుచేస్తారు, వారే కన్యాదానం కూడా చేస్తారు. దైవనాయకన్ ఎమ్బెరుమాన్, “పెరయాళ్వారు లాగా పొన్నడిగళ్ జీయర్ కూడా తనకు మామగారు” అని చాటుతారు.

మణవాళ మామునుల యొక్క ఆదేశాల ఆధారంగా వారు భారత దేశపు నలుమూలలకు వెళ్లి మన సాంప్రదాయాన్ని వ్యాప్తి చేస్తారు. చివరికి, వారి ఆచార్యులైన అళగియన్ మణవాళ మామునుల దివ్య తిరువడిని ధ్యానిస్తూ పొన్నడిగళ్ జీయర్ తన చరమ తిరుమేనిని విడిచిపెట్టి పరమపదం పొందుతారు.

మనము కూడా ఎమ్బెరుమానార్ మరియు మన ఆచార్యులపై భక్తి ప్రపత్తులు పెంపొందాలని పొన్నడిగళ్ జీయర్ యొక్క దివ్య తిరువడిని ప్రార్థన చేద్దాం. 

నాన్నమ్మ: కోయిల్ అన్నన్ గురించి మన తరువాతి చర్చ. వారు అత్యంత ప్రియమైన శిష్యులలో ఒకరు మరియు అష్ట దిగ్గజాలలో ఒకరు. కోయిల్ అన్నన్ జీవితంలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది, వారు మణవాళ మామునుల వారిని ఆశ్రయించాల్సి వస్తుంది.

koilannan

పరాశర: నాన్నమ్మా, ఆ సంఘటన ఏమిటి ?

నాన్నమ్మ: నీ ఉత్సుకతను మెచ్చుకుంటున్నాను పరాశరా, ముదలియాండాన్ లాంటి గొప్ప కుటుంబ వంశంలో జన్మించి, వారు మణవాళ మామునుల వారిని ఆశ్రయించాలనుకోలేదు. ఈ సంఘటన వారిని మణవాళ మామునుల యొక్క దివ్య తిరువడి వద్దకు తిరిగి తీసుకువస్తుంది. కోయిల్ అన్నన్ వారి అనేకమంది శిష్యులతో శ్రీరంగంలో ఉండేవారు. శ్రీభాష్యకారులు (శ్రీ రామానుజులు) కోయిల్ అన్నన్ ని మణవాళ మామునుల శిష్యులుగా చేరమని ఆజ్ఞాపించారని మనందరికీ తెలుసు. శ్రీ రామానుజులు కోయిల్ అన్నన్ వారికి మార్గదర్శనం చేస్తూ ముదలియాండాన్ తో వారి సంబంధాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతారు.

“నేను ఆదిశేషుడిని, మరలా మణవాళ మామునులుగా తిరిగి వచ్చాను. నీవు మరియు మీ బంధువులు మణవాళ మామునుల యొక్క శిష్యులై ఉన్నతిని పొందండి” అని ఎమ్బెరుమానార్ అంటారు.  పిల్లలు, ఈ మొత్తం సంఘటన వారి కలలో జరుగుతుంది. కల ఆగిపోయి అన్నన్ మేలుకొని పూర్తిగా ఆశ్చర్యపోతారు. వారు తన సోదరులకు భావోద్వేకంతో ఈ సంఘటనను వివరిస్తారు.

అన్నన్ వారి ఇతర కందాడై కుటుంబ ఆచార్యపురుషులతో పాటు జీయర్ మఠముకి వెళ్ళి మణవాళ మామునులను ఆశ్రయిస్తారు. మణవాళ మామునులు వానమామలై (పొన్నడిగళ్) జీయర్ని వారి పంచ సంస్కారం కోసం అవసరమైన సామగ్రిని సిద్ధం చేయమని నిర్దేశిస్తారు.

కాబట్టి పిల్లలూ, మనము కోయిల్ కందాడై అన్నన్ యొక్క అద్భుతమైన జీవితం యొక్క కొన్ని తళుకులు చూశాము. వారు మణవాళ మామునులకు చాలా ప్రియమైనవారు. వారికున్న అచార్యాభిమానంలో కొంత శాతం మనము కూడా పొందాలని కోరుకుంటూ వారి దివ్య తిరువడిని ప్రార్థన చేద్దాము.

ఇప్పుడు నేను మోర్ మున్నార్ అయ్యర్ (పరవస్తు పట్టర్పిరాన్ జీయర్) గురించి చెప్తాను. వారు 
మణవాళ మామునుల యొక్క అష్ట దిగ్గజాలలో ఒకరు. వారు మణవాళ మామునులను విడనాడకుండా, ఎమ్బెరుమానార్ తో ఎంబార్ ఉన్నట్టుగా, ఎల్లప్పుడూ వారితోనే ఉండేవారు, .

OLYMPUS DIGITAL CAMERA

వేదవల్లి: నాన్నమ్మా, వారిని మోర్ మున్నార్ అయ్యర్ అని ఎందుకు  పిలిచేవారు?

నాన్నమ్మ: ఆసక్తికరమైనదిగా ఉంది కదూ.  ప్రతిరోజూ, వారు మణవాళ మామునుల యొక్క శేష ప్రసాదం
(అవశేషాలు) తినేవారు. వారు మణవాళ మామునులు ఆరగించిన ఆ అరటి ఆకులోనే తినేవారు. మణవాళ మామునులు పెరుగన్నంతో ముగించే వారు, పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ వారు అలాగే ప్రసాదాన్ని తినేవారు రుచిని (పెరుగు నుండి పప్పులోకి) మారనిచ్చే వారు కాదు. అందుకోసం వారు “మోర్ మున్నార్ అయ్యర్” గా ప్రసిద్ధులైయ్యారు.

వారు మణవాళ మామునుల నుండి శాస్త్రార్థాలను వాటి సారాన్ని నేర్చుకున్నారు మరియు నిరంతరం వారికి సేవలు అందించేవారు. మణవాళ మామునులు పరమపదించిన తరువాత,
పట్టర్పిరాన్ జీయర్ తిరుమలలో స్థిరపడి, అక్కడ అనేక జీవాత్మలను శుద్ధి చేస్తారు. అమితమైన ఆచార్య నిష్ఠ ఉన్నందున, వారు అంతిమోపాయ నిష్ఠ అనే గ్రంథం వ్రాశారు, పూర్తిగా మన ఆచార్య పరంపరను మరియు మన పూర్వాచార్యులు వారి ఆచార్యులపై ఎలా పూర్తిగా ఆధారపడేవారో తెలియజేస్తుంది. వారు గొప్ప విద్వాంసులు మరియు మణవాళ మామునులకు చాలా ప్రియమైనవారు.

eRumbiappA-kAnchi

నాన్నమ్మ: పిల్లలూ. తరువాత ఇప్పుడు నేను ఎరుంబి అప్పా గురించి చెప్తాను. వారి అసలు పేరు దేవరాజన్. వారి గ్రామంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ నివసించే రోజుల్లో, ఎరుంబి అప్పా మణవాళ మామునుల గురించి విని వారిని కలుసు కోవాలనుకుంటారు. ఎరుంబి అప్పా కొంతకాలం మణవాళ మామునులతో ఉండి అన్ని రహస్య గ్రంథాలను  నేర్చుకొని చివరికి వారి గ్రామానికి తిరిగి వెళ్లి అక్కడ వారు కైంకర్యాన్ని కొనసాగిస్తారు. 

వారు  తన ఆచార్యుల గురించి నిరంతరం ఆలోచిస్తూ, పూర్వ మరియు ఉత్తర దినచర్యలను (మణవాళ మామునులు యొక్క రోజువారీ కార్యక్రమాలను సంగ్రహంగా) సంగ్రహించి వ్రాసి, ఒక శ్రీ వైష్ణవుని ద్వారా మణవాళ మామునులకు పంపుతారు. మణవాళ మామునులు ఎరుంబి అప్పా యొక్క నిష్టని చూసి ఎంతో ఆనందించి వారిని కీర్తిస్తారు. వారు వచ్చి సందర్శించమని ఎరుంబి అప్పాకి ఆహ్వానాన్ని కూడా పంపిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పట్టర్పిరాన్ జీయర్, పొన్నడిగళ్ జీయర్ లాగా ఎరుంబి అప్పాకి కూడా వారి ఆచర్యులంటే అమితమైన అభిమానం ఉంది. కదా నాన్నమ్మా ?

నాన్నమ్మ:  అవును వ్యాస. ఎరుంబి అప్పా యొక్క అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి “విళక్షణ మోక్ష అధికారి నిర్ణయం”.  ఎరుంబి అప్పా మరియు వారి శిష్యులలో ఒకరైన సేనాధిపతి ఆళ్వన్ మధ్య సంభాషణల సంగ్రహం ఆ గ్రంథం.

వేదవల్లి: నాన్నమ్మా, విళక్షణ మోక్ష అధికారి నిర్ణయం అంటే ఏమిటి?

నాన్నమ్మ: ఈ గ్రంథం మన ఆళ్వారులు / ఆచార్య శ్రీసూక్తులను తప్పుగా అర్థం చేసుకున్న అనేక సందేహాలను వివరిస్తుంది. ఎరుంబి అప్పా వారి బోధనలలో సంసార వైరాగ్యం యొక్క 
ప్రాముఖ్యతను మరియు పూర్వాచార్యుల జ్ఞానానుష్ఠానములపై అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను తెలిపారు మరియు వాటిని ఎలా ఆచారణలో పెట్టాలో మనకు మార్గనిర్దేశం చేశారు.

మణవాళ మామునులును ఎల్లప్పుడూ గుర్తుచేసుకున్న ఎరుంబి అప్పాని మనం గుర్తుపెట్టుకుందాము.

నాన్నమ్మ: పిల్లలూ, ఇప్పుడు మనం ప్రతివాది భయంకరం అన్నా గురించి చర్చించుకుందాము. వారు హస్తిగిరినాథగా జన్మించారు, వారి జీవిత ప్రారంభ కాలంలో వారు కంచీపురంలో నివసించారు మరియు వేదాంతాచార్యులచే ఆశీర్వదించబడ్డారు. వారు ఒక గొప్ప పండితులయ్యి ఇతర సాంప్రదాయ పండితులు మరియు అనేక విద్వాంసులపై గెలిచిన వారు.

pb-annan-kanchi

తరువాత వారు తిరుమలలో ఉంటూ వెంకటేశ్వర స్వామికి సేవలు అందించారు. మణవాళ మామునుల కీర్తి గురించి విని, వారు మణవాళ మామునుల శిష్యులుగా చేరాలని నిర్ణయించుకుంటారు. వారు శ్రీరంగానికి చేరుకొని మామునుల మఠాన్ని సందర్శిస్తారు. ఆ సమయంలో మణవాళ మామునులు కాలక్షేపం చేస్తూ ఉంటారు, ఆ కాలక్షేపాన్ని విని వివిధ శాస్త్ర రంగాలలో మణవాళ మామునుల యొక్క గొప్ప జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. వారు మణవాళ మామునులకు శరణాగతి చేసి వారి శిష్యులౌతారు.

వారు ఎమ్బెరుమానార్ను మరియు మణవాళ మామునులను ప్రశంసిస్తూ అనేక గ్రంథాలను వ్రాసారు. వారి ఆచార్యులైన మణవాళ మామునుల యొక్క ఆనందం కోసం అత్యంత ప్రజాదరణ పొందిన వెంకటేశ సుప్రభాతం, వెంకటేశ ప్రపత్తి మొదలైనవి తిరువెంకటముడయాన్కి సమర్పించారు.                

నాన్నమ్మ: పిల్లలూ,  చివరిగా మనం అప్పిళ్ళై, అప్పిళ్ళార్ గురించి చర్చించుకుందాం. వారి గురించి ఎక్కువ వివరాలు మనకు అందుబాటులో లేవు. వారు మణవాళ మామునుల ప్రియమైన శిష్యులయ్యారు, అష్ట దిగ్గజాలలో ఒకరైనారు. వారిరువురు ఉత్తర భారతదేశంలో అనేక పండితులపై గెలిచన గొప్ప విద్వాంసులు.

appiLLai appiLLAr

వారు మణవాళ మామునులు గురించి విన్నప్పటికీ, వారికి గొప్ప అనుబంధం చూపలేదు. కానీ కొద్ది కాలంలోనే మణవాళ మామునుల కీర్తి గురించి తెలుసుకుంటారు, ఇంకా కందాడై అన్నన్, ఎరుంబి అప్పా వంటి అనేక గొప్ప వ్యక్తులు మణవాళ మామునులను ఆశ్రయించారని కూడా తెలుసుకొంటారు.

వేదవల్లి: నాన్నమ్మా, వారు మణవాళ మామునుల యొక్క శిష్యులుగా ఎలా మారారు?

నాన్నమ్మ: అవును వేదవల్లి, ఎరుంబి అప్పా మణవాళ మామునుల ఆచార్య సంబంధానికి సిద్ధంగా ఉన్నారని వారికి తెలియజేస్తారు. పొన్నడిగళ్ జీయర్ మణవాళ మామునులతో అంటారు “ఎరుంబి అప్పాతో చర్చించే భాగ్యం కలిగింది, వారు మీ శిష్యులు కావాలసిన అన్ని అర్హతలను కలిగి ఉన్నారు” అని అంటారు. వారిరువురూ, వారిని స్వీకరించి ఆశీర్వదించమని అడిగారు. మణవాళ మామునులు వారిద్దరికీ  పంచ సంస్కారం చేస్తారు.

అప్పిళ్ళార్ కి జీయర్ మఠంలో రోజువారీ కార్యకలాపాలు తదీయారాదనం లాంటివి చూసుకునే బాధ్యతను అప్పగిస్తారు. ఎలాగైతే కిడంబి ఆచ్చాన్ మఠం బాధ్యతలను పూర్తిగా స్వీకరించి ఎమ్బెరుమానార్ని సేవించారో అలాగే, మణవాళ మామునులకు అప్పిళ్ళార్ సేవలు అందించారు.

అప్పిళ్ళై మణవాళ మామునుల దివ్య సూచనలను అనుసరిస్తూ తిరువంతాదుల వ్యక్యానాలు వ్రాస్తారు మరియు వారు అనేక దివ్య ప్రబంద సంబంధమైన కైన్కర్యాలలో మణవాళ మామునులకు సహాయం చేస్తారు.

మణవాళ మామునుల చివరి రోజులల్లో, అప్పిళ్ళార్ వారి రోజువారీ ఆరాధన కొరకు వారి అర్చా విగ్రహాన్ని ప్రసాదించమని కోరతారు.  మణవాళ మామునులు వారు నిత్యం ఉపయోగించే ఒక చెంబుని వారికి ఇస్తారు,  వారు ఆ చెంబును ఉపయోగించి రెండు విగ్రహాలు తయారు చేస్తారు. వారిద్దరూ మణవాళ మామునుల విగ్రహాన్ని చెరి ఒకటి వారి నిత్యారాధానం కోసం తీసుకుంటారు.

కాబట్టి పిల్లలూ, వారికున్న అచార్యాభిమానంలో కొంత శాతం మనము కూడా పొందాలని కోరుకుంటూ వారి దివ్య  తిరువాడికి ప్రార్థన చేద్దాము.

పిల్లలు ఇప్పటి వరకు మనం మణవాళ మామునులు మరియు వారి అష్ట దిగ్గజాల యొక్క కీర్తుల గురించి చర్చించాము.

పరాశర: ఈ రోజు మనం చాలా నేర్చుకున్నాము నాన్నమ్మా.

నాన్నమ్మ: అవును. నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అందరికి చెప్తాను. జాగ్రత్తగా వినండి.

మణవాళ మామునుల కాలం తర్వాత అనేక మంది పెద్ద ఆచార్యులు ప్రతి పట్టణం మరియు గ్రామంలో భక్తులను అనుగ్రహిస్తూ వచ్చారు. ఆచార్యలు దివ్య దేశాలలో, అభిమాన స్థలాలలో, ఆళ్వార్ / ఆచార్య అవతార స్థలాలలో మరియు ఇతర క్షేత్రాలలో నివసించి జ్ఞాన, భక్తి ప్రపత్తులను ప్రతి ఒక్కరికీ పెంపొందించే  ప్రయత్నము చేశారు.

తిరుమళిసై అణ్ణవప్పంగార్ మరియు మొదటి శ్రీపెరుంబుతూర్ ఎంబార్ జీయర్  ఇటీవలి కాలం (200 సంవత్సరాల క్రితం) వారు. వారి గ్రంథాలు మరియు కైంకర్యాల ద్వారా మన సాంప్రదాయానికి గణనీయంగా దోహదపడ్డారు.

నేను మీతో పంచుకున్న జ్ఞానమంతా ఈ పరంపర ఆచార్యుల ద్వారానే వచ్చింది. మనము ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మీరందరి  సమయం ఆనందంగా గడిచిందని ఆశిస్తున్నాను. మన మనస్సు, బుద్ధి, శరీరం ఇటువంటి ఆచార్యులు, ఆళ్వారులు మరియు ఎమ్బెరుమానార్ కైన్కర్యంలో ఉపయోగించాలి.

సరే,  చీకటి పడింది. మనం ఆచార్యుల గురించి ఆలోచిస్తూ నేటికి ముగిద్దాం.

పిల్లలు:  ధన్యవాదాలు నాన్నమ్మా.

 మూలము : http://pillai.koyil.org/index.php/2018/07/beginners-guide-ashta-dhik-gajas-and-others/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – తిరువాయ్మోళి పిళ్ళై

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – పిళ్ళై లోకాచార్య శిష్యులు

పిళ్ళై లోకాచార్య శిష్యుల గురించి మరింతగా చర్చించడానికి పిల్లలందరూ ఇంటికి వచ్చినపుడు ఆండాళ్ నాన్నమ్మ వంటచేయటంలో నిమగ్నమై ఉన్నారు. నాన్నమ్మ అందరిని చిరునవ్వుతో స్వాగతించారు. ఆమె పిల్లలకు పంచడానికి శ్రీరంగనాథుని ప్రసాదంతో నిరీక్షిస్తూ ఉన్నారు.

నాన్నమ్మ: పిల్లలూ లోపలికి రండి, పెరుమాళ్ ప్రసాదం తీసుకోండి. మీకందరికీ మనం ముందు చర్చించుకున్న విషయాలు గుర్తున్నాయని ఆశిస్తున్నాను.

వ్యాస: నాన్నమ్మా, మనం కూరకుళోత్తమ దాసు, విళాంచోళ్ళై పిళ్ళై  గురించి నేర్చుకున్నాము. 
ఇంకా “ఆచార్య అభిమానమే ఉద్ధారకం” అనే లోకోక్తిని గురించి కూడా నేర్చుకున్నాము.

నాన్నమ్మ: పిల్లలూ, మిమ్ములను చూస్తుంటే గర్వంగా ఉంది, ఈ రోజు పిళ్ళై లోకాచార్య శిష్యులలో మరొకరైన తిరుమలై ఆళ్వారు గురించి మరింత తెలుసుకుందాము.

అత్తుళాయ్: నాన్నమ్మా, తిరుమలై ఆళ్వారుకి ఆ పేరు ఆళ్వారుల తిరువాయ్మోళిపై వారికి ఉన్న అనురాగం వల్ల వచ్చిందని నేను విన్నాను. నిజమేనా నాన్నమ్మా!

నాన్నమ్మ: అవును అత్తుళాయ్, వారిని శ్రీశైలేశ, శాటకోపదాసు మరియు ముఖ్యంగా తిరువాయ్మోళి పిళ్ళై అని కూడా పిలుస్తారు. నమ్మాళ్వార్ మరియు ఆళ్వారుల యొక్క తిరువాయ్మోళి పట్ల వారికున్న అనురాగం కారణంగా వారికి ఈ పేరు వచ్చింది. తిరుమలై ఆళ్వారుకి తన చిన్న వయస్సులో పిళ్ళై లోకాచార్య యొక్క తిరువడి వద్ద పంచ సంస్కారం జరిగింది.  కాని కొంతకాలం తర్వాత, తిరుమలై ఆళ్వార్ మన సాంప్రదాయానికి దూరమై మధురై రాజ్యంలో ప్రధాన సలహాదారుడిగా సేవ చేయసాగారు.

వ్యాస: ఓ, కానీ నాన్నమ్మా అప్పుడు తిరుమలై ఆళ్వారుని మళ్లీ సంప్రాదయాంలోకి ఎవరు తెచ్చారు?

నాన్నమ్మ: పిల్లలు, నేను మీ ఉత్సుకతని అభినందిస్తున్నాను. తన చివరి రోజులలో పిళ్ళై లోకాచార్య,
కూరకుళోత్తమ దాసు మరియు ఇతర శిష్యులను తిరుమలై ఆళ్వారుని సంస్కరించి మరలా 
సాంప్రదాయంలోకి తీసుకురామని ఆదేశించారు.

వేదవల్లి: నాన్నమ్మా, కూరకుళోత్తమ దాసు తిరుమలై ఆళ్వారుని సంస్కరించేందుకు ఏమి చేశారు? 
నాన్నమ్మా మాకు మీరు చెప్పగలరా?

నాన్నమ్మ: సరే, ఒకసారి తిరుమలై ఆళ్వార్ తన పల్లకీలో యదావిధిగా సంచరిస్తున్నారు. అప్పుడు కూరకుళోత్తమ దాసు తిరువిరుత్తం పాటిస్తుండగా వింటారు. తిరుమలై ఆళ్వారుకి పిళ్ళై లోకాచార్య యొక్క ఆశీర్వాదాలు ముందే కలిగి ఉన్నందున, వారు కూరకుళోత్తమ దాసు యొక్క గొప్పతనాన్ని అర్ధం చేసుకో గలుగుతారు. తిరుమలై ఆళ్వార్ పల్లకీ నుండి క్రిందకు దిగి 
తిరువిరుత్తం  అర్ధాలను నేర్పించమని కూరకుళోత్తమ దాసును అభ్యర్థించారు.

పరాశర: నాన్నమ్మా, మాకు కూరకుళోత్తమ దాసు వద్ద నుండి తిరుమలై ఆళ్వార్ ఎలా నేర్చుకున్నారనే దాని గురించి మరింతగా చెప్పండి.

నాన్నమ్మ: కూరకుళోత్తమ దాసు, తిరుమలై ఆళ్వారుకి బోధించడానికి వస్తారు. వారు తిరుమలై ఆళ్వారు ఊర్ధ్వ పుండ్రం పెట్టుకునేటప్పుడు పిళ్ళై లోకాచార్యుల తనియన్ పాటిస్తుండగా గమనించి సంతోషిస్తారు. అయితే తిరుమలై ఆళ్వారు తరగతికి క్రమంగా హాజరు కాలేకపోతారు. తిరుమలై ఆళ్వారు కూరకుళోత్తమ దాసును క్షమాపణ కోరుతారు. కూరకుళోత్తమ దాసు వారి క్షమాపణ స్వీకరించి వారి శేష ప్రసాదాన్ని ఇస్తారు. తిరుమలై ఆళ్వారు సంతోషంతో స్వీకరిస్తారు, అప్పటినుండి వారు పూర్తిగా భౌతిక కార్యకలాపాలను విడిచి, రాజ్యాధికారాన్ని యువరాజుకి అప్పగించి రాజ్యాన్ని వదిలిపెట్టేస్తారు.

వారి చివరి రోజులలో కూరకుళోత్తమ దాసు,  తిరుమలై ఆళ్వారుని తిరుక్కన్నంగుడి పిళ్ళై వద్దకు వెళ్లి తిరువాయ్మోళిని సవివరంగా నేర్చుకోమని నిర్దేశిస్తారు. తరువాత, వారు అన్ని రహస్య అర్థాలను విళాంచోళై పిళ్ళై వద్ద నేర్చుకున్నారు. కూరకుళోత్తమ దాసులవారు పరమపదించిన తరువాత, పిళ్ళై లోకాచార్యను ధ్యానిస్తూ తిరుమలై ఆళ్వారు దాసుల వారి చరమ కైంకర్యాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, ఆ పైన తిరుమలై ఆళ్వారు మన సాంప్రాదయాన్ని నడిపించారా?

నాన్నమ్మ: కాదు వ్యాస, నేను ముందు చెప్పినట్లుగా, తిరుమలై ఆళ్వారు తిరుక్కన్నంగుడి పిళ్ళై వద్దకు వెళ్లి తిరువాయ్మోళి నేర్చుకోవడం ప్రారంభించారు. వారు పాసురాల అర్థాలను వివరంగా తెలుసుకోవాలని కోరుకుంటారు. అందువల్ల పిళ్ళై వారిని తిరుప్పుట్కుళి జీయర్ వద్దకు నేర్చుకోమని పంపుతారు. దురదృష్టవశాత్తు వీరు చేరికునే ముందే జీయర్ వారు పరమపదం చేరుకుంటారు. తిరుమలై ఆళ్వారు చాలా నిరాశ చెందుతారు, తరువాత దేవ పెరుమాళ్ (కాంచీపురం వరదరాజస్వామి) మంగళాశాసనం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

పరాశర: నాన్నమ్మా, రామానుజులు ఆలవందార్ వద్దకు చేరుకునే ముందే వారు పరమపదించి నట్టుగా ఉంది  ఈ సంఘటన కూడా, అవునా నాన్నమ్మా?

నాన్నమ్మ: అవును పరాశర, అప్పుడు వారు దేవ పెరుమాళ్ కి మంగళాశాసనం చేయటానికి అక్కడకు  చేరుకుంటారు; అక్కడ ప్రతి ఒక్కరూ వారిని స్వాగతిస్తారు, దేవ పెరుమాళ్ తిరుమలై ఆళ్వారుకి వారి శఠకోపంతో, మాలలతో, చందనంతో ఆశీర్వదిస్తారు. దేవ పెరుమాళ్ నాలూర్ పిళ్ళైని తిరుమలై ఆళ్వారుకి తిరుప్పుట్కుళి జీయర్ వద్ద నేర్చుకోలేక పోయిన తిరువాయ్మోళి ఈడు వ్యాక్యానంతో పాటు  అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) అర్థాలను కూడా బోధించమని ఆదేశిస్తారు.

నాలూర్ పిళ్ళై బోధించడానికి సంతోషపడతారు, కానీ వారి వృద్ధాప్యం కారణంగా తిరుమలై ఆళ్వారుకి సరిగ్గా బోధించలేనేమోనని భావిస్తారు. అప్పుడు తిరుమలై ఆళ్వారుకి నేర్పడానికి నాలూర్ పిళ్ళై కుమారుడు నాలూర్ వాచ్చాన్ పిళ్ళైని దేవ పెరుమాళ్ ఆదేశిస్తారు. ఈ దివ్య ఆజ్ఞ వినగానే, నాలూర్ పిళ్ళై  తిరుమలై ఆళ్వారుని ఎంతో సంతోషంగా స్వీకరించి వారిని నాలూర్ వాచ్చాన్ పిళ్ళై వద్దకు తీసుకొని వచ్చి ఈడుతో పాటు అరుళిచ్చెయల్ అర్థాలను కూడా బోధించమని చెప్తారు. ఈ సంఘటన గురించి విన్న తిరునారాయణపురత్తు ఆయీ మరియు తిరునారాయణపురత్తు, పిళ్లై నాలూర్ వాచ్చాన్ పిళ్ళైని
మరియు తిరుమలై ఆళ్వార్ లను తిరునారాయణపురానికి వచ్చి కాలక్షేపాన్ని వివరంగా కొనసాగించుకోమని తద్వారా తాముకూడా నేర్చుకోగలమని విన్నపించుకుంటారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించి వారిరువురు తిరునారాయణపురంలో కాలక్షేపాన్ని వివరంగా కొనసాగిస్తారు. అక్కడ తిరుమలై ఆళ్వారు ఈడు వివరంగా లోతైన అర్థాలతో నేర్చుకుంటారు. నాలూర్ వాచ్చాన్ పిళ్ళై,
తిరుమలై ఆళ్వారు వారి సేవా భావాన్ని మెచ్చుకుని వారి తిరువారాధన పెరుమాల్ను ఆళ్వారుకి ఇస్తారు. తద్వారా ఈడు 36000 పడి నాలూర్ వాచ్చాన్ పిళ్ళై నుండి ముగ్గురు గొప్ప పండితులు – తిరుమలై ఆళ్వారు, తిరునారాయణపురత్తు ఆయీ మరియు తిరునారాయణపురత్తు పిళ్లై ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత తిరుమలై ఆళ్వారు ఆళ్వార్ తిరునగరికి వెళ్లి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు.

వ్యాస: ఆళ్వార్ తిరునగరి నమ్మాల్వారి జన్మ స్థలం కదా నాన్నమ్మా? ఆళ్వార్ తిరునగరి చాలా దీనదశలో ఉన్నప్పుడు తిరుమలై ఆళ్వారు పునరుద్ధరించారని నేను విన్నాను. దయచేసి మాకు ఆ చరితం గురించి చెప్పండి నాన్నమ్మా.

నాన్నమ్మ: అవును వ్యాస. తిరుమలై ఆళ్వారు ఆళ్వార్ తిరునగరికి వచ్చినప్పుడు, అది ఒక అడవిలా ఉండేది. ముస్లింల దండయాత్ర సమయంలో, ఆళ్వార్ ఆళ్వార్ తిరునగారిని వదిలి కర్ణాటక / కేరళ సరిహద్దుకు వెళ్ళిపోతారు. చాలా ప్రయత్నించి తిరుమలై ఆళ్వారు అడవిని తొలగించి ఆ పట్టాణాన్ని మరియు ఆలయాన్ని పునర్నిర్మిస్తారు, ఆలయ వీధులను తిరిగి స్థాపించారు. వారు మధురై రాజు సహాయంతో ఆళ్వార్ని తిరిగి తీసుకువస్తారు. వారు ఆళ్వార్ అన్నా, తిరువాయ్మోళి అన్నా గొప్ప భక్తి గౌరవాలు చూపించేవారు. వారు నిరంతరం తిరువాయ్మోళి పాటించే వారు, క్రమేణా వారు తిరువాయ్మోళి పిళ్ళై అని పిలవబడ్డారు. వారు దివ్యమైన భావిష్యదాచార్య (ఎమ్బెరుమానార్) విగ్రహాన్ని వెలికి తీసి 
ఎమ్బెరుమానార్ కోసం ఆ పట్టణం యొక్క పశ్చిమ భాగంలో చుట్టూ 4 మాడవీధులతో ఎదుట సన్నిధి వీధితో ఒక ప్రత్యేక ఆలయాన్ని ఏర్పాటుచేస్తారు. వారు ఆలయ జాగ్రత్త కోసం సంరక్షకులను కూడా నియమిస్తారు. వారు లేకుండా, ఇవాల మనం చూస్తున్న ఆళ్వార్ తిరునగరిని ఊహించుకోలేము. 

Image result for manavala mamuni

అప్పుడు తిరువాయ్మోళి పిళ్ళై గురించి విని, అళగియ మణవాళన్ (మణవాళ మాముని సన్యాసాశ్రమానికి ముందు) ఆళ్వార్ తిరునగరికి వెళ్లి, వారికి శిష్యులుగా మారి వారికి సేవ చేసుకుంటూ అరుళిచ్చెయల్ పూర్తి అర్ధాలతో నేర్చుకుంటారు. తిరువాయ్మోళి పిళ్ళై వారి చివరి రోజులలో, వారి తదుపరి సాంప్రదాయ  ఆచార్యులు ఎవరని చింతిస్తుండగా అళగియ మణవాళన్ ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మాట ఇస్తారు. దానికి తిరువాయ్మోళి పిళ్ళై సంతోషించి, అళగియ మణవాళన్ వారిని శ్రీభాష్యం నేర్చుకొని, జీవితాంతం వారి పూర్తి దృష్టి తిరువాయ్మోళి మరియు తిరువాయ్మోళి వ్యాఖ్యానాలపై పెట్టమని కోరుతారు. ఆ తరువాత తిరువాయ్మోళి పిళ్ళై పరమపదానికి చేరుకుంటారు, అళగియ మణవాళన్ వారి చరమ కైంకర్యాలు పూర్తి చేస్తారు.

తిరువాయ్మోళి పిళ్ళై వారి జీవితాన్ని నమ్మాళ్వారికి మరియు తిరువాయ్మోళికి అంకితం చేశారు. వారి యొక్క ప్రయత్నాల వల్ల మనకు ఈడు 36000 పడి వ్యాఖ్యానం అందింది, అళగియ మణవాళన్ చేత విస్తృతంగా విస్తరింపబదిండి. కాబట్టి పిల్లలూ, తిరువాయ్మోళి పిళ్ళై తిరువాడిని ప్రార్థించి, ఎమ్బెరుమానార్ మరియు ఆచార్యులపై వారికున్న భక్తి ప్రపత్తులను మనకు కూడా ప్రాసాదించమని వేడుకుందాం.

పిల్లలు పూర్తి ఆశీర్వాదాలతో, చర్చను గురించి ఆలోచిస్తూ ఇళ్ళకు వెళతారు.


మూలము : http://pillai.koyil.org/index.php/2018/05/beginners-guide-thiruvaimozhip-pillai/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


బాల పాఠము – అళగియ మణవాళ మామునులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – తిరువాయ్మోళి పిళ్ళై

ఆండళ్ నాన్నమ్మ మణవాళ మామునుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన పిల్లలను స్వాగతిస్తుంది.

నాన్నమ్మ: స్వాగతం పిల్లలు, మీరు మీ వేసవి సెలవులు ఎలా గడిపారు?

పరాశర: నాన్నమ్మా, సెలవులు బాగా గడిచాయి. ఇప్పుడు మణవాళ మామునుల గురించి  వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది. మీరు వారి గురించి మాకు చెప్పరూ?

నాన్నమ్మ: సరే పిల్లలు. వారు ఆళ్వార్ తిరునగరిలో తిగళక్కిడందాన్ తిరునావిరుడైయ పిరాన్ మరియు శ్రీ రంగ నాచియార్లకు ఆదిశేషుని అవతారంగా, యతిరాజు యొక్క పునరావతారముగా జన్మించారు.  వారికి అళగియ మణవాళన్ (అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అని కూడా) పేరు పెట్టారు. వారు అన్ని సామాన్య శాస్త్రాలు (ప్రాథమిక సూత్రాలు) మరియు వేదాధ్యయనం వారి తండ్రి మార్గదర్శకత్వంలో 
నేర్చుకున్నారు.

వ్యాస: నాన్నమ్మా, తిరువాయ్మోళి పిళ్ళై వారి ఆచార్యులు కాదా?

నాన్నమ్మ: అవును వ్యాస, తిరువాయ్మోళి పిళ్ళై యొక్క గొప్పతనాన్ని గురించి విని, వారికి శరణాగతులౌతారు. వారు అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) ప్రత్యేకించి తిరువాయ్మోళి మరియు ఈడు 36000 పడి వ్యాఖ్యానంలో నిపుణులౌతారు. వారు శ్రీరామానుజులపై భక్తి భావంతో 
ఆళ్వార్ తిరునగరిలోని భవిష్యదాచార్య సన్నిధిలో సేవించేవారు. యతీంద్రుల (శ్రీరామానుజుల) పట్ల వారికున్న అమితమైన భక్తి ప్రపత్తుల వల్ల వారిని ప్రేమతో “యతీంద్ర ప్రవణ” అని పిలిచేవారు. 

తరువాత, వారి ఆచార్యుల యొక్క నియమనం జ్ఞాపకం చేసుకొని, మన సాంప్రదాయ ప్రచారం కోసం శ్రీరంగంలో ఉంటారు. శ్రీరంగం చేరిన తరువాత, వారు సన్యాసాశ్రమం స్వీకరించి, అళగియ మణవాళ మాముని మరియు పెరియ జీయర్ గా పిలువబడతారు.

వారు ముమ్ముక్షుప్పడి, తత్వ త్రయం, వేదం, వేదాంతం, ఇతిహాస, పురాణాలు, పాసురాలు మరియు అరుళిచ్చెయల్ నుండి అనేక ఉపప్రమాణాలతో శ్రీ వచన భూషణం వంటి అనేక రహస్య గ్రంథాలకు అందమైన వ్యాఖ్యానాలను రాశారు.

వారు  రామానుజ నూట్రందాది,  జ్ఞాన సారం మరియు ప్రమేయ సారానికి వ్యాఖ్యానాలు వ్రాసారు. 
ప్రమేయ సారం చరమోపాయ నిష్ఠను (ఆచార్యుల అవగాహనే సర్వస్వం) వివరిస్తుంది.  శ్రీవైష్ణవుల విన్నపంతో మామునులు తిరువాయ్మోళి అర్థాలను మరియు నమ్మాళ్వారి ప్రాముఖ్యమును గొప్పతనాన్ని తెలుపుతూ తిరువాయ్మోళి నూట్రందాది వ్రాశారు. వారు మన పూర్వాచార్యుల విలువైన బోధనలను ఉపదేశ రత్నమాలలో ఊటంకిస్తూ, ఆళ్వారుల జన్మస్థలాలు, తిరునక్షత్రాలు, తిరువాయ్మోళి మరియు శ్రీ వచన భూషణము యొక్క ప్రాముఖ్యమును గొప్పతనాన్ని తెలుపుతూ వ్రాశారు.

మామునులు కూడా దివ్య దేశ యాత్రకు వెళ్లి పెరుమాళ్ లకు మరియు ఆల్వారులకు మంగళాశాసనాలు చేశారు.

వేదవల్లి: నాన్నమ్మా, మామునులు మరియు వారు మన సాంప్రదాయానికి చేసిన కృషి గురించి వినడానికి చాలా అద్భుతంగా ఉంది.

నాన్నమ్మ: అవును వేదవల్లి, నంపెరుమాళ్ కూడా  మామునుల నుండి నమ్మాళ్వారి యొక్క
తిరువాయ్మోళి ఈడు 36000 పడి వ్యాఖ్యానం యొక్క కాలక్షేపాన్ని వినడానికి చాలా ఆసక్తిగా ఉండేవారు.
మామునులు చాలా సంతోషించి ఆ కాలక్షేపాన్ని10 నెలలు చెప్పి, చివరకు ఆని తిరుమూలంలో సాత్తుముర వహిస్తారు.

srisailesa-thanian-small

సాత్తుముర పూర్తయిన తరువాత, నంపెరుమాళ్ ఒక చిన్న పిల్లవాడి రూపంలో
మామునుల ఎదుటకు వచ్చి అంజలి ముద్రతో “శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం” ను పఠించడం మొదలుపెడతారు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి వారెవరో కాదు నంపెరుమాళ్ అని అర్థం చేసుకుంటారు.

పరాశర: ఓ! నంపెరుమాళ్ చేత గౌరవించబడటం చాలా గర్వకారణం. నాన్నమ్మా, అందుకోసమేనా మన సేవాకాలం ఈ తనియన్ తో ప్రారంభిస్తాము?

నాన్నమ్మ: అవును పరాశర. ఎమ్బెరుమాన్ ఈ తనియన్ న్నిఅన్ని దివ్య దేశాలకు పంపి సేవాకాలం ప్రారంభంలో మరియు చివరిలో పాటించాలని ఆదేశిస్తారు. తిరువెంగడముడయాన్ మరియు తిరుమాలిరుంజోలై అళగర్ కూడా ఈ తనియన్ న్ని ప్రారంభంలో మరియు అరుళిచ్చెయల్ అనుసంధానం చివరిలో పాటించాలని ఆదేశిస్తారు.

వారి చివరి రోజులలో, చాలా కష్టంగా ఆచార్య హృదయం వ్యాఖ్యానాన్ని పూర్తి చేస్తారు. చివరగా వారి తిరుమేనిని విడిచి పరమపదానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. వారు ఆర్తి ప్రబంధం పటిస్తూ  ఎమ్బెరుమానార్ని స్వీకరించమని మరియు ఈ భౌతిక సామ్రాజ్యం నుండి ఉపశమనాన్ని ఈయమని 
వేదనతో ప్రార్థిస్తారు. తరువాత, ఎమ్బెరుమానార్ యొక్క దయతో మామునులు పరమపదానికి చేరుకుంటారు. ఆ సమయంలో దగ్గరలో ఉన్న పొన్నడిగళ్ జీయర్ ఈ వార్త విని శ్రీరంగంకు తిరిగి వచ్చి,
మామునుల చరమ కైంకర్యాలు పూర్తి చేస్తారు.

అత్తుళాయ్: నాన్నమ్మా, వారి గురించి మాట్లాడుకొని మన అందరికీ ఎంతో ప్రయోజనం కలిగింది. మామునుల దివ్య చరితాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

నాన్నమ్మ: నాకూ చాలా ఆనందం కలిగింది అత్తుళాయ్. చివర్న ఒక మాట, వారిని పెరియ పెరుమాళే ఆచార్యులుగా అంగీకరించినందున, వారు పెరియ పెరుమాళే చేతనే ప్రారంభమైన ఆచార్య రత్నహారమును మరియు ఓరాన్ వాళి గురుపరంపర ను పూర్తి చేశారు.

మనము తరువాత చర్చలో మామునుల శిష్యుల (అష్ట దిగ్గజాలు) గురించి చర్చిద్దాము.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/06/beginners-guide-mamunigal/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Posters – AchAryas – telugu

శ్రీః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

OrAN vazhi AchAryas

 1. పెరియ పెరుమాళ్
 2. పెరియ పిరాట్టి
 3. సేనై ముదలియార్
 4. నమ్మాళ్వార్
 5. శ్రీమన్నాథమునులు
 6. ఉయ్యక్కొండార్
 7. మణక్కాల్ నంబి
 8.  ఆళవందార్
 9.  పెరియనంబి
 10. ఎమ్పెరుమానార్
 11. ఎంబార్
 12. పరాశరభట్టర్
 13. నంజీయర్
 14. నంపిళ్ళై
 15. వడక్కు తిరువీధిపిళ్ళై
 16. పిళ్ళై లోకాచార్యులు
 17. తిరువాయ్ మొళిపిళ్ళై
 18. అళగియ మనవాళ మామునిగల్

Thanks to SrI dhAsarathi for preparing the posters.

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

బాల పాఠము – పిళ్ళై లోకాచార్య శిష్యులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<పిళ్ళై లోకాచార్య మరియు నాయనార్

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి 
పూర్తి ఉత్సుకతతో పిళ్ళై లోకాచార్య శిష్యుల గురించి తెలుసుకోవడానికి వస్తారు.

నాన్నమ్మ: స్వాగతం పిల్లలు, మీరు ఎలా ఉన్నారు? నేను మీ అందరి ముఖాల్లో ఉత్సాహాన్ని చూస్తున్నాను.

వ్యాస: నమస్కారం నాన్నమ్మా, మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు?
మీరు సరిగ్గా అన్నారు నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్య శిష్యుల గురించి వినడానికి మాకు చాలా ఉత్సాహంగా ఉంది.

నాన్నమ్మ: అవును పిల్లలు, నేను కూడా  మీతో ఆ విషయాలు పంచుకోడానికి వేచి ఉన్నాను. మీకు గతసారి ఎవరి గురించి చెప్పుకున్నామో గుర్తుందని ఆశిస్తున్నాను. వారి శిష్యుల పేర్లు చెప్పగలరా?

అత్తుళాయ్: నాన్నమ్మా! నాకు పేర్లు గుర్తున్నాయి. కూరకుళోత్తమ దాస, విళాంచోళ్ళై పిళ్ళై, తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై), మణపాక్కత్తు నంబి, కొత్తూర్ అన్నర్, తిరుప్పుట్కొళి జీయర్, తిరుక్కన్నన్ గుడి పిళ్ళై, కొల్లికావల దాస.

నాన్నమ్మ: చాలా బావుంది అత్తుళాయ్, మీకు గుర్తున్నందుకు ఆనందంగా ఉంది.  ఇప్పుడు వివరంగా చెప్పుకుందాము. మొదట, కూరకుళోత్తమ దాస గురించి చెప్పుకుందాము.

పిల్లలందరు : సరే నాన్నమ్మ!

నాన్నమ్మ: కూరకుళోత్తమ దాసు శ్రీరంగం లో జన్మించారు. తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై)ని
తిరిగి మన సాంప్రదాయంలోకి  తీసుకురావడంలో వీరు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు.
వారు పిళ్ళై లోకాచార్యులకు అత్యంత సన్నిహితులు, వారు పిళ్ళై లోకాచార్యులతో తిరువరంగనుల 
(ముస్లిం దాడి సమయంలో నంపెరుమాళ్ వివిధ ప్రదేశాలను సందర్శించారు) సమయంలో పిళ్ళై
లోకాచార్యులతో ప్రయాణం చేశారు. కూరకుళోత్తమ దాసును కీర్తిస్తూ మణవాళ మాముని ఇలా అన్నారు “కూరకుళోత్తమ దాసం ఉదారం” (చాలా దయగల, దాతృత్వం గల వ్యక్తి) ఎందుకంటే వారి అమితమైన కృపతో అనేక ప్రయత్నాలు చేసి తిరుమలై ఆళ్వారును తీర్చిదిద్దిన వారు. క్రమేణా తిరుమలై ఆళ్వారు కూరకుళోత్తమ దాసుకు ఎంతో కృతజ్ఞతతో వారికి శరణాగతి చేసి వారికి ఎల్లప్పుడూ సేవచేసుకుంటూ ఉండిపోయారు. కూరకుళోత్తమ దాసు పరమపదించిన తరువాతనే వారు మరలా ఆళ్వారుతిరునగరికి వెళతారు. శ్రీ వచన భూషనంలో ఒక శిష్యునికి “ఆచార్య అభిమానమే ఉద్ధారకం” అని చెబుతారు. ఇది ఖచ్చితంగా కూరకుళోత్తమ దాసు మరియు తిరుమలై ఆళ్వారుకి సరిపడుతుంది. మనం కూడా పిళ్ళై లోకాచార్యుల చరణ కమలాలను ధ్యానించే కూరకుళోత్తమ దాసును ఎల్లప్పుడూ గుర్తు చేసుకుందాం.

వేదవల్లి : నాన్నమ్మా, మేము కూరకుళోత్తమ దాసు గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆచార్యులను ఒక శిష్యుడు ఎలా గౌరవించాలో మేము నేర్చుకున్నాము.

నాన్నమ్మ: అవును వేదవల్లి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి “ఆచార్య అభిమానమే ఉద్ధారకం”. ఇప్పుడు మరో ముఖ్యమైన శిష్యుడి గురించి నేర్చుకుందాము. వారి పేరు విళాంచోళై పిళ్ళై.

వ్యాస: నాన్నమ్మా, నాకు తెలుసు వారిని విళాంచోళై పిళ్ళై అని ఎందుకు పిలుస్తారో. వారు  తిరువనంతపురంలో, పద్మనాభ స్వామి ఆలయ గోపురం దర్శనం చేసుకోవడానికి వెళగచెట్టు ఎక్కేవారట.

viLAnchOlai piLLai

నాన్నమ్మ: బాగుంది వ్యాస. నిమ్న కులంలో జన్మించిన వారైనందుకు వారిని ఆలయంలోకి అనుమతించే వారుకాదు. అందువలన పెరుమాళ్ దర్శనం చేసుకోవడానికి వెళగచెట్టును ఎక్కి మంగళాశాసనం చేసేవారట. పిళ్ళై లోకాచార్యుల దయతో వారు ఈడు, శ్రీ భాష్యం, తత్వ త్రయం ఇంక మరికొన్ని రహస్య గ్రంథాలు వారి సోదరులైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ వద్ద నేర్చుకుంటారు.

విళాంచోళై పిళ్ళై వారి ఆచార్యులైన పిళ్ళై లోకాచార్య వద్ద శ్రీవచన భూషణము నేర్చుకుంటారు. 
శ్రీవచన భూషణము యొక్క తాత్పర్యంలో వారు నిపుణులవుతారు. వారు శ్రీవచన భూషణ సారాంశాన్ని “సప్త గాధై” అను గ్రంథములో వాశారు.

పరాశర: విళాంచోళై పిళ్ళై యొక్క ఆచార్య నిష్ఠ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది.

నాన్నమ్మ: అవును పరాశర! వారి ఆచార్య సూచనలను అనుసరిస్తూ వారు చేసిన అతిపెద్ద కైంకర్యాలలో ఒకటి తిరుమలై ఆళ్వారుని మన సాంప్రదాయంలోకి తీసుకురావడం. తిరుమలై ఆళ్వారులకు శ్రీవచన భూషణ సారాంశాన్ని బోధించమని విళాంచోళై పిళ్ళై కి పిళ్ళై లోకాచార్యులు నిర్దేశిస్తారు. పిల్లలు! ఇప్పుడు, విళాంచోళై పిళ్ళై జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను మీతో పంచుకోబోతున్నాను.

అత్తుళాయ్: నాన్నమ్మా, ఆ సంఘటన గురించి దయచేసి మాకు చెప్పరూ.

నాన్నమ్మ: మీకు వినడానికి చాలా ఆసక్తిగా ఉందని నాకు తెలుసు. మీ అందరితో సద్విషయాలు పంచుకోవడం నా బాధ్యత, కాబట్టి జాగ్రత్తగా వినండి,

ఒకరోజు తిరువనంతపురంలో నంబూద్రీ అర్చకులు పద్మనాభస్వామికి తిరువారాధనం చేస్తున్నారు. ఆలయంలోకి విళాంచోళై పిళ్ళై ప్రవేశించారు. మనకు తెలిసినంతవరకూ గర్భగుడికి మూడు ద్వారాలు ఉంటాయి. విళాంచోళై పిళ్ళై పెరుమాళ్ తిరువడి కనిపించేటట్టుగా ఒక ద్వారం వద్ద నిలుచున్నారు. అది చూసి నంబూద్రీ అర్చకులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆలయ ప్రాంగణంలో విళాంచోళై పిళ్ళై వారికి అనుమతి లేదు కాబట్టి, అర్చకులు సన్నిధి తలుపును మూసివేసి, ఆలయం నుండి బయటకు వెళ్ళడం ప్రారంభించారు.

అదే సమయంలో, కొంతమంది స్థానిక విళాంచోళై పిళ్ళై శిష్యులు ఆలయానికి వచ్చి వారి ఆచార్యులైన విళాంచోళై పిళ్ళై వారి శరీరాన్ని విడిచి తన ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల తిరువడి చేరుకున్నారని ప్రకటిస్తారు. వారికి “తిరుపరియట్టం” (ఎమ్బెరుమాన్ వస్త్రం ప్రసాద రూపంలో) ఇంకా ఎమ్బెరుమాన్ పూలదండలు విళాంచోళై పిళ్ళై తిరుమేని కోసం కావాలని అడుగుతారు.

ఇది విన్న నంబూద్రీ అర్చకులు విళాంచోళై పిళ్ళై యొక్క గొప్పతనాన్ని అర్ధం చేసుకుంటారు. అప్పుడు వారు పెరుమాళ్ తిరుపరియట్టం మరియు దండలు వారికి అందజేస్తారు.

వేదవల్లి: నాన్నమ్మా, నేను విళాంచోళై పిళ్ళై చివరి క్షణాలు గురించి వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి.

వ్యాస: అవును నాన్నమ్మా, నాకు కూడా కళ్ళ నుండి సంతోష భాష్పాలు వస్తున్నాయి. ఈ సంఘటన  నుండి ఒక నిమ్న కులపు వ్యక్తి మన సాంప్రదాయంలో ఎలా మహిమపరచబడ్డారో తెలుస్తోంది.

నాన్నమ్మ: సరే పిల్లలు, మీతో సమయం బాగా గడిచింది. మీరు ఈ రోజు మనం చర్చించిన వాటిని గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను. మరోసారి నేను తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) గురించి వివరంగా చెప్తాను.

పిల్లలందరూ ఉత్సాహంగా చర్చించుకున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఆనందంతో ఇండ్లకు వెళ్ళారు.

మూలము :http://pillai.koyil.org/index.php/2018/05/beginners-guide-pillai-lokacharyars-sishyas/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – పిళ్ళై లోకాచార్య మరియు నాయనార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంపిళ్ళై శిష్యులు

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి వస్తారు, నాన్నమ్మ తిరుప్పావై పఠిస్తూ ఉంటే చూసి వారు ఆ పాఠం పూర్తయ్యేవరకు వేచి చూస్తారు. నాన్నమ్మ పాఠము పూర్తి అయ్యాక పిల్లలతో మాట్లాడుతూ లోపలికి రమ్మంటారు.

నాన్నమ్మ: పిల్లలూ! లోపలికి రండి!

వ్యాస: నాన్నమ్మా, క్రిందటిసారి మీరు వడక్కు తిరువీధి పిళ్ళై యొక్క కుమారుల గురించి చెప్తానని అన్నారు. వారి గురించి మాకు చెప్పరూ.

నాన్నమ్మ: అవును వ్యాస. ఈ రోజు మనం వడక్కు తిరువీధి పిళ్ళై యొక్క సుప్రసిద్ధులైన ఇద్దరు కుమారుల గురించి మాట్లాదాము. నేను క్రిందటిసారి చెప్పినట్లుగా, వారి ఆచార్యులైన నంపిళ్ళై మరియు నంపెరుమాళ్ యొక్క అనుగ్రహంతో, వడక్కు తిరువీధి పిళ్ళైకి ఇద్దరు కుమారులు పిళ్ళై లోకాచార్య మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు జన్మించారు. ఆ ఇద్దరు బాలురు రామ లక్షణుల లాగా కలిసి పెరుగి గొప్ప విద్వాంసులుగా మారి మన సాంప్రదాయానికి గొప్ప కైంకర్యాలు చేశారు.

నంపిళ్ళై పరమపదానికి చేరుకున్న తరువాత, వడక్కు తిరువీధి పిళ్ళై మన సాంప్రదాయానికి తదుపరి ఆచార్యులై వారి కుమారులకు తాను తన ఆచార్యులైన నంపిళ్ళై నుండి నేర్చుకున్న అన్ని అంశాలను ఉపదేశిస్తారు. కొంతకాలం తర్వాత వడక్కు తిరువీధి పిళ్ళై వారి ఆచార్యులైన నంపిళ్ళైని ధ్యానిస్తూ తన చరమ తిరుమేనిని విడిచి  పరమపదానికి చేరుకుంటారు. వారి తరువాత వారి కుమారుడు పిళ్ళై లోకాచార్య మన సాంప్రదాయానికి ఆచార్యులుగా అధీష్టిస్తారు.

అత్తుళాయ్: నాన్నమ్మా,  పిళ్ళై లోకాచార్య ఎవరో కాదు దేవ పెరుమాళ్ అని నేను విన్నాను.

కాట్టళగియ కోయిల్ లో కాలక్షేపం చేస్తూ పిళ్ళై లోకాచార్య

నాన్నమ్మ: అవును అత్తుళాయ్, నువ్వు విన్నది నిజమే. పిళ్ళై లోకాచార్య ఎవరో కాదు స్వయంగా దేవ పెరుమాళే. జ్యోతిష్కుడిలో పిళ్ళై లోకాచార్య వారి ఆఖరి రోజులలో, మన సాంప్రదాయ తదుపరి ఆచార్యులు కావలసిన తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) కి వ్యాఖ్యానాలు బోధించమని నాళూర్ పిళ్ళైని ఆదేశిస్తారు. తిరుమలై ఆళ్వారు దేవ పెరుమాళ్ మంగళాసాసం కోసం కాంచీపురానికి వెళ్ళినప్పుడు, దేవ పెరుమాళ్ పక్కనే నిలబడి ఉన్న నాళూర్ పిళ్ళైతో మాట్లాడుతూ అంటారు “నేను జ్యోతిష్కుడిలో చెప్పినట్లుగా మీరు తిరుమలై ఆళ్వారుకి అరుళిచ్చెయల్ అన్ని అర్థాలను నేర్పించాలి” అని అంటారు.

వేదవల్లి: నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్య జ్యోతిష్కుడిలో ఎందుకు వారి చివరి రోజులు గడిపారు? వారు శ్రీరంగంలో జన్మించలేదా?

నాన్నమ్మ: పిళ్ళై లోకాచార్యులు అందరి ప్రయోజనం కోసం సులభమైన తమిళ భాషలో ఆళ్వార్ ల పాసురాలపై అందమైన గ్రంథాలు రాసిన ఒక గొప్ప ఆచార్యులు. సంస్కృతం లేదా తమిళ భాషల్లో అందరికీ ప్రావీణ్యం ఉండదు. భాషా ప్రావీణ్యం లేకపోయినా మన పూర్వాచార్యుల రచనల గురించి తెలుసుకొని లాభపడే కోరిక ఉన్నవారి కోసం పిళ్ళై లోకాచార్యులు గొప్ప దయతో వారి ఆచార్యుల నుండి విన్న ఉపదేశాలను సాధారణమైన, ప్రస్ఫుటమైన భాషలో రచించి ఉంచారు. వారి రచనలలో అతి గొప్పదైన శ్రీవచన భూషణం దివ్యమైన శాస్త్రం, మన సాంప్రదాయ అర్ధాల వివరాలను తెలియజేస్తుంది. అందువల్ల వారు ప్రమాణ రక్షణం (మన సాంప్రదాయం యొక్క పరిజ్ఞాన పునాదిని రక్షించడం / పోషించడం) చేసిన ముఖ్యమైన ఆచార్యులు.

పిళ్ళై లోకాచార్యులు – శ్రీరంగం

పిళ్ళై లోకాచార్య మన సాంప్రదాయ ఆధ్యాత్మిక జ్ఞానాధారాన్ని కాపాడుకోవడమే కాకుండా, మన సాంప్రదాయ మూలాధారమైన శ్రీరంగం నంపెరుమాళ్ని కూడా పరిరక్షించారు. శ్రీరంగంలో అన్ని కార్యాలు సక్రమంగా జరుగుతున్న రోజుల్లో హఠాత్తుగా ముస్లింల ముట్టడి అడవి మంటలా వ్యాపించింది. ఈ ముస్లిం రాజులు మన దేవాలయాల విస్తారమైన సంపదను లక్ష్యంగా చేసుకొని ఆక్రమించడంలో ప్రసిద్దులు, కావున అందరూ చాలా భయపడ్డారు. వెంటనే పిళ్ళై లోకాచార్య (శ్రీవైష్ణవ వరిష్ఠమైన ఆచార్య) పరిస్థితిని వారి నియంత్రణలోకి తీసుకుంటారు. పెరియ పెరుమాళ్ ఎదురుగా ఒక గోడను కట్టమని శ్రీవైష్ణవులను ఆదేశించి, నంపెరుమాళ్ మరియు ఉభయ నాచియార్లను తన వెంట తీసుకొని భారతదేశ దక్షిణదిశ వైపు బయలుదేరుతారు. వారు ఆ సమయంలో చాలా వృద్ధులు కానీ తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా  నంపెరుమాళ్తో  పాటు ప్రయాణించారు. వారు అడవుల గుండా వెళుతుండగా, కొంతమంది దొంగలు వచ్చి, నంపెరుమాళ్ ఆభరణాలను దోచుకుంటారు. కొని, తరువాత పిళ్ళై లోకాచార్యులు  వారి మనస్సు మార్చుతారు, వారు పిళ్ళై లోకాచార్యులకు శరణాగతి చేసి ఆభరణాలను తిరిగి వారికి అప్పగిస్తారు.

ఆ తరువాత, వారు జ్యోతిష్కుడి (మధురై సమీపంలో) అనే ప్రదేశానికి చేరుకుంటారు. పిళ్ళై లోకాచార్య వృద్ధులై అనారోగ్యం కారణంగా, పరమపదానికి చేరుకోవాలని నిర్ణయించుకొంటారు. వారు తన శిష్యులలో ఒకరైన తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మోలి పిళ్ళై)ను తదుపరి ఆచార్యులుగా చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ సమయంలోనే తిరుమలై ఆళ్వార్ కి వ్యాఖ్యానాలు బోధించమని  నాలూర్ పిళ్ళైని నిర్దేశిస్తారు. అప్పుడు శ్రీశైలేశ (తిరువాయ్మోలి పిళ్ళై) మధురై రాజు వద్ద పని చేస్తుండేవారు. వారిని సాంప్రదాయంలోకి తిరిగి తీసుకురావాలని కూరకులోత్తమ దాసు మరియు విలంచోలై పిళ్ళై ని ఆదేశిస్తారు, తద్వారా వారు తదుపరి ఆచార్యునిగా మారవచ్చునని వారిని నిర్దేశిస్తారు. చివరగా వారు తన చరమ తిరుమేనిని వదిలి, జ్యోతిష్కుడిలో పరమపదానికి చేరుకుంటారు. అలా పిళ్ళై లోకాచార్య నంపెరుమాళ్ భద్రత కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారు. వారు మరియు వేలాది శ్రీవైష్ణవులు వారి జీవితాలను నంపెరుమాళ్ కోసం త్యాగం చేయకపోయుంటే ఈవాల్టి రోజు మనం శ్రీరంగంలో నంపెరుమాళ్ని దర్శనం చేసుకునే వాళ్ళం కాదు, సేవించుకునే వాళ్ళం కాదు.

జ్యోతిష్కుడి – పిళ్ళై లోకచార్యులు పరమపదించిన స్థానం

పరాశర: వారు స్వయంగా దేవ పెరుమాళ్ అవతారం అనడంలో అతిశయోక్తి లేదు, వారు త్యాగాల సంగ్రహము!

నాన్నమ్మ: అవును పరాశర, అందువల్ల దేవ పెరుమాళ్ని మన సాంప్రదాయ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. పిళ్ళై లోకాచార్య  ప్రమాణ రక్షణ (మన గ్రంథాల రూపంలో జ్ఞానాధారం యొక్క రక్షణ) మాత్రమే కాకుండా, వారు ప్రమేయ రక్షణం (నంపెరుమాళ్ యొక్క రక్షణ) లో కూడా కీలక పాత్ర పోషించారు. వారు నంపెరుమాళ్ యొక్క రక్షణ గురించి ఆలోచిస్తూ ఒక శ్రీవైష్ణవుని యొక్క నిజమైన లక్షణాన్ని మనకు చూపించారు. పెరయాళ్వార్ ఎమ్బెరుమాన్ యొక్క తిరుమేని గురించి ఆందోళన చెంది పల్లాండు పల్లాండు అని పాడి నట్టుగా, పిళ్ళై లోకాచార్య నంపెరుమాళ్ అర్చామూర్తిని పితృ వాత్సల్య భావంతో ప్రేమతో సంరక్షించారు, వారి జీవితాన్ని త్యాగము చేయటానికి సిద్ధమైనారేే కాని ముస్లిం ఆక్రమణదారులు నంపెరుమాళ్ని తీసుకువెళ్ళనివ్వలేదు. అందువల్ల, మీరు ఈసారి పెరుమాళ్ ఆలయానికి వెళ్ళినపుడు, నేడు మనకున్న ఈ సాంప్రదాయం వేలమంది శ్రీవైష్ణవులు చేసిన నిస్వార్ధమైన త్యాగంతో నిర్మించబడినదని మీరు గుర్తుంచుకోవాలి. వారు మన సాంప్రదాయాన్ని మరియు నంపెరుమాళ్ని కాపాడారు, ఎందుకంటే ఆ కారణంగా మనమూ, మన భవిష్యత్తు తరాలవారూ ఆ ఫలాన్ని పొందవచ్చునని. మనము వారి ఋణము ఎప్పుడూ తీర్చుకోలేము. వారికి కృతజ్ఞతగా వారి త్యాగాలను గుర్తుంచుకొని, మన సాంప్రదాయాన్ని గౌరవించి, ముందు తరాల వారికి ఆ విలువలను, జ్ఞానాన్ని అందించి ముందుకు తీసుకువెెెళ్ళవలెను.

అత్తుళాయ్: నానమ్మ, పిళ్ళై లోకాచార్య తమ్ముడైన అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ గురించి మాకు చెప్పండి.

nayanar

అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్

నాన్నమ్మ: నాయనార్ మన సాంప్రదాయ సూత్రాలపై అద్భుతమైన గ్రంథాలు వ్రాశారు, వాటిలో ఆచార్య హృదయం శ్రేష్ఠమైన కృతి. వారికున్న సాంప్రదాయ, దివ్యదేశ జ్ఞానం వలన వారిని పెరియ వాచ్చాన్ పిళ్ళై లాంటి గొప్ప ఆచార్యులకు సమానంగా పరిగణిస్తారు.  నాయనార్ గొప్ప ఆచార్యులుగా ప్రశంసించబడే వారు. వారిని సాధారణంగా అందరూ  “జగత్ గురువరానుజ – లోకాచార్యకు తమ్ముడు” గా కీర్తించే వారు. పిళ్ళై లోకాచార్యను వదిలి నాయనార్ చిన్న వయస్సులోనే వారి తిరుమేనిని విడవాలని నిర్ణయించుకొని పరమపదాన్ని అధీష్టిస్తారు. వారి రచనలు జ్ఞాన రత్నాలు, ఆ రచనలు లేకపొతే మన సాంప్రదాయం యొక్క క్లిష్టమైన అర్థాలు, వివరాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవికావు. మాముని నాయనార్ని మరియు వారి రచనలను మెచ్చుకుంటూ పెరియ వాచ్చాన్ పిళ్ళై తరువాత, నాయనార్ వారి రచనలతో కీలక పాత్ర వహించారని కీర్తిస్తారు. నాయనార్ పరమపదం చేరుకున్నప్పుడు, పిళ్ళై లోకాచార్య దుఃఖ సాగరంలో పడి నాయనార్ యొక్క తిరుముడిని (తల) తన ఒళ్ళో ఉంచి విలపిస్తారు. ఈ ప్రపంచం వారిని కొద్ది కాలంలోనే కోల్పోయిందని వారు నాయనార్ని ఒక శ్రేష్ఠమైన శ్రీవైష్ణవ దృష్టితో చూస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్య మరియు నాయనార్ వారి జీవితాలు వినడానికి చాలా ఆసక్తికరంగా మరియు భావోద్వేగంగా ఉన్నాయి.

నాన్నమ్మ: అవును వ్యాస. మన ఆచార్యుల జీవితాల గురించి మాట్లాడటం మొదలుపెడితే, సమయమే తెలియదు. బయట చీకటి పడుతోంది. పిల్లలు మీరిప్పుడు మీ ఇళ్లకి వెళ్లాలి. మనము ఈ సారి కలుసుకున్నప్పుడు పిళ్ళై లోకాచార్య శిష్యుల గురించి మీకు చెప్తాను.

పిల్లలు వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్య, అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ మరియు వారి అద్భుతమైన జీవితాల గురించి ఆలోచిస్తూ వారి ఇంటికి వెళ్ళిపోతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/09/beginners-guide-pillai-lokacharyar-and-nayanar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org