శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< ఉయ్యక్కొణ్డార్, మణక్కాల్ నంబి
వ్యాస పరాశరులు అత్తుళాయ్ తో కలిసి బామ్మగారి ఇంటికి వస్తారు. బామ్మగారు వాళ్ళకి ప్రసాదాన్నిచ్చి కూర్చోమంటారు.
బామ్మగారు: పిల్లలూ! ఇక్కడ మీ కాళ్ళు చేతులు కడుక్కొని ఈ ప్రసాదం తీసుకోండి. ఈ వేళ ఉత్తరాషాడం, ఆళవందార్ల తిరునక్షత్రం.
పరాశర: నాన్నమ్మా, పోయిన సారి మీరు యమునైత్తుఱైవర్ గురించి మాకు చెప్తానని అన్నారు గుర్తుందా?
బామ్మగారు: అవును! గుర్తుంది. ఆచార్యుల గురించి తెలుసుకోవాలన్న మీ ఆసక్తిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేళ వారి తిరునక్షతరం. వారి మహిమల గురించి చెప్పుకోడానికి మనకు సరైన రోజు.
వ్యాస: నాన్నమ్మా, కానీ మీరు ఆళవందార్ల తిరునక్షత్రం అని అన్నారు కదా?
ఆళవందార్ – కాట్టు మన్నార్ కోయిల్
బామ్మగారు: అవును. కట్టూమన్నర్ కైయిల్లో జన్మించిన యమునైత్తుఱైవర్ తరువాతి కాలంలో ఆళవందార్లుగా ప్రసిద్ది చెందారు. వీరు ఈశ్వరముని పుత్రులు, నాథమునుల మనుమలు. వీరు మహాభాష్య భట్టర్ల వద్ద విద్యను అభ్యసించారు. వీరు ఆళవందార్లుగా పిలువబడడానికి ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఆ రోజులల్లో పండితులు తమ ప్రధాన పండితునికి పన్నులు చెల్లించేవారు. ఆక్కియాల్వాన్ అనే రాజ పురోహితుడు తన ప్రతినిధులను పండితుల వద్దకు పన్నులు చెల్లించమని పంపేవారు. మహాభాష్య భట్టర్ కొంచం సంకోచిస్తారు. యమునైత్తుఱైవర్ తను చూసుకుంటాడని వారికి ధైర్యం చెబుతారు. అతను “చవకబారి ప్రతిష్ఠను ఆశించే కవులను నాశనం చేస్తాను” అని ఒక శ్లోకాన్ని పంపుతాడు. ఇది చూసిన ఆక్కియాల్వాన్ కు కోపం వచ్చి, యమునైత్తుఱైవర్ని రాజసభకి తీసుకురమ్మని తన సైనికులను పంపుతాడు. యమునైత్తుఱైవర్ తనకు తగిన గౌరవం ఇచ్చినప్పుడు మాత్రమే వస్తాను అని అంటారు. రాజు వారి కోసం పల్లకిని పంపితే యమునైత్తుఱైవర్ సభకి హాజరౌతారు. చర్చ మొదలవుతుండగా రాణి యమునైత్తుఱైవర్ గెలుస్తాడని రాజుతో అంటుంది. ఒక వేళ ఓడిపోతే, ఆమె రాజుకి దాసురాలై సేవ చేస్తానని పందెం కడుతుంది. రాజు ఆక్కియాల్వాన్ గెలుస్తాడన్న నమ్మకంతో ఒకవేళ యమునైత్తుఱైవర్ గెలుస్తే అతనికి సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తారు. చివరకు, గొప్ప శౌర్యం జ్ఞానంతో, యమునైత్తుఱైవర్ ఆక్కియాల్వాన్ పై విజయం సాధిస్తారు. ఆక్కియాల్వాన్ యమునైత్తుఱైవర్ శిష్యులు అవుతారు. తనని రక్షించాడని రాణి “ఆళవందార్” అనే పేరును ఇస్తుంది – ఒక వేళ అతను ఓడిపోతే, ఆమె ఒక దాసిగా మారి ఉండేది. తరువాత ఆమె కూడా ఆళవందార్ల శిష్యురాలౌతుంది. రాజు వాగ్దానం ప్రకారం అతనికి సగం రాజ్యాన్ని ఇస్తాడు.
వ్యాస: నాన్నమ్మా, యమునైత్తుఱైవర్ సగం రాజ్యం పొందాడంటే, అతను ఆ రాజ్యాన్ని పరిపాలించి వుండాలి. మన సాంప్రదాయంలోకి ఎలా వచ్చారు?
అత్తుళాయ్: ఉయ్యక్కొండార్ శిష్యులైన మణక్కాళ్ నంబి ద్వారా వీరు మన సాంప్రదాయంలోకి వచ్చారు. ఉయ్యక్కొండార్ నిర్దేశం ప్రకారం మణక్కాళ్ నంబి ఆళవందార్లను తీసుకువస్తారు.
బామ్మగారు: నిజం అత్తుళాయ్! దీని గురించి నీకు ఎలా తెలుసు?
అత్తుళాయ్: మా అమ్మ కూడా మన ఆచార్యులు, పెరుమాళ్ళ విషయాల గురించి అప్పుడప్పుడు చుబుతుంటుంది.
బామ్మగారు: ఆళవందార్లు ఒక గొప్ప ఆచార్యులు, దేవపెరుమాళ్ళ అనుగ్రహంతో శ్రీ రామానుజులను మన సాంప్రదాయంలోకి తీసుకువచ్చారు.
పరాశర: కానీ నాన్నమ్మా, దేవపెరుమాళ్ళు ఆళవందార్లకి ఎలా సహాయం చేస్తారు?
బామ్మగారు: ఆళవందార్లు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ళ సన్నిధి వద్ద ఇళైయాళ్వార్ని (రామానుజులు) చూస్తారు. ఇళైయాళ్వార్లు తన గురువులైన యాదవ ప్రకాశుల వద్ద విద్య నేర్చుకొనే రోజులవి. సాంప్రదాయం తర్వాతి నాయకుడిగా ఇళైయాళ్వార్ని తయారు చేయాలని ఆళవందార్లు పెరుమాళ్ళను ప్రార్థిస్తారు. దేవపెరుమాళ్ళు ఒక తల్లిలా ఇళైయాళ్వార్ని పెంచి రామోయే కాలంలో గొప్పలో మహాగొప్ప సాంప్రదాయ కైంకర్యాలని వీరికి అనుగ్రహిస్తారు. సరైన విధంగా ఇళైయాళ్వార్లకు మార్గనిర్దేశం చేయమని తిరుక్కచ్చినంబికి ఆళవందార్లు అప్పగిస్తారు. తిరుక్కచ్చినంబి మీకు గుర్తున్నారా?
వ్యాస: అవును నాన్నమ్మా, వీరు దేవపెరుమాళ్, తాయార్లకు తిరువాలవట్ట (వింజామర) కైంకర్యం చేసేవారు. దేవపెరుమాళ్ళతో పరస్పరం మాట్లాడేవారు కూడా. మనం కూడా తిరుక్కచ్చినంబిలాగా పెరుమాళ్ళతో మాట్లాడినట్లయితే ఎంత బాగుంటుంది? అయితే ఆళవందార్లు ఇళైయాళ్వార్లని కలిసారా? ఆళవందార్లు ఇళైయాళ్వార్ని తమ శిష్యులుగా చేసుకున్నారా?
బామ్మగారు: దురదృష్టవశాత్తు కలుసుకోలేదు! ఆళవందార్ల శిష్యుడిగా కావటానికి ఇళైయాళ్వార్లు శ్రీరంగానికి బయలుదేరారు. వీరు శ్రీరంగం చేరుకునే ముందే ఆళవందార్లు పరమపదానికి చేరుకుంటారు. వీళ్ళు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు కానీ ఆళవందార్ల 3 కోరికలను నెరవేరుస్తానని ఇళైయాళ్వార్లు ప్రమాణం ఇస్తారు.
ఈ సారి మనం కలుసుకున్నప్పుడు, నేను మీకు ఆళవందార్ల శిష్యులలో ఒకరైన పెరియ నంబి గురించి చెప్తాను. వీరే ఇళైయాళ్వార్లకు గురువై మార్గదర్శకులగా నిలిచి ముందుకు నడిపించారు. ఆళవందార్లకు అనేక శిష్యులు ఉండేవారు. వారందరూ ఇళైయాళ్వార్ని సాంప్రదాయంలోకి తీసుకురావడానికి కలిసి కృషి చేశారు. పెరియ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరుమలై ఆండాన్, మాఱనేరి నంబి, తిరుక్కచ్చి నంబి, తిరువరంగ పెరుమాళ్ అరైయర్ ఇంకా మరెందరో ఆళవందార్లకు శిష్యులుగా ఉండేవారు.
పిల్లలు: బావుంది నాన్నమ్మా. ఈ సారి మాకు పెరియ నంబి, ఇళైయాళ్వార్ల గురించి చెప్పండి.
బామ్మగారు: తప్పకుండా చెప్తాను. కానీ ఇప్పుడు ఇక చీకటి పడుతోంది. మీరు ఇంటికి వెళ్లండి.
పిల్లలు ఆళవందార్ల గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లకు బయలుదేరుతారు.
మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-alavandhar/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org