బాల పాఠము – ఉయ్యక్కొణ్డార్ మరియు మణక్కాల్ నమ్బి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< నాథమునులు

వ్యాస పరాశరులు ఇంకొక స్నేహితురాలు వేదవల్లిని తీసుకొని బామ్మగారింటికి వస్తారు. బామ్మగారు వాళ్ళకి తన చేతుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇచ్చి కూర్చోమని అంటుంది.

బామ్మగారు: ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని మీ కొత్త స్నేహితురాలు ఎవరో చెప్పండి.

వ్యాస: ఈమె పేరు వేదవల్లి నాన్నమ్మా! సెలవుల కోసం కాంచీపురం నుండి వచ్చింది. తను కూడా మన ఆచార్యుల చరిత్రలను వినాలని మాతో వచ్చింది.

పరాశర: ఈవేళ ఏదైనా పండుగా నాన్నమ్మా?

బామ్మగారు: ఈవేళ ఉయ్యక్కొండార్ల తిరునక్షత్రము. వీరిని పద్మాక్షర్, పుండరీకాక్షర్ అని కూడా పిలుస్తారు.

uyyakkondar

వ్యాస: నాన్నమ్మా, ఈ ఆచార్యుని గురించి చెప్తారా?

బామ్మగారు: వీరు చైత్ర మాసం కృత్తికా నక్షత్రంలో తిరువెళ్ళఱై దివ్య దేశంలో జన్మించారు. అక్కడ జన్మించినందున తిరువెళ్ళఱై పెరుమాళ్ళ పేరునే పెట్టారు. వీరు నాథమునుల ప్రధాన శిష్యులలో ఒకరు. కురుగై కావలప్పన్ వీరి సహశిష్యులు. నాథమునులకు అష్టాంగ యోగ సిద్ధి నమ్మాళ్వార్ల అనుగ్రహంతో లభించింది.

పరాశర: అష్టాంగ యోగం అంటే ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: యోగాలలో ఈ యోగ పద్ధతి ఒక రకం. దీని ద్వారా శారీరిక ధ్యాస లేకుండా నిరంతరాయముగా భగవానుడిని అనుభవించవచ్చు. నాథమునులు ఈ అష్టాంగ యోగాన్ని కురుగై కావలప్పన్ కు నేర్పించి, ఉయ్యక్కొండార్ను నేర్చుకుంటారేమోనని అడిగారు. ఉయ్యక్కొండార్ “పిణం కిడక్క మణం పుణరళామొ?” అని అంటారు.

పరాశర: నాన్నమ్మా, ఎవరైనా మరణిస్తే మనం సంతోషించలేము అని చెబుతున్నారా? ఎవరు మరణించారు?

బామ్మగారు: అద్భుతం పరాశర! ఈ లోకంలో అనేక మంది బాధపడుతున్నప్పుడు తానొక్కడే భగవానుడిని అనుభవించాలని ఎలా అనుకుంటామని వారన్నారు. ఇది విన్న, నాథమునులు సంతోషపడి ఉయ్యక్కొండార్ల ఔదార్యాన్ని ప్రశంసిస్తారు. ఈశ్వరముని కుమారుడికి (నాథమునుల మనవడు) అష్టాంగ యోగం, దివ్య ప్రబంధం, వాటి అర్థాలని బోధించమని ఉయ్యక్కొండార్, కురుగై కావలప్పన్ ను నిర్దేశిస్తారు.

వ్యాస: నాన్నమ్మా ఉయ్యక్కొండార్ కు శిష్యులు ఎవరైనా ఉన్నారా?

బామ్మగారు: మణక్కాళ్ నంబి ఉయ్యక్కొండార్ల ప్రధాన శిష్యుడు. పరమపదానికి వెళ్ళే సమయములో, ఉయ్యక్కొండార్లు మణక్కాళ్ నంబిని సంప్రదాయ బాధ్యతలు నిర్వహించమని నిర్దేశిస్తారు. యామునైత్తుఱైవర్ (ఈశ్వరముని పుత్రుడు) ని వారి ఉత్తరాధికారిగా సిద్ధం చేయమని నిర్దేశిస్తారు.

పరాశర: నాన్నమ్మా మణక్కాళ్ నంబి గురించి మాకు చెప్పగలరా?

బామ్మగారు: వారి అసలు పేరు రామమిశ్రార్. మాఘ మాసం మఖా నక్షత్రంలో మణక్కాళ్ అనే ఊరులో జన్మించారు. మధురకవి ఆళ్వార్లు ఎలా నమ్మాళ్వార్లకి అంకితులై ఉండేవారో, మణక్కాళ్ నంబి ఉయ్యక్కొండార్లకి అంకితులై ఉండేవారు. ఉయ్యక్కొండార్ల ధర్మపత్ని మరణించిన తరువాత, వీరి వంట కైంకర్యాన్ని నిర్వహిస్తూ తమ ఆచార్యుని ప్రతి అవరాలను శ్రద్ధగా చూసుకునేవారు. ఉయ్యక్కొండార్ల కుమార్తెలు నదిలో స్నానం చేసి వస్తుండగా ఒకసారి వాళ్ళు బురదను దాటాల్సివస్తుంది. రామమిశ్రులు ఆ బురదలో పడుకొని వాళ్ళకు బురద అంటుకోకుండా దాటిస్తారు. ఇది విన్న ఉయ్యక్కొండార్లు నంబి శ్రద్ధ అంకితభావానికి ఎంతో గర్విస్తారు.

పిల్లలు: నాన్నమ్మా, మనము ఈసారి కలిసినప్పుడు మాకు యమునైత్తురైవర్క చరిత్రను చెప్పాలి?

నాన్నమ్మ సంతోషంగా సరే అన్న తరువాత పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇండ్లకి వెళ వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2015/10/beginners-guide-uyakkondar-and-manakkal-nambi/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment