బాల పాఠము – పెరియ నంబి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళవందార్

వ్యాస పరాశరులు బామ్మగారి ఇంటికి వస్తారు. చేతిలో ఒక బహుమానాన్ని పట్టుకొని అత్తుళాయ్ లోపలికి వస్తుంది.

బామ్మగారు: ఏమిటిది అత్తుళాయ్?

వ్యాస: నాన్నమ్మా, మా బడి పోటీలల్లో అత్తుళాయ్ ఆండాళ్ లాగా నటించింది, తిరుప్పావై పాశురాలని పాడి మొదటి బహుమతిని గెలుచుకుంది.

బామ్మగారు: శభాష్ అత్తుళాయ్! ఈ రోజు మీకు పెరియనంబి వారి గురించి చెప్పి, ఆ తర్వాత పాశురాలను నేను వింటాను.

పిల్లలు : ఇలైయాళ్వార్ల గురించి కూడా నాన్నమ్మా.

బామ్మగారు: అవును, అవును. పెరియనంబి వారు ఆళవందార్ల ప్రధాన శిష్యులలో ఒకరు. శ్రీరంగంలో మార్గశిర మాసం, జ్యేష్ట నక్షత్రంలో జన్మించారు.  ఇలైయాళ్వార్ను కాంచీపురం నుండి శ్రీరంగానికి రప్పించింది కూడా వీరే. ఇలైయాళ్వార్ను కలుసుకోవడానికి పెరియనంబి వారు కంచికి వెళుతుండగా, ఇలైయాళ్వార్ పెరియనంబి వారిని కలుసుకునేందుకు శ్రీరంగం నుండి బయలుదేరతారు.

పరాశర: నాన్నమ్మా, ఇలైయాళ్వార్లు కాంచిపురంలో యాదవప్రకాశుల వద్ద విధ్య నేర్చుకుంటుండగా శ్రీరంగానికి ఎందుకు బయలుదేరారు?

బామ్మగారు: మంచి ప్రశ్న! మీకు మొన్న ఒక మాట చెప్పాను గుర్తుందా, ఆళవందార్లు ఇలైయాళ్వార్లని తిరుక్కచ్చినంబికి అప్పగించి అవసరాన్ని బట్టి మార్గనిర్దేశం చేయమని చెబుతారు. యాదవప్రకాశులతో అభిప్రాయభేదాలు మొదలై ఇలైయాళ్వార్లు సతమతమవుతుండగా, పరిష్కారం కోసం తిరుక్కచ్చినంబి వారిని అడుగుతారు. మార్గదర్శం చేయమని తిరుక్కచ్చినంబి వెళ్లి ఎవరిని అడుగుతారు?

అత్తుళాయ్: దేవ పెరుమాళ్!

బామ్మగారు: అద్భుతం! దేవ పెరుమాళ్ళు సదా ఇలైయాళ్వార్ల రక్షణ కోసం ముందుండేవారు. ఇలైయాళ్వార్లను పెరియనంబి వద్ద పంచ సంస్కారము కానిచ్చి వారి శిష్యులు కామని దేవ పెరుమాళ్ళు నిర్దేశిస్తారు. అతను ఒక ప్రకాశవంతమైన, ఉదయించే సూర్యుడు చీకటి రాత్రిని తొలగించినట్టు ఇలైయాళ్వార్ల మనస్సులో సందేహాలను దేవ పెరుమాళ్ళు తొలగిస్తారు. అట్లా, కాంచీపురం నుండి ఇలైయాళ్వార్లు బయలుదేరారు. మరోవైపు పెరియనంబి వారు ఇలైయాళ్వార్లు కలుకోడానికి కాంచీపురానికి బయలుదేరారు. వీరిద్దరూ మధురాంతగం అనే ప్రదేశంలో కలుసుకుంటారు.  పెరియ నంబులు ఇలైయాళ్వార్లకు అక్కడే పంచ సంస్కారము చేసి మన సాంప్రదాయంలోకి ప్రవేశింపజేస్తారు.

వ్యాస: అవును, మధురాంతగంలో యేరికాత్త రామాలయం ఉంది. పోయిన సెలవుల్లో మేము ఆ గుడికి వెళ్ళాము. కానీ, కాంచీపురం లేదా శ్రీరంగానికి వేళ్ళెవరుకు ఇలైయాళ్వార్లు ఎందుకు ఆగలేదు? మధురాంతగంలోనే ఉన్న ఫలంగా ఎందుకు దక్షను తీసుకున్నారు?

పెరియ నంబి – శ్రీరంగం

బామ్మగారు: పెరియనంబులు ఒక గొప్ప మహిమగల ఆచార్యులు. వీరికి ఇలైయాళ్వార్ల పట్ల అపారమైన ప్రేమ గౌరవం ఉండేది. ఇలాంటి శుభ కార్యాలను వాయిదా వేయకూడదని వారికి తెలుసు. పిల్లలు! దీని నుంచి మనకేమి తెలుస్తుందంటే, సాంప్రదాయానికి  సంబంధించిన పనులను చేయడంలో వాయిదా కన్నీ ఆలస్యం కానీ చేయకూడదు. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది! పెరియనంబి వారు సాంప్రదాయ విషయాలను లోతుగా ఎరిగినవారు. తన శిష్యుడైన రామానుజులను ఎంతో ఇష్టపడేవారు. ఎంత అంటే సాంప్రదాయం కోసం – రామానుజుల కోసం తమ జీవితాన్నే ధార పోసారు.

వ్యాస: తమ జీవితాన్నే అర్పించారా! ఎందుకు అలా చేసారు నాన్నమ్మా?

బామ్మగారు: ఆ ప్రాంతాన్ని పలిపాలించే రాజు ( శైవుడు) రామానుజులను రాజసభకు హాజరు కావలసిందిగా ఆజ్ఞాపిస్తారు. రామానుజుల వేషంలో వారి ప్రియ శిష్యుడైన కూరత్తాల్వాన్లు, వయోవృద్ధిలైన పెరియనంబులు, వారి పుత్రిక అత్తుళాయ్ కలిసి రాజ సభకు వెళతారు.

అత్తుళాయ్: అది నా పేరు!

బామ్మగారు: అవును! రాజాజ్ఞను పాటించనందుకు, ఆగ్రహంతో రాజు వారిద్దరి కళ్ళు తీసేయమని సేవకులకు ఆదేశిస్తారు. వయోవృద్ధిలైన పెరియనంబులు ఆ బాధను తట్టుకోలేక తిరిగి శ్రీరంగానికి వెళ్తుండగా కూరత్తాల్వాన్ల వడిలో తమ జీవితాన్ని త్యాగం చేసి పరమపదం చేరుకుంటారు. ఈ మహాత్ములు సంకోచించకుండా ముత్యాలమాలలో మహామణి వంటి రామానుజులను కాపాడటానికి త్యాగం చేశారు. మాలలోని ముత్యాలను చిన్నాభిన్నం చేస్తే ఏమవుతుంది?

పిల్లలు ఒకే సారిగా: మాల తెగిపోతుంది!

బామ్మగారు: సరిగ్గా!  అదేవిధంగా, మన సాంప్రదాయానికి మణి వంటి రామానుజులను ముత్యాల వంటి మన పూర్వాచార్యులందరు సంరక్షిస్తుండేవారు. కాబట్టి మనందరం మన ఆచార్యాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

పరాశర: నాన్నమ్మా, కూరత్తాల్వాన్లకి ఏమి అయింది?

బామ్మగారు: కూరత్తాల్వాన్లు నేత్రహీనులై తిరిగి శ్రీరంగానికి వచ్చారు. వీరు రామానుజుల ప్రియ శిష్యుడు. సదా  రామానుజులతో ఉండి ఎన్నో కైంకర్యాలు చేశారు. మరెప్పుడైనా రామానుజులు, వారి శిష్యుడైన కూరత్తాల్వాన్ల గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లండి. మీ అమ్మానాన్నలు మీ కోసం ఎదురుచూస్తుంటారు. అత్తుళాయ్, ఈ సారి వచ్చినపుడు తిరుప్పావై పాశురాలను నాకు వినిపించాలి.

పెరియనంబులు కూరత్తాల్వాన్ల గురించి ఆలోచిస్తూ పిల్లలు ఇంటికి వెళ్ళారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-periya-nambi/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment