బాల పాఠము – వేదాంతాచార్యులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము << పిళ్ళై లోకాచార్యుల శిష్యులు ఇంట్లో ఆండాళమ్మ పువ్వులు అల్లుతూ గుడి వైపు వెళుతూ వస్తున్న వాళ్ళని చూస్తున్నారు. పరిగెత్తుకుంటూ వస్తున్న పిల్లలను చూసి చిరునవ్వు నవ్వుకుంది. అల్లిన మాలలను ఆమె పెరియ పెరుమాళ్ తయార్ల చిత్ర పఠాలని అలంకరించారు ఆవిడ. బామ్మగారు : పిల్లలలూ రండి. ఈ రోజు ఎవరి గురించి చెప్పుకోబోతున్నాము తెలుసుకదా? పిల్లలందరు ఒకేసారి: వేదాంతాచార్యుల గురించి. బామ్మగారు: అవును. ఆ పేరు వారికి ఎవరు పెట్టారో మీకు తెలుసా? వ్యాస: పెరియ పెరుమాళ్ళు వారికి ‘వేదాంతాచార్య’ అనే పేరు పెట్టారు. అవునా నాన్నమ్మ? బామ్మగారు: అవును, వ్యాస. వీరికి ‘వెంకటనాథుడు’ అని పుట్టిన పేరు. కంచీపురంలోని అనంతసూరి తోతారంబై అనే దివ్య దంపతులకు జన్మించారు. పరాశర: నాన్నమ్మ, వీరు సంప్రదాయంలోకి ఎలా వచ్చారో చెప్తారా? బామ్మగారు: ఓ తప్పకుండా! నడాదూర్ అమ్మాళ్ కాలక్షేప గోష్టిలో కిడాంబి అప్పుళ్ళార్ అనే పేరుతో ఒక శ్రీవిష్ణవుడుండేవారు. వేదాంతాచార్యులు తన చిన్నప్పటి రోజుల్లో తన మామగారైన కిడాంబి అప్పుళ్ళార్లతో కలిసి శ్రీ నడాదూర్ అమ్మాళ్ కాలక్షేప గోష్టికి వెళుతుండేవారు. అప్పుడు శ్రీ నడాదూర్ అమ్మాళ్ వేదాంతాచార్యులని “అన్ని అడ్డంకులను ఛేదించి విశిష్టాద్వైత శ్రీవిష్ణవ సిద్దాంతాన్ని స్థిరపరుస్తారు” అని ఆశీర్వదిస్తారు. అత్తుళాయ్ : ఓహ్! వారి ఆశీర్వాదం నిజమైంది! నాన్నమ్మ చిరునవ్వుతో: అవును, అత్తుళాయ్. పెద్దల ఆశీర్వాదాలు నెరవేరకుండా ఉండవు. వేదవల్లి: వీరు తిరువెంకటేశ్వరుడి ‘గంట’ అవతారమని విన్నాను. నిజమేనా నాన్నమ్మ ? బామ్మగారు: అవును. వీరు సంస్కృతం, తమిళం, మణిప్రవాళంలో వందకుపైన గ్రంథాలు వ్రాశారు. వ్యాస: వందనా? బామ్మగారు: అవును, వాటిలో ముఖ్యమైనవి తాత్పర్య చంద్రిక (శ్రీ భగవత్గీత వ్యాఖ్యానం), తత్వతీకై, న్యాయ సిద్జాంజనం, శత దూశని, అహార నియమం ఇంకా ఎన్నో ఉన్నాయి. పరాశర: నాన్నమ్మ! ఒకే వ్యక్తి అతిప్రాథమికమైన ఆహార అలవాట్లపై గ్రంథం వ్రాసి, అదే సమయంలో లోతైన తత్వ వ్యాఖ్యానాలు కూడా ఎలా వ్రాశారూ అని ఆశ్చర్యంగా ఉంది. బామ్మగారు: మన పూర్వాచార్యుల జ్ఞానం మహాసముద్రం లాంటిది, పరాశర! ఆశ్చర్యపోనవసరం లేదు. వీరికి మన తాయార్ (శ్రీ రంగనాచ్చియార్) ‘సర్వ-తంత్ర-స్వతంత్ర’ (అన్ని కళల నైపుణ్యం) అని బిరుదునిచ్చారు. అత్తుళాయ్: ఇంకా చెప్పండి, నాన్నమ్మ! ఇంకా వినాలని ఉంది. బామ్మగారు : వేదాంతాచార్యులను ‘కవితార్కిక కేసరి’ (కవులలో సింహం) అని కూడా పిలుస్తారు. ఒకసారి వీరు కృష్ణమిశ్ర అనే ఒక అధ్వైతితో 18 రోజుల పాటు సుదీర్ఘ చర్చలో పాల్గొని గెలిచారు. వారు ఒక కవి సవాలు చేస్తే ‘పాదుకా సహస్రం’ ను రచించారు. ఇది శ్రీ రంగనాథుని దివ్య పాదుకలను స్తుతిస్తూ వ్రాసిన 1008 పద్యాల కవిత.
srivedanthachariar_kachi_img_0065.jpg
అవతార ఉత్సవంలో కాంచి తూప్పుళ్ వేదాంతాచార్య
వేదవల్లి: చాలా బాగుంది! ఇన్ని నైపుణ్యాలు ఉండి కూడా ఇంత వినమ్రంగా ఉండే గొప్ప ఆచార్యులు మన సాంప్రదాయంలో ఉండటం నిజంగా మన అదృష్టం. బామ్మగారు: బాగా చెప్పావు వేదవల్లి. వేదాంత దేశికులు, అనేక ఇతర సమకాలీన ఆచార్యులు పరస్పర ప్రేమ గౌరవాలు ఇచ్చి పుచ్చు కుంటూ ఉండేవారు. తన అభితిస్తవంలో, వారు శ్రీ రంగనాథుడిని “ఓ భగవాన్! శ్రీరంగం లోనే గొప్ప భాగవతుల చరణాల వద్ద ఉంటాను” అని ప్రార్థిస్తారు. మణవాళ మామునులు, ఎఱుంబి అప్పా, వాధికేసరి అళగీయ మణవాళ జీయర్, చోళసింహపురం (షోలింగర్) దొడ్డాచార్యులు అందరూ తమ రచనలలో వేదాంత దేశికుల గ్రంథాలను ఉల్లేఖించారు. వేదాంత దేశికులు, పిళ్ళై లోకాచార్యులను ఎంతో గౌరవించి ప్రశంసించేవారు. “లోకాచార్య పంచాశట్” అనే గ్రంథంలో విరికి పిళ్ళై లోకాచార్యుల పట్ల ఉన్న భక్తి మనకు కనిపిస్తుంది. ఈ గ్రంథాన్ని మేల్కోటె తిరునారాయణపురంలో క్రమం తప్పకుండా రోజూ పఠిస్తారు. పరాశర: నాన్నమ్మ! వేదాంతాచార్యులు శ్రీ రామానుజాచార్యుల మద్య సంబంధం ఎలా ఉండేది? బామ్మగారు: శ్రీ రామానుజుల పట్ల వేదాంతాచార్యుల భక్తి అపారమైనది. ‘న్యాస తిలకా’ అనే గ్రంథంలో ‘ఉక్త్య ధనంజయ…’ అనే శ్లోకంలో, శ్రీ రామానుజుల సంబంధం వల్ల మోక్షం ఖాయమైందని, ఇక పెరిమాళ్ళు ఇచ్చే పనిలేదని ప్రస్తావించిబడి ఉంది. వ్యాస: మన ఆచార్యుల నుండి తెలుసుకోవాల్సినది ఎంతో ఉంది, నాన్నమ్మ ! బామ్మగారు: అవును. ‘వేదాంతాచార్య విజయ’ అనే గ్రంథాన్ని ‘ఆచార్య – చంపు’ అని కూడా పిలుస్తారు. వేదాంత దేశికుల జీవితం చరిత్ర గురించి, రచనల గురించి సంస్కృతంలో గద్య, పద్య రూపంలో గొప్ప పండితుడైన ‘కౌశిక కవితార్కికసింహ వేదాంతాచార్య’ (సుమారు 1717 లో నివసించిన గొప్ప పండితుడు) రచించారు. అత్తుళాయ్: ఓహ్, బాగుంది! నాన్నమ్మ, ఈ రోజు మనం వేదాంతాచార్యుల సంస్కృత తమిళ సాహిత్యం గురించి, వారి భక్తిలో వినయాల గురించి తెలుసుకున్నాము. వారిని స్తుతించి అనుసరించడం నిజంగా మన అదృష్టం. బామ్మగారు: అవును, ఇలాంటి గొప్ప పుణ్యాత్ములను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి! రేపు మళ్లీ కలుద్దాం. మీరు ఇక ఇంటికి వెళ్ళండి. పిల్లలందరు ఒకేసారి నాన్నమ్మకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. మూలము : http://pillai.koyil.org/index.php/2019/02/beginners-guide-vedhanthacharyar/ పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org ప్రమేయము (గమ్యము) – http://koyil.org ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment