బాల పాఠము – ముదలాళ్వార్లు – భాగము 2

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<ముదలాళ్వార్లు – భాగము 1

బామ్మగారు, వ్యాసపరాశరులు ముదలాళ్వార్ల సన్నిధిలో నుండి బయటకు వచ్చారు.

పరాశర: ముదలాళ్వార్ల దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ముగ్గురు ఆళ్వార్లు ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటారా నాన్నమ్మ?

mudhalAzhwargaL-thirukkovalur-with-perumAL
తిరుక్కోవలూర్ – తిరుక్కోవలూర్ ఎంపెరుమాన్ తో ముదల్ ఆళ్వారులు

బామ్మగారు: మంచి ప్రశ్న. వారు ముగ్గురు ఒకే దగ్గర ఉండడానికి ఒక కారణం ఉంది, వివరిస్తాను. ఒక  రోజు, పెరుమాళ్ళ దివ్య సంకల్పంతో, వాళ్ళు తిరుక్కోవలూర్కు ఒకరి తరువాత ఒకరు వచ్చి చేరారు. భయంకరమైన తుఫాను వచ్చి కుండపోత వర్షం పడుతోంది. తిరుక్కోవలూర్లో మృకండు అనే ఒక ఋషి ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం ఎదురుగా ఒక చిన్న గుడిసె ఉంది. ఆ కుండపోత వర్షంలో మొదట పొయిగై ఆళ్వార్ అక్కడి గుడిసెలోకి  వచ్చి తల దాచుకున్నారు. కొంచం నడుం వాల్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.

పరాశర: ఒంటరిగానా? భయం వేయదా వారికి?

బామ్మగారు:  ఎప్పుడూ పెరుమాళ్ళ చింతనలో ఉండే వారికి భయం ఉండదు పరశర! అదే సమయంలో, భూదత్తాళ్వారు అక్కడికి వచ్చి లోనికి రావచ్చా అని ప్రార్థించారు. వారికి పొయిగై ఆళ్వారు బదులిస్తూ “ఇక్కడ ఒక్క మనిషి పడుకునేటంత చోటు ఉంది. కాని ఇద్దరు మనుషులు కూర్చోవచ్చు. దయచేసి లోపలికి రండి” అని అన్నారు. భూదత్తాళ్వారు లోపలికి సంతోషముగా వేళ్లి ఇద్దరు ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నారు. తరువాత, ఆ వర్షంలో పేయాళ్వారు పరుగు పరుగున అక్కడకు వచ్చి లోనికి రావచ్చా అని ప్రార్థించారు. వారికి పొయిగై ఆళ్వారు బదులిస్తూ “ఇక్కడ ఒక్క మనిషి పడుకునేటంత చోటు ఉంది. ఇద్దరు మనుషులు కూర్చోవచ్చు. కానీ ముగ్గురు మనుషులు నిలబడవచ్చు. దయచేసి లోపలికి రండి, మనం ముగ్గురం నిలుచుందాం” అని అన్నారు. పేయాళ్వారు లోనికి సంతోషముగా వచ్చారు. వాళ్ళు ముగ్గురు చలికి వణుకుతూ నిలుచున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడ సాగారు. వాళ్ళ అభిరుచులు ఒక్కటేనని తెలుసుకోని, వాళ్ళు ముగ్గురు కలిసి పెరుమాళ్ళ రూప గుణాలు, నామాల గురించి చర్చించ సాగారు.

వ్యాస: బావుంది. నిజంగా దివ్యంగా ఉంది. కాని నాన్నమ్మా, అక్కడ పెరుమాళ్ళు కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది.

బామ్మగారు: ఉండండి! ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ముందు జరగబోయే దాన్ని బాగనే ఊహించావు. ముందు ముందు ఇంకా దివ్యంగా ఉంటుంది, వినండి. తన ప్రియమైన భాగవతుల గోష్ఠిని చూసి ఇప్పుడు పెరుమాళ్ళు కూడా ఆ గోష్ఠిలో పాలుపంచు కోవాలనుకున్నారు. పెరుమాళ్ళు లోపలికి వెళ్లి వాళ్ళ మధ్యలో ఇరుక్కునారు. ఆ చీకటిలో అనుకోకుండా ఇరుకు, ఇక్కడ ఏమి జరుగుతుంది, మనకి తెలియకుండా ఎవరు వచ్చారు అని ముగ్గురు ఆళ్వార్లు ఆశ్చర్యపోయారు. అప్పుడు, మొదట పొయిగై ఆళ్వారు పాడటం మొదలుపెట్టారు “వైయం తగలియ” – ప్రపంచమునే ఒక దీపంగా ఊహించు కుంటున్నాను అని. ఆ దీపాలతో ఆ ప్రదేశామంతా వెలిగిపోయింది,పేయాళ్వారుకి మొదట శ్రీ మహాలక్ష్మితో కూడి ఉన్న శ్రీమన్నారాయణ యొక్క దివ్యమంగళ స్వరూపం ఆ పందిరి కింద వాళ్ళ మధ్య కనిపించింది. వారు పాడసాగరు “తిరుక్కండెన్…” ( నేను శ్రీమహాలక్ష్మితో శ్రీమన్నారాయణని దివ్య స్వర్ణమయమైన స్వరూపాన్ని దివ్య శంఖ చక్రాలతో దర్శించుకున్నాను). ముగ్గురు ఆళ్వార్లు, తాయారుతో కూడి ఉన్న పెరుమాళ్ళ దివ్య రూపాన్ని దర్శించుకొని ఆనందించారు.

పరాశర: ఇది చాలా అద్భుతంగా ఉంది. వారు ఎంత ఆనందించి ఉంటారో.

బామ్మగారు: అవును – వారు చాలా ఆనందపడ్డారు. పెరుమాళ్ మరియు తాయారు కూడా ఎంతో సంతోషించారు. ఈ ఆశ్చర్యమైన సంఘటన తరువాత, వాళ్ళు అనేక దివ్యదేశాల అర్చావతార పెరుమాళ్ళను కలిసి సేవించుకున్నారు. శేష జీవితాన్ని కలసి జీవించారు. తరువాత వారు  చివరకు పరమపదాన్ని చేరుకొని పెరుమాళ్ళ నిత్య సేవలో  ఉండిపోయారు.

వ్యాస పరాశరులు: ఈ సంఘటన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మిగిలిన ఆళ్వార్ల జీవితం గురించి విందామా?

బామ్మగారు: మిగిలిన ఆళ్వార్ల జీవితం గురించి మనం మరో సారి చెప్పుకుందాం. ఇప్పుడు మీరు సరదాగా బయట ఆడుకునే సమయం. పెరుమాళ్ళకు ఇప్పుడు నైవేద్యం తయారు చేస్తాను, మనం రాత్రికి తినవచ్చు.

వ్యాస పరాశరులు: సరే నాన్నమ్మ. మేము మళ్లీ రేపు వచ్చి మీతో ఇంకా వింటాము.

మూలము : http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-mudhalazhwargal-part-2/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment