బాల పాఠము – తిరుమళిశై ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ముదలాళ్వార్లు – భాగము 2

thirumazhisaiazhwar

వ్యాస పరాశరులను తిరువేళ్ళరై దివ్యదేశానికి తీసుకోని వెళ్ళారు బామ్మగారు.  శ్రీరంగ రాజగోపురం బయట వాళ్ళు బస్సెక్కారు.

పరాశర: ఇప్పుడు మీరు నాలుగవ ఆళ్వారు గురించి చెప్తారా?

బామ్మగారు: తప్పకుండా! పరాశర.  ఈ ప్రయాణం సమయంలో మీరు ఆళ్వార్ల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది.

వ్యాస పరాశరులు బామ్మవైపు చూచి ఒక చిన్న నవ్వు నవ్వారు. శ్రీరంగం నుండి బస్సు బయలుదేరింది.

బామ్మగారు: నాలుగవ ఆళ్వారు తిరుమళిశై ఆళ్వారు, భక్తిసార అని అందరు ఇష్టంగా పిలిచేవారు. వారు చెన్నై దగ్గర తిరుమళిశై గ్రామంలో భార్గవ ముని, కనకాంగి దంపతులకు మాఘ మాసంలో మఘా నక్షత్రంలో  జన్మించారు. ఈ ఆళ్వారు అందరి కన్నా ఎక్కువ జీవించారు. వీరు “4700 సంవత్సరాలు” జీవించారు.

వ్యాస పరాశరులు ఆశ్చర్యపోయి “4700 సంవత్సరాలా?!!” అని అడిగారు.

బామ్మగారు: అవును, వీరు పెయాళ్వారును కలుసుకునేటప్పటికే అనేక తత్వ శాస్త్రాల అధ్యయనం చేసారు.

వ్యాస: ఒహో! తరువాత ఏమి అయ్యింది?

బామ్మగారు: తిరుమళిశై ఆళ్వారుకు భగవత్ జ్ఞానాన్ని బోధించి శ్రీవైష్ణవంలోకి తీసుకొని వచ్చారు పెయాళ్వారు.

బస్సు ఛత్రం బస్సుస్టాండ్ కు చేరుకుంది.

బామ్మగారు: అంతర్యామి గురించి తెలుసుకోవాలని ప్రత్యేక శ్రద్ధ ఉండేది వీరికి. మనందరిలో అంతర్యామి స్వరూపంగా ఉన్న భగవానుడి పట్ల, కుంభకోణం ఆరవముదన్ పెరుమాళ్ళ పట్ల ఎక్కువ భక్తితో ఉండేవారు. వీరి భక్తి ఎంత లోతుకి చేరిందంటే ఆళ్వారు పెరుమాళ్ళు ఇద్దరూ వారి పేర్లు మార్చుకుని ఆరవముద ఆళ్వారుగా తిరుమాళిశైపిరాణ్ గా ప్రసిద్ధులైనారు.

పరాశర: ఒహో! నాన్నమ్మ. ఈ ఆళ్వారు పెరుమాళ్ళకు చాలా దగ్గరైనట్టున్నారు.

బామ్మగారు: అవును, అలా ఉండేవారు. ఒకసారి ఒక ఊర్లో ప్రయాణం చేస్తున్నారు, ఆ ఊరి గుడికి వెళ్లారు. పెరుమాళ్ళకి వీరంటే ఎంత ప్రీతి అంటే, ఆళ్వారు ఎటువైపు వెళ్ళితే అటువైపు పెరుమాళ్ల తిరగసాగారు. అట్లాగే, ఆరావముద పెరుమాళ్ళు కూడా ఆళ్వారు చెప్పినట్టు ఎంతో వినమ్రంగా విని శయనించినవారు లేవసాగారు.

వ్యాస పరాశరులిద్దరు ఆశ్చర్యపోయి “తరువాత ఏమి అయ్యింది నాన్నమ్మా?” అని అడిగారు.

బామ్మగారు: ఆళ్వారు ఆశ్చర్యపోయి పెరుమాళ్ళని తిరిగి పడుకోమన్నారు. పెరుమాళ్ళు కంగారు పడ్డారు. ఆ దివ్యదేశంలో ఇప్పడికీ ఆ పెరుమాళ్ళు పడుకొని లేస్తున్నట్టుగా సగం శయనించిన స్థితిలో మనందరికీ దర్శనమిస్తారు.

వ్యాస: ఓ! చాలా బావుంది నాన్నమ్మా. ఒక రోజు మనం ఈ పెరుమాళ్ళని దర్శింకోవాలి.

బామ్మగారు: తప్పకుండా, ఎప్పుడైనా అక్కడికి మనం వెళదాం. ఆళ్వారు ఎంతో కాలం అక్కడ ఉన్నారు. వీరు రచించిన 2 ప్రబంధములు – తిరుచ్ఛంద విరుత్తం, నాన్ముగన్ తిరువందాది మినహా అన్ని రచనలను వీరే కావేరి నదిలో పారవేసి చిట్టచివర పరమపదానికి చేరుకొని పెరుమాళ్ళ నిత్య సేవలో ఉండిపోయారు.

తిరువేళ్లరై చేరుకుంది బస్సు. వారు గుడిలోనికి వెళ్లి పెరుమాళ్ తాయార్లని సేవించుకున్నారు.

మూలము: http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-thirumazhisai-azhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment