బాల పాఠము – ముదలాళ్వార్లు – భాగము 1

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళ్వార్ల పరిచయం

వ్యాస పరాశరులను శ్రీ రంగంలోని ముదలాళ్వార్ల సన్నిధికి తీసుకెళ్లి వారి కీర్తి ప్రఖ్యాతుల గురించి వివరిద్దామని బామ్మగారు అనుకుంటున్నారు.

పొయిగై ఆళ్వార్

Created with Nokia Smart Cam

భూదత్తాళ్వారు

peyazhwar-mylai

పెయాళ్వార్

బామ్మగారు: పిల్లలూ! ఇవేళ మనం గుడిలోని ముదలాళ్వార్ల సన్నిధికి వెళ్దాము.

వ్యాస పరాశర్లు: బావుంది నాన్నమ్మ. వెళ్దాం పదండి.

బామ్మగారు: నడుచుకుంటూ వెళ్లుతూ దారిలో వాళ్ళ గురించి మీకు కొంచం చెప్తాను. ముదల్ అంటే మొదలు. భక్తిలో మునిగిన వారని ఆళ్వార్ అంటారని మీకు తెలుసు కదా. ఆ 12 మంది ఆళ్వార్లలో మొదటి వారు ఈ ఆళ్వార్లు.

వ్యాస: ముదలాళ్వార్లు అని బహువచనం ఎందుకు నాన్నమ్మ? ఒక్కరి కంటే ఎక్కువ ఆళ్వారున్నారా?

బామ్మగారు: మంచి ప్రశ్న. అవును, ఆళ్వార్లులో మొదటి ముగ్గురు ఆళ్వార్లను, కలిపి సంభీదిస్తారు.

పరాశర: ఎందుకు నాన్నమ్మ? వీరు కూడా పంచ పాండవులలాగా ఎప్పుడూ కలిసుండేవారా?

బామ్మగారు: మంచి ఉదాహరణ పరాశర. అవును – మొదటి ముగ్గురు ఆళ్వార్లు వేరు వేరు చోట్లలో పుట్టినప్పటికీ, ఒక దివ్య సంఘటన ద్వారా తిరుక్కోవలూర్ దివ్యదేశంలో కలుసుకొని శ్రీమన్నారాయణను సేవించారు. ఆ ఘటన తరువాత వారి ముగ్గురిని కలిపి సంభీదిస్తారు.

వ్యాస: ఆ దివ్య సంఘటన ఏమిటి నాన్నమ్మ? నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

బామ్మగారు: తప్పకుండా చెప్తాను. కాని దానికి ముందు, ఈ ముగ్గురు ఆళ్వార్ల గురించి కొంచం తెలుసుకుందాము. మొదటి ఆళ్వార్ పొయిగై ఆళ్వారుకి ‘సారో యోగి’ అని పేరు. రెండవ ఆళ్వారు భూదత్తాళ్వార్ – ‘భూత యోగి’ అని పేరు. మూడవ ఆళ్వారుకు పెయాళ్వార్ – ‘మహాతాహ్వాయ’ అని పేరు.

పరాశర: వీళ్ళు ఎప్పుడు, ఎక్కడ పుట్టారు నాన్నమ్మా?

బామ్మగారు: వాళ్ళు ముగ్గురు ద్వాపర యుగంలో జన్మించారు. ముగ్గురూ పుష్పాల నుండి ఆవిర్భవించారు. పొయిగై ఆళ్వార్ ఆశ్వీయుజ మాసం శ్రవణ నక్షత్రంలో కాంచీపురంలోని తిరువెక్కా దివ్యదేశంలో ఒక కొలనులో ఆవిర్భవించారు. భూదత్తాళ్వారు ఆశ్వీయుజ మాసం ధనిష్ఠ నక్షత్రంలో తిరుక్కడల్మల్లైలోని ఒక సరస్సులో ఆవిర్భవించారు. ఇప్పుడు ఈ దివ్యదేశం మహాబలిపురంగా పేరుగాంచింది. పెయాళ్వార్ ఆశ్వీయుజ మాసం శతభీష నక్షత్రంలో తిరుమయిలైలోని ఒక బావిలో ఆవిర్భవించారు – ఇప్పుడు ఈ దివ్యదేశం పేరు మైలాపూర్ గా మనకు తెలుసు.

వ్యాస: ఒహో! వీరు పుష్పాల నుండి ఆవిర్భవించారన్నమాట. అయితే, వీళ్ళకి అమ్మానాన్నలు లేరా?

బామ్మగారు: అవును, వీళ్ళు భగవదనుగ్రహంతో జన్మించారు. వీళ్ళు పెరుమాళ్ తాయార్లనే తమ తల్లిదండ్రులుగా భావించారు.

పరాశర: ఓ! చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే, వాళ్ళు ఎలా కలుసుకున్నారు. ఆ దివ్య సంఘటనను వివరించండి నాన్నమ్మ?

బామ్మగారు: వివిధ దివ్యదేశ పెరుమాళ్ళను సేవించడమే వారి జీవనం. అంటే కేవలం గుడికి వెళ్ళటం, పెరుమాళ్లని సేవించడం, కొంత కాలం అక్కడ ఉండి ఇంకొక దివ్య దేశానికి బయలుదేరడం అన్నమాట.

వ్యాస: అదేదో చాలా బావింది – దేని గురించి చింత పడవలసిన అవసరం లేదు. అలా మనం కూడా ఉంటే బావుండు నాన్నమ్మ.

బామ్మగారు: అవును. చూడండి మనం ముదలాళ్వార్ల సన్నిధికి వచ్చేసాము. లోపలికి వెళ్లి దర్శనం చేసుకుందాం. తిరిగి వెళ్ళేటప్పుడు వారి మిగితా జీవిత చరిత్ర గురించి చెప్పుకుందాం.

మూలము: http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-mudhalazhwargal-part-1/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

1 thought on “బాల పాఠము – ముదలాళ్వార్లు – భాగము 1”

Leave a Comment