బాల పాఠము – నాథమునులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆచార్యుల పరిచయము

nathamunigalవ్యాస మరియు పరాశర పాఠశాల తర్వాత ఇంటికి వస్తారు. వారితో పాటు వారి స్నేహితురాలు అత్తుళాయ్ ని తీసుకువస్తారు.

నాన్నమ్మ: మీరు ఎవరిని వెంట తీసుకువచ్చారు?

వ్యాస: నాన్నమ్మా, ఈమె అత్తుళాయ్ , మా స్నేహితురాలు. మీరు మాతో చెప్పిన కొన్ని వైభవాలను ఆమెకు చెప్పాము,  మీ నుండి వినాలని ఆమెకు ఆసక్తిగా ఉంది. అందుకని, ఆమెని వెంట తీసుకువచ్చాము.

నాన్నమ్మ:  స్వాగతం అత్తుళాయ్. మీరు ఇద్దరూ నేను చెప్పేది వినడమే కాకుండా,  మీ స్నేహితులకి కూడా వినిపిస్తున్నారంటే, చాలా సంతోషంగా ఉంది.

పరాశర: నాన్నమ్మా, మేము మన ఆచార్యుల గురించి వినడానికి వచ్చాము.

నాన్నమ్మ: మంచిది .నేను ఈ రోజు మీకు నమ్మాళ్వార్ దైవిక జోక్యంతో మన సాంప్రదాయం  మహిమను తిరిగి వెలికి తెచ్చిన ఆచార్యుడి గురించి చెప్తాను.

అత్తుళాయ్: వారు ఎవరు నాన్నమ్మా?

నాన్నమ్మ అత్తుళాయ్, వ్యాస మరియు పారాశరుల కోసం కొన్ని పండ్లు మరియు తినే వస్తువులను తెస్తుంది.

నాన్నమ్మ: అతను మన నాథముని. శ్రీమాన్ నాథముని ఈశ్వర భాట్టాల్వార్ కు వీరనారాయణపురంలో (కాట్టు మన్నార్ కోయిల్ ) జన్మించారు. అతనిని శ్రీరంగనాథముని అని మరియు నాథ బ్రహ్మర్ అని కూడా పిలుస్తారు. అతను అష్టాంగ యోగంలో మరియు దివ్య సంగీతంలో  నిపుణులు. అంతేకాదు వీరే అరైయర్ సేవను స్థాపించిన వ్యక్తి, ఇప్పటికీ శ్రీరంగం, ఆళ్వార్  తిరునాగరి, శ్రీవిల్లిపుత్తూర్  మొదలైన దివ్య దేశాలలో  అమలులో ఉంది.

పరాశర: నాన్నమ్మా మేము చాలా సార్లు మా పెరుమాళ్ ముందు అరైయర్ సేవ చూసాము . అరైయర్ స్వామి తన చేతుల్లో తాళం పట్టుకొని పాసురాలు పాడుతున్న విధానం చాలా అందంగా ఉంటుంది.

నాన్నమ్మ: అవును. ఒక రోజు, మేళనాడు (తిరునారాయణపురం ప్రాంతం) నుండి శ్రీవైష్ణవుల  బృందం కాట్టు మన్నార్ కోయిల్ ను సందర్శించారు. మన్నార్  (కాట్టు మన్నార్ కోయిల్ లో ఎమ్పెరుమాన్) ముందు తిరువాయ్మోలి లోని ” ఆరావముదే …” పాడతారు. నాథముని, ఆ పాసురాల లోని అర్థంతో మోహితుడై, వాటి గురించి ఆ శ్రీవైష్ణవులను అడిగారు, కానీ వారికి ఆ 11 పాసురాలు తప్ప ఇంక ఏమి తెలియదు. వారు నాథమునిని తిరుక్కురుగూర్ కి వెళితే, అక్కడ మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అని వివరిస్తారు. నాథముని మన్నార్ దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆళ్వార్ తిరునగరి చేరుకుంటారు.

అత్తుళాయ్, వ్యాస మరియు పరాశరులు త్వరగా వారి తినుబండారాలు పూర్తి చేసి, ఆత్రుతగా నాథముని గురించి వినడం కొనసాగిస్తున్నారు .

నాన్నమ్మ: అయన మాధురకవి ఆళ్వార్ యొక్క శిష్యుడైన పరాంకుశ దాసుని కలుసుకుంటారు , వారు కన్నినూన్ చిరుత్తాంబు ను నాథమునికి బోధించి తిరుప్పులియాల్వార్  (చింతపండు చెట్టు, నమ్మాళ్వార్ నివసించిన చోట) ఎదుట 12000 సార్లు ఒకే సారిగా నిరంతరంగా పటించమని వివరిస్తారు. నాథముని అప్పటికే అష్టాంగ యోగం నేర్చుకున్నారు కాబట్టి, అతను నమ్మాళ్వార్ ని ధ్యానించి, విజయవంతంగా కన్నినూన్ చిరుత్తాంబు 12000 సార్లు పఠనం పూర్తిచేస్తారు. నమ్మాళ్వార్ సంతోషంతో అతని ముందు ప్రత్యక్షమై  అష్టాంగ యోగం, 4000 దివ్య ప్రబంధం మరియు అరులిచెయ్యల్ (దివ్య ప్రబంధం) యొక్క అన్ని అర్ధాలుతో పూర్తి జ్ఞానాన్ని అతనికి ప్రసాదించి ఆశీర్వదిస్తారు.

వ్యాస: అయితే, ‘ఆరావముదే’ పదిగం 4000 దివ్య ప్రబంధంలోని భాగమేనా?

నాన్నమ్మ: అవును. ఆరావముదే పదిగం తిరుక్కుడంతై  ఆరావముదన్ ఎమ్పెరుమాన్  గురించి ఉంది. ఆ తరువాత, నాథముని కాట్టు మన్నార్ కోయిల్ తిరిగి వచ్చి మన్నారుకు  4000 దివ్య ప్రబందం అర్పిస్తారు . మన్నార్ చాలా సంతోషించి నాథమునిని  దివ్య ప్రబందాన్ని  వర్గీకరణ చేసి నలుమూలలా ప్రచారం చేయమని వివరిస్తారు. నాథముని అరులిచ్చెయల్ కి సంగీతాన్ని జతచేర్చి వారి మేనల్లుడైన కీలై అగత్త్ ఆల్వారుకు భోదించి వారి ద్వారా ప్రచారం చేస్తారు. అంతేకాక, తన అష్టాంగ యోగ సిద్ది ద్వారా, వారు మన సాంప్రదాయంలో మరొక పెద్ద ఆచార్యలు రానున్నారని కనపెడతారు. మరో సారి, నేను అతని గురించి మరింత మీకు చెప్తాను.

పిల్లలు: ఖచ్చితంగా నాన్నమ్మ. వారి గురించి తెలుసుకోవడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము.

అత్తుళాయ్  నాన్నమ్మ నుండి ఆశీర్వాదం తీసుకోని ఆమె ఇంటికి బయలుదేరింది, అయితే వ్యాస మరియు పరాశర వారి పాఠశాల పాఠాలను అధ్యయనం చేయడానికి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2015/06/nathamunigal/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *