బాల పాఠము – ఆచార్యుల పరిచయము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< దివ్య ప్రబంధము – ఆళ్వార్లు అనుగ్రహించిన విలువైన కానుక

Acharyas
ఆచార్య రత్నహారం

సెలవుల్లో తిరువల్లిక్కేణి వాళ్ళ అమ్మమ్మింటికి వెళ్లి వచ్చారు వ్యాస పరాశరులు. ఇప్పుడు ఆండాళమ్మ దగ్గరకు వచ్చారు.

బామ్మగారు: పరాశర! వ్యాస! బావున్నారా? తిరువల్లిక్కేణి ప్రయాణం బాగా సాగిందా?

పరాశర:  అవును నాన్నమ్మా!  అద్భుతంగా ఉండింది. మేము రోజూ పార్థసారథి పెరుమాళ్ళ గుడికి వెళ్ళాము. అంతేకాదు, దగ్గర్లోని కాంచీపురం మొదలైన దివ్యదేశాలకు వెళ్ళాము. శ్రీపెరుంబుదూర్ కూడా వెళ్లి ఎంబెరుమానార్ల దర్శనం కూడా చేసుకున్నాము.

బామ్మగారు: బాగుంది. శ్రీపెరుంబుదూర్ రామానుజుల జన్మ స్థలం. వారు మన ఆచార్యులలో అతి ముఖ్యమైన వారు. నేను త్వరలో మీకు వారి గురించి మరిన్ని వివరాలు చెప్తాను. మొన్నసారి నేను ఆచార్యుల గురించి చెప్తాను అని చెప్పాను కదా! ఇప్పుదు పరిచయం చేస్తాను వినండి. “ఆచార్య” అనే పదానికి అర్థమేమిటో మీకు తెలుసా?

వ్యాస: నాన్నమ్మ! ఆచార్య, గురువు అంటే ఒకటేనా?

బామ్మగారు: అవును. ‘ఆచార్య’, ‘గురువు’ సమానమైన పదాలే. ఆచార్య అంటే జ్ఞానాన్ని అధ్యయనం చేసి, ఆచరించి, అందరూ అనుసరించేలా చేసేవాడు. గురువు అనగా మన అజ్ఞానాన్ని తొలగించేవాడు.

పరాశర:  “నిజమైన జ్ఞానం” ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: చాలా తెలివైన ప్రశ్న వేసావు పరాశర. నిజమైన జ్ఞానం అంటే మనమెవరో, మన బాధ్యతలేమిటో తెలుసుకోవటం. ఉదాహరణకు, నేను మీ నాన్నమ్మను. మీకు మంచి మాటలు చెప్పి మంచి బాటలో నడిపించడం నా బాధ్యత. ఈ జ్ఞానం నాకు ఉంటే నాకు నిజమైన జ్ఞానం ఉన్నదని అర్థం. అట్లానే, మనందరం భగవానుడి సేవకులం, అతను మనందరికీ యజమాని. ఒక యజమానిగా మన సేవకు అతను అర్హుడు. అలాగే ఒక దాసునిగా ఆయనను సేవించడం మన బాధ్యత. ఇది ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవలసిన సాధారణమైన “నిజమైన జ్ఞానం”. ఇది తెలిసుకొని, ఆచరించి అందరికీ నేర్పించే వారిని ‘ఆచార్యులు’ అని పిలుస్తాము. ఇదే “నిజమైన జ్ఞానం” వేదం, వేదాంతం , దివ్య ప్రబంధంలో ఉంది.

వ్యాస:  ఓ! అయితే, మొదటి ఆచార్యుడు ఎవరు? ఈ “నిజమైన జ్ఞానం” అందరికీ బోధించడానికి మొదట ఎవరికో ఒకరికి ఈ జ్ఞానం తెలిసి ఉండాలి కదా?.

బామ్మగారు: తెలివైన ప్రశ్నవ్యాస. మన పెరియ పెరుమాళ్ళే మొదటి ఆచార్యుడు. ఇప్పటి వరకు ఆళ్వార్ల గురించి చూశాము. పెరుమాళ్ళు వారికి యదార్థ జ్ఞానాన్ని ప్రసాదించారు. వాళ్ళ చరిత్రలలో మనము చూశాము, ఆళ్వార్లు పెరుమాళ్ళ పట్ల మహాప్రీతితో జీవించారు. వాళ్ళు ఆ నిజమైన జ్ఞానాన్ని దివ్య ప్రబంధం ద్వారా మనకు ప్రసరింపజేశారు.

పరాశర: నాన్నమ్మా!  ఆళ్వార్ల కాలం తర్వాత, ఏమి జరిగింది?

బామ్మగారు: ఆళ్వార్లు కొంతకాలం ఈ భూలోకంలో ఉన్న తరువాత పరమపదానికి వెళ్ళిపోయారు. జ్ఞానం నెమ్మదిగా క్షీణించి, దివ్య ప్రబంధాలు దాదాపుగా నష్టమైపోయినప్పుడు నలుమూలలా చీకటి అలుముకుంది.  కానీ నమ్మాళ్వార్ల కృపతో, మనకు దివ్యప్రబంధాలు తిరిగి లభించాయి. ఆ తరువాత కాలంలో అనేక ఆచార్యులు వాటిని ప్రచారం చేసారు. మనము ఆ ఆచార్యుల గురించి చూద్దాము.

వ్యాస పరాశరులు:  సరే నాన్నమ్మ!

బామ్మగారు: మీ అమ్మానాన్నలు పిలుస్తున్నారు. ఇంకోసారి కలిసినప్పుడు మన ఆచార్యుల గురించి మరిన్ని విషయాలు చెప్తాను.

అడియేన్ రఘువంశీ రామానుజ దాసన్

మూలము :  http://pillai.koyil.org/index.php/2015/06/introduction-to-acharyas/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment