శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< దివ్య ప్రబంధము – ఆళ్వారులు అనుగ్రహించిన విలువైన కానుక
పరాశర మరియు వ్యాస కొంతకాలం తర్వాత ఆండాళ్ నాన్నమ్మ వద్దకు వచ్చి ఉంటారు. సెలవులలో అమ్మమ్మ తాతలతో కలిసి ఉండటానికి వారు తిరువల్లిక్కేణి వెళ్లారు.
నాన్నమ్మ: పరాశర! వ్యాస! స్వాగతం. తిరువల్లిక్కేణిలో చాలా బావుండింది అని ఆశిస్తున్నాను.
పరాశర : అవును నాన్నమ్మ! అద్భుతంగా ఉండింది. మేము ప్రతిరోజు పార్థసారథి పెరుమాళ్ దేవాలయానికి వెళ్ళాము. అంతేకాదు, మేము దగ్గరలోని కాంచీపురం మొదలగు చాలా దివ్యదేశాలు దర్శించాము. మేము శ్రీపెరుంబుదూర్ కూడా వెళ్లి ఎమ్బెరుమానార్ని దర్శనం చేసుకున్నాము.
నాన్నమ్మ: చాలా బాగుంది. శ్రీపెరుంబుదూర్ రామానుజుల వారి జన్మ స్థలం. వారు అత్యంత ముఖ్యమైన ఆచార్యులలో ఒకరు. నేను త్వరలో వారి గురించి మరిన్ని వివరాలు చెప్తాను. మొన్నసారి నేను ఆచార్యుల గురించి చెప్తాను అని చెప్పాను. నేను ఇప్పుడు క్లుప్తంగా పరిచయం చేస్తాను. “ఆచార్య” అనే పదానికి అర్థమేమిటో మీకు తెలుసా?
వ్యాస: నాన్నమ్మ! ఆచార్య, గురువు అంటే ఒకటేనా?
నాన్నమ్మ: అవును. ఆచార్య మరియు గురువు సమానమైన పదాలు. ఆచార్య అంటే నిజమైన జ్ఞానం నేర్చుకున్నవాడు, దానిని స్వయంగా పాటించి మరియు ఇతరులు అనుసరించడానికి స్ఫూర్తినిస్తాడు. గురువు అనగా మన అజ్ఞానాన్ని తొలగించేవాడు.
పరాశర: “నిజమైన జ్ఞానం” ఏమిటి నాన్నమ్మా?
నాన్నమ్మ: చాలా తెలివైన ప్రశ్న వేసావు పరాశర. నిజమైన జ్ఞానం అంటే మనము ఎవరో తెలుసుకోవటం మరియు మన బాధ్యతలు ఏమిటో తెలుసుకోవడం. ఉదాహరణకు, నేను మీ నాన్నమ్మను. మీకు మంచి విలువలను నేర్పించడం నా బాధ్యత. ఈ విషయంలో నాకు మంచి అవగాహన ఉంటే – ఇది నిజమైన జ్ఞానం. అదేవిధంగా, మనందరం భగవానుని సేవకులం మరియు అతను మనందరికీ యజమాని. ఒక యజమానిగా, అతను మన సేవకు అర్హుడు మరియు ఒక సేవకుడిగా ఆయనను సేవించడం మన బాధ్యత. ఇది ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవలసిన సాధారణమైన “నిజమైన జ్ఞానం”. ఇది తెలిసినవారు మరియు ఆచరణాత్మక మార్గాల ద్వారా ఇతరులకు నేర్పించేవారిని ‘ఆచార్యులు’ అని పిలుస్తారు. ఈ “నిజమైన జ్ఞానం” వేదం, వేదాంతం , దివ్య ప్రబంధం మొదలైన వాటిలో అందుబాటులో ఉంది.
వ్యాస: ఓ! అయితే, మొదటి ఆచార్య ఎవరు? ఈ “నిజమైన జ్ఞానం” ఇతరులకు నేర్పడానికి మొట్ట మొదట ఎవరికో ఒకరికి తెలిసిఉండాలి.
నాన్నమ్మ: తెలివైన ప్రశ్న వ్యాస. మన పెరియ పెరుమాళ్ మొదటి ఆచార్యుడు. ఇప్పటి వరకు ఆళ్వారుల గురించి మనము చూశాము. పెరుమాళ్ వారికి నిజమైన జ్ఞానాన్ని ఇచ్చారు. వారి జీవితాల్లో మనము చూసినట్లుగా ఆళ్వార్లు పెరుమాళ్ వైపు గొప్ప అనుబంధాన్ని చూపించారు. వారు ఆ నిజమైన జ్ఞానాన్ని దివ్య ప్రబంధం ద్వారా వెల్లడించారు.
పరాశర: నాన్నమ్మా! ఆళ్వారుల సమయం తర్వాత, ఏమి జరిగింది?
నాన్నమ్మ: ఆళ్వార్లు కొంతకాలం ఈ ప్రపంచంలో నివసించి వారు శాశ్వతంగా ఉండటానికి పరమపదానికి వెళ్ళిపోయారు. జ్ఞానం నెమ్మదిగా క్షీణించి, దివ్య ప్రబంధాలు దాదాపు నష్టమైనప్పుడు చీకటి కాలాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ నమ్మాళ్వార్ వారి కృపతో, మనకు దివ్యప్రబందాలు తిరిగి లభించాయి మరియు తరువాత కాలంలో అనేకమంది ఆచార్యులు వాటిని ప్రచారం చేసారు. మనము ఆ ఆచార్యుల గురించి చూద్దాము.
పరాశర మరియు వ్యాస : నాన్నమ్మ మేము ఎదురు చూస్తాము.
నాన్నమ్మ: మీ తల్లిదండ్రులు ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. మనము తరువాత కలిసినప్పుడు ఆచార్యుల గురించి మరిన్ని విషయాలు చెబుతాను.
అడియేన్ రఘువంశీ రామానుజ దాసన్
మూలము : http://pillai.koyil.org/index.php/2015/06/introduction-to-acharyas/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org