బాల పాఠము – నాథమునులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆచార్యుల పరిచయము

nathamunigalవ్యాస పరాశరులు బడి నుండి ఇంటికి వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితురాలు అత్తుళాయ్ ని తీసుకువచ్చారు.

బామ్మగారు: మీరు ఎవరిని వెంట తీసుకువచ్చారు? ఎవరీ అమ్మాయి?

వ్యాస: నాన్నమ్మా! ఈమె పేరు అత్తుళాయ్, మా స్నేహితురాలు. మీరు మాతో చెప్పిన కొన్ని విషయాలను ఈమెకు చెప్పాము. మీ నుండి ఇంకా వినాలని ఆశతో మాతో వచ్చింది.

బామ్మగారు: బావుందమ్మా అత్తుళాయ్. మీరిద్దరూ నేను చెప్పేది వినడమే కాకుండా,  మీ స్నేహితులకు కూడా వినిపిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది.

పరాశర: నాన్నమ్మా, మన ఆచార్యుల గురించి చెప్తారా?

బామ్మగారు: సరే. ఈ రోజు మీకు నమ్మాళ్వార్ల దివ్య అనుగ్రహంతో మన సాంప్రదాయ మహిమను తిరిగి వెలుగులోకి తీసుకు వచ్చిన ఆచార్యుడి గురించి చెప్తాను.

అత్తుళాయ్: ఎవరు నాన్నమ్మా?

అత్తుళాయ్, వ్యాస పారాశరులు తినడం కోసం బామ్మగారు కొన్ని పండ్లు తెస్తుంది.

బామ్మగారు: వారు మన నాథమునులు. వీరనారాయణపురంలో (కాట్టు మన్నార్ కోయిల్) ఈశ్వర భాట్టాల్వార్లకు వీరు జన్మించారు. వీరిని శ్రీరంగనాథముని అని, నాథబ్రహ్మర్ అని కూడా పిలుస్తారు. వీరు అష్టాంగ యోగంలో, సంగీతంలో మహానిపుణులు. అంతేకాదు అరైయర్ సేవను స్థాపించిన వీరే. ఇప్పటికీ శ్రీరంగం, ఆళ్వార్తిరునాగరి, శ్రీవిల్లిపుత్తూర్  మొదలైన దివ్య దేశాలలో ఈ అరైయర్ సేవ జరుగుతుంది.

పరాశర: నాన్నమ్మా! పెరుమాళ్ళ ముందు అరైయర్ సేవ జరుగుతుండగా మేము ఎన్నో సార్లు చూసాము. అరైయర్ స్వామి తన చేతుల్లో తాళం పట్టుకొని పాశురాలు పాడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది.

బామ్మగారు: అవును. ఒక రోజు, తిరునారాయణపురం ప్రాంతం నుండి ఒక శ్రీవైష్ణవుల గోష్ఠి కాట్టుమన్నార్ కోయిల్ కి వచ్చింది.  మన్నార్ (కాట్టుమన్నార్ కోయిల్ లోని పెరుమాళ్ళు) ముందు తిరువాయ్మోళిలోని ” ఆరావముదే …” పాశురాలను సేవించారు. నాథమునులు ఆ పాశురాల అర్థంతో ముగ్దుడై వాటి గురించి ఆ శ్రీవైష్ణవులను అడిగారు. కానీ వాళ్ళకు ఆ 11 పాశురాలు తప్ప వాటి గురించి ఇంకేమీ తెలియదు. కానీ, తిరుక్కురుగూర్కి వెళితే, అక్కడ ఈ వివరాలను తెలుసుకోవచ్చు అని నాథమునులకు చెప్పారు. నాథమునులు మన్నార్ దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆళ్వార్తిరునగరికి చేరుకుంటారు.

అత్తుళాయ్, వ్యాస పరాశరులు ఆత్రుతగా నాథమునుల గురించి వింటున్నారు.

బామ్మగారు: నాథమునులు మాధురకవి ఆళ్వార్ల శిష్యుడైన పరాంకుశదాసుని కలుసుకుంటారు. వారు నాథమునులకు కణ్ణినుణ్ చిరుత్తాంబును బోధించి తిరుప్పులియాల్వార్ (చింత చెట్టు, నమ్మాళ్వార్లు ఉన్న చోట) ఎదుట కూర్చొని 12000 సార్లు నిరంతరంగా ఈ కణ్ణినుణ్ చిరుత్తాంబును పటించమని చెబుతారు. నాథమునులు అష్టాంగ యోగంలో సిద్ధులు కాబట్టి, నమ్మాళ్వార్లని ధ్యానించి ఏకధాటిగా కణ్ణినుణ్ చిరుత్తాంబును 12000 సార్లు పఠించి పూర్తి చేస్తారు. నమ్మాళ్వార్లు ప్రసన్నులై నాథమునుల ఎదుట ప్రత్యక్షమై అష్టాంగ యోగం, 4000 దివ్య ప్రబంధం, అరుళిచెయ్యల్ (దివ్య ప్రబంధం) అర్ధాల జ్ఞానాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తారు.

వ్యాస: అయితే, ‘ఆరావముదే’ పదిగం 4000 దివ్య ప్రబంధంలోనిదేనా నాన్నమ్మా?

బామ్మగారు: అవును. ‘ఆరావముదే’ పదిగం తిరుక్కుడంతై  ఆరావముదన్ పెరుమాళ్ళను స్తుతిస్తూ పాడినది. ఆ తరువాత, నాథమునులు కాట్టుమన్నార్ కోయిల్ కి తిరిగి వచ్చి మన్నార్ పెరుమాళ్ళకు 4000 దివ్య ప్రబంధం సమర్పిస్తారు. మన్నార్ పెరుమాళ్ళు ప్రసన్నులై దివ్య ప్రబందాన్ని వర్గీకరణ చేసి నలుమూలలా ప్రచారం చేయమని నాథమునులకు నిర్దేశిస్తారు. నాథమునులు అరుళిచ్చెయల్ కి సంగీతాన్ని జతపరచి వారి మేనల్లుడైన కీలై అగత్తాళాన్ కు భోదించి వారి ద్వారా ప్రచారం చేస్తారు. అంతేకాక, తమ యోగసిద్ది ద్వారా దివ్య దృష్ఠితో మన సాంప్రదాయంలో మరొక గొప్ప ఆచార్యడు రానున్నాడని చెబుతారు. మరెప్పుడైనా వారి గురించి మీకు చెప్తాను.

పిల్లలు: సరే నాన్నమ్మ.

అత్తుళాయ్ నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకోని ఇంటికి బయలుదేరింది, అయితే వ్యాస పరాశరులు చదువుకోడానికి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2015/06/nathamunigal/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment