బాల పాఠము – తొండరడిప్పొడి ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆండాళ్

periyaperumal-thondaradippodiazhwar

ఆండాళమ్మ అంగడిలో పువ్వులు కొన్నారు. వ్యాస పరాశరులు ప్రొద్దున్నే నిద్రలేచి నాన్నమ్మ దగ్గరకు వెళ్ళారు.

వ్యాస: నాన్నమ్మా, ఆళ్వార్లలో ఇద్దరు పెరుమాళ్ళకి పుష్ప కైంకర్యం చేసారని గుర్తుంది.  వారిలో పెరియాళ్వారు ఒకరని తెలుసుకున్నాము. రెండో ఆళ్వారు ఎవరో వారి గురించి ఇప్పుడు మాకు చెప్తారా?

బామ్మగారు: నీకు నిజంగానే మంచి జ్ఞాపకశక్తి ఉంది వ్యాస. నువ్వు అడిగి నందుకు, పుష్ప కైంకర్యం చేసిన రెండవ ఆళ్వారు గురించి వివరిస్తాను.

వ్యాస పరాశరులిద్దరూ బామ్మగారికి అటు ఒకరు ఇటు ఒకరు కూర్చొని తరువాతి ఆళ్వారు గురించి వింటున్నారు.

బామ్మగారు: వారు తొందరడిప్పొడి ఆళ్వారుగా ప్రసిద్దులు. వీరికి తల్లి తండ్రులు పెట్టిన పేరు విప్ర నారాయణ. కుంబకోణం, తిరుమండంగుడిలో మార్గళి మాసం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు. వీరికి శ్రీరంగనాథుడంటే ఎంతో ప్రీతి. ఎంత ప్రీతి అంటే వీరు వ్రాసిన రెండు దివ్య ప్రబంధాలలో వేరే ఏ దివ్య దేశ పెరుమాళ్ళ గురించి పాడలేదు, తిరుమాలై ఒకటి మరియు తిరుప్పళ్ళియెళుచ్చి మరొకటి. ఎవరికైతే తిరుమాలై తెలియదో వారు పెరుమాళ్ళను తెలుకోలేరు అని చెప్పబడింది.

పరాశర: ఓ! అవునా నాన్నమ్మ? అయితే మేమిద్దరం తిరుమాలై కూడా నేర్చుకుంటాం.

బామ్మగారు: తప్పకుండా, మీరు ఇది కూడా నేర్చేసుకుంటారు. తిరుమాలై మొత్తం పెరియ పెరుమాళ్ మహిమను వివరిస్తుంది. ఈ ఆళ్వారు ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

వ్యాస: అది ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: శ్రీవేంకటేశ సుప్రభాతంలోని మొదటి శ్లోకం ఎప్పుడైనా విన్నారా?

పరాశర: విన్నాము నాన్నమ్మ. “కౌసల్యా సుప్రజా రామ…..”.

బామ్మగారు: అవును. మీకు తెలుసా అది శ్రీరామాయణం లోనిది. విశ్వామిత్ర ముని శ్రీరాముడిని నిద్ర లేపుతూ పాడారు. అదే విధంగా, పెరయాళ్వార్లు వారి పాశురాలలో శ్రీకృష్ణుని నిద్ర లేపేవారు. తొండరడిప్పొడి ఆళ్వారు తమ తిరుప్పళ్ళియెళుచ్చి ప్రబంధంలో శ్రీరంగనాథుడికి సుప్రభాతం పాడారు.

వ్యాస: ఓ! మార్గళి మాసంలో ప్రతి రోజు ప్రొద్దున్నే తిరుప్పావైతో పాటు అరైయర్ స్వామి పెరియ పెరుమాళ్ళ ఎదుట పాడతారు .

బామ్మగారు: అవును. చాలా సరిగ్గా చెప్పావు. ఈ పూలతో మనం ఒక దండ చేసి పెరియ పెరుమాళ్ళ సన్నిధికి వెళదాం.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/12/beginners-guide-thondaradippodi-azhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment