బాల పాఠము – తిరుమంగై ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< తిరుప్పాణాళ్వార్

thirumangai-adalma
తిరుమంగై ఆళ్వార్, వారి ఆడల్మా గుఱ్ఱం

ఆండాళమ్మ, వ్యాస పరాశరులు ఉరైయూర్ నుండి ఇంటికి వస్తున్నారు.

బామ్మగారు: పిల్లలూ ఉరైయూర్ ప్రయాణం ఆనందంగా గడిచినట్టుంది.

వ్యాస పరాశరులు: అవును, నాన్నమ్మా. అక్కడ తిరుప్పాణాళ్వారును దర్శించుకోవడం చాలా బావుండింది. దివ్యదేశాలకు వెళ్ళటం అక్కడి పెరుమాళ్ళను దర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది.

బామ్మగారు: ఇప్పుడు మీకు తిరుమంగై ఆళ్వారు గురించి చెప్తాను. వీరు మన దివ్యదేశ పెరుమాళ్ళ కీర్తి మహిమల ప్రచారం  చేయడంలో ఎంతో కృషి చేశారు. వీరు కార్తీక మాసం, కృతిక నక్షత్రంలో తిరునాంగూర్ దివ్య దేశం దగ్గర్లోని తిరుక్కురైయలూర్లో జన్మించారు. వీరు 6 దివ్య ప్రబంధాలను రచించారు. అవి పెరియ తిరుమొళి, శిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడుందాండగం. వారి అసలు పేరు ‘నీలన్’ (నీలవర్ణం కలవారు కాబట్టి).

పరాశర: నాన్నమ్మా! ఆ రోజుల్లో దివ్యదేశాలకు ఎలా వెళ్ళేవారు ?

బామ్మగారు: వారి దగ్గర ‘ఆడల్మా’ అని ఒక మహాబలశాలి అయిన గుఱ్ఱం ఒకటి ఉండేది. లోక సంచారమంతా దాని పైనే చేసేవారు.

వ్యాస: వీరి విశేషత ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: అసమానమైన గుణశాలి తిరుమంగై ఆళ్వారు. మొదట్లో వీరు రాజ్యాన్ని పరిపాలించేవారు, మహా యోద్ధులు కూడా. ఆ సమయంలో కుముదవల్లి నాచ్చియార్ను కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆవిడ పెరుమాళ్ళ భక్తుడినే పెళ్ళాడతానని, భాగవతులను సేవించే వాడే వరుడిగా కావాలని కోరుకుంటుంది. ఆళ్వారు సరేనని పెరుమాళ్ళ భక్తునిగా మారి కుముదవల్లి నాచ్చియార్ను పెళ్ళాడతారు. ఆళ్వారు అనేక శ్రీవైష్ణవులకు అన్నప్రసాదాలతో సేవ చేసేవారు. కాల క్రమేణ, వారి దగ్గర ఉన్న సంపదంతా కరిగి కైంకర్యంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు చేసే యాత్రికులను అడవుల్లో దాడిచేసి దోచుకొని, దొంగిలించిన అ సొమ్ముతో భాగవతులను కైంకర్యం చేసేవారు.

పరాశర: ఓ! దొంగతనం చేయవచ్చా నాన్నమ్మా?

బామ్మగారు: లేదు! ఎప్పుడూ చేయకూడదు. భాగవతులను సేవించాలనే ఆతృతతో ఆళ్వారు దబ్బున్న వాళ్ళను దొంగిలించేవారు. కనీ, పెరుమాళ్ళు వారికి జ్ఞాన ప్రసాదాన్నిచ్చి సంస్కరించాలని సంకల్పిస్తారు. అలా, పెరుమాళ్ళు తాయారుతో కలిసి, నూతన దంపతులుగా వేషం వేసుకొని బంధువులతో కలిసి ఆ అడవి గుండా ప్రయాణిస్తారు. ఆళ్వారు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి వాళ్ళని దోచుకోడానికి ప్రయత్నిస్తారు. కాని, పెరుమాళ్ళ అనుగ్రహంతో, స్వయంగా పెరుమాళ్ళే వచ్చారని ఆళ్వారు తెలుసుకుంటారు. ఆళ్వార్ను పరిపూర్ణంగా అనుగ్రహించి పరిశుద్దులను చేస్తారు. పెరుమాళ్ళు వీర్కి “కలియన్” అన్న నామాన్ని కూడా ప్రసాదిస్తారు. “కలియన్” అంటే దివ్యమైనది అని అర్ధం. వీరికి  ‘పరకాలన్’ (అంటే భగవానుడికి మాత్రమే భయపడేవాడు) అని మరో పేరు కూడా ఉంది.

వ్యాస : ఓహో! అద్భుతంగా ఉంది నాన్నమ్మా. దాని తరువాత వారు ఏం జరిగింది?

బామ్మగారు: భక్తి పారాస్యంలో మునిగిపోయి వీరు పెరుమాళ్ళకు శరణాగతులైనారు. ఆ తరువాత, వీరు భారతదేశం నలు మూలలా సంచారం చేసి అనేక దివ్యదేశాల (80 కి పైగా) పెరుమాళ్ళను స్తుతిస్తూ పాశురాలను పాడారు. అదీగాక, వీరు ఇతర ఆళ్వారులు స్తుతించని 40కి పైగా దివ్యదేశ పెరుమాళ్ళను స్తుతిస్తూ పాశురాలను పాడారు. వీరి అనుగ్రహం ద్వారా మనకు అనేక దివ్యదేశాల పరిచయం దొరికింది.

పరాశర: ఓ! మనకిది గొప్ప సంపద వంటిది. వీరి కారణంగా, మనము ఇప్పుడు ఈ దివ్యదేశాలను సేవించుకోగలుగుతున్నాము. వీరికి మనం సదా కృతజ్ఞులం.

బామ్మగారు: వీరు మన శ్రీరంగంలో అనేక కైంకర్యాలు చేశారు. ఆలయం చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించటం వగైరా వంటివి.  ఆళ్వారు జీవితకాలంలోనే, వారి బావగారికి తిరుమంగై ఆళ్వార్ల విగ్రహం తయారు చేసి ఆరాధించమని పెరుమాళ్ళు నిర్దేశిస్తారు. కొంత సమయం గడిచాక ఆళ్వారు తిరుకురుంగుడి దివ్యదేశానికి వెళ్లి, కొంత కాలం అక్కడి నంబి పెరుమాళ్ళను సేవిస్తారు. చివరగా, పెరుమాళ్ళను ధ్యానిస్తూ నిత్య కైంకర్యం చేయాలని ఆశించి పరమపదానికి చేరుకుంటారు.

వ్యాస: నాన్నమ్మా! అర్చావతార పెరుమాళ్ళ గురించి, భాగవత సేవ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ ఆళ్వారు జీవితంతో  తెలుసుకున్నాము.

బామ్మగారు: అవును, భాగవత సేవయే మన సాంప్రదాయ సారాంశం. దీనితో, మీరు అందరి ఆళ్వారుల గురించి విన్నారు. మీ ఇద్దరికి మన ఆచార్యుల గురించి మరోసారి చెప్తాను.

వ్యాస పరాశరులు: సరే నాన్నమ్మా! మేము ఎదురు చూస్తుంటాము.

మూలము : http://pillai.koyil.org/index.php/2015/02/beginners-guide-thirumangai-azhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment