శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఆండాళమ్మ వైకుంఠ ఏకాదశి రోజున జాగారణ ఉందామని అనుకున్నారు. వ్యాస పరారులు కూడా ఆ రోజు నిద్రపోకుండా మేలుకొని ఉంటామన్నారు.
బామ్మగారు: ఈ రోజు, కేవలం మేలుకొని ఉంటే మాత్రమే సరిపోదు. పెరుమాళ్ళ గురించి చర్చించాలి.
పరాశర: నాన్నమ్మా! మనము ఎలాగో జాగరణ చేయాలనుకుంటున్నాము కదా, మీరు తరువాత ఆళ్వారు గురించి చెప్తారా?
బామ్మగారు: పరాశర, నా మనస్సులోని మాట చెప్పావు. సరే, ఇప్పుడు తిరుప్పాణ్ ఆళ్వార్ గురించి చెప్తాను.
వ్యాస పరాశరులు: తప్పకుండా నాన్నమ్మా.
బామ్మగారు: తిరుప్పాణ్ ఆళ్వారు శ్రీరంగం దగ్గర ఉరైయుర్లో కార్తీక మాసం, రోహిణి నక్షత్రంలో జన్మించారు. వీరు శ్రీరంగనాథుని సౌందర్యాన్ని శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణిస్తూ 10 పాశురాలు ఉన్న అమలనాదిపిరాన్ రచించారు.
వ్యాస: ఓ! అవును నాన్నమ్మా, మన పెరుమాళ్ళ సౌదర్యం ఎంతో గొప్పది. ఎవరు చూసినా వారికి పరిపూర్ణ ఆనంద అనుభవం కలుగుతుంది.
బామ్మగారు: అవును! వీరు పెరియ పెరుమాళ్ళ ప్రియ భక్తులు. ఒక ఆసక్తికరమైన ఘటన ఒకటి సంభవించి వీరు పరమపదానికి చేరుకునేటట్టు చేసింది.
పరాశర: అదేమిటో చెప్పండి నాన్నమ్మా.
బామ్మగారు: ఒక రోజు, వీరు కావేరికి అటు వైపు ఒడ్డున నుండి పెరిమాళ్ళని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. అప్పటి వరకు వీరు శ్రీరంగంలో ఎప్పుడూ అడుగు పెట్టలేదు. పెరియ పెరుమాళ్ళ కైంకర్యపరర్లలో ఒకరైన లోకసారంగముని కావేరి నుండి జలం తీసుకువెళ్ళడానికి వస్తారు. ఆ సమయంలో వారి దారిలో ఆళ్వారు ఉండటం గమనిస్తారు. అడ్డు తప్పుకుంటే జలం తీసుకోని వెళ్లతానని ఆళ్వార్ని అడుగుతారు. కాని ఆళ్వారు పెరియ పెరుమాళ్ళ ధ్యానములో దీర్ఘంగా మునిగి ఉండటం చేత స్పందించరు.
వ్యాస: తరువాత ఏమి అయ్యింది నాన్నమ్మా?
బామ్మగారు: లోక సారంగముని ఒక గులకరాయిని తీసుకోని ఆళ్వార్ పైన విసిరారు. ఆళ్వారుకి దెబ్బ తగిలి రక్తం కారటం మొదలైయింది. ఆళ్వారు టక్కున కళ్ళు తెరిచి తాను దారిలో ఉన్నారని తెలుసుకొంటారు.
పరాశర: ఆళ్వారుకి లోకసారంగాముని పైన కోపం వచ్చిందా?
బామ్మగారు: లేదు! శ్రీవైష్ణవులకు ఇలాంటి చిన్న విషయాలకు ఎపుడూ కోపం రాదు. వెంటనే ఆళ్వారు క్షమించమని అడిగి పక్కకు తప్పుకుంటారు. లోకసారంగముని గుడికి వెళ్లతారు. ఆళ్వారుపైన అనవసరంగా కోపగించుకున్నందుకు పెరియ పెరుమాళ్ళు సంతోషించరు. పెరుమాళ్ళు తలుపులు తీయకుండా, వెంటనే ఆళ్వారు దగ్గరకు వెళ్లి క్షమాపన వేడుకొని వారిని గుడిలోకి తీసుకొని రమ్మంటారు. లోకసారంగముని తాను చేసిన ఈ పెద్ద తప్పుని గుర్తించి పరిగెత్తుకొని ఆళ్వారు దగ్గరకు వెళ్లి తనను క్షమించమని ఆళ్వారుని వేడుకుంటారు. ఆళ్వారు వినయముగా వారి మటలను స్వీకరిస్తారు.
వ్యాస: వారు మంచి ఉదాహరణ మనకు నాన్నమ్మా. మనము కూడా వారి లాగా సజ్జనులై , ఉదార స్వాభావులుగా ఉండటానికి ప్రయత్నిద్దాం.
బామ్మగారు: తరువాత లోకసారంగముని మరీ మరీ ప్రార్థించగా, లోకసారంగముని భుజాలపైన ఆళ్వారు కూర్చొని దారిలో అమలనాదిపిరాన్ పాడుతూ పెరియ పెరుమాళ్ళా సన్నిధికి చేరుకుంటారు. ఆఖరి పాశురం పాడుతూ “పెరియ పెరుమాళ్ళని చూచిన ఈ కళ్ళతో ఇంక ఏమి చూడను” అని చెప్పి పెరియ పెరుమాళ్ సన్నిధికి చేరుకుంటారు. ఒక్కసారి వారు పెరియ పెరుమాళ్ళ పాదపద్మాల వద్ద మాయమైపోయి శాశ్వత కైంకర్యం కొరకు పరమపదానికి చేరుకుంటారు.
పరాశర: ఓ! ఇది ఎంత అద్భుతంగా ఉంది నాన్నమ్మా. ఇప్పటి వరకు విన్న ఆళ్వారుల చరిత్ర అందరిలోకి ఇది చాలా బావుంది.
బామ్మగారు: అవును, తిరుప్పాణ్ ఆళ్వార్ పెరియ పెరుమాళ్ళ పరమ భక్తులు. మనం కూడా ఈ వేళ ఉరైయూర్కి వెళ్లి వారిని సేవిద్దాం.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము : http://pillai.koyil.org/index.php/2015/01/beginners-guide-thiruppanazhwar/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org