శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
<< బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్యమైన అర్చారూపములు మరియు గుణములు
ఒక మనోహరమైన ఆదివారం ప్రొద్దున్నే ఆండాళ్ నాన్నమ్మ అమలనాదిపిరాన్ చదువుతుండగా వ్యాస మరియు పరాశర వింటారు.
పరాశర: నాన్నమ్మ, మీరు ఏమి చదువుతున్నారు? మీరు ప్రతిరోజు ప్రొద్దున్నే చదువుతుండగా మేము వింటున్నాము.
ఆండాళ్ నాన్నమ్మ: పరాశర, దీన్ని అమలనాదిపిరాన్ అంటారు. 12 ఆళ్వారులలో ఒకరైన తిరుప్పాణ్ ఆళ్వారు రచించారు.
వ్యాస: ఆళ్వారులు ఎవరు? అమలనాదిపిరాన్ అంటే ఏమిటి? వారి గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాన్నమ్మ, మీరు మాకు చెబుతారా?
ఆండాళ్ నాన్నమ్మ: నేను తప్పకుండ మీకు ఆళ్వారులు, వారి రచనల గురించి చెప్పగలను, కాని దానికి ముందు, మీరు శ్రీరంగనాథుని గురించి ఇంకొంచం ఎక్కువ తెలుసుకోవాలి.
వ్యాస: అది ఏమిటి, అవ్వా?
ఆండాళ్ నాన్నమ్మ: వారి కృపను గురించి తెలుసుకోవాలి.
పరాశర: దయచేసి చెప్పండి నాన్నమ్మ.
ఆండాళ్ నాన్నమ్మ: నేను చెప్పాబోయేది మీరు గ్రహించటం కొంచం కష్టం. కాబట్టి, జాగ్రత్తగా వినండి, సరేనా?
పరాశర మరియు వ్యాస: సరే నాన్నమ్మ.
ఆండాళ్ నాన్నమ్మ: మనం ఇప్పటికే మునుపటి చర్చలలో చూసాము శ్రీమన్నారాయణుడు పరమపదము నుంచి శ్రీరాముడిగా, కృష్ణడిగా మరియు ఎన్నో అర్చావతార ఎంపెరుమానులు శ్రీరంగనాథునిగా దిగివచ్చారు. వారు అంతర్యామిగా ప్రతి ఒక్కరిలో ఉన్నారు.
పరాశర మరియు వ్యాస ఇప్పుడు ఆండాళ్ నాన్నమ్మ యొక్క ప్రతి పదముపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
ఆండాళ్ నాన్నమ్మ: మునిపటి చర్చలలో మీకు గుర్తుందా వారు ఎందుకు ఇన్ని రూపాలలో ప్రత్యక్షమైనారో?
పరాశర మరియు వ్యాస: ఓ అవును నాన్నమ్మ! మనందరం అంటే వారికి చాలా ఇష్టం. అందుకోసం మనతో ఉండటానికి వారు క్రిందకి వస్తారు.
ఆండాళ్ నాన్నమ్మ: అద్భుతం! నువ్వు మూల సూత్రాలను చాలా బాగా అర్థంచేసుకున్నావు. వారు క్రిందకి మనతో ఉండటానికి మాత్రమే కాదు, వారు క్రమేణా మనందరినీ పరమపదానికి తీసుకోని వెళ్లాలని వారి కోరిక.
పరాశర: ఎందుకు నాన్నమ్మ? ఆ స్థలానికి అంత ప్రత్యేకత ఎందుకు? శ్రీరంగం కంటే బావుంటుందా?
ఆండాళ్ నాన్నమ్మ: హ! హా! నిస్సందేహంగా, శ్రీరంగం చాలా బావుంది. కాని పరమపదం వారి నిత్య స్థానం, అక్కడ నిర్మలమైన ఆనందం మరియు వారకి ఎడతెగకుండా సేవ చేసుకోవటానికి అవకాశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనము గుడికి వెళ్తాము, ఉత్సవాలలో పాల్గొంటాము, కాని ఒక సమయానికి మనము ఇంటికి రావాలి మరియు ఇతర పనులు చేసుకోవాలి. కాని పరమపదంలో ఇలాంటి భంగాలు ఉండవు – అది నిరంతర ఆనందం.
వ్యాస: ఓ! అట్లాగే నాకు ఇష్టం – స్థిరమైన ఆనందం.
ఆండాళ్ నాన్నమ్మ: పైగా, ఇక్కడ, మన శరీర సామర్ద్యం మితమైనది – మనము అలసిపోతాము, కొన్నిసార్లు జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది… కాని పరమపదంలో, ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా దివ్యమైన శరీరం దొరుకుతుంది. మనము శాశ్వతముగా కైన్కర్యంలో నిమగ్నమై ఉండికూడా ఏ అలసట, అనారోగ్యం అనుభవించము.
పరాశర: ఓ! ఇది ఇంకా మంచిది. అయితే, వారు మనలని పరమపదానికి తీసుకుని వెళ్ళటానికి ఏం చేస్తారు?
ఆండాళ్ నాన్నమ్మ: అద్భుతమైన ప్రశ్న. వారు వారి అమితమైన కరుణతో ఎన్నో చేస్తారు. కరుణ అంటే ఎదుటి వారికీ దయతో సహాయం చేయటం. వారు స్వయంగా దిగి శ్రీరామ, కృష్ణ, రంగనాథ, శ్రీనివాస, మొదలగు లాగా వచ్చారు. కాని వారు ఇంకా మనలోని చాలా మందిని తీసుకుని వెళ్ళలేకపోయారు, ఎందు కంటే చాలామంది మనుష్యులు వారిని స్పష్టంగా అర్థంచేసుకొని సర్వశ్రేష్ఠునిగా అంగీకరించలేదు.
వ్యాస: వారు ముందే ఉండగా ఎందుకు మనుష్యులు వారిని అర్థం చేసుకోవట్లేదు?
ఆండాళ్ నాన్నమ్మ: ఎందుకంటే వారు చాలా పెద్దవారు, కాబట్టి ఈర్ష్యతో కొంతమంది జనాలు, వారి శ్రేష్ఠుత్వానికి భయపడి కొందరు వారి దరికి రావట్లేదు.
పరాశర: ఓ అలాగా. ఇది ఆళ్వారుల జననానికి దారితీస్తుంది అని ఊహిస్తున్నాను.
ఆండాళ్ నాన్నమ్మ: తెలివైన వాడవు. అవును, పెరుమాళ్ కు ఒక ఆలోచన వచ్చింది. మీకు తెలుసా వేటగాళ్ళు జింకలను ఎలా పట్టుకుంటారో? చాలా కష్టంగా ఒక జింకను పట్టుకుంటారు. తరువాత ఆ జింకకు ఇతర జింకలను ఎలా ఆకర్షించాలో శిక్షణ ఇస్తారు. ఎప్పుడైతే ఈ జింకకు ఇతర జింకలు ఆకర్షితులవుతారో, వేటగాడు వెంటనే అన్నిటిననీ పట్టుకుంటాడు.
వ్యాస: అవును నాన్నమ్మ. ఇదే కుయుక్తితో ఏనుగులను కూడా పట్టుకుంటారు అని విన్నాను.
ఆండాళ్ నాన్నమ్మ: అవును. అలాగే, పెరుమాళ్ వారి నిష్కారణమైన కరుణతో ప్రతి ఒక్కరికి సహాయం చేయుటకు, కొంత మంది జనాలను ఎంపిక చేసుకొని వారికి తనఎడల నిండు భక్తిని నిండు జ్ఞానాన్ని మరియు మిగిలిన వన్నీ ప్రసాదిస్తారు. ఇలాంటి వ్యక్తులు పెరుమాళ్ భక్తిలో మునిగిఉండే వారిని ఆళ్వారులు అంటారు.
పరాశర: ఓ! అయితే, ఆళ్వారుల ద్వారా చాలా మంది భక్తులై వారిని చేరుకుంటారు. ఓ! ఇది పెరుమాళ్ యొక్క గొప్ప పద్ధతి.
ఆండాళ్ నాన్నమ్మ: అవును, ఇది వారి గొప్ప కరుణ. గుర్తుపెట్టుకోండి, ఎవరూ వారి సొంత ప్రయత్నంతో ఆళ్వారులుగా మారారు. భగవాన్ కటాక్షంతో మాత్రమే, వారు ఆళ్వారులుగా మారతారు. ఎందుకంటే సొంత ప్రయత్నముతో పెరుమాళ్ వైపు కొంతవరకు భక్తిలో అభివృద్ధి చెందవచ్చు – కాని పెరుమాళ్ పైనే సంపూర్ణ భక్తి ఉండటం అంటే, వారికి భగవాన్ యొక్క సంపూర్ణ కటాక్షం ఉండాలి. అలాగే సొంత ప్రయత్నముతో కొంతవరకు జ్ఞానంలో అభివృద్ధి చెందవచ్చు – కాని అన్నిటి గురించి సంపూర్ణ జ్ఞానం ఉండాలంటే అలాంటి జ్ఞానం ఉన్న ఒక్క భగవానుడే ఇతరులకు అలాంటి జ్ఞానం ఉండాలని కటాక్షించ గలరు.
పరాశర: అవును, నాన్నమ్మ. మాకు ఇప్పుడు అర్థమైయింది. మీరు ఎంత మంచిగా మాకు ఈ సూత్రాలను వివరిస్తున్నారు. చూడండి, ఇది కొంచం కఠినమైన విషయము అని మీరు చెప్పినందుకు, మేము కళ్లు రెప్ప కూడా వాల్చలేదు.
ఆండాళ్ నాన్నమ్మ: అవును. మిమ్మల్ని బయటకు ఆడుకోవటానికి వదిలే ముందు, నేను మీకు అమలనాదిపిరాన్ గురించి వివరిస్తాను, ఎందుకంటే మీరు ముందు అడిగారు కాబట్టి. ఇది రచించినది తిరుప్పాణ్ ఆళ్వార్, పెరియ పెరుమాళ్ దివ్య మంగళ సౌందర్యాన్ని పూర్తిగా అనుభవించినవారు. వారు 5 వ పాసురములో ” అనేక సంవత్సరాలుగా మీరు కఠిన తపస్సు చేస్తున్నారు, కేవలము నన్నుపాప విముక్తుడను చేసి నిన్ను అర్థము చేసుకొని నిన్ను చేసుకోవడానికి సహాయం చేయుచున్నారు” అని వారు శ్రీరంగనాథునికి చెబుతున్నారు, . అక్కడినుండి మన మొత్తం సంభాషణ శ్రీమన్నారాయణ కృప గురించి మొదలైయింది. ఇప్పుడు మీకు మొత్తం విషయము గురించి మంచి అవగాహన ఉంది. మరో సారి, నేను మీకు ఆళ్వారుల గురించి మరింత చెబుతాను. ఇప్పుడు మీరు ఇద్దరూ కొద్దిసేపు ఆడుకోవచ్చు.
పరాశర మరియు వ్యాస: ధన్యవాదం నాన్నమ్మ. మేము తప్పకుండా తొందరలోనే తిరిగి వచ్చి ఆళ్వారుల గురించి వింటాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము : http://pillai.koyil.org/index.php/2014/09/beginners-guide-sriman-narayanas-divine-mercy/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org