బాల పాఠము – దివ్య ప్రబంధము – ఆళ్వారులు అనుగ్రహించిన విలువైన కానుక

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< తిరుమంగై ఆళ్వారు

dhivyaprabandham-small

 

నాన్నమ్మ కన్నినూన్ చిరుత్తాంబు ప్రబంధాన్ని చదువుతోంది. పరాశర, వ్యాసులు అక్కడికి వచ్చారు.

వ్యాస: నాన్నమ్మ! మీరు ఇప్పుడు ఏమి చదువుతున్నారు?

నాన్నమ్మ: వ్యాస! నేను దివ్య ప్రబంధంలోని ఒక భాగమైన కన్నినూన్ చిరుత్తాంబు చదువుతున్నాను.

పరాశర: నాన్నమ్మ! ఇది మధురకవి ఆళ్వారుచే రచింపబడినది కదా?

నాన్నమ్మ:  అవును. చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు.

వ్యాస: నాన్నమ్మ! ఆళ్వారుల చరిత్రను వివరిస్తున్నప్పుడు, ప్రతి ఆళ్వార్ కొన్ని దివ్య ప్రబంధాలను రచించినట్లు మీరు చెప్పారు. దయచేసి దివ్య ప్రబంధం వివరాల గురించి వివరంగా చెప్పండి.

నాన్నమ్మ: తప్పకుండా వ్యాస. ఈ వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండటం మంచిది. మన శ్రీరంగనాధుడు మరియు శ్రీరంగనాచియార్ను దివ్య దంపతులుగా పిలుస్తారు. భగవాన్ ఆశీర్వాదం కారణంగా ఆళ్వారులు దివ్య సూరులు (దివ్య మరియు పవిత్ర వ్యక్తిత్వాలు) అని పిలవబడ్డారు. ఆళ్వారులు స్వరపరిచిన పాసురములను (తమిళంలో శ్లోకాలు) దివ్య ప్రబంధం (దివ్య సాహిత్యం) అని పిలుస్తారు. ఆళ్వారులచే దివ్య ప్రబంధంలో మహిమపరచబడిన క్షేత్రాలు దివ్య దేశాలుగా (దివ్య పట్టణం)  పిలువబడ్డాయి.

పరాశర: ఓ! చాలా ఆసక్తికరంగా ఉంది నాన్నమ్మా. మీరు మాట్లాడే ఈ దివ్య ప్రబంధాలు ఏమిటి నాన్నమ్మా?

నాన్నమ్మ: దివ్య ప్రబంధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఎమ్బెరుమాన్ పవిత్రమైన లక్షణాలను పూర్తిగా చర్చించడం. అంతేకాకుండా, ప్రత్యేకించి, అర్చావతార ఎమ్బెరుమాన్, మన పెరియ పెరుమాళ్, తిరువేంకటేశ్వరుడు మొదలైనవి.

వ్యాస : కానీ మనము వేదం చాలా ముఖ్యం అని విన్నాము కదా నాన్నమ్మా . దివ్య ప్రబంధంతో వేదం ఎలా సంబంధం చేర్చ బడింది నాన్నమ్మా?

నాన్నమ్మ:  అది మంచి ప్రశ్న. పెరుమాళ్ గురించి తెలుసుకోవడం వేదం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వేదం యొక్క అత్యుత్తమ భాగమైన వేదాంతం, పెరుమాళ్, అతని దివ్య లక్షణాలు, తత్వశాస్త్రం మొదలైనవాటి గురించి వివరంగా చర్చిస్తుంది. కానీ ఇవి అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆళ్వారులు వేదం మరియు వేదాంతం యొక్క సారాంశాన్ని అందమైన తమిళంలో వారి దివ్య ప్రబంధాలలో తెచ్చారు.

పరాశర : ఓ! అయితే వేదం మరియు దివ్యప్రబంధం మధ్య తేడా ఏమిటి నాన్నమ్మ?

నాన్నమ్మ: శ్రీవైకుంఠము నుండి భగవాన్ అయోధ్యకు  శ్రీరాముడుగా దిగివచ్చినపుడు, వేదం కూడా శ్రీరామాయణంగా ప్రత్యక్షమైనది. అదే విధంగా పెరుమాళ్ అర్చావతారంగా దిగివచ్చినపుడు, వేదం  ఆళ్వారుల మాటల ద్వారా దివ్యప్రబంధంగా కనిపించింది. పరమపదనాధుడిని ఇక్కడ నుండి మనము గ్రహించటం చాలా కష్టం. కాబట్టి మనము ఉన్న స్థలంలోనే అర్చావతార పెరుమాళ్ ను దర్శిస్తాము . అదేవిధంగా, వేదం / వేదాంతాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కానీ అవే సూత్రాలు ఆళ్వారులు  దివ్య  ప్రబంధంలో చాలా సరళమైన మరియు సుస్పష్టమైన పద్ధతిలో వివరించారు.

వ్యాస:  నాన్నమ్మా! అంటే మనకు వేదం ముఖ్యం కాదా?

నాన్నమ్మ: కాదు కాదు! వేదం మరియు దివ్య ప్రబంధం రెండూ మనకు సమానంగా ముఖ్యమే. వేదం  ఎందుకు ముఖ్యం  అంటే పెరుమాళ్ ను అర్థం చేసుకోవడానికున్న అన్ని వనరులకు మూలం వేదం. కానీ పెరుమాళ్ యొక్క పవిత్ర లక్షణాలను నేర్చుకోవటానికి ఆనందించడానికి దివ్య ప్రబంధం చాలా సముచితమైనది. అంతేకాదు, మనకు ఎంతో సంక్లిష్టమైన సూత్రాలు వేదంలో వివరించబడ్డాయి,  దివ్య ప్రబంధం యొక్క అర్థాలను అధ్యయనం చేయడంతో ఆ సూత్రాలు సులభంగా అర్ధం చేసుకోవచ్చు. అందువల్ల  పరిస్థితుల ప్రకారం, వేదం, వేదాంతం  మరియు దివ్య ప్రబంధం వంటి వాటిని అధ్యయనం చేయాలి.

పరాశర :  దివ్య ప్రబంధం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి నాన్నమ్మా?

నాన్నమ్మ: ఈ భౌతిక ప్రపంచంలో తాత్కాలిక ఆనందంతోను, కష్టాలతోను  మనకున్న బంధాన్ని తొలగించడమే కాకుండా శాశ్వతంగా పరమపదంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి మరియు శ్రీమన్నారయణునికి శాశ్వతముగా సేవలను అందించడమే దివ్య ప్రబంధం యొక్క ప్రధాన లక్ష్యం. మన స్వభావం శ్రీమన్నారయణునికి నిత్యంగా సేవలు అందించటమే. కానీ ఈ లోకంలో మనము ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటం వలన, ఆ విలువైన ఆనందాన్ని కోల్పోతున్నాము. దివ్య ప్రబంధం పరమపదంలో పెరుమాళ్ ను నిరంతరం సేవించే  ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

వ్యాస : అవును నాన్నమ్మా! మీరు ఇంతకు మునుపు ఈ సూత్రాన్ని వివరించారు.

పరాశర: మన పూర్వాచార్యులు ఎవరు నాన్నమ్మా?

నాన్నమ్మ: పరాశర! చాలా మంచి ప్రశ్న. నేను ఇప్పటి నుండి మన సాంప్రదాయం యొక్క అనేక ఆచార్యుల గురించి వివరిస్తాను. మన ఆచార్యుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది, తద్వారా వారు ఆళ్వారుల మాటలను ఎలా అనుసరించి జీవించారో మరియు వారి అడుగుజాడలను అనుసరించాల్సిన అవసరమును, ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాము.

పరాశర మరియు వ్యాస: ధన్యవాదాలు నాన్నమ్మా! మేము మన ఆచార్యులను గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2015/02/beginners-guide-dhivya-prabandham-the-most-valuable-gift-from-azhwars/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *