బాల పాఠము – ఆండాళ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< పెరియాళ్వార్

andal-birth-mirror

ఆండాళ్ నాన్నమ్మ ప్రొద్దు ప్రొద్దున్నే పాలవాడి దగ్గర నుంచి ఆవు పాలని తీసుకుని ఇంటిలోపలి వచ్చారు. వేడి చేసిన తరువాత, ఆవిడ వ్యాస మరియు పరాశరులకు ఇచ్చారు. వ్యాస మరియు పరాశరులు ఇద్దరూ పాలు త్రాగారు.

పరాశర: నాన్నమ్మ, ఒకసారి మీరు ఆండాళ్ గురించి తరువాత చెబుతాను అని అన్నారు. మీరు ఇప్పుడు చెబుతారా?

ఆండాళ్ నాన్నమ్మ: ఓ! తప్పకుండా. మీఇద్దరికి చెప్పినట్టు నాకు గుర్తుంది. ఇప్పుడు ఆండాళ్ గురించి చెప్పే సమయం వచ్చింది.

ఆండాళ్ నాన్నమ్మ, వ్యాస మరియు పరాశర, వారు ముగ్గురు వరండాలో కూర్చున్నారు.

ఆండాళ్ నాన్నమ్మ: ఆండాళ్ పెరియాళ్వారి పుత్రిక. ఆవిడ శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు, ఆండాళ్ పెరియాళ్వారుకు గుడి ప్రక్కనే ఉన్నఒక తోటలో తులసి చెట్టు దగ్గర దొరికారు. ఆవిడ ఆషాడ మాసంలో పుబ్బ నక్షత్రంలో జన్మించారు. ఈ రోజు కూడా తిరువాడిప్పూరంగా చాలా గొప్పగా జరుపుకుంటారు.  వెన్నె ముద్ద తో  పెరుమాళ్ భక్తిని కూడా ఆండాళ్కు  తినిపించేవారు పెరియాళ్వారు.

వ్యాస: ఓ! చాలా బాగుంది నాన్నమ్మ. ఇప్పుడు మీరు మాకు భోదిస్తున్నట్టుగానా?

ఆండాళ్ నాన్నమ్మ: అవును. నిజానికి దీనికంటే ఎక్కువే. ఎందుకంటే పెరియాళ్వారు పూర్తిగా కైన్కర్యంలో  నిమగ్నులై ఉండేవారు, వారు ఎప్పుడూ ఆమెకు పెరుమాళ్ కైంకర్యము చేయు అద్భుతమైన విషయములను తెలియచేసేవారు. అందు వల్ల ఆవిడ 5 సంవత్సరాల లేత వయస్సులోనే పెరుమాళ్ తనను పెళ్లి చేసుకుంటారని, ఆవిడ వారిని సేవించకోవచ్చని కలలు కంటూ ఉండేది.

పరాశర: ఓ! వారి ముఖ్యమైన కైన్కర్యం ఏమిటి నాన్నమ్మ?

ఆండాళ్ పాటి: వారి ముఖ్యమైన కైన్కర్యం గుడి తోటను పరిరక్షించడం మరియు పెరుమాళ్లకు ప్రతి రోజు మంచి మంచి దండలు తయారు చేయడం. వారు మంచి దండలు చేసి , ఇంట్లో పెట్టి ఉంచేవారు, వారి దినచర్యలు చేసుకొన్న తరువాత గుడికి వెళ్ళేటప్పుడు వారు ఆ దండలని తీసుకోని వెళ్లి పెరుమాళ్లకు సమర్పించేవారు. వారు దండలు ఇంట్లో పెట్టినప్పుడు, ఆండాళ్ వాటిని ధరించి బాగున్నాయో లేదో అని చూసేవారు మరియు దండలతో ఆవిడని  పెరుమాళ్ ప్రేమగా చూస్తారని ఊహించుకునేది.

వ్యాస: అయితే, పెరియాళ్వారుకు  అసలు ఈ విషయము తెలియనే తెలియదా?

ఆండాళ్ నాన్నమ్మ: అవును. చాలా రోజుల వరకు, వారికి ఈ విషయం తెలియదు. పెరుమాళ్ కూడా ఆ దండలు చాలా సంతోషముగా స్వీకరించేవారు ఎందుకంటే అవి తనకు ప్రియమైన ఆండాళ్ ధరించినవి కాబట్టి. కాని ఒక రోజు, పెరియాళ్వారు దండ తయారు చేసి, ఇంట్లో పెట్టి బయటకు వెళ్లారు. ఆండాళ్ ఎప్పటి లాగానే తాను ధరించారు. తరువాత, పెరియాళ్వారు వాటిని గుడికి తీసుకోని వెళ్లారు,  కాని దండలో ఒక వెంట్రుక కనుగొని వారు ఆ దండలు తిరిగి ఇంటికి తీసుకోని వస్తారు. వారు వారి కూతురు ధరించి ఉండవచ్చు అని గ్రహించి, కొత్త దండ సిద్ధం చేసి గుడికి తీసుకోని వెళ్లతారు. పెరుమాళ్ కొత్తగా చేసిన దండను తిరస్కరిస్తారు మరియు ఆండాళ్ ధరించిన దండనే కావలెనని అడుగుతారు. పెరియాళ్వారు వారి కూతురి లోతైన భక్తిని అర్థం చేసుకుంటారు మరియు ఆండాళ్ పై పెరుమాళ్ ప్రేమను కూడా, వారు ఆండాళ్ ధరించిన దండను తీసుకొని తిరిగి వస్తారు. వాటిని పెరుమాళ్ సంతోషంగా స్వీకరిస్తారు.

వ్యాస మరియు పరాశర అబ్బుర పోయి నిలుచొని ఆండాళ్ గురించి  మరియు పెరిమాళ్ పై వారి ప్రేమ గురించి వింటున్నారు.

వ్యాస: ఆ తరువాత ఏమి అయ్యింది?

ఆండాళ్ పాటి: పెరుమాళ్ పై  ఆండాళ్ భక్తి రోజు రోజుకి పెరిగింది. లేత వయసు లోనే, ఆవిడ తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళి పాడారు. మార్గళి మాసంలో, ప్రతి కోవెలలో మరియు గృహములలో తిరుప్పావై చదువుతారు. చివరిగా, పెరియ పెరుమాళ్, ఆండాళ్ ను శ్రీరంగానికి కళ్యాణము చేసుకోవడానికి తీసుకోని రమ్మని పెరియాళ్వారుకి ఆదేశిస్తారు. పెరియాళ్వారు సంతోషంగా ఆండాళ్ తో పాటు ఘనమైన ఊరేగింపుతో శ్రీరంగానికి వేంచేస్తారు. ఆండాళ్ నేరుగా పెరియ పెరుమాళ్ సన్నిధికి వెళ్ళిన తరువాత పెరుమాళ్ తనను స్వీకరిస్తారు మరియు ఆవిడ పరమపదానికి తిరిగి వెళ్లిపోతారు.

పరాశర: ఆవిడ తిరిగి వెళ్లిపోవుట అంటే? వారు మొదటి నుంచి పరమపద వాసి ఆ?

ఆండాళ్ నాన్నమ్మ: అవును. ఆవిడ స్వయంగా భూదేవి . ఇతర ఆళ్వారుల ఈ భూలోకం  లో అవతరించి పెరుమాళ్ కృపతో ఆళ్వారులు అయినట్టుగా కాకుండా, ఆండాళ్ మనలందరిని భక్తి మార్గ దర్శనం చేయడానికి  పరమపదం నుండి దిగివచ్చారు. వారి పని అయిపోయిన తరువాత, ఆవిడ పరమపదానికి తిరిగి వెళ్లిపోయారు.

పరాశర: ఓ! తెలుసుకోవడం చాలా బాగుంది. వారు ఎంత దయామయి.

ఆండాళ్ నాన్నమ్మ: చాలా బాగుంది. ఇప్పుడు, మీరిద్దరూ తిరుప్పావై ని నేర్చుకొని అభ్యాసం చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే  వచ్చే మార్గళి మాసంలో మీరు కూడా చదవాలి.

వ్యాస మరియు పరాశర: తప్పకుండా నాన్నమ్మ, ఇప్పుడే మొదలు పెడదాం.

ఆండాళ్ నాన్నమ్మ వారికి నేర్పించడం మొదలుపెట్టారు మరియు ఆ అబ్బాయిలు ఆత్రంగా నేర్చుకున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2014/12/beginners-guide-andal/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *