బాల పాఠము – పెరియాళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< కులశేఖర ఆళ్వార్

periyazhvar

ఒక ఆహ్లాదమైన ఆదివారం ప్రొద్దున ఆండాళమ్మగారు ఇంటి బయట వాకిట్లో కూర్చొని పెరుమాళ్ళ కోసం పుష్పమాలలు కడుతున్నారు. వ్యాస పరాశరులు వచ్చి వాకిట్లో బామ్మగారి ప్రక్కన కూర్చున్నారు. బామ్మగారిని వాళ్లిద్దరు ఆసక్తిగా చూస్తునారు.

వ్యాస: ఏం చేస్తున్నారు నాన్నమ్మ?

బామ్మగారు: పెరుమాళ్ళ కోసం మాల కడుతున్నాను, ఇది నాకు కొంతమంది ఆళ్వార్లను గుర్తుచేస్తుంది. వాళ్లలో ఒకరి గురించి చెప్తాను వింటారా?

పరాశర: ఓ! తప్పకుండా నాన్నమ్మ.

బామ్మగారు: నా బంగారే! సరే, పెరియాళ్వార్ల గురించి చెప్తాను. వీరు జేష్ఠ మాసం స్వాతి నక్షత్రంలో శ్రీ విల్లిపుత్తూర్లో జన్మించారు. వీరిని పట్టర్ పిరాన్ అని కూడా పిలిచేవారు. వీరు వటపత్రసాయి పెరుమాళ్ళకు దండలు కడుతుండేవారు. ఒక సంధర్భంలో పాండ్య రాజు కొందరు విధ్వానులను ఆహ్వానించాడు. పర తత్త్వమైన భగవానుడు ఎవరో నిరూపించిన వారికి బంగారు నాణాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు.

వ్యాస: అది చాలా కష్ఠమై ఉండాలి, కదా నాన్నమ్మ?

బామ్మగారు: పెరయాళ్వార్లుకు కాదు. వారి భక్తి పెరుమాళ్ళ అనుగ్రహముతో, రాజసభకు వెళ్లి వేద ప్రమాణాలతో పెరుమాళ్ళే పరతత్త్వమని నిరూపిస్తారు. ఆ రాజు ఆనందించి తాను ప్రకటించిన బహుమతిని పెరయాళ్వార్లకు ఇచ్చి, ఏనుగుపైన కూర్చోపెట్టి ఊరేగింపుతో మధుర విధులలో ఊరేగిస్తారు.

పరాశర: ఆ దృశ్యము చూడ ముచ్చటగా ఉండి ఉండవచ్చు కదా నాన్నమ్మా?

బామ్మగారు: అవును పరాశర. అందు కోసమే స్వయంగా పెరుమాళ్ళే గరుడారూడుడై పరమపదం నుండి బయలుదేరి క్రిందకు వచ్చారు. పెరయాళ్వార్లు ఏనుగు స్వారులైనప్పటికీ ఎంత వినయవంతులంటే పెరుమాళ్ళ రక్షణ కోసం తిరుప్పల్లాండుని పాడారు. అలాగ వీరు పెరయాళ్వార్లుగా ప్రసిద్ధులైనారు. వీరు పెరయాళ్వార్ తిరుమొళి కూడా పాడారు.

వ్యాస: అవును నాన్నమ్మ – పల్లాండు పల్లాండు గుర్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి రోజు అదే కదా మొదట్లో చదువుతాము. గుడిలో విన్నాము.

బామ్మగారు: అవును, నిజమే వ్యాస. పెరయాళ్వార్ల తిరుప్పల్లాండు మొదట్లో తరువాత ఆఖరున కూడా సేవిస్తాము.

పరాశర: బావుంది నాన్నమ్మ. మేము కూడా నేర్చుకొని పెరుమాళ్ ముందు సేవిస్తాము.

బామ్మగారు: తప్పకుండా పరాశరా! వీరు సుప్రసిద్ధమైన తిరుప్పావై పాడిన ఆండాళ్ కు తండ్రిగారు. ఆండాళ్ గురించి తరువాత చెప్తాను. రండి వెళ్లి పెరుమాళ్ళకు మాలలు సమర్పిద్దాము.

బామ్మగారు మాలలు అల్లడం పూర్తి చేసుకొని వ్యాస పరాశరులతో కలిసి శ్రీరంగనాథుడి గుడి వైపు వెళ్లసాగింది.

మూలము : http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-periyazhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment